ఆపత్కాలములో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 2

అఖిల మానవాళికి ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత  గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్‌ బాలాజి ఆఠవలె !

భాగము – 1 చదవండి. ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 1

వరదలు,  భూకంపాలు, మూడవ ప్రపంచ మహాయుద్ధం, కొరోనా మహమ్మారి వంటి సంకటాల్లో మొదలగు ఆపత్కాలములో స్థిరంగా వుండుటకు  నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తీసుకొనవలసిన చర్యలు అనే ఈ అంశంపై వచ్చిన మొదటి లేఖనములో (భాగములో) వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి, గోబర్‌గ్యాస్‌ మొదలైనటువంటి ప్రత్యామ్నాయాలు వివరాలు తెలుసుకున్నాము. రెండావ లేఖలో మనము ‘ఆహారం’  గురించి తెలుసుకుందాము. జీవించడానికి ఆహారం ప్రాథమిక అవసరం. ఆపత్కాలములో  మనకు ఆకలి (వుపాసము)తో చావడమనే సమయము రాకుండ వుండటానికి, ముందే తగినంత ఆహార ధాన్యాలు కొనడం చాలా అవసరం. ప్రస్తుత తరానికి వివిధ రకాల ఆహార ధాన్యాలు ఎక్కువ కాలం నిల్వ వుంచే మరియు సంరక్షించే పద్ధతుల గురించి తెలియదు. ఇందుకొరకు, మేము  కొన్ని పద్ధతులను ఈ లేఖలలో ఇచ్చాము. ఆహార ధాన్యాలను ఎన్ని చేర్చి పెట్టిన, అవి నిధానంగా అయిపోతాయి.  దిక్కు తోచని స్థితికి రాకుండా ముందు జాగ్రత్తగా, మనం ఆహార ధాన్యాలను పండించడము అవసరము. వరి(బియ్యము), కాయధాన్యాలు(మొలకలు) వంటి ఆహార ధాన్యాలు పండించడమనేది అందరికి సాధ్యము కాకపోవచ్చు; కానీ కంద మూలాలు, తక్కువ నీరులో ఎక్కువ వుత్పన్నమయ్యే  ఏడాది పొడువున పండించగల కూరగాయలు  మరియు అన్ని రకాల వుపయోగపడే చెట్లు, ఫలాలు కాసే మొక్కలు మొదలైనవి ఇంటి చుట్టూ పరిసరాల్లో మరియు మేడమీద వసారాలో కూడా పండించవచ్చు. వీటికి సంబంధించిన విషయమును క్లుప్తంగా ఈ లేఖలో వ్రాయబడినది.

3 అ 3. ఆహార ధాన్యాలు సాగుచేయడం, పశువుల పెంపకం మొదలైన వాటిని ఇప్పటి నుండే ప్రారంభించవలెను

ఆహార ధాన్యాలను భవిష్యదుపయోగమునకు ఎంత నిలువచేసినాగాని అవి నిధానంగా అయిపోతాయి.  ఇలాంటి సమయములో ఆకలి భాదలు లేకుండా వుండటానికి, ఆహార ధాన్యాలు సాగుచేయడం, పశువులను పెంచడం మొదలైనవి చేయవలసిన అవసరం ఎంతైనావుంది.

3 అ 3 అ. వరి, కాయధాన్యాలు మొదలైన పంటలను సాగుచేయవలెను.

రైతులు కాని వారు అనుభవజ్ఞులైన వారి నుండి వ్యవసాయం నేర్చుకొనవలెను.

3 అ 3 ఆ . కూరగాయలు, కంద మూలాలు మరియు దుంపలు వంటి కూరగాయలను మరియు పండ్లను ఇచ్చే చెట్లను పండించవలెను.

సాగు యొక్క వివిధ అంశాలను పాఠకులకు పరిచయం చేయడానికి, ఈ శీర్షికలో సంక్షిప్తంగా ప్రస్తావించబడింది. ‘కూరగాయలు, పండ్ల చెట్లు మొదలైన వాటిని ఎలా పండించాలి, సంరక్షించాలి?’ అనే విషయముపై సనాతన సంస్థ ప్రత్యేక గ్రంథాన్ని ప్రచురింపబోతుంది.

3 అ 3 ఆ 1. కూరగాయలు, కంద మూలాలు, దుంపలు వంటి కూరగాయలను మరియు పండ్లను ఇచ్చే చెట్లను  పెంచడం అవసరం

అ. కుటుంబానికి కొన్ని నెలలకు సరిపోయేంత ధాన్యాలు, కాయధాన్యాలు మొదలైనవినిలువచేయవచ్చు; కానీ కూరగాయలు, పండ్లు మొదలైన వాటి విషయంలో అలా చేయలేము.

ఆ. ఆపత్కాలములో భోజనానికి కూరగాయలు వండటం వల్ల కాయధాన్యాలు కుటుంబానికి  అవి ఎక్కువకాలం సరిపడుతాయి.

ఇ. ధాన్యాలు మరియు కాయధాన్యాలు పెరగడానికి చాలా విస్తారమైన సాగు భూమి అవసరం వుంటుంది, కాని కూరగాయలు మరియు పండ్లను మేడముందు వసారాలో మరియు ఇంటి పెరట్లో (తోటలో) పెంచవచ్చు.

ఈ. ఆహార ధాన్యాలు మరియు కాయధాన్యాల కంటే కూరగాయలు వేగంగా పెరుగుతాయి.

ఉ. మన శరీరానికి అవసరమైన విటమినులు, ఇనుము, పీచు పదార్ధము (Fibare)మొదలైనవి కూరగాయలు, దుంపలు, కంద మూలాలు మరియు పండ్లలో వుంటాయి. అందువల్ల వీటిని మన ఆహారంలో చేర్చమని ఆహార శాస్త్రము చెబుతుంది.

ఊ. ప్రతిరోజూ జొన్న రొట్టే – చపాతితో పప్పు చారు మరియు అన్నిరకాల కాయధాన్యాలతో తయారు చేసిన కూరను పదే-పదే తినడము అనేది కూరగాయలను చేర్చినందువలన దూరమౌతుంది. అలాగే కూరగాయలు భోజనానికి ఎక్కువగా రుచిని ఇస్తాయి.

ఋ. కూరగాయలు మరియు పండ్లకు ఔషధ విలువలు కూడా వుంటాయి. (కూరగాయలను మరియు పండ్లను ఔషధములుగా కూడ వుపయోగించవచ్చు.)

౩ అ 3 ఆ 2. ఆపత్కాలములో ఏ కూరగాయలు, దుంపలు, కంద మూలాలు మరియు పండ్ల చెట్లను పెంచడమనేది లాభదాయకంగా వుంటుతుంది ?

ఏది నాటినా ఆపత్కాలములో స్వల్పమైన కాలావధిలో ఎక్కువ పంట లేదా పండ్లు లభించడమనేది అవసరముంటుంది’, ఇది గ్రహించి, పంట పండించడము హితకారంగా వుంటుంది -(అన్ని రకాల ఆకు కూరలు; గోరుచిక్కుడు, క్యాబేజీ, బఠానీ, కాలీఫ్లవర్‌, టమోటా, వంకాయ, బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్‌, తీగలాగా పాకే కూరగాయలు (ఉదాహరణ లిమా,చిక్కుడుకాయ విత్తులు, దొండకాయ); బంగాళాదుంప(ఆలు గడ్డ), బీట్రూట్‌, క్యారెట్‌(గాజరగడ్డ), ముల్లంగి, చిలగడదుంప, (భారతీయ కుడ్జు) (నేల గుమ్మడి), వైన్‌ బంగాళాదుంప, పర్పుల్‌ యమ మరియు యమ రూట్‌ వంటి రూట్‌ మరియు గడ్డ(చిలగడ దుంప) కూరగాయలు; అననసపండు, బొప్పాయి, అరటి, సపోట మరియు దానిమ్మపండు వంటి పండ్ల చెట్లను నాటవచ్చు.

3 అ 3 ఆ 3. కూరగాయలు, దుంపలు, కంద మూలాలు మరియు పండ్లను ఎప్పుడు నాటాలి?

చాలా వరకు ఆకు కూరలు, వంకాయ, టమోటా మరియు బెండకాయ ఎప్పుడైనా నాటవచ్చు. తీగలాగా పాకేటువంటి కూరగాయల మొక్కలను (ఉదాహరణ. దొండకాయ) మరియు (గోరుచిక్కుడుకాయ) వర్షాకాలం ప్రారంభంలో లేదా శీతాకాలం చివరిలో నాటాలి. దుంపలు మరియు కంద మూలాలు (ఉదాహరణ, చిలగడదుంప) మరియు పండ్ల చెట్లను వర్షాకాల ప్రారంభములో నాటాలి’.

– శ్రీ అవినాష్‌ జాదవ్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (మార్చి 2020)

ఇంటి ముందర ప్లాస్టిక్ బకేట్ లో కూరగాయలను పెంచడం

3 అ 3 ఆ 4. ఆపత్కాలములో ప్లాటు సజ్జలలో(ప్లాటు గ్యాలరిలో) మరియు ఇంటి మిద్దెపై కూరగాయలు మరియు ఆకుకూరలను పెంపకమునకు కావాలసిన మట్టి కుండీల కంటే ఇతర పర్యాయోపాయములను అనుసరించే ఆవశ్యకత

మట్టి కుండీలలో మొక్కలను పెంచడం వాటి పెరుగుదలకు అనువైన పద్ధతి; ఏదేమైనా, మట్టి కుండీలను కదలిస్తున్నప్పుడు   అవి పగిలిపోవచ్చు. ఆపత్కాలములో ఏమి జరుగబోతుందో, తెలియదు; అందువల్ల, కుండీలు పగిలి కలిగే నష్టాన్ని  తొలగించుటకు, ఇటువంటి సమయములో మట్టి కుండీలకంటే ఇనుప రేకుల పీపాలు; నూనెవి ఖాళీ ఇనుప డబ్బాలు; ప్లాస్టిక్‌ గోనెసంచులు, సంచులు, సత్తు డబ్బాలు(టిన్లు ), చదరపు తొట్టి లేదా పీపాలు మొదలైనవి మొక్కలు నాటడానికి ఉపయోగించడము మంచిది. అదనపు నీటిని విడుదల చేయడానికి డబ్బా అడుగు నుంచి ట అంగుళం పైకి 2-3 రంధ్రాలు సమాన దూరంలో చేయవలెను. ఈ డబ్బా అడుగున రంధ్రాలు చేసినట్లైతే, మొక్క యొక్క వేర్లు డబ్బా క్రింది నుండి బయట మట్టిలోకి చొచ్చుకొనిపోయే అవకాశం ఉంది, అందుచేత డబ్బాఅడుగున రంధ్రాలు చేయకూడదు.

– శ్రీ మాధవ్‌ రామచంద్ర పరద్కర్‌ పరాడ్కర్‌, డిచోలి, గోవా. (28.5.2020)

3 అ 3 ఆ 5. మేడ ముందు వసారాలో పండించగల కూరగాయలు

మేడముందు వసారాలో రోజుకు 3 – 4 గంటల సూర్యరశ్మి వస్తే, వంకాయ, టమోటా, మిరపకాయలు, కొత్తిమీర మొదలైన వాటిని అక్కడ పండించవచ్చు. మేడ ముందు వసారాలో తగినంత సూర్యరశ్మి అందుబాటులో లేకపోయినా, మనము అక్కడ అల్లం పెంచుకోవచ్చు.

3 అ 3 ఆ 6. ఇంటి మిద్దె పై(బాల్కానిలో) పండించే కూరగాయలు, దుంపలు, కంద మూలాలు మరియు పండ్లు

మేడముందు వసారాలో పండించగల అన్ని కూరగాయలు, అలాగే ఆకు కూరలు; కాలీఫ్లవర్‌, క్యాబేజీ, గోరుచిక్కుడు, బెండకాయ మొదలైన కూరగాయలు; దొండకాయ వంటి తీగలాగా పాకే కూరగాయల మొక్కలు; బంగాళదుంపలు, ముల్లంగి, దుంప మరియు గాజరగడ్డ వంటి కంద మూలాల కూరగాయలు; అనానసపండు కూడా.

3 అ 3 ఆ 7. ఇంటి పెరటిలో పండించగల కూరగాయలు, దుంపలు మరియు కంద మూలాలు

మేడముందు వసారాలో మరియు ఇంటి మిద్దె పై పెరుగు కూరగాయలు; చిక్కుడు వంటి తీగలాగా పాకే కూరగాయల మొక్కలు; చిలగడ దుంపలు, యమ రూట్‌ వంటి దుంపలు మరియు కంద మూలాల కూరగాయలు.

3 అ 3 ఆ 8. ఇంటి పెరటిలో పండించ గల పండ్ల చెట్లు

నిమ్మ, అరటి, జామ, సపోట, బొప్పాయి, అనాసపండు, శీతాఫలం మరియు అంజీర పండ్లు.

– శ్రీ అవినాష్‌ జాదవ్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (మార్చి 2020)

3 అ 3 ఇ. గోవులు మరియు ఎద్దుల పెంపకం

పాలు, గోమూత్రం, పేడ, పిడకలు మొదలైన వాటి కోసం ఆవులను పెంచాలి, ఎడ్లబండి కోసము ఎడ్లు వుపయోగకరమైనవి. వ్యవసాయానికి, బండ్లు లాగడానికి మొదలైనవాటికోసం పెంచాలి. పశువులను ఎలా పెంచాలో, ఆవులు మరియు ఎడ్ల పెంపకము, ఆవుల పాలు పితకడము, ఈ పశువులను అనారోగ్య సమయంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవడము మొదలగు వాటి గురించి అనుభవము వున్నవారి నుండి నేర్చుకొనండి.

3 అ 4. వర్షాకాలంలో సహజంగా పెరిగే కూరగాయలను వండుకోవడం ఇప్పటి నుండే ప్రారంభించండి

తగిరిస (Cassia tora), భారంగీ (Clerodendrum serratum), గురుగు (Celosia argentea), ఉత్తరేణు ఆకు (Prickly chaff flower) మన ఆహారంలో చేర్చవచ్చు. వాటి వుపయోగము గురించి తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించండి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ‘నిసర్గ మిత్రా’ (మొబైల్‌: 9423858711) అనే సంస్థ ‘ఔషధ గుణాలతో కూడిన సహజంగా పెరిగే కూరగాయలు’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. వారు 61 రకాల సహజంగా పెరిగే కూరగాయల యొక్క ఔషధ మరియు ఆహార వినియోగాన్ని చిత్రాలతో సహా ఇచ్చారు.

సేకరణ : సనాతన ప్రచురణ ‘ ఆపత్కాలములో ప్రాణరక్షణకై చేయబడే సంసిద్ధత’

Sanatan Sanstha provides guidence on surviving adverse times !

సంగ్రహకర్తలు : (పరాత్పర గురువులు) డా. ఆఠవలె

External links

1. Wild Vegetables

2. Surviving in the Wild : 19 Common Edible Plants

3. The Ultimate Army Field Guide to Wild Edible Plants

Leave a Comment