తుఫాను(సుడిగాలి, కుండపోత వర్షముతో కూడిన) లాంటి నైససర్గిక ఆపదలను ఎదుర్కోడానికి చేయబడే సంసిద్ధత మరియు ప్రత్యక్షంగా ఆపత్కాల పరిస్థితిలో ఆచరించవలసిన కృతువులు

మే మరియు జూన్‌ నెలలలో, భారతదేశం శక్తివంతమైన తుఫానులైన ‘అమ్ఫాన్‌’ మరియు ‘నిసర్గము’ అను శక్తిశాలి సుడిగుండాలను ఎదుర్కోవలసి వచ్చింది. 20.5.2020 న, భారతదేశం యొక్క తూర్పు తీరం ‘అమ్ఫాన్‌’, 2020 జూన్‌ 2 మరియు 3 తేదీలలో, ముంబైతో సహా కొంకణ తీరం ‘నిసర్గము’ సుడిగుండాలతో దెబ్బతిన్నాయి.

మనుష్యుడికి గుండెల్లో తీవ్రమైన భయము కలిగేలా ప్రచండమైన వేగము గల గాలి మరియు కుండపోత వర్షాలతో పెద్ద-పెద్ద వృక్షాలను కూడా వేర్లతో సహా పెకలించివేశాయి. ఇళ్ళ గోడలు కూలిపోవడం, పైకప్పులు ఎగిరిపోవడం మొదలైనవి భారీగా ఆర్థిక నష్టాలను కలిగించాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలి, తీగలు తెగిపోయి విద్యుత్‌ సరఫరా దెబ్బతింది. మొబైల్‌ నెట్‌వర్క్‌లు నిలిచిపోయాయి మరియు సమాచార వ్యవస్థ (కమ్యూనికేషన్‌ వ్యవస్థ) కూడా నిలిపివేయబడింది. ప్రజా జీవితం పూర్తిగా దెబ్బతింది. ప్రకృతి దాల్చినటువంటి ఈ భయంకరమైన రూపాన్ని చూసిన ప్రజలు భయాందోళనకు గురైనారు.

తుఫానులు, అతివృష్టి (భారీ వర్షాలు), భూకంపాలు వంటి నైసర్గిక ఆపదలను మనం ఎప్పుడు ఎదుర్కోవలసి వస్తుందో అంచనా వేయడం కష్టం. ఇలాంటి విపత్తులు ఏ క్షణంలోనైనా ఉద్భవించవచ్చు. అందువల్ల, సంసిద్ధత అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అందరు ఇక్కడ ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించవలెను.

 

1. నైససర్గిక ఆపదలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండటం

అ. మీరు క్రొత్త ఇంటిని నిర్మిస్తుంటే, ఇనుప రేకులకు బదులుగా కంకర పైకప్పు(ఉదా. స్లాబ్‌) ఉండేలా చూసుకోండి.

ఆ. పైకప్పులకు ఉపయోగించే తగరము పూసిన ఇనుప రేకులు ఎంత బలంగా ఉన్నా, రేకులు గాలిలో ఎగిరిపోతాయి. తుఫాను ఎప్పుడు వస్తుందో ఊహించలేము. కాబట్టి అవి ఎగిరిపోకుండా ఉండటానికి ఎల్లప్పుడూ ఇసుక సంచులను రేకుల పైన ఉంచండి. (రేకుల విస్తీర్ణం 500 చదరపు అడుగుల వరకు ఉంటే, 5-10 కిలోల బరువున్న కొన్ని సంచులు ఒక్కొక్కటి పైకప్పుపై చుట్టూ మరియు మధ్యలో అవసరమైన విధంగా ఉంచాలి. ఈ సంచులు మంచి నాణ్యతతో ఉండాలి.)

ఇ. ఇంటి చుట్టూ చాలా పాత మరియు ప్రమాదకరమైన చెట్లు ఉంటే, వాటిని నరికేయవలెను, తద్వారా తుఫానుల సమయంలో చెట్లు వేర్లతో సహా కూలిపోయినప్పుడు ఇల్లు దెబ్బతినకుండా ఉంటుంది.

ఈ. మీ భవనం మీదుగా లేదా ఇంటి వెలుపల ఉన్న రహదారులపై అధిక ఉద్రిక్తత గల విద్యుత్‌ తీగలుండి మరియు సమీపంలో చెట్లు ఉంటే, వర్షం లేదా గాలి వల్ల చెట్లు తీగలపై పడటం వల్ల అవి తెగి మరణం సంభవించడానికి దారితీస్తాయి. అందువల్ల, స్థానిక విద్యుత్‌ విభాగాన్ని సంప్రదించి, విద్యుత్‌ తీగల దగ్గర ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయమని వారికి చెప్పండి.

ఉ. విద్యుత్‌ తీగల క్రింద నిలబడి, మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడకండి. జంతువులు విద్యుత్‌ తీగల క్రింద నిలబడకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యుత్‌ తీగలపై నిప్పు రవ్వల విషయంలో, వెంటనే విద్యుత్‌ విభాగానికి తెలియజేయండి.

ఊ. ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు మరియు చెట్ల క్రింద నిలిపి వుంచినప్పుడు, తుఫాను వల్ల స్తంభాలు మరియు చెట్లు కూలిపోయి వాహనాలను దెబ్బతీస్తాయి. అందువల్ల వాహనాలను నిలిపి వుంచుతున్నా, నడుపుతున్నా ఆ ప్రదేశాలలో లేకుండా జాగ్రత్త పడాలి.

ఋ. వర్షాకాలంలో విద్యుత్‌ సరఫరాకు ఎప్పుడైనా అంతరాయం కలగవచ్చు. అందువల్ల దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌ లైట్‌, లాంతర్లు మొదలైనవి ఇంట్లో వుంచుకోవాలి.

ౠ. ‘ఇంటి కిటికీలు మరియు తలుపులు సరిగ్గా మూసుకుంటున్నాయ లేదా?’ నిర్ధారించుకోండి. అవి సరిగ్గా మూసుకోకపోతే, వాటిని మరమ్మతులు చేయించండి.

ఎ. ప్రభుత్వం మరియు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అనుసరించండి. వాటిని విస్మరించకూడదు.

 

2. తుఫాను హెచ్చరిక ముందుగా వచ్చినప్పుడు తీసుకోవలసిన చర్యలు

అ. ఇంటి ప్రాంగణం, వరండా, పైకప్పు లేదా వసారాలో తేలికపాటి వస్తువులు పడి ఉంటే, వాటిని వెంటనే లోపలికి తీసుకురావాలి లేదా సరిగ్గా కట్టిపెట్టాలి.

ఆ. జంతువులను సురక్షితమైన ప్రదేశానికి తరలించండి.

ఇ. నీరు మరియు పొడి ఆహార పదార్థములను ఇంట్లో నిల్వ చేసుకోండి.

ఈ. గాలి వేగం పెరుగుతున్నట్లు గమనించినట్లయితే, వంటగది మరియు ప్రధాన వాల్వ్‌లోని గ్యాస్‌ (వంట గ్యాసు) సరపరాలను ఆపివేయాలి.

తుఫాను ముగిసే వరకు దీన్ని వేయకూడదు.

 

3. తుఫాను సమయంలో మీరు ఇంట్లో ఉన్నట్లైతే అప్పుడు తీసుకోవలసిన చర్యలు

అ. ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు. మేడమీద మరియు ఇనుప రేకుల పాకలోకి వెళ్ళవద్దు. సమీపంలోని ఇళ్ళ పైకప్పులతో పాటు వస్తువులు కూడా గాలిలో ఎగిరి, మీరు గాయపడే అవకాశం వుంటుంది.

ఆ. ఇంటి కిటికీలు మరియు తలుపులు సరిగ్గా మూసివేయాలి. గాలి వేగం కారణంగా తలుపులు వాటికవే తెరచుకోకుండా వుండటానికి, భారీ వస్తువులను లోపలి నుండి తలుపు దగ్గర వుంచవచ్చు.

ఇ. కిటికీ యొక్క గాజు తలుపులు పగిలినప్పుడు గాయపడే అవకాశం ఉంటుంది. అందువల్ల, కిటికీల దగ్గర నిలబడటం, నిద్రించడం మొదలైనవి చేయకండి.

ఈ. విద్యుత్‌ సరఫరా వచ్చే ప్రధాన స్విచ్‌ను ఆపివేయండి. దూరదర్శని (టీవీ), మిక్సర్లు మొదలైన విద్యుత్‌ ఉపకరణాల ప్లగ్‌లను సాకెట్ల నుండి తొలగించండి.

ఉ. ఎలివేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, హెయిర్‌ డ్రైయర్స్‌ మొదలైనవి ఈ సమయంలో ఉపయోగించకూడదు. రిఫ్రిజిరేటర్‌ను తాకకూడదు.

ఊ. కొన్నిసార్లు అత్యవసర సమయంలో ప్రతిచోటా పుకార్లు (అపప్రచారము) వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వాటిని నమ్మవద్దు. ప్రభుత్వం అధికారికంగా ప్రచారం చేసిన సమాచారాన్ని మాత్రమే నిజమని భావించాలి.

 

4. ఇంటి బయట ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

అ. తుఫాను సమయంలో ఉండటానికి సురక్షితమైన స్థలానికి చేరుకొనండి. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు లేని ప్రదేశాలు సురక్షితమైనవి. చెట్ల క్రింద లేదా విద్యుత్‌ స్తంభాల దగ్గర ఆగవద్దు.

ఆ. ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాలను చెట్లు మరియు విద్యుత్‌ స్తంభాలకు దూరంగా సురక్షితమైన ప్రదేశంలో వుంచాలి. నాలుగు చక్రాల వాహనాల తలుపులు మరియు కిటికీలు సరిగ్గా మూసివేయబడ్డాయా లేదా నిర్ధారించుకోండి. పెద్ద రాళ్ళను వాహనాలు కదలకుండ వుండెందుకు చక్రాల క్రింద పెద్ద రాళ్ళను వుంచండి, ఎందుకంటే గాలి వీచినప్పుడు వాహనాలు కొట్టుకుపోయే అవకాశం వుంది.

ఇ. రహాదారులపై పడి ఉన్న చెట్లు మరియు పొదలను తాకవద్దు. వీటిపై విద్యుత్‌ తీగలుపడివుండే అవకాశం ఉంది.

ఈ. వర్షం కారణంగా ప్రతిచోటా తడిగా ఉంటే ఆ సమయంలో విద్యుత్‌ స్తంభాన్ని తాకవద్దు. ఎందుకంటే తడిగా వుండటమువలన విద్యుత్‌ షాక్‌కు దారితీస్తుంది.

 

5. తుఫాను తగ్గిన తర్వాత తీసుకోవలసిన చర్యలు

అ. వాతావరణం సాధారణంగా అయ్యేవరకు ఇల్లు వదిలి వెళ్ళవద్దు.

ఆ. తుఫాను మరియు వర్షాల కారణంగా మీ ప్రాంతంలో పడిపోయిన చెట్లు మరియు విద్యుత్‌ తీగలను మీరు తాకవద్దు. వాటి గురించి అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్‌ శాఖకు తెలియజేయండి.

ఇ. ఇంట్లో సిలిండర్‌ నుండి గ్యాస్‌ బయటికి వస్తున్నట్లైతే (లీకేజ్‌), విద్యుత్‌ సరఫరా యొక్క ప్రధాన స్విచ్‌ను ఆపివేయండి. గాలి ఆడేటువంటి ప్రదేశంలో (ఉదాహరణకు ఇంటి పైకప్పు) సిలిండర్‌ను వుంచాలి . ఇంట్లో గ్యాస్‌ వాసన వస్తుంటే విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలి.

ఈ. వాహనాలు, విద్యుత్‌ ఉపకరణాలు మరియు గృహోపకరణాలు కొత్తవి మరియు బీమా చేయబడి ఉంటే మరియు నైసర్గిక ఆపదల వలన కలిగే నష్టానికి పరిహారం చెల్లించబడితే, భీమా ప్రతినిధి యొక్క మార్గదర్శకత్వం పొందాలి. దెబ్బతిన్న వస్తువులను పారవేసే ముందు, వాటిని మొదట ఛాయాచిత్రాలు తీయాలి మరియు వాటి పంచనామ చేయించుకోవాలి.

నైసర్గిక ఆపదల విషయంలో, జాతీయ విపత్తు నివారణ సహాయ కేంద్రం దూరవాణి (హెల్ప్‌ లైన్‌) 011-1078 కు సంప్రదించడం ద్వారా సహాయం పొందవచ్చు.

 

సంకట సమయములో మనోధైర్యాన్ని కొల్పోకుండ ఉండటానికి సాధన తప్ప వేరే మార్గము లేదు.

నేడు అన్ని రంగాలలో విజ్ఞాన శాస్త్రం ఎంత పురోగతిని సాధించినా, తుఫానుల వంటి నైససర్గిక ఆపదలు ఉద్భవించకుండ వుండుటకు ప్రయత్నించడము మానవ శక్తికి మించినది. ఇలాంటి సంకటాలలో మన మనస్సును స్థిరంగా ఉంచుకొని మనోధైర్యముతో వుండటము మాత్రమే మనం చేయగలిగినది. ఇందుకోసం, నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన చేయడానికి ప్రయత్నించడం అత్యవసరం. ఆధ్యాత్మిక సాధనవలన సంకటాలను కూడ ధైర్యంగా మరియు ఆనందంగా ఎదుర్కోవచ్చును.  ‘పాఠకులారా, సంకటములో కాకుండ, ఇప్పటి నుండే సాధనను ప్రారంభించండి మరియు ఆధ్యాత్మిక శక్తిని (భగవంతుడి శక్తి) మీతోడుగా వుంచుకొని నిశ్చింతగా వుండండి !

 

పాఠకులకు విజ్ఞప్తి!

తుఫానులాంటి ఆపదల దష్టితో కొన్ని మార్గదర్శక అంశాలు ఇక్కడ ఇవ్వబడినాయి. ఈ విషయముపై పాఠకులు ఏమైన సలహాలను ఇవ్వాలనుకుంటే ఈమేల్‌ (Email-ID) లేదా క్రింద ఇచ్చిన చిరునామా పై తపాలా ద్వారా పంపించగలరని విన్నపము. మీ సలహా సహకారం ద్వారా ఈ విషయమును సమాజానికి లోతుగా అందించడానికి సహాయపడుతుంది.

Email ID : [email protected]

మా చిరునామా : సౌ. భాగ్యశ్రీ సావంత్‌, ద్వారా ‘సనాతన ఆశ్రమం’, 24 / బి, రామనాథి, బాందివడె, ఫోండా, గోవా. పిన్‌ కోడ్‌ నం.(తపాల సూచిక సంఖ్య) – 403 401.

ముందు రాబోయే మూడవ మహాప్రపంచయుద్ధ కాలములో కూడ ఇలాంటి పరిస్థితి ఉద్భవించవచ్చు. అప్పటికోసము కూడ ఈ వివరాలు వుపయోగపడగలవు; కాబట్టి సంగ్రహించి పెట్టుకోగలరు.

 

Leave a Comment