ఆపత్కాలములో ప్రాణరక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 4

అఖిల మానవాళికి ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్ ఆఠవలె !

ఆపత్కాలము గురించి ఈ లేఖనమాలలో ఇప్పటివరకు ఆహారం లేనప్పుడు ఆకలిని నివారించడానికి ఏమి చేయాలి మరియు తృణ ఆహారధాన్యాలను పండించడము, గోపాలన మొదలైన అంశాలను చూశాము. నీరు లేకుండా మనిషి బ్రతుకలేడు మరియు విద్యుత్తు లేకుండ జీవించడమనేది ఉహించలేడు; అందువల్ల, ఈ వ్యాసంలో నీటి సౌకర్యాలు, నీటిని నిల్వ చేయడము మరియు దాని శుద్దీకరణ పద్ధతుల గురించి, అలాగే విద్యుత్ సరపరాకు గల ఎంపికల వివరాలు ఇవ్వబడినాయి.

3. అత్యవసర పరిస్థితుల్లో ఆపత్కాలము యొక్క దష్టితో దైనందిన (శారీరక) స్థాయిలో చేయబడే వివిధ సంసిద్ధతలు !

3 ఆ . నీటి కొరత వలన ఇబ్బంది కాకుండా ఉండడానికి వీటిని చేయండి !

3 ఆ 1. ఆపత్కాలములో నీటి కొరత అనుభవించకుండా ఉండటానికి బావిని తవ్వించండి, అది సాధ్యం కాకపోతే, ఒక బోర్‌వెల్‌ను తవ్వించండి.


బావి

కొన్ని గ్రామాల్లో, పట్టణాలు (నగరాలకు) మరియు మహానగరాలకు పంచాయతీలు, పురపాలిక మొదలగు వాటి నుండి ఆనకట్ట లేదా సరస్సు నుండి నీటిని కుళాయి ద్వారా సరపరా చేయబడుతుంది. ఆపత్కాల పరిస్థితుల్లో, చాలా రోజులు విద్యుత్ లేకపోవడం, అతివష్టి వలన ఆనకట్ట విచ్ఛిన్నం అవ్వడం మరియు చెరువులున్న ప్రాంతంలో కావలసినంత వర్షము కురువక పోవడం వల్ల కుళాయి ద్వారా చేయబడే నీటి సరఫరా ఆగిపోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కొన్నిసార్లు ‘ట్యాంకర్’ ద్వారా నీటిని సరఫరా చేస్తుంది; కానీ ఆపత్కాల పరిస్థితుల్లో ఇంధనం లేకపోవడంతో, ట్యాంకర్ రవాణాకు ఆటంకం ఏర్పడవచ్చు. దుష్కాలములో గ్రామంలో ప్రవహించే నదులు కూడ ఎండిపోవచ్చు. ఈ రకమైన అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడైతే నీరు పడుతుందో అక్కడ ఇంటి దగ్గర బావిని తవ్వించండి. అది సాధ్యం కాకపోతే, బోర్‌వెల్ వేయించుకోండి. బోర్‌వెల్ కంటే బావిని నిర్మించడం చాలా మంచిది; ఎందుకంటే ఆపత్కాల పరిస్థితుల్లో, బోర్‌వెల్ చెడిపోతే దానిని బాగు చేయడానికి అవసరమైన పరికరాలు (విడి భాగలు), మెకానిక్ మొదలైనవి పొందడం కష్టంగా ఉండచ్చు. బావిని త్రవ్వటానికి లేదా బోర్వెల్ త్రవ్వటానికి ముందు నీరు పడే విషయములో’ నిపుణులను సంప్రదించండి. భూమిలో నీరు ఉంటేనే, దానిని తవ్వించండానికి ఖర్చు చేయండి.

బావులు లేదా బోర్‌వెల్స్‌లో తగినంత నీరు ఉన్నచో, పంటకు, ఉద్యానవనం (తోటపని) మొదలైన వాటికి ఉపయోగించవచ్చు.

3 ఆ 1 అ . భూగర్భములో నీటి స్థాయిని పెంచడానికి తీసుకోవలసిన వివిధ చర్యలు

కావలసినంత వర్షము కురువక పోవటము, నీటి సంగ్రహణ ఎక్కువగుట మొదలగు కారణముల వలన, భూగర్భంలో నీటి మట్టం తగ్గుతుంది. కింద పేర్కొన్న ప్రయత్నాల వల్ల నీటి స్థాయి పెంచగలిగితే ప్రాంగణంలోని బావులు, బోర్‌వెల్స్ మొదలైన వాటి నీటి స్థాయి కూడా పెరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న ప్రకారం, గ్రామంలోని ప్రజలందరూ కలిసి వర్షపు కాలువలపై ఆనకట్టను నిర్మించి, నదిలో నాగలిని నడుపుతారు. దీన్ని చేయడానికి ముందు ప్రభుత్వం నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకోండి.

3 ఆ 1 అ 1. ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం !

గ్రామ ప్రజలు వ్యక్తిగతంగా లేదా అందరూ ఐక్యమై ఇటువంటి పథకాల లాభమును పొందటానికి ప్రయత్నించవలెను, ఉదాహరణకు ప్రభుత్వం నడుపుతున్న నీటి మట్టం పెంచండి’ పథకం

3 ఆ 1 అ 2. వర్షపు కాలువల్లో వివిధ ప్రదేశాలలో చిన్న ఆనకట్టలు నిర్మాణం చేయండి !


చిన్న ఆనకట్ట

3 ఆ 1 అ 3. గ్రామానికి సమీపంలో ప్రవహించే నది ఒడ్డున ఉన్న భూమిని దున్నుట

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో, నదిలో వచ్చే కుళ్ళు నీటిలోని సూక్ష్మ కణాలు నదీతీరం ఇసుకపై పేరుకుపోతుంది. ఇలా చాలా సంవత్సరాలు జరిగిన తరువాత, నదితీరంలోని ఇసుక మీద మట్టి యొక్క మందపాటి పొర పేరుకుపోతుంది. ఈ కారణంగా, నదిలో ప్రవహించే చాలా నీరు ఇసుక ద్వారా భూగర్భంలోకి వెళ్ళడానికి కుదరదు. ఈ కారణంగా, ప్రతి సంవత్సరం నది సముదాయంలో భూగర్భజలాల నీటి మట్టం తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి, కొన్ని గ్రామాల్లో నది ఒడ్డున దున్నుటపై ప్రయోగాలు చేశాయి, ఇది విజయవంతమైంది. ఈ విషయం లో మరింత సమాచారం ఇవ్వబడింది.

3 ఆ 1 అ 3 అ . గోమయీ నది ఒడ్డున నివసిస్తున్న గ్రామస్తులు నది ఒడ్డును దున్నుతూ భూమి నీటిని పీల్చుకునే లాగ చేసి భూగర్భజల మట్టాన్ని విజయవంతంగా పెంచారు !

పై సంఘటన మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లా, షాహదా తాలూకా, డాంబార్ఖేడ గ్రామంలో జరిగింది. ఈ గ్రామం గోమయీ నది ఒడ్డున ఉంది. ఈ నదికి 4 నుండి 6 నెలల వరకు నీరు ఉంటుంది. అయినప్పటికీ, బావి మరియు బోర్వెల్ యొక్క నీటి మట్టం 500 నుండి 700 అడుగుల లోతు వరకు పడిపోయింది. ఈ సమస్యను అధిగమించడానికి, వేసవిలో ఇక్కడి గ్రామస్తులు గోమయీ నదిని ట్రాక్టర్, కలప నాగలి, ఇనుప నాగలి మొదలైన వాటితో సుమారు ఒక కిలోమీటర్ నిలువుగా అలాగే అడ్డంగా దున్నారు. ఈ కారణంగా, వర్షాకాలంలో నదిలో నీరు ప్రవహించి పోకుండ, నదీతీరంలోని భూమిలోకి ఎక్కువ శాతములో వెళ్ళింది. ఫలితంగా, కేవలం 24 గంటల్లో పరిసరంలోని బావులు మరియు బోర్‌వెల్‌ల నీటి మట్టం (జలస్థాయి) 500 నుంచి 700 అడుగుల నుంచి 90 అడుగుల పైకి వచ్చింది !

తదనంతరం, మధ్యప్రదేశ్‌లోని ఖేతీయా పట్టణం వరకు అనేక గ్రామాల గ్రామస్తులు కూడా తమ గ్రామానికి సమీపంలో ప్రవహించే గోమయీ నదిని దున్నారు మరియు వర్షకాలంలో ప్రవహించే నీటిని నదీతీర భూమిలో ఇనకేటట్లు చేశారు.’ (సందర్భం : వాట్స్ ఆప్ లో వచ్చిన వ్యాసం)

3 ఆ 1 ఆ . కొన్ని సూచనలు

1. బావి లేదా బోర్ తవ్వించడానికి ఆర్థిక ఇబ్బందులున్నచో, కొన్ని కుటుంబాలు కలిసి బావి లేదా బోర్ బావి తవ్వవచ్చు.

2. బావి నుండి నీటిని తీసుకోవడానికి బావిపై ఒక కప్పి గిరికా (కొప్పెర) ఏర్పాటు చేయండి. గిరిక మీద వున్న తాడు సహాయంతో చేతులతో నీరు లాగడానికి అలవాటు చేసుకోవాలి. కొప్పెరకు కట్టిన తాడు పాడైనచో దానిని మార్చుటకు ఒక విడి తాడును అదనంగా ఇంట్లో ఉంచండి. వీలైతే సోలార్ పంప్‌ను ఏర్పాటు చేయండి. సౌర పంపు వ్యవస్థాపించినప్పటికీ, కప్పి వ్యవస్థను ఉంచండి; ఎందుకంటే మేఘావృత వాతావరణంలో సౌర పంపు ఉపయోగపడదు.

3. బావిలోని నీరు వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు సరిపోయేటంత ఉండకపోతే, నిపుణుడిని సంప్రదించి దాని లోతును పెంచుకోండి, తద్వారా వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు మీకు తగినంత నీరు ఉంటుంది.

4. బోర్ బావిపై ఎలక్ట్రిక్ పంప్‌తో పాటు సోలార్ పంప్ మరియు హ్యాండ పంప్‌ను ఏర్పాటు చేయండి. ఈ సదుపాయాలను కొత్త బావిలో కూడా వ్యవస్థాపించండి.

5. బావులు మరియు బోర్‌వెల్‌లు మానవ అప్రమేయాలతో కలుషితం కాకుండా జాగ్రత్త వహించండి.

3 ఆ 2. ఆపత్కాలములో ఒక కుటుంబానికి కనీసం 10-15 రోజులు సరిపడేంత నీరు నిల్వ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయండి.

ఆపత్కాలములో ప్రభుత్వ నీటి సరఫరా క్రమబద్ధీకరించబడకపోవడం, బావులు లేదా గొట్టపు బావులలో విద్యుత్ పంపులు చెడిపోవటం మొదలగు వాటి గురించి ఆలోచించి కుటుంబానికి కనీసం 10 నుండి 15 రోజులు వరకు సరిపడేంత నీటిని నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేయండి; ఉదా. వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయండి.

3 ఆ 3. విద్యుత్తు కొరత కారణంగా ఇంట్లోని జలశుద్ధీకరణ-యంత్రము (వాటర్ ప్యూరిఫైయర్) పనిచేయదు, కాబట్టి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించండి.

3 ఆ 3 అ . ప్రత్యామ్నాయంగా క్యాండల్ ఫిల్టర్ ని కొనండి

3 ఆ 3 ఆ . నీటిని శుభ్రం చేయడానికి పటిక ఉపయోగించడం


పటిక

బురదనీటిని తాగడానికి లేదా వంట కోసం ఉపయోగించాల్సిన పరిస్థితులలో క్రింద సూచించిన విధంగా పటికతో శుద్ధి చేయండి.

పటిక సుమారు 3-4 సెం.మీ. పొడవైన ముక్క లేదా నిమ్మ ఆకారపు ముక్కను పాత్రలోని నీటిలో పైభాగంలో సవ్యదిశలో 2-3 సార్లు తిప్పండి. తరువాత రెండు లేదా మూడు సార్లు వ్యతిరేక దిశలో తిప్పండి. ఇలా చేసిన తరువాత, ఆ నీటిలో కరిగిన మట్టి 3-4 గంటల్లో అడుగున స్థిరపడుతుంది. నీరు పూర్తిగా శుభ్రం చేయడానికి ఒక రోజు పడుతుంది. నీటిని పూర్తిగా శుద్ధి చేసే వరకు కదిలించవద్దు, లేకపోతే క్రింద ఉన్న మట్టి తిరిగి పైకి వస్తుంది.

పెద్ద పాత్రలో శుభ్ర పరచిన నీటిని ఉపయోగించడం కోసం, శుభ్రమైన నీటిని మరొక పాత్రలో చాలా జాగ్రత్తగా పోయాలి మరియు మిగిలిన బురదనీటిని మొక్కలకు పోయండి.

3 ఆ 3 ఇ . నీటిని వడబోసి మరిగించండి

తాగునీటిని పాత్రకు నింపే ముందు, ఒక శుభ్రంగా కడిగిన మందపాటి వస్త్రాన్ని ఆ పాత్ర పై భాగంలో కట్టి, దాని నుండి నీటిని వడబోయాలి. ఆహారాన్ని వండడానికి ఈ నీటిని ఉపయోగించవచ్చు. నీటిని వడబోసిన తరువాత, బట్టను శుభ్రంగా కడగాలి. నీటిని వడబోయడం కోసం మాత్రమే ఈ వస్త్రాన్ని ఉపయోగించండి. వడబోసిన నీటిలో తాగడానికి కావలసినంత నీరుని కాంచి మరొక పాత్రలో ఉంచండి.

3 ఆ 3 ఈ . నీటిని శుభ్రపరిచే యంత్రణలున్న బాటిల్ (ఇన్‌బిల్ట్ వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ బాటిల్ ) ఉపయోగించండి

ఈ బాటిల్‌లో అశుద్ధమైన నీరు కొంత సమయంలో స్వయంచాలకంగా శుద్ధి అవుతుంది మరియు త్రాగడానికి వీలుంటుంది. మీరు అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు లేదా మరొక గ్రామంలో ఉండవలసి వచ్చినప్పుడు ఈ రకమైన బాటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో లభిస్తాయి, వీటీ ఖరీదు సుమారు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.

3 ఆ 4. విద్యుత్ కొరత కారణంగా వాటర్ కూలర్లు పనిచేయకపోవచ్చు, చల్లటి నీటి కోసం కొన్ని సులభమైన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించండి

3 ఆ 4 అ . పెద్ద మట్టి కూజా లేదా కుండ ఉపయోగించండి

మట్టి కుండ

గ్రామంలోని కొన్ని గృహాల్లో, చల్లటి నీటి కోసం పెద్ద మట్టి కూజాను ఉపయోగిస్తారు. ఇంట్లో కూజాను ఉంచడానికి, ఒక గొయ్యి తవ్వి వాలుగా ఉన్న స్థితిలో ఉంచండి. ఇది భూమి నుండి ఒక అడుగు పైన ఉండాలి, కూజాను వాలుగా పూడ్చడం వల్ల దాని నుండి నీటిని తొలగించి సులభంగా శుభ్రపరచవచ్చు.

నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలను కూడా ఉపయోగించవచ్చు

3 ఆ 4 ఆ . గ్లాస్ బాటిల్, పాత్ర లేదా నీళ్ళ డ్రంను తడి గుడ్డతో చాలా గట్టిగా చుట్టండి

గ్లాస్ బాటిల్, పాత్ర లేదా నీళ్ళ డ్రంను తడి గుడ్డతో చాలా గట్టిగా చుట్టండి. దీని నుండి సుమారు 3-4 గంటల్లో నీరు చల్లబడుతుంది. గుడ్డ ఆరిపోయినప్పుడు, తిరిగి తడి చేయండి. తాగునీరు చల్లగా అయ్యే వరకు, ఆ గుడ్డను మధ్య మధ్యలో తడుపుతు ఉండండి.’

– (పూజ్య) వైద్య వినయ్ భావే, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా. (10.12.2019)

3 ఆ 5. నీటి వాడకానికి సంబంధించి కొన్ని చిట్కాలు

3 ఆ 5 అ . పొదుపుగా నీటిని ఉపయోగించడం

1. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, నేల తుడవడం, బట్టలు ఉతకడం, కారు కడగడం మొదలైన పనులు చేసేటప్పుడు నీరును పొదుపుగా ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.

2. తోటకి నీరు పోయడానికి అలాగే వ్యవసాయం కోసం, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ వ్యవస్థను ఉపయోగించండి.

3. వేసవిలో మొక్కల చుట్టూ ఎండిన ఆకులతో లేదా గడ్డితో మట్టి పైన కప్పండి. ఇలా చేయడం ద్వారా మొక్కల నుండి నీరు వేగంగా ఆవిరైపోదు మరియు నీరు ఆదా అవుతుంది.

3 ఆ 5 ఆ . ట్యాంక్‌లో (డ్రమ్) లో వర్షపు నీటిని నిల్వ చేయండి

వర్షాకాలంలో, ఇంటి పైకప్పు నుండి పడే నీటి క్రింద ట్యాంక్ ఉంచండి అందులో ఈ నీరుని నిల్వ చేయండి. ఈ నీటిని ఇంటి పనులకు ఉపయోగించవచ్చు.

నీటిని వధా చేయుట, క్షమించరాని అపరాధము !

‘ఒకరు దర్శనమునకు వచ్చినవారు చెంబులోని నీటిని ఒక గుప్పెడు త్రాగి మిగిలిన నీరును పారవేశాడు. అప్పుడు ఆ నీటిని పారవేయుటవలన శేగావ్ పరమపూజ్యులైన గజానాన్ మహారాజ్‌గారు, అతనిని “ నీ, తరువాత జన్మ నీరు లేని గ్రామములో అవుతుంది అని !” అని చెప్పారు. – (పరమ పూజ్య) సుశీల ఆపటే, గోవా(18.11.2018)

3 ఇ. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణించండి !

ఆపత్కాలములో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. తుఫాను సమయంలో చాలా రోజులు విద్యుత్ సరఫరాజు ఉండకపోవచ్చు. లైట్లు, ఫ్యాన్లు మొదలైన విద్యుత్ పరికరాలను నిలిపివేయడం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, పనిలో కూడా ఆటంకం కలిగకుండా ఉండటానికి, క్రింద ఇవ్వబడిన కొన్ని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించి, ఎక్కువ కాలం విద్యుత్తును అందించే వాటిని ఎంచుకోండి. ప్రతికూల సమయాలలో మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఇవి ఉపయోగపడతాయి.

3 ఇ 1 అ. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ (రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్) నుండి విద్యుత్ ఉత్పత్తి

విద్యుత్ ఉత్పత్తి కోసం సూర్యశక్తి ద్వారా విద్యుత్ ఉత్పాదన చేసే యంత్రాన్ని స్థానిక డీలర్ ద్వారా పెట్టించుకోవచ్చు. దీనికోసం ఏ ఇబ్బందులు రాకుండా నిరంతరాయంగా సూర్యప్రకాశం రాగలిగే కనీసం 100 చదరపు అడుగుల స్థలం ఇంటి పైకప్పుపై ఉండడం అవసరం. అటువంటి ప్రాంతంలో సోలార్ ప్యానెల్లు స్థిరంగా ఉంటే, రోజంతా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మరియు బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కొన్ని కారణాల వల్ల విద్యుత్ బోర్డు నుండి విద్యుత్ సరఫరా నిలిపివేయబడితే లేదా ఈ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే, ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్ మొదలైన ఉపకరణాలు, సౌరశక్తికి మార్చవచ్చు. ఈ సౌర పరికరం తగిన సామర్థ్యం కలిగి వుంటే ఎల్‌ఈడీ బల్బులు, బ్యాటరీతో నడిచే సైకిల్, ద్విచక్ర వహనము మరియు నాలుగు చక్రాల వహనములను కూడా ఛార్జ్ చేయవచ్చు.

మట్టికౌలల పైకప్పు లేదా స్లాబ్ ఉన్న ఇల్లు పైకప్పుపై సౌర వ్యవస్థను వ్యవస్థాపించవచ్చు. ఫ్లాట్ (అపార్ట్మెంట్) యజమానులు కూడా తమ భవనం పైన (టెర్రస్ మీద) సౌర వ్యవస్థను సమిష్టిగా వ్యవస్థాపించవచ్చు. సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అధిక శక్తిని విద్యుత్ బోర్డు కొనుగోలు చేస్తుంది. సౌరశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఉత్పత్తిదారునికి సబ్సిడీ ఇస్తుంది. ఇళ్ళు, దుకాణాలు మొదలైన వాటిలో సౌర శక్తి వ్యవస్థను వ్యవస్థాపించడానికి గ్రాంట్ మరియు రిబేటు పథకం అందుబాటులో ఉంది. ఈ విషయం గురించి మరింత సమాచారం సంబంధిత డీలర్ దుకాణాదారుల నుండి పొందండి.

3 ఇ 1 ఆ. జనరేటర్ వాడకం

జనరేటర్

3 ఇ 1 ఇ. చేతితో పనిచేసే జనరేటర్ సెట్‌ను ఉపయోగించండి.

ఇది మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3 ఇ 1 ఈ. ఇంధన శక్తితో పనిచేసే జనరేటర్‌ను ఉపయోగించడం

ఇటువంటి జనరేటర్లు పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్‌పై నడుస్తాయి. కొన్ని కిలోవాట్లను (1 కిలోవాట్ = 1,000 వాట్స్) ఉత్పత్తి చేసే సామర్థ్యం వాటికి ఉంటుంది.

3 ఇ 1 ఉ. నిరంతర విద్యుత్ సరఫరాకు [U.P.S] ను వ్యవస్థాపించడం

U.P.S

విద్యుత్ బోర్డు నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే, యుపిఎస్ స్వయంచాలకంగా (ఆటోమేటిక్) పనిచేయడం మొదలవుతుంది మరియు బ్యాటరీల నుండి విరామం లేకుండా విద్యుత్ సరఫరా చేయబడుతుంది. బాహ్య విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిన తర్వాత, ఈ వ్యవస్థ స్వయంచాలకంగా పనిచేయడం ఆపివేస్తుంది, మరియు దాని డిశ్చార్జ్డ్ ఎలక్ట్రిక్ కెపాసిటర్ (బ్యాటరీ) మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది.

ప్రభుత్వ విద్యత్ సరఫరా నుండి విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేనప్పుడు ఈ వ్యవస్థ ద్వారా సహాయమౌతుంది.

గృహ అవసరాలు కోసం, ఎత్తైన భవనాలపైను గాలిమరలను ఏర్పాటు చేయాలి. గాలి అధిక వేగంతో ప్రవహించే చోట గాలిమరను పెట్టడం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తిని విద్యుత్ కెపాసిటర్‌లో నిల్వ చేయవచ్చు. ఆ తరువాత ఈ శక్తిని అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి కోసం గాలిమరలను పర్వతాలపై లేదా బహిరంగ పీఠభూములలో ఏర్పాటు చేస్తారు.

సౌర శక్తితో పోలిస్తే, గాలిమరలు ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తికి చాలా పరిమితులు ఉన్నాయి. అందువల్ల గాలిమరలు నుంచి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించండి.

3 ఇ 1 ఊ. విద్యుత్ శక్తితో ఛార్జ్ అయ్యే ఎల్‌ఈడీ బల్బులు, బ్యాటరీలు మొదలైన పరికరాలను ఉపయోగించడం

పూర్తిగా ఛార్జ్ చేయబడిన ‘ఎల్‌ఈడీ’ బల్బులు, ట్యూబ్ లైట్లు, బ్యాటరీలు మొదలైనవి కొన్ని గంటలు వెలుగు ఇవ్వగలవు.

3 ఇ 1 ఎ. ఇతర సాంప్రదాయ ప్రత్యామ్నాయాలు

పైన పేర్కొన్న , ప్రత్యామ్నాయాలకు పరిమితులు ఉన్నాయి, ఉదా : ఆకాశంలో మొబ్బు ఉన్న వాతావరణం సమయంలో సౌరశక్తిని ఉత్పత్తి చేయడం కష్టం, అదే విధంగా ఆపత్కాల పరిస్థితుల్లో ఇంధనం లేకపోతే జనరేటర్ పని చేయదు. అటువంటి సమయంలో చమురు దీపం, లాంతరు, చిన్న కాగడా మొదలైన సంప్రదాయ ప్రత్యామ్నాయాలు ఉండాలి. ఇవి రాత్రి వేళ కొంతైనా వెలుగునిస్తాయి.

సేకరణ : సనాతన గ్రంథమాల ‘ఆపత్కాలములో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత !’

Leave a Comment