బరువు పెరగడానికి ఆయుర్వేద ఉపాయాలు

వైద్యులు మేఘరాజ్ పరాడ్కర్
వైద్యులు మేఘరాజ్ పరాడ్కర్

బరువు పెరగడానికి ప్రతిరోజూ శరీరానికి మర్దన చేయాలి, వ్యాయామం చేయాలి మరియు పోషకమైన ఆహారాన్ని తినాలి. ఆకలి తక్కువగా ఉన్న వారు ఆకలి పెరగడానికి మందులు తీసుకోవాలి. అన్ని స్థాయిలలో ప్రయత్నాలు చేస్తే, శరీరం మృదువుగా ఉంటుంది. దీని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 

1. నూనెతో మర్దన

వ్యాయామం చేయడానికి 15 నిమిషాల ముందు ఈ క్రింది నూనెలతో శరీరమంతా మర్దన చేయాలి.

అ. కొబ్బరి నూనె

ఆ. నువ్వుల నూనె

ఇ. వేరుశనగ నూనె

ఈ. శనగ పప్పు నూనె

ఒక గిన్నెలో కొన్ని సెనగ గింజలు రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం దానికి రెండు గ్లాసుల నీరు వేసి ఒక గ్లాసుకు తగ్గే వరకు మరగించాలి. అప్పుడు దానికి ఒక లీటరు నువ్వుల నూనె వేసి నీరు ఆవిరయ్యే వరకు కాయాలి. ఇనుము లేదా స్టీల్ వడపోత గిన్నెలో వేడిగా ఉన్నప్పుడు వడకట్టాలి మరియు చల్లబడిన తరువాత డబ్బాలో నింపాలి. స్నానానికి ముందు శరీర మర్దన కోసం ఈ నూనెను ఉపయోగించాలి. 1 లేదా 2 టీ చెంచాలు నూనెను వేడి నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కండరాలను మృదువుగా మరియు బలంగా చేస్తుంది.

 

2. వ్యాయామం – సూర్యనమస్కారములు

సూర్య భగవానుని ప్రార్థించిన తరువాత సూర్యనమస్కారములు చేయాలి. ఒక నమస్కారంతో ప్రారంభించి, ప్రతిరోజూ 24 సూర్యనమస్కారములను చేయగలిగే వరకు, రోజుకు ఒక నమస్కారాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి.

 

3. మందులు

బరువు పెరగడానికి పోషకమైన ఆహారం ముఖ్యం కాని జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నా లేదా జీర్ణక్రియ లోపాలు ఉన్నా తినే పోషకమైన ఆహారం జీర్ణము కాదు మరియు ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. దీనిని నివారించడానికి ఆకలి తక్కువగా లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు క్రింద ఇవ్వబడిన మందులలో ఏదైనా ఒకదాన్ని తీసుకోవాలి మరియు ఆకలి మెరుగుపడిన తర్వాత  ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే పోషక ఆహారాన్ని తినడం ప్రారంభించాలి.

అ. ఉదయం ఖాళీ కడుపుతో 4 తులసి ఆకులను కడిగి తినాలి, ఆపై నోటిని నీటితో పుక్కిలించాలి.

ఆ. భోజనానికి అరగంట ముందు  అల్లం ముక్కపై ఉప్పు చల్లుకొని నమలండి.

 

4. పోషకమైన ఆహారం

అ. తీసుకొనే ఆహారంలో ఈ ఆరు రుచులు – తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఉండాలి మరియు తీపి మోతాదు ఎక్కువగా ఉండాలి. పోషకమైన ఆహారాల జాబితా మరింత క్రింద ఇవ్వబడ్డాయి. ప్రతిరోజూ ఒకే ఆహారం తినడం చికాకుగా అనిపిస్తే మీ ఇష్టాన్ని బట్టి క్రింద ఇవ్వబడిన వాటిలో 1 లేదా 2 ఎంచుకోవాలి. జాబితా ప్రకారం వాటిని మార్చండి. మీరు ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా పోషకమైన ఆహారాన్ని తినండి.

ఆ. ఒక గుప్పెడు నలుపు లేదా తెలుపు నువ్వులు బాగా నమిలి తినాలి.

ఇ. ఒక గుప్పెడు తెల్ల నువ్వులు నానబెట్టి ముద్దగా తయారు చేసుకోవాలి. దానికి ఒక కప్పు నీరు కలపి పాలులాగా చేయాలి. దీనికి ఒక వక్కగింజంత బెల్లం వేసి ప్రతి ఉదయం త్రాగాలి.

ఈ. 3 టీచెంచాల మినుములు పైన పొట్టు తీయనివి లేదా పొట్టు తీసిన పప్పులు గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. 3 గంటల తరువాత ఒక గిన్నె తురిమిన కొబ్బరి వేసి మిక్సర్‌లో ముద్దగా తయారు చేసుకోవాలి. దీనినుండి రసం తీసి, వడపోసి బెల్లం వేసుకొని త్రాగాలి.

ఉ. పిండితో భక్రీ రొట్టె చేసేటప్పుడు 1/10 వ వంతు మినప పిండిని కలపాలి.  రొట్టెను నెయ్యి, మజ్జిగ లేదా వంకాయ కూరతో తినాలి.

ఊ. భోజనానికి వారానికి రెండుసార్లు మినుములు మరియు అమరిండ్ సీడ్ పిండి మిశ్రమం నుండి తయారుచేసిన చపాతీలను మినుములతో చేసిన కూరతో తినాలి.

ఋ. మొలక్కట్టిన చిక్కుడు గింజలతో  గుజ్జుగా ఉండేటట్లు వండిన కూరను తినాలి.

ౠ. మీ ఆకలిని బట్టి అరటి, ఖర్జురము లేదా అంజీర పండ్ల మిశ్రమాన్ని ఒక టీస్పూన్ తేనెతో తినండి. తరచుగా జలుబు సమస్యలు ఉండేవారు తేనె మరియు ఖర్జురము మాత్రమే తీసుకోవాలి, అరటి లేదా అంజీర పండ్లు తీసుకోకూడదు.

ఎ. ఉదయం అల్పాహారంతో పెరుగు తినాలి.

ఏ. మీ ఆకలిని బట్టి పాల మీగడ మరియు పటికబెల్లం మిశ్రమాన్ని తినాలి.

ఐ. ప్రతి రోజు ఒక నెల పాటు 2 టీచెంచాలు (10 గ్రాములు) పాల కోవా తినాలి మరియు తరువాత ఒక గ్లాసు పాలు తీసుకోవాలి.

ఒ. ఉదయాన్నే ప్రతిరోజు అల్పాహారంతో 2 టీచెంచాల తురిమిన జున్ను, 1 గరిట తేనె 1 లవంగంతో తినాలి.

ఓ. క్రమం తప్పకుండా పన్నీర్ ను తినాలి.

4అ. బరువు తక్కువ ఉండి ఇతర రుగ్మతలు ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకోవలసిన పోషకమైన ఆహారాలు

4అ 1. మందగించిన ఆకలి, నిద్ర సమస్యలు, చిరాకు, కాలేయం మరియు గుండెకు బలవర్ధక ఔషధం

మామిడి పండ్లు లభించు రోజుల్లో ప్రతి రోజు 1 మామిడి పండు తినాలి మరియు దాని తరువాత ఒక గ్లాసు పాలు త్రాగాలి. ఇలా వరుసగా మూడు నెలలు కొనసాగించాలి. పాలతో మామిడి తప్ప వేరే పండు తినకూడదు.

4అ 2. కడుపులో మంట

అన్నం నుంచి వచ్చిన గంజి తీసుకోవాలి లేదా అన్నం గంజిలో తరిగిన కొత్తిమీర కలిపి త్రాగాలి.

4అ 3. గట్టి మలం మరియు మూత్రం తక్కువ రావడం

పాక్షికంగా పులియబెట్టిన సగం గిన్నె పెరుగు మరియు వక్క గింజంత బెల్లం మిశ్రమాన్ని ఒక వారం రోజులు ఆహారం తినేటప్పుడు తినాలి. తరువాత ఒక వారం ఆపాలి. ఇలా 3 వారాలు కొనసాగించాలి. అప్పుడు శరీరంలోని కొవ్వు పదార్ధం పెరుగుతుంది.

4అ 4. విరేచనాలు

అన్నం గంజిలో తాజాగ తరిగిన కొత్తిమీర వేసి త్రాగాలి.

4అ 5. విరేచనాలు (మలం కొన్ని సమయాల్లో వదులుగా ఉన్నప్పుడు మరియు గట్టిగా మరియు అంటుకునేటప్పుడు)

పసుపు ఎరుపు రంగు గుమ్మడికాయను గట్టిగా ముదిరిన విత్తనాలతో తీసుకోవాలి. దాని చర్మాన్ని తీసివేసి నెయ్యిలో వేయించాలి. రుచికి పటికబెల్లం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గల్లు ఉప్పు కలపండి. ఇది శరీరాన్ని బలపరుస్తుంది.

4అ 6. మూత్ర, చర్మ సమస్యలు

ఒక పిడికిలి శనగలను రాత్రిపూట నీటిలో నానబెట్టి, అరగంట వ్యాయామం తర్వాత తినండి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

4అ 7. తక్కువ వీర్యకణాల సంఖ్య

పనసకాయ విత్తనాలు తీసుకోవడం వల్ల కండరాలు, కొవ్వు మరియు వీర్యకణాల పెరుగుదలను పెంచుతాయి.

-వైద్యులు మేగరాజ్ మాధవ్ పరద్కర్, మహర్షి ఆధ్యాత్మ విశ్వవిద్యాలయము, గోవా. (20-5-2016)

సూచన: ప్రతికూల సమయాలపై సనాతన సంస్థ యొక్క పవిత్ర గ్రంథాల శ్రేణి – ప్రతికూల సమయాల్లో ప్రాణాలను కాపాడుకొనుటకు ‘ఆయుర్వేదం’

Leave a Comment