అనారోగ్యాలను నయం చేయడానికి ఖాళీ పెట్టెలను ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక వైద్యం – భాగం 3

రాబోయే ప్రపంచ యుద్ధంలో, అణు వికిరణం కారణంగా లక్షలాది మంది చనిపోతారని  మహాత్ములు అంచనా వేశారు. భవిష్యత్తులో, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి మరియు ఈ కాలంలో సమాజం అనేక విపత్తులను ఎదుర్కొంటుంది. మనతో సహా కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించడం అత్యవసర పరిస్థితుల్లో పెద్ద సవాలు. ప్రతికూల సమయంలో, సమాచార మాధ్యమాలు విచ్ఛిన్నమవుతాయి. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్ళడం,  వైద్యుడిని సంప్రదించడం మరియు మందులు కొనడం కష్టం అవుతుంది. అత్యవసర పరిస్థితులను  ఎదుర్కోవడంలో సహాయపడే  గ్రంథాలను సనాతన సంస్థ సిద్ధం చేసింది. ఈ గ్రంథాల నుండి నేర్చుకున్న చికిత్సా విధానం అత్యవసర సమయాల్లో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా సహాయపడుతుంది; ఎందుకంటే, ప్రతి ఒక్కరినీ స్వయం సమృద్ధిగా మరియు ఆత్మ విశ్వాసంతో ఉండేటట్లు చేయటం సంస్థ ద్యేయం. ప్రస్తుతానికి, ఈ శ్రేణిలో 13 గ్రంథాలు ఉన్నాయి. ‘రుగ్మతలను తగ్గించడానికి కాళీ అట్ట పెట్టెలను వుపయోగించి ఆధ్యాత్మిక చికిత్సలను చేయుట’ అనే పుస్తకాన్ని రెండు భాగాలుగా పరిచయం చేస్తున్నారు. ఈ గ్రంథాలలో వివరంగా సమాచారం అందించబడింది.

‘రుగ్మతలను తగ్గించడానికి కాళీ అట్ట పెట్టెలను వుపయోగించి ఆధ్యాత్మిక చికిత్సలను చేయుట’  అనే గ్రంథము ఇది ప్రతికూల సమయాల్లో మాత్రమే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది.

ఖాళీ పెట్టెలతో ఆధ్యాత్మిక చికిత్స చేయడం అనూహ్యమైన సాధనంగా అనిపించవచ్చు; ఏదేమైనా, ఖాళీ పెట్టెలో శూన్యత్వం ఉంటుంది. ఇది  ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. అన్ని పంచతత్వాలలో (పంచభూతాలు ), ఆకాశ తత్త్వం అత్యంత సూక్ష్మమైనది మరియు అత్యంత శక్తివంతమైనది.  ఆధ్యాత్మిక  చికిత్స కోసం ఆకాశతత్వం వాడటం ఒక వ్యక్తి యొక్క శరీరం, మనస్సు మరియు తెలివిపై ఉన్న నల్లటి వలయం తొలగించబడుతుంది, అదే విధంగా వ్యక్తిని బాధకు గురిచేస్తున్న దుష్ట శక్తిని కూడా తొలగిస్తుంది. వ్యాధి యొక్క  మూలకారణం నిర్మూలించబడుతున్నందున, వ్యాధిని త్వరగా తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

3 ఈ. నిద్రపోయేటప్పుడు ఖాళీ పెట్టెల  నివారణలు చేయడం

రాత్రి సమయంలో దుష్ట శక్తుల బాధ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, బాధవున్నవాళ్ళు పగటిపూట మరియు రాత్రి నిద్రపోయేటప్పుడు ఖాళీ పెట్టెల నివారణలు చేయాలి. ఎలాంటి బాధతో బాధపడని వారు కూడా రాత్రిపూట మంచానికి చుట్టూ పెట్టెలను ఉంచడము వల్ల రక్షణ కవచం ఏర్పడుతుంది.

3 ఈ 1. మంచం చుట్టూ ఖాళీ పెట్టల అమరికపై కొన్ని  సూచనలు

3 ఈ 1 అ. వ్యక్తి (నేలపై లేదా మంచం మీద) ఎక్కడ నిద్రిస్తాడో దానిని బట్టి పెట్టెలను ఉంచాలి.

1. కుర్చీ, పీట, బల్ల  మొదలైన వాటిని ఉపయోగించి మంచం ఎత్తు ప్రకారం పెట్టెలను సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది సాధ్యం కాకపోతే, వాటిని తక్కువ ఎత్తులో లేదా నేలపై ఉంచండి.  పెట్టెలను  ఇతర ఎత్తులలో ఉంచడం ద్వారా పొందే ప్రయోజనం 20 నుండి 30 శాతం మాత్రమే, అవసరమైన ఎత్తులో ఉంచడం ద్వారా పొందు ప్రయోజనం ఎక్కువ. దీనిని పరిగణనలోకి తీసుకుని, పెట్టెలను  అవసరమైన ఎత్తులో ఉంచడానికి ప్రయత్నించాలి.

పెట్టెలను ఒకే ఎత్తులో ఉంచడం సాధ్యం కాకపోతే, పెట్టె తెరచివున్నవైపు వ్యక్తికి ఎదురుగా ఉండే విధంగా ఏటవాలుగా ఉంచాలి (క్రింద ఉన్న బొమ్మను చూడండి. ఈ చిత్రంలో  సౌలభ్యం కోసం రెండు పెట్టెలను మాత్రమే చూపబడింది).

 

 

2. మంచం ఒకటి లేదా రెండు వైపులా గోడను తాకినట్లయితే, అప్పుడు పడుకునే ముందు, గోడ నుండి దూరంగా లాగి, మంచం ఎత్తులో పెట్టెలను ఉంచాలి. (గోడ నుండి మంచం లాగడం సాధ్యం కాకపోతే, గోడ దగ్గర దాని అంచున చిన్న పెట్టెలను ఉంచాలి. చిన్న పెట్టెల నుండి పొందిన ప్రయోజనం పెద్ద వాటి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, పెట్టెలు లేకపోవడం కంటే ఇది మంచిది).

3 ఈ 1 ఆ. పెట్టెలను 30 సెం.మీ. (1 అడుగు) మంచం నుండి దూరంగా ఉంచాలి. ఒక 10 సెం.మీ. ఇంచుమించుగా ఉన్నా కూడా ఆమోదయోగ్యమే. ఇది సాధ్యం కాకపోతే, దూరాన్ని మరింత తగ్గించవచ్చు.

3 ఈ 1 ఇ . పాయింట్ ‘3ఈ  2అ’ లో చూపిన విధంగా, పెట్టెలను అడ్డంగా ఉంచాలి. దీనివల్ల, పెట్టెల యొక్క ఎక్కువ భాగం వ్యక్తి శరీరానికి ఎదురుగా ఉంటుంది.

3 ఈ 2. రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి నిద్రపోయినప్పుడు ఆధ్యాత్మిక నివారణలు చేయడం

3 ఈ 2 అ. రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి  మాత్రమే నిద్రపోతున్నప్పుడు పెట్టెలను ఎలా ఉంచాలి

క్రింద ఉన్న చిత్రంలో చూపిన విధంగా వ్యక్తి మంచం యొక్క నాలుగు వైపులా పెట్టెలను ఉంచాలి.

3 ఈ 2 అ 1. పెట్టె యొక్క తెరచినవైపు భాగం రుగ్మత ఉన్న వ్యక్తి తలకు ఎదురుగా ఉంచాలి.

3 ఈ 2 అ 2. వ్యక్తి యొక్క పాదాల దగ్గర మరొక పెట్టెను అరికాళ్ళకు ఎదురుగా ఉంచాలి.

3 ఈ 2 అ 3. రుగ్మత ఉన్న వ్యక్తి యొక్క ఎడమ మరియు కుడి వైపున రెండు పెట్టెలను ఉంచాలి. పెట్టె యొక్క తెరచినవైపు భాగం రుగ్మత ఉన్న వ్యక్తి యొక్క నివారణ ప్రదేశంలో ఉంచాలి. ( నివారణ  చేయడానికి నిర్దిష్ట ప్రదేశాలు లేకపోతే, ‘3ఈ. 2అ. ‘ చిత్రంలో చూపిన విధంగా పెట్టె 1’, ‘పెట్టె 2’, ‘పెట్టె 3’ మరియు ‘పెట్టె 4’ స్థానాల ప్రకారం పెట్టెలను ఉంచాలి).

3 ఈ 2 అ 4. మరో రెండు పెట్టెలను తీసుకొని, వాటిలో ఒక పెట్టె యొక్క తెరచినవైపు భాగం పైకి మరియు మరొక పెట్టె యొక్క తెరచినవైపు భాగం క్రిందికి, ‘3 ఈ 2 అ’ చిత్రంలో చూపిన విధంగా పెట్టెలను వ్యక్తి చుట్టూ ఉంచాలి. (సౌలభ్యం కోసం రెండు పెట్టెలను వ్యక్తి యొక్క పాదాలకు ఎడమ మరియు కుడి వైపులా ఉంచారు).

వ్యక్తి మంచం మీద నిద్రిస్తున్నప్పుడు , మంచం క్రింద ఒక పెట్టెను తెరచినవైపు భాగం క్రింది దిశలో ఉండేలా ఏర్పాటుచేయాలి. మరియు మరొక పెట్టెను తెరచినవైపు భాగం పైదిశలో ఉండే విధంగా  ఎక్కడైనా వ్యక్తి చుట్టూ ఉంచాలి (కాని మంచం క్రింద కాదు).

‘ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే నిద్రిస్తే ఒకరు (ఉదా. భార్యాభర్తలలో ఒకరు) అనారోగ్యంతో బాధపడుతుంటే, అప్పుడు పెట్టెలను ఎలా ఉంచాలి?, అనారోగ్యమైన  తల్లి తన ఆరోగ్యకరమైన బిడ్డతో నిద్రిస్తున్నప్పుడు పెట్టెలను ఎలా ఉంచాలి? ‘ మొదలైనవి ఈ పవిత్ర గ్రంథంలో చర్చించారు.

3 ఈ 3. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ ఆరోగ్యకరమైన వ్యక్తులు కలిసి నిద్రిస్తున్నప్పుడు, దుష్ట శక్తుల నుండి వారిని రక్షించడానికి పెట్టెలతో నివారణలు చేయడం

ఈ పద్ధతిలో, పెట్టె యొక్క తెరచినవైపు భాగం వ్యక్తి యొక్క శరీరానికి వ్యతిరేకంగా ఉంచాలి. తత్ఫలితంగా, బయటి నుండి వచ్చే దుష్ట శక్తి పెట్టెల శూన్యతలోకి లాగబడుతుంది, తద్వారా వ్యక్తికి  రక్షణ కలుగుతుంది.

3 ఈ 3 అ. ఒక వ్యక్తి మాత్రమే నిద్రిస్తున్నప్పుడు పెట్టెలను ఎలా ఏర్పాటు చేయాలి?

1. ప్రతి పెట్టె యొక్క తెరచినవైపు భాగం వ్యక్తి యొక్క శరీరానికి వ్యతిరేకంగా ఉండేటట్లు క్రింద చూపిన విధంగా నాలుగు పెట్టెలను మంచం చుట్టూ నాలుగు దిశల్లో అమర్చాలి.

అ. వ్యక్తి తల పైన ఒక పెట్టెను ఉంచాలి.

ఆ. వ్యక్తి యొక్క పాదముల క్రింద మరియొక పెట్టెను  ఉంచాలి.

ఇ. మరో రెండు పెట్టెలను వ్యక్తి యొక్క ఎడమ మరియు కుడి వైపులా సుమారు మధ్యలో ఉంచాలి.

2. పైన ‘3ఈ.2అ4’ లో సూచించిన విషయమును చూడండి (సమీప బొమ్మను చూడండి.)

 

4. ఖాళీ పెట్టెలను ఉపయోగించి అనారోగ్య సమస్యలపై ఆధ్యాత్మిక నివారణలు చేయు వ్యవధి మరియు తీవ్రతను బట్టి నివారణ వ్యవధిని పెంచుట

ప్రతిరోజూ సుమారు 1-2 గంటలు ఖాళీ పెట్టెలను ఉపయోగించి నివారణలు చేయాలి. కొన్ని రోజులు 1-2 గంటలు ఈ నివారణలు చేసిన తర్వాత కూడా, రుగ్మత తగ్గకపోతే లేదా నియంత్రించకపోతే, అప్పుడు నివారణల  వ్యవధిని పెంచాలి.

 

5. ఖాళీ పెట్టెల ద్వారా ఆధ్యాత్మిక వైద్య  నివారణకు సంబంధించిన సాధారణ సూచనలు

5 అ. ఖాళీ పెట్టెల ద్వారా-నివారణలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన సూచనలు

5 అ 1. ఆధ్యాత్మిక నివారణల కోసం మనం ఏ దిశలో కూర్చోవాలి?

సాధ్యమైనంతవరకు, తూర్పు-పడమర దిశలో కూర్చోవాలి . ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు కూర్చోకూడదు.

5 అ 2. ఉపాసించే దేవతను ఆధ్యాత్మిక భావోద్వేగంతో  ప్రార్థించాలి.

ప్రార్థన చేయు విధానము:  ‘ఓ’ ‘దేవత (దేవత నామాన్ని చెప్పాలి), నా అనారోగ్యం (వ్యాధి పేరు) మీ దయ వల్ల ఆధ్యాత్మిక నివారణల ద్వారా మరియు వీలైనంత త్వరగా నయమవాలి  అని నేను మీ  పవిత్ర పాదాలకు ప్రార్థిస్తున్నాను.

5 అ 3. భావముతో ఆధ్యాత్మిక నివారణలు చేయుట

భక్తుడి భావము తో భగవంతుడు సంతోషిస్తాడని అంటారు. పెట్టలలోని ఆకాశతత్వము  మన భావము వల్ల ఎక్కువ స్థాయిలో చైతన్యవంతం అవుతుంది మరియు మన బాధను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

5 అ 3 అ. ఆధ్యాత్మిక నివారణల సమయంలో భావము ఉత్పత్తి చేయడానికి చేయవలసిన చర్యలు

1. పెట్టెలో దైవత్వం ఉంది అన్న భావముతో పెట్టెలకు నమస్కారం చేసి ఉపయోగించాలి.

2.ఆధ్యాత్మిక నివారణలు చేస్తున్నప్పుడు, ‘నా చుట్టూ ఉన్న నల్లటి వలయం మరియు నాలోని బాధను కలిగించే శక్తి నాశనం అవుతోంది మరియు నేను చైతన్యమును  (దైవ చైతన్యాన్ని) పొందుతున్నాను’ అని భావించాలి.

5 అ 4. నివారణలు పూర్తయిన తర్వాత ఉపసనాదేవతకు  కృతజ్ఞతలు తెలియజేయాలి.

ఈ విధంగా కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి  – ‘ఓ’ దేవత… (ఉపసనాదేవత నామాన్ని చెప్పాలి), నేను మీ దయ వల్ల మాత్రమే ఆధ్యాత్మిక నివారణలు చేయగలిగాను. మీ పవిత్ర పాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ’.

5 ఆ. ఇతర సూచనలు

5 ఆ 1. ఆధ్యాత్మిక నివారణలకు ఉపయోగించే పెట్టెలను శుద్ధి చేయాలి.

సాత్వికమైన ధూపపు కడ్డీ యొక్క పొగతో ప్రతిరోజూ పెట్టెలను శుద్ధి చేయాలి.

5 ఆ  2. ఖాళీ పెట్టెల శూన్యతలో దైవత్వాన్ని నిలిపి ఉండేటట్లు ఇలా చేయాలి.

అ. ప్రార్థన:  ‘పెట్టెల యొక్క  శూన్యత దైవ చైతన్య స్థాయిలో నిరంతరం చురుకుగా ఉండనివ్వండి’. అని  ఉపాసన దేవతను ప్రార్థించాలి.

ఆ. ధూపపు కడ్డీని త్రిప్పడం : పెట్టెల  శూన్యతలో ధూపపు కడ్డీని  త్రిప్పాలి మరియు అందువల్ల వాటిలో దైవత్వాన్ని చైతన్య  స్థాయిలో మేల్కొలపాలి .

– ‘ఒక విద్వాంసుడు’ (16.10.2007, 12.35 p.m.) (సనాతన సద్గురు [శ్రీమతి] అంజలి గాడ్గిల్ యొక్క రచనలు, ‘గురుతత్త్వం’ మొదలైన పేర్లతో ప్రచురించబడ్డాయి.)

 

6. పెట్టెలతో పరోక్ష నివారణ యొక్క కొన్ని పద్ధతులు

6 అ. రుగ్మత నుండి బయటపడటానికి, వ్యక్తి యొక్క పూర్తి పేరును కాగితంపై లేదా ఫోటోను పెట్టెలో ఉంచడం

6 అ 1. విధానం

రుగ్మత నుండి బయటపడటానికి, ఆ వ్యక్తి తన పూర్తి పేరును కాగితంపై వ్రాసి కాగితమును లేదా ఫోటోను పెట్టెలో ఉంచాలి.

6 అ 2. ప్రత్యేక అనుకూలత

వ్యక్తి చుట్టూ చికిత్సల కోసం పెట్టెలను ఉంచడం సాధ్యం కాకపోతే (ఉదా. రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్నారు, ప్రాకే పిల్లవాడు), అప్పుడు ఈ చికిత్సలు చేయండి.

6 ఆ. ఒక వ్యక్తి మనస్సులో ప్రతికూల, నిరుత్సాహపరిచే, అసహ్యకరమైన లేదా అపసవ్య ఆలోచనలను కలిగి ఉంటే, ఆ ఆలోచనలను కాగితంపై వ్రాసి ఖాళీ అట్ట పెట్టెలో ఉంచండి లేదా ఆ వ్యక్తి స్వయంగా వ్రాసిన కాగితమును లేదా పుస్తకమును ఖాళీ అట్ట పెట్టెలో ఉంచండి.

6 ఆ 1. విధానము

అ. మండలంలో (కాగితముకు నాలుగు ప్రక్కల) ‘ఓం నమో భగవతే వాసుదేవయ ‘ అను నామజపమును వ్రాసి, వ్యక్తి పైన పేర్కొన్న ఆలోచనలను కాగితంపై వ్రాసి మడత పెట్టి ఒక ఖాళీ అట్ట పెట్టెలో ఉంచండి మరియు ఉపాసన దేవత యొక్క నామజపమును చేయాలి.

ఆ. పైన పేర్కొన్న విధానము చేయలేకపోతే, వ్యక్తి తన చేతివ్రాతను కాగితం పై లేదా పుస్తకములో వ్రాసి పెట్టెలో ఉంచాలి. సమస్యలు వున్న సమయంలో చేతివ్రాతతో వ్రాయాలి.

సందర్భం : సనాతన ప్రచురణ ‘వికార (రుగ్మత) నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము భాగము 3’(ఇంగ్లీషు)

Leave a Comment