శివుడి విశిష్టతలు

Shiv
శివుడు

 

భగవంతుడు ప్రజాపతి, బ్రహ్మా, శివ, శ్రీవిష్ణువు మరియు మీనాక్షి ఈ ఐదుగురు దేవతల తత్వముల నుండి విశ్వమును నిర్మించాడు. ఈ ఐదుగురు దేవతలలో భగవంతుడి సర్వ విశిష్టతలు వున్నాయి, అలాగే ఆ యా దేవతలకు వారి వైశిష్ఠములు గలవు. ఈ లేఖ ద్వారా శివుడి విశిష్టతలను తెలుసుకుందాం.

 

1. శారీరక మరియు భౌతిక వైశిష్ట్యాలు

1 అ. గంగా

గ్రహములకు కేంద్రబిందువు సూర్యుడు, శరీరానికి కేంద్రబిందువు ఆత్మ, అదే విధంగా ప్రతి వస్తువు యొక్క చైతన్యము మరియు పవిత్రకముల (సూక్ష్మ చైతన్య కణముల) కేంద్రబిందువు ‘గం’, ‘గం’ (బీజ మంత్రము) దేని నుండి ప్రవాహిస్తుందో ఇలాంటి ప్రవాహము ‘గం గః’ అంటే ‘గంగా’. శివుని శిరస్సు నుండి ‘గం’ (బీజ మంత్రము) ప్రవహిస్తుంది. దీనినే ‘శివుని నుండి గంగా అవతరించినదని’, అంటారు.

పృథ్వి పై ప్రవహిస్తున్న గంగానది పైనచెప్పిన ఆధ్యాత్మిక గంగ యొక్క అంశాత్మక తత్వమైనందున అది కాలుష్యం కారణంగా ఎంత మలినమైనప్పటికీ దాని పవిత్రత ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుచేతనే ప్రపంచములోని ఏ నీటితో పోల్చిననూ గంగానది నీరు అన్నిటి కంటే పవిత్ర మైనదని సూక్ష్మజ్ఞానము తెలిసినవారికే కాక శాస్త్రజ్ఞులకు కూడా ఈ విషయము తెలుస్తుంది.

1 ఆ. చంద్రుడు

శివుని నుదుటి మీద చంద్రుడు ఉంటాడు. మమత, క్షమాగుణం మరియు వాత్సల్య (ఆహ్లాదం) తరంగాలు ఎక్కడి నుండి వస్తూ ఉంటాయో దానినే ‘చంద్రుడు’ అంటారు.

1 ఇ. మూడవ కన్ను

1 ఇ 1. శివుని ఎడమ నేత్రం మొదటి కన్ను, కుడి నేత్రం రెండవ కన్ను మరియు భ్రూమధ్యకు (కన్నుబొమ్మల) కొంచెం పైన సూక్ష్మరూపములో ఉన్న ఊర్ధ్వ నేత్రమే మూడవ కన్ను. ఊర్ధ్వ నేత్రము కుడి కన్ను మరియు ఎడమ కన్నుల సంయుక్త శక్తికి ప్రతీకము మరియు అదే విధంగా అతీంద్రియ శక్తికి మాహాపీఠము. దీనికే జ్యోతిర్మఠ్, వ్యాసపీఠము అను పేర్లు ఉన్నవి.

1 ఇ 2. శివుడు త్రినేత్రుడు అంటే భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్కాల అంటే త్రికాల ఘటనలను చూడగలడు.

1 ఇ 3. యోగశాస్త్రానుసారం మూడవ నేత్రం సుషూమ్నానాడి.

1 ఈ. సర్పములు

1 ఈ. అ. వేరువేరు పాములంటే పవిత్రకముల (సూక్ష్మ చైతన్య కణముల) సమూహము. బయటకు పామువలె కనిపించిననూ వాస్తావానికి అవి ఒక నిచ్చెనలాంటివి. ఆధ్యాత్మిక ప్రగతి కొరకు ఈ పాముల తోక పట్టుకొని పైకి వెళ్లవలసి వుంటుంది. ఈ పాములంటే పవిత్రకములను పోషించి వాటి హారమును మెడలో ధరించువాడు, అందుకే శివున్ని ‘భుజంగపతిహారీ’ అని కూడా అంటారు.

శివుని తలమీద ఒకటి, మెడలో ఒకటి, రెండు భుజముల పై ఒక్కొక్కటి, రెండు మణికట్టుల పై ఒక్కోక్కటి, నడుముపై ఒకటి మరియు ఒక్కోక్క తొడపై ఒక్కొక్కటి మొత్తం తొమ్మిది స్థానములలో తొమ్మిది పాములుండును. అంటే పవిత్రకములతోనే శివుని సమస్త శరీరము తయారైనది లేక విశ్వరూపి శివుని శరీరముపై పవిత్రకములు అంటే పాములు ఆడుచున్నవి.

1 ఈ. ఆ. సర్పము శివుని ఆయుధం అని కూడా అంటారు. విశ్వములోని 9 సర్పాలను ‘నవనారాయణ’ అని కూడా అంటారు. 9సర్పాలనుండే నవనాథుల సృష్టి జరిగినది.

1 ఈ ఇ. కార్తీకేయ, జ్యోతిబా, రవళనాథ, మరియు సబ్బు వీరందరూ నాగరూప దేవతలు.

1 ఈ. ఈ. అన్ని దేవి, దేవతల రూపములో ఏదో ఒక సందర్భములో సర్పముతో సంబంధము ఉంటుంది.

1 ఈ. ఉ. ఒక నాగిని మన శరీరములో ఉండును. దానిని కుండలిని అని అంటారు. ఐదు పాములు ఐదు అంతస్థ వాయు రూపములో పూర్తి శరీరములో తిరుగుతూ ఉంటాయి. అలాగే మిగిలిన నాలుగు నాగినులు ఆధ్యాత్మిక ప్రగతి ద్వారానే మన శరీరములో రావచ్చును.

1 ఈ. ఎ. నాగ (సర్పము) పురుషతత్వమునకు ప్రతీక. ఇది సంతానము ఇచ్చే దేవుడు.

1 ఉ. భస్మము

భూ-భవ అనగా జన్మించుట. అస్ – అస్మ – అశ్మ అంటే బూడిద. ఏది జన్మ తీసుకుంటుందో మరియు చివరకు బూడిదలో కలిసిపోతుందో దానినే భస్మము అంటారు. భస్మము అంటే జన్మ తీసుకొన్న బూడిద. స్మ (శ్మ) అంటే బూడిద. ఇంకా శ్రు-శన్ అంటే వెదజల్లిన, అందుకే ఏ స్థలములో బూడిద వెదజల్లి వుండునో ఆ స్థలము స్మశానము. పృథ్వి అగ్ని నుండి (తేజము నుండి) జన్మించినది. పృథ్వి మీదనున్న సమస్త జీవరాసులు పృథ్వి యొక్క తేజము నుండి జన్మిస్తాయి మరియు ఆ తేజములోనే విలీనమౌతాయి. ‘శరీరము నాశనమగునను దానిని ఎల్లప్పుడూ గుర్తు చేయునదే ‘భస్మము ’.

1 ఊ. రుద్రాక్ష

అంశము ‘8 ఆ. రుద్రాక్షధారణ’ చూడండి.

1 ఎ. వ్యాఘ్రాంబర

వ్యాఘ్రము అంటే పులి (రజ-తమ గుణాలు) క్రూరతకు ప్రతీకము. అలాంటి వ్యాఘ్రమును (రజ- తమ గుణాలను) వధించి శివుడు దానిని ఆసనముగా చేసుకున్నాడు.

 

2. ఆధ్యాత్మిక వైశిష్ట్యాలు

2 అ. మహాతపస్వి మరియు మహాయోగి

నిరంతరంగా నామజపము చేయు ఏకైక దేవుడు శివుడు.

2 ఆ . కోపిష్టి

తాను చేయు అఖండ నామజపమును అతనే స్వయంగా(వారంతటవారే) విశ్రమిస్తే(ఆపితే) అప్పుడు వారు శాంతంగానే వుంటారు. కానీ నామజపములో ఎవరైనా విఘ్నాలను (ఆటంకాలు) కలిగిస్తే సాధన ద్వారా పెరిగిన తేజము (అగ్ని) ఒక్కసారిగా బయటకు వస్తుంది. కావున ఎదుట వున్న వ్యక్తి ఆ తేజమును భరించలేక భస్మమై పోతాడు. దీనినే ‘శివుడు తన మూడవ నేత్రము తెరిచి భస్మము చేసెను’ అని అంటారు. ఇలాంటి విఘ్నాలు, ఇబ్బందులు ఇచ్చు వ్యక్తికి 100% హానికలిగితే శివునికి కేవలము 0.01% ఇబ్బంది (కష్టము) కలుగును. దీని నుండి శివుని నాడిబంధము విడిపోవును కాని ఆసనము అలాగే వుండును. తరువాత శివుడు మరల బంధములో కూర్చుంటాడు.

2 ఇ. ఇతరుల సుఖము కొరకు ఎలాంటి కష్టానైనా సహించుటకు సిద్ధంగా వుండువాడు

సముద్రమంథనము నుండి వుత్పన్నమైన హాలాహల విషము పూర్తి విశ్వాన్ని దహిస్తున్నప్పుడు ఏ దేవుడు కూడా ఆ విషాన్ని గ్రహించే సాహసము చేయలేదు. అప్పుడు శివుడు హాలాహలమును త్రాగి సంపూర్ణ జగత్తును వినాశనము నుండి రక్షించెను.

2 ఈ. సులభముగా ప్రసన్నమగువాడు (ఆశుతోష్)

2 ఉ. దేవతలు, దానవులు రెండు వర్గాల ఉపాసకులున్న వాడు

బాణాసురుడు, రావణుడు మొదలగు దానవులు విష్ణూ తపస్సు చేయలేదు లేక విష్ణూవు ఏ దానవునికి (రాక్షసుడికి) వరము ఇవ్వలేదు. కాని దానవులు శివుని ఉపాసన చేసిరి శివుడు వారికి వరములను ఇచ్చెను.

2 ఊ . భూతముల స్వామి

శివుడు భూతములస్వామి అయినందున శివుడి ఉపాసకులకు బహుశః భూతబాధ కలుగదు.

2 ఎ. ఊర్ధ్వరేతస్

ఎవరి వీర్య పాతము జరుగదో అతడు ఊర్ధ్వరేతస్.

2 ఏ. ఊహకు మించిన నిర్మాణ క్షమత ఉన్నవాడు

బ్రహ్మదేవుని ఆయువు 100 దివ్య సంవత్సరములు. ఆ దివ్య సంవత్సరాల యొక్క పట్టిక కింద చూపించనట్లున్నది.

మానవుని సం॥ యుగం మానవుని సం॥ యుగం
17,28,000 కృత 8,64,000 ద్వాపర
12,16,000 త్రేతా 4,32,000 కలి

కృత, త్రేతా, ద్వాపర మరియు కలి ఈ నాలుగు యుగములు కలిపితే ఒక పర్యాయమౌతుంది. ఇలాంటి 1000 పర్యాయములంటే బ్రహ్మదేవునికి ఒక రోజు లేదా కల్పము. ఇలాంటి 360 రోజులంటే 1 దివ్య సంవత్సరం. ఇలాంటి 100 దివ్య సంవత్సరములు గడచినా కూడా శివుడి ఉత్పత్తి ప్రక్రియ ఇప్పటికి కూడా జరుగుతునే వున్నది. శైవ సంప్రదాయములో శివుణ్ణి సృష్టి ఉత్పత్తికారకుడు అని ఎందుకు అంటారో దీని నుండి తెలియుచున్నది.

సందర్భము : సనాతన ప్రచురణ ‘శివుడు – భాగము 1’

Leave a Comment