శివుని ఉపాసన

భస్మము

 

భగవంతుడిని స్మరింప జేస్తుంది, అది భస్మము !

 

1. భస్మము పెట్టుకొనుట

1అ. త్రిపుండ్ర

‘త్రిపుండ్ర’ అంటే భస్మము యొక్క మూడు అడ్డ నామాలు. ఈ మూడు నామాల భావార్థము – జ్ఞానము, పవిత్రత మరియు తపస్సు (యోగసాధన), అలాగే ఇదే భావార్థము శివుని 3 కళ్ళకు కూడా వర్తిస్తుంది.

 

2. రుద్రాక్ష

రుద్రాక్ష

రుద్రాక్షధారణ

శివుని పూజ చేయు సమయములో మెడలో రుద్రాక్ష మాలను తప్పకుండా వేసుకొనవలెను.

2 అ. రుద్రాక్ష పదము యొక్క ఉత్పత్తి మరియు అర్థము

రుద్ర + అక్ష ఈ రెండు పదాల నుండి ‘రుద్రాక్ష’ పదము తయారైనది.అక్ష అంటే కేంద్రరేఖ. కన్ను ఒక్కటే అక్షరేఖ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిని కూడా అక్ష అంటారు. రుద్ర + అక్ష అంటే ఎవరు అన్నిటిని చూడగలరో మరియు అన్నీ చేయగలరో వారే రుద్రాక్ష. (ఉదా: మూడవ కన్ను). రుద్రాక్ష రంగు ఆకాశములోని ముదురు ఎరుపు రంగు మరియు ఆకారము చేప మాదిరిగా పలుచగా ఉండును. దాని మీద పసుపుపచ్చని గీతలు మరియు ఒక వైపు తెరచి ఉన్న నోరువలె ఉండును.

 

3 . ప్రత్యేకతలు

3 అ. రుద్రాక్ష విశ్వములోని దేవతల ప్రకాశ తరంగాలను మానవ శరీరములోని నాద తరంగాలకు మరియు నాద తరంగాలను ప్రకాశతరంగాలుగా మార్చును. దీనివలన మానవుడు దేవతల తరంగాలను గ్రహించగలుగుతాడు మరియు మానవుని ఆలోచనలను దేవతల భాషలోనికి రూపాంతరమవుతాయి.

3 ఆ. రుద్రాక్ష సమ (సత్వ) తరంగాలను ఆకర్షిస్తుంది అలాగే తన ఉబ్బుల నుండి సమతరంగాలను ప్రసరింప జేస్తుంది. ఆసలైన రుద్రాక్షను వేళ్ళతో పట్టుకుంటే స్పందనలు తెలుస్తాయి. ఆ సమయంలో రుద్రాక్ష నుండి బయటకువచ్చు సమ తరంగాలను శరీరము గ్రహిస్తుంది.

 

4. నకిలీ రుద్రాక్ష

4 అ. భద్రాక్ష

భద్రాక్ష

4 ఆ. వికృతాక్ష

వికృతాక్ష

ఇది ఒక రకమైన అడవి రేగి (నేరెడు) పండు బీజము. దీనికి కాలుతున్న సూదితో రంధ్రము వేస్తారు దానిపై ఓం, స్వస్తిక్, శంఖము మొదలుగు చిహ్నా లను చెక్కుతారు, రంగు వచ్చుట కొరకు వీటిని వక్క నీటిలో ముంచుతారు. అందుకే వాటిని నీళ్లలో వేస్తే రంగు పోతుంది. తాంత్రికులు యజ్ఞము, చేతబడి, బాణామతి మొ॥ వాటికై వికృతాక్షలను ఉపయోగిస్తారు.

 

5. శివుని పూజకు ముందు శివతత్వానికి సంబంధించిన సాత్విక ముగ్గులను వేయడం

ప్రతి సోమవారము, అలాగే విశేషంగా ‘శివరాత్రి’ లాంటి రోజులలో శివతత్వమును అధిక ప్రమాణంలో ఆకర్షించి, ప్రక్షేపించే ముగ్గులను వేయవలెను.

 

సందర్భము : సనాతన ప్రచురణ ‘శివుడు – భాగము 1’

Leave a Comment