శివుడు మరియు శివుడి ఇతర పేర్లు

దేవతల గురించి మనకు ఆధ్యాత్మికశాస్త్ర జ్ఞానము తెలిసినచో ఆ దేవత పట్ల మన శ్రద్ధా-భక్తి పెరుగుటకు సహాయమౌతుంది. శ్రద్ధావలన ఉపాసన భావపూర్వకంగా జరుగుతుంది మరియు భావపూర్వకమైన ఉపాసన అధిక ఫలదాయకంగా వుంటుంది. ఈ కారణంగా ఈ లేఖలో శివుడు ఈ పదమునకు అర్థము, శివుడి ఇతర పేర్లకు గల ఆధ్యాత్మిక అర్థములను చూద్దాం.

 

shiv
శివుడు

 

1. ఉత్పత్తి మరియు అర్థము

1 అ. ‘శివ’ పదము ‘వశ్’ అను పదము అటుఇటు అయ్యి, అంటే అక్షరముల వరుసక్రమము మారి తయారైనది. ‘వశ్’ అంటే ప్రకాశించునది; అందువలన ఎవడు ప్రకాశించునో అతడు శివుడు అని అర్థము. శివుడు స్వయంసిద్ధుడు, స్వయం ప్రకాశితుడు. అతడు స్వయం ప్రకాశితుడై, సంపూర్ణ విశ్వాన్ని ప్రకాశింపజేయును.

ఆ. ‘శివుడు’ అనగా మంగళమయుడు, శుభకర తత్వం.

 

2. శివుని ఇతర నామములు

2 అ. శంకరుడు

‘శం కరోతి ఇతి శంకరః ’ ‘శం’ అంటే శుభము మరియు కరోతి అంటే చేస్తాడు. ఎవడు శుభము చేస్తాడో అతడు శంకరుడు.

2 ఆ. మహాంకాళేశ్వరుడు

అఖిల విశ్వ బ్రహ్మాండమునకు అధిష్ఠాన దేవుడు (క్షేత్రపాలకుడు) ఈ కాల పురుషుడే మహాకాలుడు (మహాన్‌కాల్). కాబట్టి శివున్ని మహాంకాళేశ్వరుడు అంటారు.

2 ఇ. మహాదేవుడు

సంపూర్ణ విశ్వమును సృష్టించి దానిని నడపాలనుకొంటే ముఖ్యంగా మూడు విషయాలు ఉంటాయి – పరిపూర్ణమైన పవిత్రత, పరి పూర్ణమైన జ్ఞానము మరియు పరిపూర్ణమైన సాధన. ఈ మూడు గుణాలు ఏ దేవునిలో ఉన్నాయో, అతడు దేవుళ్ళకే దేవుడు అనగా మహాదేవుడు అని సంభోదిస్తారు.

2 ఈ. భాలచంద్రుడు

భాలము అంటే నుదుట, ఎవరు నుదుటిపై చంద్రున్ని ధరిస్తారో వారు ‘భాలచంద్రుడు’. శివ పుత్రుడైన గణపతికి ఒక నామము కూడా భాలచంద్రుడే.

2 ఉ. కర్పూరగౌర

శివుని రంగు కర్పూరము వలె తెల్లగా ఉండును. అందుకే ఆయనను ‘కర్పూరగౌర’ అని అంటారు.

సందర్భము : సనాతన ప్రచురణ ‘శివుడు – భాగము 1’

Leave a Comment