గురువుల పవిత్ర చరణాలకు కృతజ్ఞతను సమర్పించడమే గురు దక్షిణ

1. ఒకసారి నేను కేరళ లోని సనాతన సాధకురాలు కుమారి కైమల్‌ ను అనుకోకుండా కలవడం జరిగింది. మేము ఇరువురం పలకరించుకుని ఎవరికి వాళ్ళము వెళ్ళిపోయాము. మా ఈ ఒక్క క్షణం సమావేశం ద్వారానే ఆమెకు భావ జాగృతి అయింది అని నాకు తరువాత తెలిసింది. మా ఇద్దరికీ పెద్దగా పరిచయం లేకపోయినా, అనుకోకుండా తోవలో ఎదురుపడినా, ఆమెకు భావ జాగృతి ఎందుకు జరిగింది? పరాత్పర గురువు డా. ఆఠవలెగారి ప్రతి సాధకులలో అపారమైన భావం ఉంటుంది. అందరు సాధకులలో సూక్ష్మంగా గురు తత్వం ఉంటుంది. నా లోని గురు తత్వము వల్లనే కుమారి కైమల్‌కు భావ జాగృతి అయ్యింది అని నేను గ్రహించాను.

గురువు మాత్రమే మన హృదయాలలో ఉంటూ మన చెయ్యి పట్టుకుని మనల్ని ఆధ్యాత్మిక సాధనా మార్గంలో నడిపిస్తారు. మన బాగోగులు చూసుకుంటారు. అటువంటప్పుడు మనకు మనపై గర్వం ఎందుకు?

2. వేదధర్మ అనబడే ఒక గురువు ఒక రోజు తన శిష్యులను పిలిచి, “నా పూర్వ జన్మలో నేను ఒక పాపం చేసాను. దానిని పరిహరించుకోవడానికి నేను కాశీకి వెళ్తాను. మీరు నన్ను అక్కడికి తీసుకు వెళ్ళండి. నేను ఈ శరీరంతో ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మీరు నా బాగోగులు చూసుకోండి” అని చెప్పారు. అప్పుడు దీపక్‌ అనే శిష్యుడు, “స్వామీ, మీరు ఆజ్ఞ ఇస్తే చాలు, నేను నా శక్తి కొలది మిమ్మల్ని చూసుకుంటాను”, అని చెప్పాడు. అప్పుడు గురువు గారు అన్నారు, “ఆ పాపం వల్ల నాకు కుష్టు రోగం వస్తుంది, నా శరీరం కండను కోల్పోతుంది, నేను కంటి చూపు కూడా కోల్పోయి వికలాంగునిగా మారవచ్చు. నువ్వు నన్ను 21 సంవత్సరాలు చూసుకోవలసి రావచ్చు.” అయినా దీపక్‌ ఒప్పుకున్నాడు.

తరువాత ఆ గురువుకి కుష్టు రోగం వచ్చింది; చీము, పురుగులు, రక్తం ఆయన శరీరం నుండి కారుతూ ఉండేవి. దీనికి తోడుగా ఆ గురువుకి మూర్ఛ రోగము కూడా వచ్చింది. ఒకసారి, దీపక్‌ గురువుకై భిక్ష తీసుకు వచ్చినప్పుడు, అది చాల తక్కువ వున్నదని కోపం వచ్చి దానిని రోడ్డుపై పడేశారు. మరుసటి రోజు, దీపక్‌ ఎక్కువ భిక్షను తీసుకు వచ్చాడు. భిక్షలో తీపి పదార్థం లేనందున గురువుకు మళ్ళీ కోపం వచ్చి దీపక్‌ ను కొట్టడానికి లేచారు. దీపక్‌ గురువు అడిగినవన్నీ తీసుకు వచ్చాడు, కానీ గురువు ఆహారాన్ని మొత్తాన్నీ పడేసి దీపక్‌ను కొట్టారు. “నువ్వు నా మలమూత్రాలను రోజూ శుభ్రం ఎందుకు చేయలేవు?” అని దెబ్బలాడారు.

దీపక్‌ తన గురువులో కాశీ విశ్వనాథుని రూపమే చూసుకుని, ప్రతి రోజూ భక్తితో భిక్షను తీసుకు వస్తూనే ఉండేవాడు. ఈశ్వరుడు దీపక్‌ పట్ల ప్రసన్నుడై అతడిని వరం కోరుకోమని అంటాడు. దీపక్‌ తనలో గురువుపై మరింత భక్తి, శ్రద్ధా పెరగాలని కోరుకున్నాడు.

దీపక్‌ అడిగిన వరానికి గురువు కూడా ప్రసన్నుడై అతడు కూడా దీపక్‌ ను ఆశీర్వదిస్తారు. నిజానికి, ఆ గురువు తన శిష్యుడిని పరీక్షించడానికి కుష్టు రోగిగా నటించారు. ఆయన పాపముల నుండి విమోచనం పొందిన ఒక తపస్వి.

ఆదర్శవంతమైన శిష్యుడు దీపక్‌ వలె మనలో కూడా గురువును సేవించే భావం ఉన్నదా? గురువు కోసం మనం ఏమీ చేయడం లేదు, గురువే మన కోసం సమస్తం చేస్తున్నారు.

నాడీ జ్యోతిష్యులు అయిన మహర్షి చెప్పిన ప్రకారం, సాధకుల మీద జరిగే దుష్ట శక్తుల దాడులను పరాత్పర గురువు ఆఠవలె గారే ఎదుర్కొంటున్నారు. ‘యోగ క్షేమం వహామ్యహం’ అనే శ్లోకంలో చెప్పబడినట్లు పరాత్పర గురువు ఆఠవలెగారు మనల్ని రక్షిస్తున్నారు. వారి కృప వలననే సనాతన ఆశ్రమంలో ఉంటున్న సాధకులకు ప్రసాదము, సౌకర్యవంతమైన  నివాసము మొదలగునవి సమకూర్చబడుతున్నవి. సాధకుల త్వరిత ఆధ్యాత్మిక ప్రగతికై వారు అనేక సమిష్టి సేవలను ఆచరింప చేస్తున్నారు. వారు ప్రతి రోజూ, సనాతన ప్రభాత్‌ మరియు ఇతర పవిత్ర గ్రంథాల మాధ్యమాల ద్వారా ఆధ్యాత్మిక సాధనను బోధిస్తున్నారు. వారు సాధకుల యొక్క తప్పులను, స్వభావ దోషములను వాత్సల్యంతో తెలియచేస్తూ వారి సాధనను మెరుగు పరచడానికి ప్రయత్నిస్తున్నారు.

పరాత్పర గురువు డా. ఆఠవలె ‘హిందూ రాష్ట్ర స్థాపన‘ అనే అత్యుత్తమమైన, అన్ని విధములుగా ఆదర్శవంతమైన లక్ష్యమును సాధకులకు నిర్దేశించారు. మనకోసం గురువులు ఇంకా ఏమి చేయాలని ఆశించాలి? మనం వారికి అడుగడుగునా కృతజ్ఞతలు సమర్పిస్తున్నామా?

ఓ పరాత్పర గురు డా. ఆఠవలెగారు, మేము మీ పవిత్రమైన పాదములకు నమస్కరిస్తున్నాము. మీరు మా యోగ క్షేమములకు అవసరమైనవన్నీయు మాకు ప్రసాదిస్తున్నారు. పవిత్రమైన మీ చరణాలకు ఎల్లపుడూ కృతజ్ఞులమై ఉంటాము! – సనాతన సంత్‌లు పూజ్య సందీప్‌ ఆళషి (రామనాథి ఆశ్రమం, గోవా, 6.5.2016)

మూలం: సనాతన ప్రభాత్‌, పక్ష పత్రిక

Leave a Comment