గురుకృపాయోగము యొక్క ప్రాముఖ్యత

 

అర్థము

కృపా ఈ పదము ‘కృప్‌’ ఈ ధాతువు నుండి నిర్మాణమైనది. ‘కృప్‌’ అంటే దయ చూపడము.  కృపా అంటే దయ, కరుణ, అనుగ్రహము లేక ప్రసాదము. గురుకృప మాధ్యమంగా జీవుడు శివుడితో అనుసంధానం జరుగుతుంది, దీనినే ‘గురుకృపాయోగము’ అని అంటారు.

 

గురుకృపాయోగము యొక్క  ఉగమము

గురుకృపాయోగములో జ్ఞానయోగము, భక్తియోగము మరియు కర్మయోగము ఇమిడివున్నాయి. మా గురువులు పరమపూజ్య భక్తరాజ్‌ మహారాజ్‌ (బాబా)గారి కృపతో, గురుకృపతో ఈ యోగము గ్రహించడం జరిగింది; అందుచేత నేను దాని పేరు ‘గురుకృపాయోగము’ అని పెట్టాను. ఈ రోజు హఠాత్తుగా, నాకు గురుకృపతో ఈ యోగము తెలిసిందని కాదు, గురువులే దానిని నిర్మించారు.  1993 లో  పరమపూజ్య బాబా వారు నాకు ఏమి చెప్పారంటే,“ డాక్టర్‌, మీరు నాకు తనువు-మనస్సు-ధనము ఇచ్చేశారు. నేను మీకు జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యమును ఇచ్చాను.” ‘జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము’ యొక్క అర్థమేమిటంటే, కర్మఫలమును అపేక్షించకుండ కర్మను నెరవేర్చుటకు నేర్పించే కర్మయోగము’, అనగా అప్పుడే బాబా నాకు జ్ఞానము, భక్తి మరియు కర్మయోగము ఇచ్చారు, అంటేనే గురుకృపాయోగమును నేర్పించారు.’ – డా. ఆఠవలె (వైశాఖ పౌర్ణిమా, కలియుగము సంవత్సరం 5114 (6.5.2021)

 

గురుకృపాయోగము యొక్క ప్రాముఖ్యత

రకరకాల యోగమార్గాలలో సాధన చేయుటకు చాల సంవత్సరాలు వ్యర్థము చేయుటకు బదులు, మార్గాలన్నిటిని వదిలేసి, గురుకృప త్వరగా ప్రాప్తమగుటకు ఏమి చేయాలో ఇది గురుకృపాయోగములో సాధకులు నేర్చుకొంటారు. ఇందుచేత సహాజంగానే ఈ మార్గములో శీఘ్ర ఉన్నతి జరుగును.

 

గురుకృప యొక్క ప్రాముఖ్యత

గురుకృపతో ఆది భ్రమ నష్టమగుట

‘బుద్ధి ద్వారా నిర్గుణమును తెలుస్తుంది మరియు ప్రీతి ద్వారా సగుణము తెలుస్తుంది. బుద్ధి అనగా శాస్త్రాభ్యాసము ద్వారా వచ్చిన బుద్ధి యొక్క సూక్ష్మత్వము. ఈ బుద్ధి వలన అనాది భ్రమ నష్టమగును. ‘నేను బ్రహ్మానుండి వేరే’ అని ప్రతి ఒక జీవదశ ప్రారంభము నుండి భ్రమ వుంటుంది. దీనిని ‘అనాది భ్రమ’అని అంటారు. శాస్త్రాభ్యాసము చేసిన తరువాత ‘నేను బ్రహ్మా నుండి వేరు కాదు’ అని తెలుస్తుంది; కాని ‘నేను బ్రహ్మా నుండి వేరు కాదు’ అని గ్రహించినప్పుడు, నాకు అలాంటి అనుభూతి ఎందుకు రావడం లేదు?’,అను భ్రమ ఉద్భవిస్తుంది. ఈ భ్రమ ఉద్భవించుట వలన, దీనిని ‘ఆది భ్రమ’ ఆని అంటారు. ఈ ఆది భ్రమ శ్రీ గురుకృపతోనే నష్టమగును; అనగా సత్సంగములో అనుభవించిన ప్రేమ ప్రీతిలో (నిరపేక్ష ప్రేమ) రూపాంతరమైన తరువాత సగుణము యొక్క ఆకారమే నష్టమగును. అందుచేత సాపేక్షజ్ఞానముతో ‘సగుణము అనగా సాకారము’ మరియు ‘నిర్గుణము అనగా నిరకారము’ నష్టమగును. సాపేక్షజ్ఞానము యొక్క పరిణతి నిరాపేక్ష జ్ఞానములో జరుగుటవలన ‘సగుణము – సాకారము’, ‘నిర్గుణము – నిరకారము’లో భేదము వుండదు. సగుణ భక్తి వలన సాక్షాత్తు సగుణము సాక్షాత్కారమైన చోటనే నిర్గుణము యొక్క జ్ఞానము తొలగిపోతుంది మరియు ‘నేను బ్రహ్మాను’ అనే అనుభూతి కలుగుతుంది. అందుకే సంత్‌మహాత్ములందరు నిర్గుణము ఇది వాచ్యాంశము మరియు సగుణము ఇది లక్ష్యాంశము అని చెప్పారు. వాచ్యాంశము అనగా వాచతో (వాణితో) మాట్లాడే విషయము, అయితే  లక్ష్యాంశము అనగా ఎవరి ప్రాప్తికొరకైతే ప్రయత్నము చేయాలో ఆ లక్ష్యమును భగవంతుడి అంశం అంటారు. సత్సంగము ప్రాప్తము కానందువలన విద్వానులు దీనిని అంగీకరించరు. సంత్‌ తుకారాం అభంగములను నదిలో ముంచేసిన రామేశ్వరభట్ట, వారి కృపతోనే అభంగాలు పూర్తి అయినవి.- పరమపూజ్య. కాణే మహారాజ్‌, నారాయణగావ్‌, జిల్లా పూణే, మహారాష్ట్ర.

సందర్భం : సనాతన ప్రచురణ – ‘గురుకృపాయోగము’

Leave a Comment