సనాతన సంస్థ గురు శిష్య పరంపరను కలియుగంలో విశిష్ఠమైనదిగా నిరూపించబడి, సాధకులను అన్ని అంశాలలోనూ తీర్చిదిద్దుతోంది !

గురు శిష్య పరంపర భారత దేశానికి ప్రత్యేకమైనది. కేవలం దీని వలననే ఎన్నో విదేశీ ఆక్రమణల తరువాత కూడా హిందూ ధర్మం కాల పరీక్షకు తట్టుకుని నిలబడి ఉంది. సనాతన సంస్థ సంస్థాపకులైన పరాత్పర గురువు డా. ఆఠవలే గారు గురు శిష్య పరంపరను కాపాడటానికి ఎంతో ప్రముఖ్యతను ఇస్తారు.  గురువు తన శిష్యుడికి ఆధ్యాత్మిక అనుభవాలు లేదా పరిస్థితుల ద్వారా ఎంతో నేర్పిస్తారు. గురువు కేవలం తన అస్థిత్వం చేత శిష్యుడి ఆధ్యాత్మిక ప్రగతికి కారణము అవుతారు. ఈ ఆధ్యాత్మిక అనుభూతి సనాతన సంస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. పరాత్పర గురువు డా. ఆఠవలే గారు సనాతన సంస్థకు చెందిన శిష్యులను అన్నిఅంశాలలోనూ తీర్చి దిద్దుతున్నారు. అందుచేత, ఈనాటికి వంద మందికి పైగా సనాతన సంస్థ సాధకులు సంతుమహాత్ముల స్థాయికి ఎదిగారు . ఈ రచన, సనాతన సంస్థ యొక్క సంతుమహాత్ములు, గురువుల మాదిరిగానే సాధకులను ఎలా తీర్చిదిద్దుతారో వివరిస్తుంది.

సాధకులకు వ్యష్టి మరియు సమష్టి సాధనలో మార్గదర్శకంగా నిలిచే సనాతన గురు శిష్య పరంపరకు శత కోటి ప్రణామాణాలు అర్పిద్దాం

 

1. సనాతన సంస్థ సంతుమహాత్ములు ఏ ఆర్భాటం లేకుండా సర్వసామాన్యంగా ఉంటారు !

పరాత్పర గురువు డా. ఆఠవలే గారు ఏ ఆర్భాటం లేకుండా వుంటారు. సనాతన సంస్థ సంతులు కూడా ఆయనలాగే వుంటారు. సామాన్యంగా మిగతా సంతుమహాత్ములు వారి వేషధారణ, అధికారాలు, వేదిక మీద వారు కూర్చునే విధానము, ఎప్పుడూ వారితో ఉండే సేవకులు, పూల దండలు మొదలగు అలంకారాల ప్రత్యేకతలు కలిగి వుంటారు. సనాతన సంస్థ సంతుమహాత్ములు అతి సామాన్యంగా వుంటూ, సాధకులు లేదా శిష్యుల లాగానే అందరితో కలిసి పోతారు. వారు సాధకులతో కలిసి భోజనం చేస్తారు. కావున వారితో మాట్లాడేటప్పుడు ఎవరూ ఒత్తిడికి గురి కారు. సనాతన సంస్థ సంతుమహాత్ములు వారి ప్రత్యేకతను చెప్పుకోకుండా అందరితో కలిసిపోతారు. వారు సాధకులకు కల్పించిన సౌకర్యములనే వాడుకుంటారు, ఎటువంటి ప్రత్యేకతను ఆశించరు.

 

2. స్వభావ దోష నిర్మూలన, అహం నిర్మూలన వంటి పద్ధతుల ద్వారా సంతుమహాత్ములు సాధకులను తీర్చిదిద్దుతారు

2 అ. సాధకులకు వారి తప్పులు తెలియపరచుట

భగవంతుడు ఒక్క తప్పు కూడా చేయడు. కావున, సాధకులు భగవంతుడిలో లీనం అవ్వాలంటే ఎంతో తపనతో కృషి చెయ్యాలి. సంతుమహాత్ములు సాధకుల తప్పులను గుర్తించి, ఏ స్వభావ దోషముల వలన అవి జరుగు తున్నాయో అనేది వారికి తెలియపరుస్తారు. వారు చేసే సేవలలో లోపాలను అధిగమించడానికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ విధంగా సాధకులలో మంచి మార్పు తెచ్చి, వారు త్వరగా ఆనందాన్ని అనుభవించడానికి సహాయం చేస్తారు.

2 ఆ. సంతుమహాత్ములు సాధకులను తీర్చిదిద్దే విధానము యొక్క ఒక ఉదాహరణ

స్వభావ దోష మరియు అహం నిర్మూలన ఆధ్యాత్మిక సాధనలో ఎంతో ప్రాముఖ్యమైనవి. సనాతన సంస్థ యొక్క సంతుమహాత్ములు దీనికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి, ఈ విషయంలో ప్రతి సాధకునికి ఎంతో తపనతో సహాయం చేస్తారు. స్వభావ దోష మరియు అహం నిర్మూలన జరగకుండా ఆధ్యాత్మిక ప్రగతి జరగదు, అంతే కాకుండా అవి పతనానికి కూడా దారి తీస్తాయి. కాబట్టి, సంతుమహాత్ములు దీనిపై ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఒకసారి ఒక సాధకుడు మళ్ళీ మళ్ళీ ఒకే విధమైన తప్పులను చేసేవాడు. తన బుద్ధికి అనుగుణంగా తనకు అప్పగించిన సేవలలో మార్పులు చేయడం, నియమాలను పాటించకపోవడం, చేరవేయవలసిన సందేశాలను మరచిపోవడం, ఫోన్‌ కాల్స్‌ స్వీకరించకపోవడం మొదలగునవి. ఒక సంతుమహాత్ములు ఆ సాధకునికి ప్రతి సారి అతని తప్పులను ఓర్పుగా వివరించి చెప్పేవారు. ఆ సాధకుడు మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేయడం వలన వారిపై విసుగు చెందడం సహజమే. కానీ ఆ సంతుమహాత్ములు ‘ఈ సాధకుడిని ఈ స్థితి నుండి బయటకు తీసుకు రావడమే నా సాధన‘ అనే ఆలోచన కలిగి ఉండటం వలన, మరింత తపనతో ఆ సాధకుడిలో మార్పు తీసుకు రావడానికి ప్రయత్నించారు. ఎందరో సంతుమహాత్ములు నిర్వహించిన సత్సంగముల ద్వారా తప్పులు చేయకపోవడంలో ఉన్న ప్రాముఖ్యతను సాధకుల మనసులలో ముద్రించారు. అవసరం అయితే సంతుమహాత్ములు సాధకులతో కఠినంగా కూడా వ్యవహరించినా, మరు క్షణమే వారు అదే సాధకులతో ఎంతో ప్రేమతో మాట్లాడుతారు. ఈ విధంగా సాధకులను సాధనలో ముందుకు తీసుకెళ్ళే పద్ధతి కేవలం సనాతన సంస్థలోనే కనిపిస్తుంది.

2 ఇ. తప్పులను ఎలా అధిగమించవలెను

సంతుమహాత్ములు సాధకులకు తమలోని తప్పు ఆలోచనలను సరి చేసుకోవడం, వాటికి సంబంధించిన సరైన దష్టికోణం కలిగి ఉండటం, స్వభావ దోష నిర్మూలన, మంచి గుణములను పెంపొందించుకోవడంలో మాత్రమే కాకుండా తమ తప్పులను అధిగమించడం కూడా నేర్పిస్తారు. తమ తప్పులను ఒప్పుకోవడం, ఇతరులను క్షమాపణ కోరడం, తమ తప్పులను రాత బల్లపై రాయడం,  ప్రాయశ్చితం వంటి మాధ్యమాల ద్వారా తప్పులను అధిగమించవచ్చు.  దీని ద్వారా సాధకుల సాధన వ్యర్థమ కాకుండా ఉంటుంది. అలాగే దీని ద్వారా కొత్త కర్మలు ఏర్పడి సాధకులు జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా  కాపాడబడతారు.

 

3. వివిధ ఆధ్యాత్మిక సాధనా మార్గాల గురించి సంతుమహాత్ముల మార్గదర్శనం

3 అ. ఆధ్యాత్మిక సాధన,  స్వఛ్చమైన మనస్సు  మరియు ఆధ్యాత్మికత

ప్రాపంచిక ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న విబేధములు, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎలా అలవర్చుకోవాలి, కాలానికి అనుగుణంగా ఏ ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి, మన స్వభావాన్ని బట్టి ఆధ్యాత్మిక సాధన ఎలా చెయ్యాలి, స్వభావ దోష నిర్మూలన పద్ధతుల ద్వారా మన అంతర్మనస్సులో ముద్రింపబడిన  దోషాలను ఎలా నిర్మూలించుకోవాలి మొదలగు విషయాల పైన సంతుమహాత్ములు మార్గదర్శనం చేస్తారు. సంతుమహాత్ములు మన మనస్సును నిర్మలంగా, ఆధ్యాత్మికంగా, భక్తి భావంతో నింపుకోవడం గురించి బోధిస్తారు. ఫలితంగా సంగీతం, నాట్యం, పాక శాస్త్రం, నిర్మాణ రంగం, ఇలా ఏ రంగం లో అయినా సేవ చేసే సాధకులు శీఘ్ర ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతారు. వివిధ రంగాలలో, లేదా తమ ఇళ్ళలో సేవ చేస్తున్న సాధకులు కూడా సంతుమహాత్ముల స్థాయికి ఎదిగారు.

3ఆ. సంతుమహాత్ములు గురువులను ఆదర్శంగా తీసుకోమని బోధిస్తారు

పూర్వ కాలపు గురు శిష్య బంధం గురించి ఆలోచించి చూస్తే, ఈనాటి కొన్ని వర్గాలను పరికించి చూడగా ‘కొందరు గురువులు శిష్యులను చేర దీసి వారికి మార్గదర్శనం చేస్తారు’ అని తెలుస్తుంది. సనాతన సంస్థలో గురువును ఆదర్శంగా తీసుకోమని సూచిస్తారు. కాబట్టి సాధకులు, తమకు మార్గదర్శి అయిన సంతుమహాత్ములను, తమ తోటి సాధకులను ఆదర్శంగా తీసుకుంటారు. ఎవరూ మరొకరితో ఎలాంటి చికాకులు పెట్టుకోరు. అలాగే, ఆధ్యాత్మిక సాధన పరంగా ఎందరో సాధకులు ఒకే సారి తీర్చిదిద్దబడతారు.

ఎలాగైతే శ్రీ దత్తాత్రేయ భగవంతుడు అనేక సద్గుణములకు 24 గురువులను స్వీకరించారో, అలానే సాధకులు ఇతరుల నుండి మంచి గుణములను నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికతను ప్రచారం చేసే సాధకులు సమాజం నుండి నేర్చుకుంటారు, కానీ, అలా నేర్చుకున్న వాటిని అవలంబించే ముందు వారు తోటి వారితో నిర్ధారించుకుంటారు. తద్వారా వారు ఎల్లప్పుడూ నేర్చుకునే స్థితిలో ఉంటూ ముందుకు వెళ్తారు. సాధకులలో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. గురువు గారు సాధకుల తో ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక సాధన గురించి మాట్లాడక పోయినా, సాధకులు సనాతన ప్రభాత్‌ లో ఆధ్యాత్మిక సాధన గురించి వచ్చే అన్ని సూచనలను పాటిస్తారు. కాబట్టి, గురువు గారు ప్రతి సారి ప్రతి సాధకునికి మళ్ళీ మళ్ళీ నేర్పించవలసిన అవసరం వుండదు. విధేయత ఒక సాధకుడికి ఉండ వలసిన అత్యుత్తమ లక్షణం. సనాతన సంస్థ సాధకులు ఈ సుగుణాన్ని తమలో అలవరచుకున్నందు వలన వారు తమకు ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తారు.

3 ఇ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంబంధిత సాధకులే కాకుండా, ఆ సమస్య గురించి తెలుసుకున్న సాధకులందరూ దానిని పరిష్కరించాలని సంతుమహాత్ములు సూచిస్తారు.

ఒకసారి ఒక ఆశ్రమం బయట నీరు నిలిచిపోయింది. అటుగా వెళ్ళిన చాలా మంది సాధకులు దానిని గమనించారు. ఒక సంతుమహాత్ములు ఈ ఘటనని ఒక సత్సంగములో ప్రస్తావించారు. ఇక్కడ నిలిచిపోయిన నీరు నిర్మాణ రంగమునకు సంబంధించిన సాధకుల బాధ్యత, కానీ ఇది ఈ సమస్యను గమనించి కూడా పట్టించుకోకుండ వున్న మిగతా సాధకుల బాధ్యత కూడా. ఇటువంటి ప్రవర్తన వారి ఆధ్యాత్మిక సాధనకు కీడు కలిగిస్తుంది. సాధకులు తమకు సంబంధించిన సేవలకే తమను తాము పరిమితం చేసుకోకుండా మరెవరి వలన అయినా జరిగిన పొరపాటులను కూడా దిద్దాలి అని, ఇది కూడా వారి ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుందని, ఈ సూచన ద్వారా సాధకులలో అవగాహన కలిగింది. ఎదురు పడే ప్రతి సంఘటనను ఆధ్యాత్మిక సాధనగా భావించే అలవాటు ఏర్పడుతుంది. దీనినే సమిష్టి సాధన అంటారు. ఈ విధంగా ఆ పొరపాటు వలన, ‘మీ దృష్టికి వచ్చిన ప్రతీదీ మీ బాధ్యతే‘ అని సాధకుల మనస్సులలో ముద్రింపబడటానికి సాధ్యం అయ్యింది. ఇలానే సాధకులలో సమాజం, మరియు దేశం ఎదురుకుంటున్న సమస్యల పట్ల బాధ్యతగా వుండటం అలవాటు అవుతుంది.

3 ఈ. సనాతన సంస్థ సంతుమహాత్ములు తమ ఆచరణ ద్వారా నేర్పే రోజువారీ జీవితపు గుణపాఠాలు :

ఒక సంతుమహాత్ముల గదిలో ఎయిర్‌ కండీషనర్‌ ఉంది. వేసవిలో అతని గది ఉన్న ప్రాంతం చాలా వేడి ఎక్కిపోతుంది. కానీ, మిగతా సాధకులకు ఎయిర్‌ కండీషనర్‌ ఈ సౌకార్యము అందుబాటులో లేనందు వలన ఆ సంతుమహాత్ముడు కూడా ఎయిర్‌ కండీషనర్‌ ను వినియోగించు కోలేదు. మిగతా వారందరికి అందుబాటులో లేని సౌకర్యాలను ఉపయోగించు కోరాదను సద్గుగుణమును సాధకులు దీని ద్వారా నేర్చుకున్నారు. ఈ విషయంలో కూడా ఆ సంతుమహాత్ములు ఏ విశేషమైన సౌకర్యాన్ని కోరుకోలేదు.

 

4. సంతుమహాత్ములు, మరియు సామ్యవాదం

కమ్యూనిస్ట్‌ సిద్ధాంతం పేరుతో అందరికీ సమానత్వం అని వాదించే వారు ధనికులుగా మారారు కానీ పేద వారి పరిస్థితులలో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు. కమ్యూనిస్టులు తామే పేదలను అణచి వేస్తున్నారు. దీనికి విరుద్ధంగా, సంతుమహాత్ములు తమ చిన్న చిన్న కార్యముల ద్వారా కూడా సమాజ శ్రేయస్సు గురించి ఎలా ఆలోచించాలో నేర్పిస్తారు. ఇదే నిజమైన సామ్యవాదం (సోషలిజం).

మనం సనాతన సంస్థ గురు శిష్య పరంపర విశిష్ఠతల  గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. నిజానికి ఈ విశిష్ఠతలు అనంతం. సనాతన సంస్థ సంతుమహాత్ములు, మరియు గురు శిష్య పరంపర, ఈ  విశిష్ఠతల వలన ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొందింది. అందుకు, పరాత్పర గురువు డా. ఆఠవలే గారి పావన చరణాలకు కోటి కృతజ్ఞతలు.

– శ్రీ యద్నేష్‌ సావంత్‌, సనాతన ఆశ్రమం, దేవద్‌, పన్వేల్‌ (8.7.2019)

 

సంతుమహాత్ములు సాధకులకు వ్యష్టి సాధనలో మార్గ నిర్దేశం చేస్తూ వారి ఆధ్యాత్మిక సాధనను తరువాత స్థాయికి తీసుకువెళ్తారు

సనాతన సంతుమహాత్ములు సాధకుల వ్యష్టి సాధనా ప్రగతిని బట్టి వారికి తగిన మార్గ నిర్దేశం చేస్తారు. ఆత్మ సాక్షాత్కారం కోసం సాధకుడు చేస్తున్న తన ప్రయాణం సరైన ఒరవడిలో సాగుతోందా, ఆ సాధకుడు ఆనందమును అనుభవిస్తున్నాడా, ఏవైనా భౌతిక, మానసిక లేదా కుటుంబపరమైన ఇబ్బందులు ఆ సాధకుని ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకులుగా ఉన్నాయా అనే విషయాలు పరిగణనలోకి తీసుకుని ఆ సాధకునికి సరైన మార్గనిర్దేశం చేస్తారు.  సంతుమహాత్ములు సర్వజ్ఞులు కావడం చేత వారు మాత్రమే సాధకులకు దైనందిన పనులను కూడ ఆధ్యాత్మిక సాధనగా, భగవంతుడు అపేక్షించే విధంగా చేయడం సాధకులకు నేర్పిస్తారు.

Leave a Comment