శ్రీ గణపతి నామజపం

 

श्री गणपति Ganpati
శ్రీ గణపతి

భక్తి-భావం త్వరగా నిర్మాణమవ్వడం కొరకు మరియు దేవతల తత్త్వం ఎక్కువెక్కువగా పొందేందుకు నామజపం యొక్క ఉచ్ఛారము సరైన పద్దతిలో ఉండాలి. శ్రీ గణపతి నామజపం ఎలా చేయాలని తెలుసుకుందాం.

1. ‘ఓం గం గణపతయే నమః l’ శ్రీ గణపతి యొక్క ఈ తారక నామజపం వినండి

 

2. ‘శ్రీ గణేశాయ నమః l’ ఈ నామజపం వినండి.

భగవత్ప్రాప్తి కొరకు ప్రతి యుగంలో వేరు వేరు ఉపాసనా మార్గం ఉండేది. ‘కలియుగంలో నామమే ఆధారం’, అని సంత మహనీయులు చెప్పారు. దీని అర్థం కలియుగంలో నామజపమే సాధన. ఇప్పుడు మనము శ్రీ గణేశుడి ‘ఓం గం గణపతయే నమః l’ ఈ నామజపము ఎలా చేయాలని తెలుసుకుందాం.

భావముతో నామజపం చేయండి !

దేవతల నామజపం భావంతో చేసినప్పుడే ఆ నామం దేవతల వరకు చేరుకుంటుంది. నామజపం చేసేటప్పుడు అందులోని అర్థం వైపు గమనం పెట్టి చేసినట్లయితే అప్పుడు జపం భావముతో జరుగుతుంది. ‘ఓం గం గణపతయే నమః l’ ఈ నామజపంలోని ‘ఓం’ ఇది భగవంతుడిని సూచిస్తుంది మరియు ‘గం’ ఇది బీజమంత్రం. బీజమంత్రమైన ‘గం’ ఇది భగవంతుడి నిర్గుణ స్వరూపానికి ప్రతీక అయితే ‘గణపతయే’ ఈ పదం భగవంతుడి సగుణ స్వరూపానికి ప్రతీక. ‘నమః’ అంటే నమస్కారం చేస్తున్నాను అని అర్థం. ‘ఓం గం గణపతయే నమః l’ ఈ నామజపము చేస్తున్నప్పుడు నామజపములో తారక భావం రావడానికి ‘నమః’ ఈ పదం పై బలం వేసి పలకకుండా సౌమ్యంగా చెప్పాలి. ఈ సమయంలో మనము శ్రీ గణపతి కి సాష్టాంగ నమస్కారం వేస్తున్నాము అనే భావం అనుభవించవచ్చు. ‘గణపతయే’ ఈ పదం పలికిన తరువాత కొద్దిగా ఆగి తరువాత ‘నమః’ పదం పలకాలి. గణేశ చతుర్థి రోజున శ్రీ గణపతి తత్త్వం మిగితా రోజుల కంటే 1000 రేట్లు ఎక్కువగా కార్యాన్వితమై ఉంటుంది. కాబట్టి ఈ తిథిన ‘ఓం గం గణపతయే నమః l’ నామజపం ఎక్కువెక్కువగా చేసి గణపతి తత్త్వం యొక్క ప్రయోజనం పొందండి.

సంత మహనీయుల మార్గదర్శనానికి అనుగుణంగా చెప్పిన నామజపము !

ఇక్కడ పొందుపరిచిన నామజపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పరాత్పర గురువులు డా. జయంత ఆఠవలే గారి మార్గదర్శనానికి అనుగుణంగా ఈ నామజపం సనాతన సాధకురాలు కు. తేజల్ పాత్రికర్ గారు పద్దతి ప్రకారంగా చెప్పారు.

Leave a Comment