శ్రీగణేశుడి మూర్తిని అక్షతాల (బియ్యము)పై పెట్టుటకు శాస్రాధారం

ఏ పీట మీద అయితే మూర్తి యొక్క స్థాపన చేయవలసి ఉన్నదో, దాని మీద పూజకు ముందు బియ్యమును (ధాన్యమును) పరుస్తారు మరియు బియ్యము మీద మూర్తిని ఉంచుతారు. తమ-తమ పద్ధతికనుసారముగా కొంచెము బియ్యము లేదా బియ్యముతో చిన్న ప్రోగుని తయారు చేస్తారు. బియ్యము మీద మూర్తిని పెట్టుట వలన ముందు చెప్పిన అనుసారముగా లాభము ఉంటుంది.

శక్తి స్పందనములు నిర్మాణము అగుట వలన ఇంటిలో నిల్వ ఉంచిన బియ్యములో కూడ శక్తి స్పందనములు నిర్మాణము అవుతాయి. ఈ విధముగా శక్తితో కూడికొని యున్న బియ్యమును సంవత్సరమంతా ప్రసాద రూపములో గ్రహించవచ్చును.

Leave a Comment