శ్రీ గణేశ విగ్రహం యొక్క వివిధ భాగముల భావార్థం

మొత్తం విగ్రహము

ఓంకార స్వరూపం, నిర్గుణ తత్వము గలదు

తొండము

కుడివైపు తొండము

కుడివైపు తొండమున్న గణపతి విగ్రహం అనగా దక్షిణాభిముఖి విగ్రహం. దక్షిణ అంటే దక్షిణ దిక్కు లేదా కుడి వైపు. దక్షిణ దిక్కు యమలోకం వైపునకు తీసుకువెళ్లేటు వంటిది మరియు కుడి వైపున సూర్యనాడి ఉంటుంది. ఎవరు యమలోకం దిక్కును ఎదురించగలరో వారు శక్తిశాలిగా ఉంటారు. అలాగే సూర్యనాడి కార్యాన్వితమైన వారు తేజోమయంగా ఉంటారు. ఈ రెండు అర్థాల నుండి కుడివైపు తొండమున్న శ్రీ గణపతిని ‘జాగృత గణపతి’ అని అంటారు. దక్షిణదిక్కుగా ఉండే యమలోకములో పాప-పుణ్యముల పరీక్ష జరుగుతుంది. కావున ఆ దిక్కు వద్దనిపిస్తుంది. మృత్యువు తర్వాత దక్షిణదిక్కుకు (యమలోకానికి) వెళ్లితే ఏ విధమైన పరీక్షలకు గురి అవుతామో అదే విధమైన పరీక్ష మృత్యువుకు ముందు దక్షిణానికి ముఖము చూపి కూర్చున్నా లేదా కాళ్లుచాచి పడుకున్నా ఎదురవుతుంది, దక్షిణాభిముఖి మూర్తి యొక్క పూజను నిత్యము జరిపే పద్ధతివలె చేయడానికి వీలుకాదు; ఎందుకంటే, దక్షిణదిక్కు నుండి ‘తిర్యక్‌’ (రజ) లహరులు వస్తుంటాయి. ఇటువంటి మూర్తి యొక్క పూజను, కర్మకాండలోని అన్ని నియమాలను తూచా తప్పకుండా పాలించి పూజావిధిని చేయాలి. దాని నుండి సాత్వికత పెరిగి దక్షిణ దిక్కు నుండి వచ్చే రజో తరంగాల నుండి ఇబ్బంది కలుగదు.

ఎడమవైపు తొండము

తొండము యొక్క కొన మలుపు ఎడమవైపు ఉండే మూర్తి అంటే ‘వామముఖి’ మూర్తి. వామ అంటే ఎడమవైపు లేక ఉత్తరదిక్కు, ఎడమవైపున చంద్రనాడి ఉండి అది శీతలమును ఇస్తుంది, ఉత్తరదిక్కు ఆధ్యాత్మికతకు అనుకూలమై మరియు ఆనందకరమై ఉంటుంది, అందుచేత వామముఖి (ఎడమవైపు తొండమున్న) శ్రీ గణపతిని పూజలో పెడతారు.

మోదకము (ఉండ్రాళ్ళు)

‘మోద’ అంటే ఆనందము, ‘క’ అంటే చిన్నభాగము. మోదకమంటే ఆనందము యొక్క చిన్న భాగము. మోదకము యొక్క ఆకారము టెంకాయవలె (కొబ్బరికాయ) అంటే ‘ఖ’ (బ్రహ్మరంధ్రము)లోని టొళ్లులా(డొల్ల) ఉంటుంది. కుండలిని యొక్క ‘ఖ’ వరకు చేరుకున్న తరువాత ఆనందము అనుభూతి వస్తుంది. చేతిలో పట్టిన మోదకము అనగా ఆనందాన్ని ప్రసాదించే శక్తి.

మోదకము జ్ఞానానికి ప్రతీక; అందుకే దానిని జ్ఞానమోదకమని పిలుస్తారు. ముందు జ్ఞానము కొంచమే ఉంది అని అనిపిస్తుంది. (మోదకము యొక్క పై భాగము దీనికి ప్రతీకమైనది), అయితే అభ్యాసము చేయనారంభిస్తే జ్ఞానము చాలా విశాలమైనది అని తెలుస్తుంది. (మోదకము యొక్క క్రింది భాగము దీనికి ప్రతీక) మోదకము తియ్యగా ఉంటుంది అదే విధంగా జ్ఞానము యొక్క ఆనందము కూడా తియ్యగా ఉంటుంది.

మోదకము యొక్క ఆకారము టెంకాయవలె ఉంటుంది. టెంకాయ ఇబ్బందికర స్పందనాలను తనలో ఆకర్షించుకోవడం దీని ప్రత్యేకత. మోదకము కూడా భక్తుల విఘ్నములు మరియు వారికున్న చెడుశక్తుల ఇబ్బందులను తనలో ఆకర్షించుకొంటుంది. గణపతి మోదకమును తింటాడు అనగా విఘ్నములు మరియు చెడు శక్తులను నాశనము చేయును.

అంకుశము

ఆనందం మరియు విద్యను సంపాదించే కార్యములో వచ్చే విఘాతక శక్తులను నాశనము చేయువాడు.

పాశము

శ్రీ గణపతి చేతిలో పాశముంటుంది, అంటే శ్రీ గణపతి పాశమును వేసి చెడు విషయములను దూరము చేయునట్టువంటివాడై ఉన్నాడు.

నడుముకు చుట్టుకున్న నాగరాజు

విశ్వకుండలిని.

నడుముకు చుట్టుకున్న సర్పము యొక్క పడగ

జాగృతకుండలిని.

ఎలుక

ఎలుక రజోగుణానికి ప్రతీక. అంటే రజో గుణము శ్రీ గణపతి ఆధీనములో ఉంటుంది.

Leave a Comment