మన భారత దేశపు సర్వ శ్రేష్ఠ గురు-శిష్య పరంపర యొక్క ప్రాముఖ్యత !

గురువులకు కృతజ్ఞత తెలిపే దినమే గురుపూర్ణిమ. గురువులు అజ్ఞాన రూపీ అంధకారాన్ని రూపు మాపే జ్ఞాన రూపీ తేజస్సు. గురువే అజ్ఞానాన్ని పారద్రోలుతారు. శిష్యుడి అజ్ఞానాన్ని దూరం చేసి అతడి ఆధ్యాత్మిక ప్రగతి కోసం అతనికి సాధన నేర్పి, శిష్యుడి నుండి ప్రత్యక్ష సాధన చేయించుకునే మరియు అతనికి అనుభవాన్ని ప్రసాదించే వారిని గురువులని పిలుస్తాము.

గురువు గారి నుండి ప్రసాదింప బడ్డ జ్ఞానం అముల్యంగా ఉంటుంది. దాని విలువ శిష్యుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. ‘ఇది నా ద్వారా అయ్యింది. కానీ నేను దీనిని చేయలేదు’ అను దానిని ఎవరు తెలుసుకుంటారో, అతను ‘జన్మ-మృత్యువుల చక్రం నుండి బయట పడతాడు’. ఈ ఉచ్చ స్థాయి అనుభూతి గురువుగారి కృప లేకుండా సాధ్యం కాదు.

‘గురుకృపా హి కేవలం శిష్య పరమ మంగళం’. ఈ వచనానికి అనుగుణంగా శిష్యుడి పరమ మంగళం అనగా మోక్షప్రాప్తి గురుకృప ద్వారా మాత్రమే సాధ్యం అన్నది త్రివార సత్యం. జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తియోగం, శక్తిపాతయోగం మొదలైన యోగమార్గాల ద్వారా సాధన చేయు ప్రతి సాధకుడికి గురుకృప అత్యంత అవసరం. ఇది లేకుండా ఈశ్వరప్రాప్తి సాధ్యం కాదు అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.

‘జ్ఞాన దానం చేసే సద్గురువులకు సరిపడే ఉపమానం ఈ త్రిభువనములలోనే లేదు’ అని ఆది శంకరాచార్యులవారు చెప్పియున్నారు. గురువుగారిని స్పర్శవేదికి పోల్చినా అది అపూర్ణమే, ఎందుకంటే ‘స్పర్శవేది లోహానికి స్వర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది, కానీ స్పర్శవేదిగా మార్చజాలదు’. కానీ గురువు శిష్యుడ్ని తన మాదిరిగానే తీర్చి దిద్దుతాడు. ఇదే గురు మహిమ !

 

భారతాన్ని విశ్వగురు స్థానంలో నిలిపిన సర్వ శ్రేష్ఠ పరంపర !

గురు-శిష్య పరంపర హిందూ ధర్మం యొక్క సర్వశ్రేష్ఠ పరంపరగా నిలిచింది. శ్రీవిష్ణువు మరియు నారదముని నుండి ఈ పరంపర ప్రారంభమయ్యింది. ఈ పరంపర శ్రీరామ-శ్రీకృష్ణావతారాలలో కూడా కొనసాగింది. హిందూ ధర్మం యొక్క ప్రగతి కోసం పాటుపడే అనేక గురు-శిష్య పరంపరల వలన ఈ ధర్మం పోషింపబడింది. భరత వర్షం ద్వారా అనేక యుగాల నుండి కొనసాగిన ఈ పరంపర మన దేశపు సర్వోత్కృష్ట వైభవంగా నిలిచింది మరియు ఇదే వైభవం వలన భారత భూమి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అత్యంత సామర్థ్యశాలి మరియు ‘విశ్వగురు’ స్థానంలో వెలుగొందుతూ ఉంది.

ప.పూ. గులాబ్ రావ్ మాహారాజ్ తో ఒక విదేశీయుడు ‘మీ దేశంలో అత్యంత తక్కువ శబ్దాలలో చెప్పగలిగిన వైశిష్ట్యం ఏమున్నది ?’ అని అడిగాడట. అందుకాయన ‘గురు-శిష్య పరంపర’ అని బదులిచ్చారట. ఈ జవాబు ఎంత అర్థపుర్ణమో కదా !

 

శిష్యావస్థలోని ఆచరణలు

1. గురువు గారు అడిగిన/అపేక్షించిన ‘చిన్న పనిని నాకు చెయ్యడం కాలేదు’ అని ఎవరికి అనిపిస్తుందో అతనే నిజమైన శిష్యుడు.

2. తరువాతి అంచెలో పైన చెప్పిన భావన తీవ్రమవుతుంది మరియు అతను దానిని ఎలా సాధించాలా అని ఉపాయం గురించి ఆలోచిస్తాడు.

3. ఇలా దొరికిన ఉపాయాన్ని వెంటనే ఆచరణలో పెడతాడు.

4. అతనికి ఎల్లప్పుడూ ‘నేను గురు సేవలో ఏమీ లోపం చేయడం లేదు కదా, నేనేమి తప్పు చేయడం లేదు కదా’ అనే చింత ఉంటుంది.

5. ఎల్లప్పుడూ ఇతరుల మాటలు వినే ప్రవృత్తి, తన మరియు ఇతరుల తప్పుల నుండి నేర్చుకునే అలవాటు, తత్పరత, జిజ్ఞాస, గురువుల పట్ల కృతజ్ఞత, శరణాగతభావం కలిగి ఉన్నవాడు మాత్రమే, గురువుగారి అపేక్షిత కార్యాన్ని గుర్తించి చేయగలడు.

6. గుణాలన్ని పూరకంగా ఉంటాయి మరియు ఒక గుణమును పెంచడానికి ఇంకొక్క గుణం సహాయపడుతుంది. గొలుసులోని ఒక కొక్కి ఇంకొక్క కొక్కిని పట్టుకున్నట్టు ప్రతి కొక్కికి కూడా తనదే అయిన ప్రాముఖ్యత ఉన్నట్టు అన్ని గుణములు కూడా మహత్వపూర్ణమే అయినవి.

Leave a Comment