శ్రీ గణపతికి తులసి దళములను ఎందుకు సమర్పించకూడదు ?

పౌరాణిక కారణము పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకొక మంచి భర్త కావలెనని కోరుకొన్నది. అందుకోసం ఆమె ధ్యానం చెయ్యడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చెయ్యడం వంటి అనేక పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె “ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా” అని పిలువ సాగింది. … Read more

శ్రీ గణేశుడికి గరిక(దుర్వము)ను ఎన్ని సంఖ్యల్లో సమర్పించాలి ?

1. ఉత్పత్తి మరియు అర్థం గరిక (దుర్వ) : శ్రీ గణపతి పూజలో దుర్వ మహత్వమైనది. దుర్వ ఈ పదము దూః + అవమ్‌ ఇలా తయారయినది. ‘దూః’ అంటే దూరములో ఉన్నది మరియు ‘అవమ్‌’ అంటే ఏది దగ్గరకు తెస్తుందో అది. దూరములో ఉన్న గణేశుని పవిత్రకములను ఏది దగ్గరకు తెస్తుందో, అదే దుర్వము అంటే గరిక. 2. గణపతికి ఎన్ని సంఖ్యలో దుర్వ సమర్పించాలి ? బేసి సంఖ్యా శక్తి తత్త్వానికి ప్రతీక. గణపతికి … Read more

శ్రీ గణపతికి ఎర్రని వస్తువులు సమర్పించుటకు గల ప్రాముఖ్యత 

దేవతా పవిత్రకములు అనగా ఆ దేవత యొక్క సూక్ష్మాతి సూక్ష్మ కణములు. ఏ వస్తువులో పలానా దేవత యొక్క పవిత్రకములు ఇతర వస్తువులకు పోలిస్తే ఎక్కువ ప్రమాణంలో ఆకర్షించబడుతుందో, అటువంటి వస్తువులను దేవతకు సమర్పిస్తే ఆ దేవతా తత్త్వము విగ్రహంలో ఆకర్షితమై ఆ దేవతా విగ్రహంలోని చైతన్యం యొక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఈ తత్త్వానికి అనుగుణంగా, శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగించవలెను. శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో … Read more

శ్రీ గణపతి ఉపాసన

ఇలాంటి కృతి చేయుట వలన ఉపాసకునికి ఆ దేవుని తత్వము ఎక్కువగా లభించుటకు సహాయమవుతుంది. ఈ ఉద్దేశంతో శ్రీ గణపతి ఉపాసనకు సంబంధించిన కొన్ని శాస్త్రమును ఈ లేఖన ద్వారా తెలపడమైనది.

గణేష్ విగ్రహం యొక్క విభిన్న వైవిధ్యాలు ఏమిటి ?

శివుడిలాగే, గణపతికి కూడా లింగము ఉంది. దీనిని గణపత్యలింగ అంటారు. ఇది దానిమ్మ, నిమ్మ, తెల్ల గుమ్మడికాయ లేదా జామున్ ఆకారంలో ఉంటుంది.

శ్రీ గణపతి కి గల ఇతర పేర్లు మరియు దాని అర్థము

గణ+పతి= గణపతి. సంస్కృత (కోశ) నిఘంటువనుసారంగా గణ అంటే పవిత్రకాలు. పవిత్రకాలంటే సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యకణాలు. పతి అంటే పాలించేవాడు (స్వామి). గణపతి అంటే పవిత్రకాలకు స్వామి.