శ్రీ గణపతి కి గల ఇతర పేర్లు మరియు దాని అర్థము

1. సృష్టి మరియు అర్థము

గణ+పతి= గణపతి. సంస్కృత (కోశ) నిఘంటువనుసారంగా గణ అంటే పవిత్రకాలు. పవిత్రకాలంటే సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యకణాలు. పతి అంటే పాలించేవాడు (స్వామి). గణపతి అంటే పవిత్రకాలకు స్వామి.

 

2. కొన్ని ఇతర పేర్లు

ముద్గలఋషి, గణేశ సహస్రనామమును వ్రాశారు. ఇందులో శ్రీ గణపతి యొక్క వెయ్యిపేర్లు ఉన్నవి. ద్వాదశ నామస్తోత్రములోని శ్రీ గణపతి యొక్క పన్నెండు పేర్లు క్రింద ఇవ్వబడినది.

 

ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్ l

తృతియం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకమ్ ll

లంబోధరం పంచమంచ షష్టం వికటమేవచ l

సప్తమం విజ్ఞరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టకమ్ ll

నవమం భాలచంద్రంచ దశమం తు వినాయకమ్ l

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ll

 

ఈ పన్నెండు పేర్ల అర్థము మరియు ఇతర కొన్ని పేర్లు క్రింది విధంగా ఉన్నవి.

2 అ. వక్రతుండ

సామాన్యముగా వక్రతుండా అంటే వంకర మూతివాడు, తొండము ఉన్నవాడు అని అనుకుంటారు, అయితే అది తప్పు. వక్రాన్ తుండయతి ఇతి వక్రతుండ, అంటే వక్ర (చెడు) మార్గంలో (నడవడిక) నడిచేవాళ్లను శిక్షించి వారిని సరియైన మార్గానికి తెస్తాడో, ఆయనే వక్రతుండ. రజో, తమతో కూడిన 360 లహరులను తొండము ద్వారా 10 లహరుల వలె చక్కగా మరియు సాత్వికముగా మార్చేవాడే, వక్రతుండ.

2 ఆ. ఏకదంత లేక ఏకశృంగ

ఒక దంతము మాత్రమే అఖండముగా ఉన్నందున శ్రీ గణపతికి ఈ పేరు వచ్చినది. ఏకం (ఒకటి) ఇది బ్రహ్మకు ప్రతీక. దంత ఈ పదము దృ-దర్షయతి (అంటే చూపించేది) ఈ ధాతువు నుండి ఏర్పడినది. ఒకటి అంటే బ్రహ్మ అనుభూతిని ఇచ్చునటు వంటి దిక్కును చూపించువాడు, ఇది కూడా దీని అర్థము.

2 ఇ. లంబోదర

లంబోదర ఈ పదము లంబ (అంటే పెద్దది) మరియు ఉదర (అంటే పొట్ట) ఈ విధంగా ఏర్పడినది. లంబోధర పదము యొక్క అర్థమును సంత్ ఏకనాథులు ఈ విధంగా చెప్పారు.

చరాచర సృష్టి నీలో నివసించుచున్నది l

అందుకే అన్నారు నిన్ను లంబోదరుడని ll

– శ్రీ ఏకనాథి భాగవతము 1:3

2 ఈ. భాలచంద్ర

భాల అంటే కనుబొమ్మల పైన ఉన్నటువంటి నుదురు. విశ్వము యొక్క ఉత్పత్తి సమయములో ప్రజాపతి, బ్రహ్మ, శివుడు, విష్ణువు మరియు మీనాక్షి వీళ్ల లహరులు కలిసి మమత, క్షమాశీలం, మరియు అహ్లాదం అన్నీ కలిసి నిర్మాణమైన స్థితిని చంద్రమ అని అంటారు. ఇటువంటి చంద్రుణ్ణి ఎవరైతే నుదుటిపై ధరించారో, ఆయనే భాలచంద్రుడు. మూలమున ఇది శివుని పేరు. అయితే శివుని పుత్రుడై నందున శ్రీ గణపతికి ఈ పేరు వచ్చినది.

2 ఉ. వినాయక

వినాయక ఈ పదము విశేషరూపేణ నాయకః ఇలా ఏర్పడినది. దీని అర్థము నాయకుని అన్ని లక్షణాలు ఉన్నటువంటివాడు. వినాయకగణ విషయంలో ఆరు ఈ సంఖ్య సర్వ ఆమోద్యమైనది. మానవగృహ్యసూత్ర మరియు భౌధాయనగృహ్యసూత్రములలో వినాయకుని గురించి జ్ఞానమున్నది, దాని సారాంశము – వినాయక గణాలు విఘ్నకారకులు, ఉపద్రవకారకులు మరియు క్రూరులు. వారి ఉపద్రవము ప్రారంభమైతే మనుష్యులు పిచ్చివాళ్ల వలె ప్రవర్తిస్తారు. వారికి దుఃస్వప్నములు పడతాయి, మరియు సదా భయము వేస్తూ ఉంటుంది. ఈ వినాయక గణుల పీడను నాశనము చేయుటకు ధర్మశాస్త్రములో అనేక శాంతి విధులను తెలుపడమైనది. శ్రీ గణపతి ఇతడు వినాయక అంటే ఈ వినాయక గణాలకు అధిపతి. శంకరుడు శ్రీ గణపతికి ఇలా చెప్పాడు, వినాయక గణాలు నీ సేవకులౌతారు, యజ్ఞాది కార్యములలో నీ పూజ ప్రథమంగా అవుతుంది, ఎవరైతే దీనిని ఆచరించరో, వారి కార్యములలో విఘ్నములు వచ్చును. అప్పటి నుండి ప్రతియొక్క కార్యము యొక్క ప్రారంభములో శ్రీ గణపతి పూజ జరుగుతుంది. వినాయక గణాలు విఘ్నకారులు అయినప్పటికి, వినాయకుడు (గణపతియు) విఘ్నములను తోలగించువాడెయును. భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదించేవాడు సిద్ధివినాయకుడు.

2 ఊ. మంగళమూర్తి

మంగం సుఖం లాతి ఇతి మంగలం. మంగ అంటే సుఖ ప్రాప్తి చేయును, అది మంగళం. ఇలా మంగళం చేయు మూర్తి అనగా మంగళమూర్తి.

మహారాష్ట్రలో మంగళమూర్తి మోరియా అని శ్రీ గణపతి జయధ్వానం చేస్తారు; దీనిలో మోరియా ఈ పదము మోరయా గోసావి అనే ప్రసిద్ధ గణేశ భక్తుని పేరు నుండి వచ్చినది. ఇతను పదునాల్గవ శతాబ్దములో పూణే దగ్గర ఉన్నట్టువంటి చించవాడ ఊరిలో ఉండేవారు. దీనిని బట్టి భగవంతునికి భక్తుని మధ్య ఉండే శాశ్వత సంబంధము తెలిసివస్తుంది.

2 ఋ. విద్యాపతి

1. చదువు, 2. కల్ప, 3. వ్యాకరణ, 4. నిరుక్త, 5. జ్యోతిష్యం, 6. ఛందస్సు, 7. ఋగ్వేదం, యజుర్వేదం, 9. సామవేదం, 10. అథర్వణవేదం, 11. పూర్వ-ఉత్తరమీమాంస, 12. న్యాయం, 13. పురాణం, 14. ధర్మశాస్త్రం, 15. ఆయుర్వేదం, 16. ధనుర్వేదం, 17. గంధవేదము మరియు 18. నీతిశాస్త్రము ఈ పద్దెనిమిది విద్యల ఆధిపత్యము శ్రీ గణేశుని దగ్గర ఉన్నది. అందుకే శ్రీ గణపతికి విద్యాపతి అని అంటారు మరియు ఈ విద్యల అధ్యయనం ప్రారంభం చేసే ముందు లేదా విద్యాంతర్గత అధ్యయన విధిలో శ్రీ గణేశుని పూజ మహత్వమైనది.

2 ౠ. చింతామణి

శ్రీ గణపతికి మరొక పేరు చింతామణి, క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్రత మరియు నిరుద్ధ ఇలా చిత్తము యొక్క ఐదు భూమికలున్నవి. (దీని వివరణ ఆధ్యాత్మికశాస్త్ర ఖండము 72 జ్ఞానయోగము ఇందులో ఇవ్వబడినది). వాటిని ప్రకాశింపచేయువాడే చింతామణి. చింతామణి భజన ద్వారా చిత్తపంచకములు, నాశనమై సంపూర్ణ శాంతి లభిస్తుంది. ఈ వివరణను ముద్గల పురాణములో ఇవ్వబడినది.

సందర్భం : సనాతన లఘుగ్రంథం ‘శ్రీ  గణపతి’

Leave a Comment