చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం

చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం

ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు లోని కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం స్వయంభూ గా వెలసిన గణేశ విగ్రహానికి, మరియు ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో పురాణాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.  11వ శతాబ్దం లో చోళ సామ్రాజ్యపు రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిని 1336లో విజయనగర రాజు పునరుద్ధరించారు.

దేవుని ఉనికిని చాటే ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ చెప్పబడుతుంది. ఈ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. వారిలో ఒకడు గుడ్డివాడు, ఒకడు చెవిటి వాడు, మరొకడు మూగ వాడు. వారు ఒక చిన్న భూమిని సాగు చేసుకుని జీవనం సాగించే వారు. ఒకసారి వారి పొలంలోని బావి ఎండిపోయింది. కావున, వారిలో ఒకడు ఆ బావిని ఇంకా లోతుగా తవ్వడానికి అందులోకి దిగాడు. అతని పార ఆ బావిలోని ఒక రాతి విగ్రహానికి తగలగానే అందులో నుండి రక్తం వచ్చింది. ఆ రక్తం బావిలోని నీటిలో కలిసి ఆ నీరు అంతా ఎర్రగా మారింది. వెంటనే ఆ ముగ్గురి అన్నదమ్ముల వైకల్యం పోయింది. అప్పుడు ఆ గ్రామస్థులు ఆ విగ్రహాన్ని బావి నుండి బయటకు తీసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అప్పటి నుండి ఆ బావి ఎప్పుడూ ఎండిపోలేదు. ప్రతి రోజూ ఈ గణేశ విగ్రహ ఆకారము మారుతూ ఉంది. ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించి, ఈ బావి ఎదురుగా శ్రీ గణేశుని మీద ప్రమాణం చేసి వారి తగాదాలను పరిష్కరించుకుంటారు. శ్రీ గణేశుని మీద ప్రమాణం చేసిన వారు సత్యం వైపు ఉన్నట్లుగా నమ్మబడుతున్నది. ఈ బావిలో స్నానం చేశాక నేరస్థులు కూడా తమ నేరాలను ఒప్పుకుని తమ పాపాల నుండి విమోచనం పొందుతారు. ఈ గ్రామంలో న్యాయం చేయడానికి ఇది ఖచ్చితంగా నమ్మదగిన మార్గంగా విశ్వసిస్తారు.

Leave a Comment