రాంటెక్ కు చెందిన పద్ధెనిమిది బాహువులు గల గణేశ విగ్రహం

రాంటెక్ కు చెందిన పద్ధెనిమిది బాహువులు గల గణేశ విగ్రహం

పద్ధెనిమిది బాహువులు గల పురాతన శ్రీ గణేశ విగ్రహం (నాగపూర్ జిల్లా) – ప్రభువు శ్రీ రామ చంద్రుని ఉనికి చేత పావనమైన చోటు

రాంటెక్ అనేది నాగపూర్ జిల్లా లోని యాత్రా స్థలం. అది పుణ్య స్వరూపుడు, ప్రభువు శ్రీ రామ చంద్రుని ఉనికి చేత పవిత్రతను సంతరించుకున్నది. కోట పాద ప్రాంతమున నెలకొని ఉన్న శైవల్య పర్వతము మీద పద్ధెనిమిది బాహువులు గల గణేశుని ఆలయం ఉంది.  శైవల్య పర్వతము శంబూక మహర్షి నివసించిన చోటు. విద్యాధర సంస్కృతి ఈ పర్వతము పై ప్రబలమై ఉండేది. పద్ధెనిమిది విద్యలలో ప్రవీణుడైన విద్యాధరుని పాండిత్యము పద్దెనిమిది బాహువుల గణపతి లో గమనించవచ్చు.

రాంటెక్ కోట పాద ప్రాంతమున ఉన్న ఈ ఆలయములో 4.5 నుండి 5 అడుగుల ఎత్తైన, పద్ధెనిమిది బాహువులు గల పురాతన చలువరాతి గణేశ విగ్రహము ఉంది. విదర్భలో ఉన్న ఎనిమిది గణేశ విగ్రహములలో ఇది ఒకటి. దీని పదహారు బాహువులు అంకుశము, పాశము, ఖట్వాంగము, త్రిశూలము, పరశు మొదలగు ఆయుధములను  ధరించి ఉంటాయి. ఒక చేతిలో మోదకము, మరొక చేతిలో నేమలి, ఈక, ఘంటము ఉంటాయి. ఈ విగ్రహము యొక్క తొండము పైకి, కిందకి చుట్టుకుని ఉంటుంది. ఈ గణేశుని విగ్రహము తలపై ఐదు పడగల సర్పము, మెడ చుట్టూ మరొక సర్పము, నడుము చుట్టూ మరొకటి ఉంటాయి.

ఐదు వందల సంవత్సరాల పురాతనమైన ఈ విగ్రహం విదర్భకే కాక మొత్తం మహారాష్ట్రకే ఆకర్షణీయం. శాస్త్రపురాణంలో పద్ధెనిమిది అతీంద్రియ శక్తుల వలన పద్ధెనిమిది బాహువుల గణపతిని విఘ్నేశ్వరుడిగా ఆరాధిస్తారు.

మహా గణపతి ఆలయం మధ్యలో కూర్చుని ఉండగా సిద్ధి, బుద్దులు, ఆయన ఎడమ వైపున ఉంటారు.

మనం అందరం మనస్ఫూర్తిగా రాంటెక్ (నాగపూర్ జిల్లా) లోని ఆ పద్ధెనిమిది బాహువుల శ్రీ గణేశునికి  హిందూ రాష్ట్ర స్థాపన త్వరగా జరగాలని ప్రార్థన చేద్దాము.

Leave a Comment