శ్రీ గణపతి అథర్వశీర్షము

శ్రీ గణపతి

‘స్తోత్రం’ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ‘స్తోత్రం’ అంటే దేవతల స్తవనమ్, అంటే దేవతలను స్తుతించడం. స్తోత్రం పఠించడం వల్ల పఠించిన వారి వ్యక్తి చుట్టూ సూక్ష్మ స్థాయిలో సంరక్షక కవచం నిర్మాణమై అనిష్ట శక్తుల నుండి రక్షణ జరుగుతుంది. ఎప్పుడు మనం ఒక నిర్దిష్టమైన లయములో మరియు రాగములో ఏదైనా స్తోత్రం చెప్పబడుతుందో, అప్పుడు ఆ స్తోత్రం నుండి ఒక విశిష్టమైన చైతన్యముతో కూడిన శక్తి నిర్మాణమౌతుంది. అందువల్ల స్తోత్రాన్ని ఒక విశిష్టమైన లయములో చెప్పడం అవసరం.

శ్రీ వినాయకుడి 2 స్తోత్రాలు చిరపరిచితం. అందులో ఒకటి ‘సంకష్టనాశన స్తోత్రం’. ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు పఠించే దృష్టిలో చాలా సులభం మరియు ప్రభావవంతమైనది. ఈ స్తోత్రమును దేవర్షి నారద ముని  దీనిని రచించారు. ఇందులో శ్రీ వినాయకుడి 12 పేర్లను స్మరించడం జరిగింది. ఈ  స్తోత్రమును ప్రొద్దున, మధ్యాహ్నం మరియు సాయంత్రం పఠించడం వల్ల అన్ని ఇష్టాలు పూర్తవుతాయి. ‘ఇలా అందరికి సరైన ఉచ్చారంతో సంకష్టనాశనం స్తోత్రం భావపూర్వకంగా పఠించడం సాధ్యం అవ్వాలని అలాగే అందరి మనో కామనలు సిద్ధిన్చాలని’ శ్రీ గణేశుడి చరణాలకు ప్రార్థన.

గణపతి యొక్క మొరక్క పరిచితమైన స్తోత్రం ‘గణపతి అథర్వశీర్ష’. ‘అథర్వశీర్ష’ లోని ‘థర్వ’ అనగా ‘ఉష్ణం’. ‘అథర్వ’ అనగా ‘శాంతి’ మరియు ‘శీర్ష’ అనగా ‘మస్తకం’ దేని పురశ్చరణతో శాంతి లభిస్తుందో, అదే ‘అథర్వశీర్ష’. ఈ స్తోత్రం గణకఋషి రచించారు. అథర్వశీర్ష మును పఠించడం వల్ల అన్ని విఘ్నాలు దూరమవుతాయి మరియు అన్ని పాపాల నుండి ముక్తి లభిస్తుంది.

అథర్వశీర్షములో 3 ముఖ్యమైన భాగాలున్నాయి –

1. శాంతి మంత్రం : ప్రారంభంలో ‘ఓం భద్రం కర్ణేభిః…।’ మరియు ‘స్వస్తి న ఇన్ద్రో…।’ ఈ మంత్రం మరియు చివరిలో ‘సహా నావవతు… ।’ ఈ మంత్రం

2. ధ్యానవిధి : ‘ఓం నమస్తే గణపతయే’ ఇక్కడ నుండి ‘వరదమూర్తయే నమః ।’ వరకు గల 10 మంత్రాలు

3. ఫలశ్రుతి :  ‘ఏతదథర్వశీర్ష యోఽధీతే’ మొదలైన 4 మంత్రాలు

అథర్వశీర్ష పఠించేటప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. 

1. ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉండాలి.

2. ఈ స్తోత్రమును ఒకటి కంటే ఎక్కువసార్లు చదవాల్సి వచ్చినప్పుడు, ‘వరదమూర్తయే నమః’ వరకు చెప్పాలి. దీని తరువాత వచ్చే ఫలశృతి చివరి ఆవర్తన తర్వాత చెప్పాలి. అదే విధంగా, శాంతి మంత్రాన్ని ప్రతి పాఠానికి ముందు చెప్పకుండా ప్రారంభంలో ఒకసారి చెప్పాలి.

3. ఈ స్తోత్రం యొక్క 21 ఆవర్తనాలు అంటే ఒక అభిషేకం.

4. మీ వీపును వంచకుండా నిటారుగా కూర్చోవలెను.

5. పఠనం ముందు, తల్లి, తండ్రి మరియు గురువులకు నమస్కారం చేయవలెను.

6.  పఠనం ప్రారంభించే ముందు సాధ్యమైతే  గణపతిని పూజించండి మరియు అతనికి అక్షత, దుర్వా, షమీ మరియు ఎర్రటి పువ్వులు సమర్పించండి. పూజ చేయలేకపోతే, ఒక నిమిషం పాటు గణపతిని ధ్యానించాలి, వందనం చేసి పఠనం ప్రారంభించాలి.

7. ఉచ్చారణలో తప్పులు చేయకుండా పఠనంను సరిగ్గా ఉచ్చరించడం తెలిసినవారితో నేర్చుకోవలెను.

అలాగే ధర్మ, అర్థ, కామ మరియు మోక్షం ఈ నాలుగు పురుషార్థాలు ప్రాప్తమౌతాయి. ఇప్పుడు మనం ఈ స్తోత్రం విననున్నాము.

Audio

శ్రీ గణపతి అథర్వశీర్షం ।

శ్రీ గణేశాయ నమః ।

(శాంతి మంత్రః)

ఓం భద్రఙ్ కర్ణేభిః శృణుయామ దేవాః । భద్రమ్ పశ్యేమాక్షభిర్యజత్రాః । స్థిరైరఙ్గైస్తుష్టువాంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః ।।

ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదాః । స్వస్తి నస్తార్క్ష్యోఽఅరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ।।

ఓం శాంతిః శాంతిః శాంతిః ।।

(అథ అథర్వశీర్షారమ్భః ।)

ఓం నమస్తే గణపతయే । త్వమేవ ప్రత్యక్షన్ తత్త్వమసి । త్వమేవ కేవలఙ్ కర్తాఽసి । త్వమేవ కేవలన్ ధర్తాఽసి । త్వమేవ కేవలమ్ హర్తాఽసి । త్వమేవ సర్వఙ్ ఖల్విదమ్ బ్రహ్మాసి । త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్ ।। ౧ ।।

ఋతం వచ్మి । సత్యం వచ్మి ।। ౨ ।।

అవ త్వమ్ మామ్ । అవ వక్తారమ్ । అవ శ్రోతారమ్ । అవ దాతారమ్ । అవ ధాతారమ్ । అవానూచానమవ శిష్యమ్ । అవ పశ్చాత్తాత్ । అవ పురస్తాత్ । అవోత్తరాత్తాత్ । అవ దక్షిణాత్తాత్ । అవ చోర్ధ్వాత్తాత్ । అవాధరాత్తాత్ । సర్వతో మామ్ పాహి పాహి సమన్తాత్ ।। ౩ ।।

త్వం వాఙ్మయస్త్వఞ్ చిన్మయః । త్వమ్ ఆనన్దమయస్త్వమ్ బ్రహ్మమయః । త్వం సచ్చిదానన్దాద్వితీయోఽసి । త్వమ్ ప్రత్యక్షమ్ బ్రహ్మాసి । త్వమ్ జ్ఞానమయో విజ్ఞానమయోఽసి ।। ౪ ।।

సర్వఞ్ జగదిదన్ త్వత్తో జాయతే । సర్వఞ్ జగదిదన్ త్వత్తస్తిష్ఠతి । సర్వఞ్ జగదిదన్ త్వయి లయమేష్యతి । సర్వఞ్ జగదిదన్ త్వయి ప్రత్యేతి । త్వమ్ భూమిరాపోఽనలోఽనిలో నభః । త్వఞ్ చత్వారి వా‍క్‌పదాని ।। ౫ ।।

త్వఙ్ గుణత్రయాతీతః । (త్వమ్ అవస్థాత్రయాతీతః ।) త్వన్ దేహత్రయాతీతః । త్వఙ్ కాలత్రయాతీతః । త్వమ్ మూలాధారస్థితోఽసి నిత్యమ్ । త్వం శక్తిత్రయాత్మకః । త్వాం యోగినో ధ్యాయన్తి నిత్యమ్ । త్వమ్ బ్రహ్మా త్వం విష్ణుస్త్వమ్ రుద్రస్త్వమ్ ఇన్ద్రస్త్వమ్ అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వఞ్ చన్ద్రమాస్త్వమ్ బ్రహ్మభూర్భువః స్వరోమ్ ।। ౬ ।।

గణాదిమ్ పూర్వముచ్చార్య వర్ణాదిన్ తదనన్తరమ్ । అనుస్వారః పరతరః । అర్ధేన్దులసితమ్ । తారేణ ఋద్ధమ్ । ఏతత్తవ మనుస్వరూపమ్ । గకారః పూర్వరూపమ్ । అకారో మధ్యమరూపమ్ । అనుస్వారశ్చాన్త్యరూపమ్ । బిన్దురుత్తరరూపమ్ । నాదః సన్ధానమ్ । సంహితా సన్ధిః । సైషా గణేశవిద్యా । గణక ఋషిః । నిచృద్గాయత్రీ ఛన్దః । గణపతిర్దేవతా । ఓం గఁ గణపతయే నమః ।। ౭ ।।

ఏకదన్తాయ విద్మహే । వక్రతుణ్డాయ ధీమహి । తన్నో దన్తిః ప్రచోదయాత్ ।। ౮ ।।

ఏకదన్తఞ్ చతుర్హస్తమ్, పాశమఙ్కుశధారిణమ్ । రదఞ్ చ వరదమ్ హస్తైర్బిభ్రాణమ్, మూషకధ్వజమ్ । రక్తం లమ్బోదరం, శూర్పకర్ణకమ్ రక్తవాససమ్ । రక్తగన్ధానులిప్తాఙ్గమ్, రక్తపుష్పైఃసుపూజితమ్ । భక్తానుకమ్పినన్ దేవఞ్, జగత్కారణమచ్యుతమ్ । ఆవిర్భూతఞ్ చ సృష్ట్యాదౌ, ప్రకృతేః పురుషాత్పరమ్ । ఏవన్ ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః ।। ౯ ।।

నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తే అస్తు లమ్బోదరాయ ఏకదన్తాయ, విఘ్ననాశినే శివసుతాయ, వరదమూర్తయే నమః ।। ౧౦ ।।

ఏతదథర్వశీర్షం యోఽధీతే । స బ్రహ్మభూయాయ కల్పతే । స సర్వవిఘ్నైర్న బాధ్యతే । స సర్వతః సుఖమేధతే । స పఞ్చమహాపాపాత్ ప్రముచ్యతే । సాయమధీయానో దివసకృతమ్ పాపన్ నాశయతి । ప్రాతరధీయానో రాత్రికృతమ్ పాపన్ నాశయతి । సాయమ్ ప్రాతః ప్రయుజానోఽఅపాపో భవతి । సర్వత్రాధీయానోఽపవిఘ్నో భవతి । ధర్మార్థకామమోక్షఞ్ చ విన్దతి । ఇదమ్ అథర్వశీర్షమ్ అశిష్యాయ న దేయమ్ । యో యది మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి । సహస్రావర్తనాత్ । యం యఙ్ కామమధీతే తన్ తమనేన సాధయేత్ ।। ౧౧ ।।

అనేన గణపతిమభిషిఞ్చతి । స వాగ్మీ భవతి । చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి । ఇత్యథర్వణవాక్యమ్ । బ్రహ్మాద్యావరణమ్ విద్యాత్ । న బిభేతి కదాచనేతి ।। ౧౨ ।।

యో దూర్వాఙ్కురైర్యజతి । స వైశ్రవణోపమో భవతి । యో లాజైర్యజతి, స యశోవాన్ భవతి । స మేధావాన్ భవతి । యో మోదకసహస్రేణ యజతి । స వాఞ్ఛితఫలమవాప్నోతి । యః సాజ్యసమిద్భిర్యజతి స సర్వం లభతే, స సర్వం లభతే ।। ౧౩ ।।

అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయిత్వా, సూర్యవర్చస్వీ భవతి । సూర్యగ్రహే మహానద్యామ్ ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా, సిద్ధమన్త్రో భవతి । మహావిఘ్నాత్ ప్రముచ్యతే । మహాదోషాత్ ప్రముచ్యతే । మహాపాపాత్ ప్రముచ్యతే । స సర్వవిద్ భవతి, స సర్వవిద్ భవతి । య ఏవమ్ వేద ।। ౧౪ ।।

ఇత్యుపనిషత్ ।

(శాంతి మంత్రః)

ఓం భద్రఙ్ కర్ణేభిః శృణుయామ దేవాః । భద్రమ్ పశ్యేమాక్షభిర్యజత్రాః । స్థిరైరఙ్గైస్తుష్టువాంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః ।।

ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదాః । స్వస్తి నస్తార్క్ష్యోఽఅరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ।।

ఓం సహనావవతు । సహనౌ భునక్తు । సహవీర్యఙ్ కరవావహై । తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ।।

ఓం శాంతిః శాంతిః శాంతిః ।।

‘ఈ విధంగా అందరికీ సరిఅయిన ఉచ్చరముతో మరియు భావరపూర్వకంగా స్తోత్రం పఠించడం సాధ్యం కానీ మరియు అందరి జీవితంలో వచ్చే విఘ్నాలు దూరమై అందరి జీవితంలో సుఖం, శాంతి మరియు సమాధానం లభించాలని’, శ్రీ గణపతి చరణాలలో ప్రార్థన.

Leave a Comment