శ్రీ గణపతి సంకష్టనాశన స్తోత్రం

శ్రీ గణపతి

‘స్తోత్రం’ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ‘స్తోత్రం’ అంటే దేవతల స్తవనమ్, అంటే దేవతలను స్తుతించడం. స్తోత్రం పఠించడం వల్ల పఠించిన వారి వ్యక్తి చుట్టూ సూక్ష్మ స్థాయిలో సంరక్షక కవచం నిర్మాణమై అనిష్ట శక్తుల నుండి రక్షణ జరుగుతుంది. ఎప్పుడు మనం ఒక నిర్దిష్టమైన లయములో మరియు రాగములో ఏదైనా స్తోత్రం చెప్పబడుతుందో, అప్పుడు ఆ స్తోత్రం నుండి ఒక విశిష్టమైన చైతన్యముతో కూడిన శక్తి నిర్మాణమౌతుంది. అందువల్ల స్తోత్రాన్ని ఒక విశిష్టమైన లయములో చెప్పడం అవసరం.

Audio

శ్రీ వినాయకుడి 2 స్తోత్రాలు చిరపరిచితం. అందులో ఒకటి ‘సంకష్టనాశన స్తోత్రం’. ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు పఠించే దృష్టిలో చాలా సులభం మరియు ప్రభావవంతమైనది. ఈ స్తోత్రమును దేవర్షి నారద ముని  దీనిని రచించారు. ఇందులో శ్రీ వినాయకుడి 12 పేర్లను స్మరించడం జరిగింది. ఈ  స్తోత్రమును ప్రొద్దున, మధ్యాహ్నం మరియు సాయంత్రం పఠించడం వల్ల అన్ని ఇష్టాలు పూర్తవుతాయి. ‘ఇలా అందరికి సరైన ఉచ్చారంతో సంకష్టనాశనం స్తోత్రం భావపూర్వకంగా పఠించడం సాధ్యం అవ్వాలని అలాగే అందరి మనో కామనలు సిద్ధిన్చాలని’ శ్రీ గణేశుడి చరణాలకు ప్రార్థన.

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్

భక్తావాసం స్మరేనిత్యమ ఆయుష్కామార్థ సిధ్దయే ॥౧॥

ప్రథమం వక్రతుణ్డం చ ఏకదన్తం ద్వితీయకమ్

తృతీయం కృష్ణపిఙగాక్షం గజవక్త్రం చతుర్థకమ ॥౨॥

లమ్బోదరం పఞ్చమం చ షష్ఠం వికటమేవ చ

సప్తమం విఘ్నరాజేన్ద్రం ధుమ్రవర్ణం తథాషష్టమ ॥౩॥

నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ ॥౪॥

ద్వాదశేతాని నామాని త్రిసంధ్యం య: పఠేన్నర:

న చ విఘ్నభయం తస్య సర్వసిధ్దీకర ప్రభో ॥౫॥

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ ॥౬॥

జపేద్గణపతిస్తోత్రం షడభిర్మాసే ఫలం లభేత్

సంవత్సరేణ సిధ్దీం చ లభతే నాత్ర సంశయ: ॥౭॥

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా య: సమర్పయేత

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదత: ॥౮॥

Leave a Comment