శ్రీ గణేశ చతుర్థీ రోజున పూజ చేసేందుకు మూర్తిని ఇంటికి ఎలా తీసుకొనిరావలెను ?

1. శ్రీ గణేశుని మూర్తిని ఇంటికి తీసుకొని వచ్చేందుకు ఇంటి పెద్ద మనిషి ఇతరులతో పాటుగా వెళ్ళవలెను.

2. మూర్తిని చేతులతో తీసుకొనివచ్చే వ్యక్తి సాంప్రదాయిక దుస్తులను ధరించవలెను అనగా ధోతీ-కుర్తా లేదా కుర్తా-పైజమాను ధరించవలెను.

౩. మూర్తిని తీసుకొని వస్తున్నప్పుడు దాని మీద నూలు, పట్టు లేదా ఖాదీతో చేసిన స్వచ్ఛమైన వస్త్రమును వేయవలెను. మూర్తిని ఇంటికి తీసుకొని వస్తున్న సమయములో మూర్తి ముఖము తీసుకొని వచ్చేవారి వైపునకు మరియు మూర్తి వీపు ముందు వైపునకు ఉండవలెను. మూర్తి యొక్క ముందు భాగము నుండీ సగుణ తత్త్వము మరియు వెనుక భాగము నుండీ నిర్గుణ తత్త్వము ప్రక్షేపితము అవుతుంది. మూర్తిని చేతిలో పట్టుకొనేవారు పూజకుడైయుంటాడు. అతను సగుణ కార్యమునకు ప్రతీకమైయుంటాడు. మూర్తి ముఖమును పూజకుని వైపునకు ఉంచుట వలన అతనికి సగుణ తత్త్వ లాభము కలుగుతుంది మరియు ఇతరులకు నిర్గుణ తత్త్వ లాభము కలుగుతుంది.

4. శ్రీ గణేశుని జయజయకారములు మరియు భావపూర్ణముతో నామజపమును చేస్తూ మూర్తిని ఇంటికి తీసుకొని రావలెను.

5. ఇంటి గడప బయట నిల్చొని ఉండాలి. ఇంటిలోని సౌభాగ్యవతీ స్త్రీ, మూర్తిని తీసుకొని వచ్చే వారి కాళ్ళ మీద పాలు, తదనంతరము జలమును చిలకరించవలెను.

6. ఇంటిలో ప్రవేశించే ముందు మూర్తి ముఖము ముందు వైపునకు చేయవలెను. తదనంతరము మూర్తికి హారతిని ఇచ్చి దానిని ఇంటిలోనికి తీసుకొని రావలెను.

7. శాస్త్రోక్త విధి మరియు వ్యవధి : ‘భాద్రపద శుక్ల చతుర్ధీ నాడు మట్టితో తయారు చేసిన గణపతిని తయారు చేస్తారు. దానిని ఎడమ చేతి మీద ఉంచి అక్కడే దానికి ‘సిద్ధి వినాయక’ నామముతో ప్రాణప్రతిష్ఠను మరియు పూజను చేసి వెంటనే నిమజ్జనము చేయమని శాస్త్రవిధిలో ఉన్నది; కానీ మానవునికి ఉత్సవము చేయుట ఇష్టమైయుండుట వలన ఈ విధముగా చేస్తే అతనికి తృప్తి ఉండదు. అందుకనే ఒక్కటిన్నర, అయిదు, ఏడు మరియు పది రోజులు ఉంచి ఉత్సవము చేయనారంభించాడు. కొంతమంది (జ్యేష్ఠ) గౌరీతో పాటుగా గణపతిని నిమజ్జనము చేస్తారు. కులాచారము ప్రకారము ఒక్క కుటుంబములో అయిదు రోజులు గణపతిని ఉంచే పద్ధతి కలదు మరియు అతను ఒక్కటిన్నర లేదా ఏడు రోజులు ఉంచాలనుకొంటే ఇలా చేయవచ్చును. ఇందుకొరకు అతను ఎవ్వరినైనా అడుగవలసిన అవసరము లేదు. పద్ధతి అనుసారముగా ఒక్కటి, రెండు, మూడు, ఆరు, ఏడు లేదా పదవ రోజున శ్రీ గణేశుని నిమజ్జనము చేయవలెను.’

౮. ఆసనము మీద మూర్తి యొక్క స్థాపన : ఏ పీట మీద అయితే మూర్తి యొక్క స్థాపన చేయవలసి ఉన్నదో, దాని మీద పూజకు ముందు బియ్యమును (ధాన్యమును) పరుస్తారు మరియు బియ్యము మీద మూర్తిని ఉంచుతారు. తమ-తమ పద్ధతికనుసారముగా కొంచెము బియ్యము లేదా బియ్యముతో చిన్న ప్రోగుని తయారు చేస్తారు. బియ్యము మీద మూర్తిని పెట్టుట వలన ముందు చెప్పిన అనుసారముగా లాభము ఉంటుంది.

శక్తి స్పందనములు నిర్మాణము అగుట వలన ఇంటిలో నిల్వ ఉంచిన బియ్యములో కూడ శక్తి స్పందనములు నిర్మాణము అవుతాయి. ఈ విధముగా శక్తితో కూడుకొని యున్న బియ్యమును సంవత్సరమంతా ప్రసాద రూపములో గ్రహించవచ్చును.

Leave a Comment