హిందు దేశ స్థాపన కొరకు దేశప్రేమ, ధర్మప్రేమ కలిగిన ఐదువేల న్యాయవాదులు అవసరం !

‘స్వాతంత్య్రసంగ్రామ కాలాన్ని గమనిస్తే, గణేశ్ వాసుదేవ జోశి, లోకమాన్య తిలక్, న్యాయమూర్తి రానాడే, స్వాతంత్య్రవీర్ సావర్కర్, దేశబంధూ చిత్తరంజన్ దాస్ లాంటి అనేక న్యాయవాదులు గుర్తుకొస్తారు. ఈ పట్టికలో వీరంతే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే న్యాయవాదుల సైన్యం స్వాతంత్య్ర సైనికులుగా స్వాతంత్య్ర పోరాటములో ప్రవేశించారు. ఇలాగే ఎప్పుడైతే వీరు ‘కార్యకర్తలుగా’ హిందూ దేశ స్థాపన కార్యంలో పాల్గొంటారో, అప్పుడు తప్పకుండా దానికి ఫలం లభిస్తుంది. సంకట కాలంలో ఈ న్యాయవాదులు దేశములో వేరు వేరు చోట్లలో హిందూ దేశ స్థాపనకై కార్యం చేస్తున్న హిందుత్వవాదులకు సహాయం చేయుటకు ముందుకు రావాలి మరియు వారికి అవసరమైన మార్గదర్శనం చేయాలి. అలాగే హిందూ దేశంను విరోధించేవారికి చట్టబద్ధంగా సమాధానమివ్వగలగాలి ఇటువంటి న్యాయవాదులు కనీసం ఐదు వేల మంది దేశవ్యాప్తంగా ఐక్యమవ్వడం అవసరం. వారి ద్వారా వైచారిక విప్లవం వేగంగా కొనసాగుటకు సహాయమగును !’
(సందర్భము : సనాతన గ్రంథము ‘హిందు దేశ స్థాపన యొక్క దిశ’)

Leave a Comment