హిందు దేశ స్థాపన, ఇది మొదటి దశ, ‘విశ్వవ్యాప్తంగా హిందు ధర్మమును స్థాపించడం’, ఇది చివరి దశ !

‘విదేశాలలోని హిందువుల దుఃస్థితిని అడ్డుకునేందుకు కుడా భారత దేశంలో హిందూ దేశంను స్థాపించడం అవసరం. హిందూ దేశ స్థాపన కేవలం హిందువుల కొరకు కాదు, ప్రపంచంలోని అఖిల మానవాళి కొరకు అవసరం. భారత దేశంలో హిందూ దేశ స్థాపించడం వల్ల విశ్వమంతటా హిందూ ధర్మ ప్రచారము చేయుటకు సులభమగును. విశ్వములో హిందూ ధర్మం ప్రస్థాపించడం వల్ల పథ్విపై సాత్విక వాతావరణం నిర్మాణమై అఖిల మానవాళికి సుఖం లభించును! మన పూర్వికులు ఋషిమునులు ‘కణ్వంతో విశ్వం ఆర్యం’, అనగా ‘అఖిల విశ్వమును సుసంస్కృతం చేద్దాం’, అని బోధించారు. మనమందరం హిందుత్వనిష్ఠులు ఈ ఋషుమునుల వంశజులం. ఇలాంటి శ్రేష్ఠమైన వారసత్వమును కాపాడే బాధ్యత మనపై ఉంది. ఈ బాధ్యత యొక్క మొదటి దశ అనగా భారత దేశములో హిందూ దేశ స్థాపన కొరకు కతిశీలురవ్వడం. ఈ ధర్మకార్యమును చేయుటకు హిందూ సమాజమునకు ఆశీర్వాదము లభించనీ, అని భగవంతుని చరణాలకు ప్రార్థన !’ – (పరాత్పర గురువులు) డా. జయంత ఆఠవలె

Leave a Comment