ఆపత్కాలములో ప్రాణరక్షణకొరకు చేయబడే సంసిద్ధత భాగము – 1౦

ఆపత్కాలములో తరించుటకు సాధన నేర్పించే సనాతన సంస్థ !

భాగము8 చదువుటకు సంప్రదించండి. ‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత’ భాగము – 9

అఖిల మానవాళికి ఆపత్కాలములో ప్రాణాలతో
బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము
చేయు ఏకైక పరాత్పర గురువు డా. జయంత్‌ బాళాజి ఆఠవలె !

ఆపత్కాలము గురించి ఇప్పటివరకు ప్రచురించబడిన ఈ లేఖనాలలో మనము కుటుంబ, ఆర్థిక మరియు సామాజిక బాధ్యతల(కర్తవ్యము) గురించి తెలుసుకోబోవున్నాము. కుటుంబము స్థాయిలో ఇంటి గురించి, ఆర్థిక స్థాయిలో సంపత్తి గురించి, సామాజిక స్థాయిలో తమ బాధ్యతలు మరియు సమాజము కొరకు మనము ఏమి చేయవచ్చు, అనే వాటి గురించి వివరించడమైనది.

 

2. ఆపత్కాలాన్ని ఎదుర్కొనుటకు కుటుంబ స్థాయిలో చేయవలసిన సంసిద్ధత

2 అ. ఇంటి విషయముపై చేయు నిర్ణయాలు

2 అ 1. ఇంటి విషయములో చేయవలసిన కృతులు
2 అ 1 అ. సాధ్యమైనంతవరకు, కొత్త ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనకండి; దానికి బదులుగా, ప్రస్తుత ఇంట్లో లేదా అద్దె ఇంట్లో వుండటం కొనసాగించండి !

అ. భూకంపం వచ్చినప్పుడు, కొండచరియలు విరిగిపడినప్పుడు ఇళ్ళు దెబ్బతింటాయి. కాబట్టి కొత్త ఇంటి కోసం పెట్టుబడి పెట్టిన డబ్బు వృధా అవుతుంది. అందువల్ల, సాధ్యమైనంతవరకు, కొత్త ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనడం మానుకోండి. బదులుగా, ప్రస్తుత ఇంట్లో లేదా అద్దె ఇంట్లో లేదా ఫ్లాట్‌లో నివసించడం కొనసాగించండి.

ఆ. కొన్ని అనివార్యమైన కారణాల వల్ల కొత్త ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనవలసిన అవసరం వస్తే సురక్షితమైన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోండి.

ఇ. మీరు ఫ్లాట్‌ కొనాలనుకుంటే, దానిని మూడవ అంతస్తు పైన తీసుకోకండి; ఎందుకంటే భూకంపం లాంటి విపత్తులు సంభవించినప్పుడు, మూడవ అంతస్తు వరకు ఉన్నవారు త్వరగా బయటకు వెళ్ళడానికి చాలా సులభం.

ఈ. ప్రస్తుతం నివసిస్తున్న ఫ్లాట్‌ మూడవ అంతస్తు పై వుంటే, వారు వేరే చోట తగిన ఫ్లాట్‌ కొనుక్కోవడానికి ప్రయత్నించండి.

2 అ 2. ప్రస్తుత ఇంటికి మరమ్మత్తులు అవసరమైతే లేదా నిర్మాణాత్మక పనులు అసంపూర్ణంగా ఉంటే, ఇప్పుడే వాటిని పూర్తి చేయించుకోండి !

ప్రస్తుత ఇంటికి మరమ్మత్తులు లేదా అసంపూర్ణ నిర్మాణాత్మక పనులు చేయించకపోతే, వరదలు, తుఫాను మొదలైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇల్లు దెబ్బతినవచ్చు లేదా కూలిపోవచ్చు. ఆపత్కాలంలో, కూలిపోయిన ఇంటిని మరమ్మత్తు చేయడం కష్టతరమౌతుంది. అందువల్ల, ఇప్పుడే సమయాన్ని వెచ్చించి ఇంటికి మరమ్మత్తులు చేయించుకోవడం సముచితం.

2 అ 3. ప్రస్తుత ఇంటిని విస్తరించడం లేదా అందంగా మార్చడం మానుకొనండి !

ఆపత్కాలంలో ఇల్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఇంటి విస్తరణ లేదా అలంకరణ కోసం ఖర్చు చేసిన డబ్బు వృధా కావచ్చు. కాబట్టి, దీని గురించి ఆపత్కాలం తరువాత ఆలోచించవచ్చు.

2 అ 4. మీకు గ్రామంలో ఇల్లు ఉంటే, దానిని నివాసయోగ్యమైన స్థితిలో ఉంచుకోండి !

రాబోయే కాలంలో, మూడవ ప్రపంచ యుద్ధం, ఉగ్రవాదం మొదలైన సమయాల్లో గ్రామాల కంటే నగరాలు ఎక్కువ నష్టపోతాయి. అప్పుడు, గ్రామంలో వున్న గృహానికి మారవలసి రావచ్చు. అందువల్ల, గ్రామంలో ఇంటిని కలిగి ఉన్నవారు దానిని నివాసయోగ్యమైన స్థితిలో ఉంచుకోవాలి.

2 అ 5. గ్రామంలో సొంత భూమి లేదా ఇల్లు లేని పట్టణ ప్రజలు, అనుకూలమైన గ్రామంలో భవిష్యత్తులో నివసించే ప్రణాళికతో, వారు ఇంటిని ఇప్పుడే కొనుగోలు చేయడానికి ఆలోచించవచ్చు !
2 అ 6. చదువు, ఉద్యోగం మొదలైన వాటి కోసం విదేశాలకు వెళ్ళిన కుటుంబ సభ్యులను వీలైతే భారతదేశానికి తిరిగి రమ్మని పిలవండి  !

భారతదేశం ఒక పుణ్యభూమి. రాబోయే ఆపత్కాలంలో భారతదేశం కంటే ఇతర దేశాలలో ఎక్కువ నష్టము జరుగుతుంది, ఎందుకంటే రజ-తమ విదేశాలలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత విదేశాల నుండి సురక్షితంగా భారతదేశానికి తిరిగి రావడం కూడా కష్టమౌతుంది.

2 అ 7. మరణం తరువాత పూర్వీకుల ఆస్తికి సంబంధించి, బంధువుల మధ్య వివాదం రాకుండా పెద్దలు మరియు వృద్దులు తమ ఇష్టానుసారం ‘వీల్‌నామా’ ను సిద్ధం చేయించాలి !

 

3. ఆర్థికస్థాయిలో చేయవలసిన సంసిద్ధత

3 అ. ఇప్పటివరకు వున్న పొదుపులు మరియు ప్రస్తుత
ఆదాయాన్ని, పొదుపుగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోండి

1. ఆపత్కాలంలో అత్యవసర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం

2. సామాజిక నిబద్ధతగా ఆపత్కాలంలో బాధిత సోదరులకు ఆర్థిక సహాయం అందించడం

3. ఆపత్కాలంలో జాతీయ విధిగా దేశం కోసం డబ్బును విరాళంగా ఇవ్వడం

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ విజ్ఞప్తిపై, చాలామంది ప్రజలు తమ డబ్బు, ఆభరణాలు మొదలైనవి ’ఆజాద్‌ హిందు సేన’ కోసం నేతాజీ సంచిలో విరాళంగా అర్పించారు. సంక్షోభ సమయాల్లో, దేశంపై ఆర్థిక ఒత్తిడి చాలా పెరుగుతుంది, ఉదా. పెద్ద మొత్తంలో యుద్ధ సామగ్రిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో దేశానికి డబ్బు ఇవ్వడము, మన జాతీయ విధి (కర్తవ్యం).

3 అ 1. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు, ఈ క్రింది సూత్రాలను అధ్యయనం చేయండి !

ప్రస్తుతం, అనేక బ్యాంకుల ఆర్థిక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మీ సొంత డబ్బును సురక్షితంగా ఉంచడానికి, ఈ క్రింది ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించండి. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకే చోట పెట్టుబడి పెట్టడం ద్వారా అన్నింటినీ కోల్పోయే బదులు భద్రత కోసం వేర్వేరు పెట్టుబడులు పెట్టండి). ’ ఆర్థిక శాస్త్ర సూత్రాల ప్రకారం పెట్టుబడులు చేయాలి.

 

3 అ 2. బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు
3 అ 2 అ. మీ డబ్బును వివిధ జాతీయ బ్యాంకుల్లో జమ చేయండి !

1. జాతీయ బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాచే నియంత్రించబడతాయి. అందువల్ల, బ్యాంకు దివాలా తీసినప్పటికీ, మీ డబ్బును కోల్పోయే అవకాశం ఉండదు; అయితే, మీ లావాదేవీలపై కొన్ని పరిమితులు ఉంటాయి, ఉదా. కొంత మొత్తాన్ని మాత్రమే పెట్టుబడి నుండి ఉపసంహరించుకోవచ్చు. మరోవైపు, ప్రైవేట్‌ లేదా సహకార బ్యాంకులు దివాళా తీస్తే, రిజర్వ్‌ బ్యాంకు బాధ్యత లేనందున వారు డబ్బును తిరిగి పొందే అవకాశం తక్కువ.

2. ఒకవేళ ఏదైనా బ్యాంకు దివాలాలో ఉంటే, ఆ బ్యాంకులో మీ పొదుపు మొత్తాన్ని కోల్పోకుండా ఉండటానికి, మీ ప్రాంతంలోని వివిధ జాతీయ బ్యాంకుల్లో డబ్బు పొదుపు చేసుకోండి. జాతీయ బ్యాంకుల్లో రూ. 5 లక్షల డిపాజిట్‌ వరకు బీమా రక్షణ ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేయవచ్చు.

3 ఆ . ఇతర సూత్రాలు

1. అన్ని రకాల బ్యాంకు ఖాతాలలో నామినీ(నామనిర్దిష్ట వ్యక్తి) ఉండాలి.

2. బ్యాంకులో డబ్బు జమ చేయడం మరియు తీసుకోవడం వంటి లావాదేవీల గురించి మీ కుటుంబ సభ్యులకు నేర్పండి.

3 ఆ 1. బంగారం, వెండి మొదలైన విలువైన వాటిపై పెట్టుబడులు పెట్టండి !

ఆపత్కాలంలో, బ్యాంకు నుండి డబ్బు తీసుకోవటానికి ఎప్పుడైనా పరిమితులు ఉండవచ్చు; కానీ బంగారం, వెండి ఆభరణాలు మరియు విలువైన వస్తువులు మనదగ్గరే వున్నందున మనకు సమయానికి డబ్బు అవసరమైతే వాటిని ఉపయోగించుకోవచ్చు.

ఎవరైనా బంగారం లేదా వెండిని పెట్టుబడిగా కొనాలనుకుంటే, వాళ్ళు ఉంగరాలు లేదా గొలుసులు వంటి ఆభరణాలను కొనకుండా స్వచ్ఛమైన బంగారు, వెండి తీగలు లేదా నాణేలను కొనుగోలు చేయాలి. ఇది ఆభరణం యొక్క తయారీ ఖర్చును తగ్గిస్తుంది.

3 ఆ 2. ఇంటి కోసం బావి త్రవ్వడం, సౌర శక్తి ప్యానెల్లు పెట్టడం మొదలైన వాటిపై చేసే ఖర్చు, ఒక విధమైన పెట్టుబడి !
3 ఆ 3. భూమిపై పెట్టుబడి పెట్టాలి

పెట్టుబడి పెట్టగలిగిన వారు సాగు భూమిని కొనాలి. ఒక వ్యక్తికి భూమి కొనడం సాధ్యం కాకపోతే, ఉమ్మడిగా కొనండి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మీరు ఖచ్చితంగా భూమి నుండి రాబడిని పొందుతారు.

3 ఆ 4. షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి !

షేర్లు ప్రైవేట్‌ సంస్థలకు చెందినవి. వాటిని విక్రయించినప్పుడు, వారు ఆ సమయంలో మార్కెట్‌ విలువ ప్రకారం డబ్బును పొందుతారు. ఈ సందర్భంలో, మీరు ‘షేర్లు’ కొనుగోలు చేసినప్పుడు మొత్తం కంటే ఎక్కువ లేదా తక్కువ పొందవచ్చు. మీరు ‘అసలు’ మొత్తం కంటే తక్కువ పొందారని అనుకుందాం, అప్పుడు మీరు ఆ నష్టాన్ని భరించాలి. ’షేర్లలో’ పెట్టుబడులపై బీమా సౌకర్యం ఉండదు మరియు దానిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు. సంక్షిప్తంగా, మీరు మీ డబ్బును తిరిగి పొందుతారని ఎటువంటి హామీ లేదు. కాబట్టి, షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.

3 ఇ . ఇతర సూచనలు

ఆపత్కాలంలో ద్రవ్యోల్బణం మరియు కుటుంబ సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, కొన్ని సంవత్సరాల అవసరాలను తీర్చడానికి తగినంత ధనమును ఇంట్లో భద్రంగా ఉంచుకోండి.

 

4. సామాజిక బాధ్యతను పరిగణనలోకి తీసుకొని చేయవలసిన సంసిద్ధత

4 అ. చాల్‌, గృహనిర్మాణ సంస్థ(హౌసింగ్‌ సొసైటీ) మరియు గ్రామంలోని వాడలో నివసించే
ప్రజలు సామూహిక అత్యవసర సంసిద్ధత చేయడం అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒకరికొకరు సహాయం చేద్దాం అనే సామేత, సమాజ జీవనంలో సహకారం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా సహాయపడుతుంది, ’. బావి తవ్వడం, సౌర లేదా పవన విద్యుత్‌ వ్యవస్థలు, బయో గ్యాస్‌ ప్లాంట్‌ వంటివి నిర్మించడం వ్యక్తిగత స్థాయిలో చాలా ఖర్చుతో కూడుకున్నవి. అవి సమష్టిగా చేపట్టినట్లయితే, తక్కువ సమయం మరియు తక్కువ ఖర్చుతో అవుతుంది. ఆపత్కాలం సమయాలకు సంసిద్ధతలో భాగంగా, ఆహార ధాన్యాలు మరియు ఇతర కిరాణా సరుకులు పెద్దమొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలోని ప్రజల అవసరాలను పరిశీలించి, వాటిని వాణిజ్య వర్తకుల నుండి కొనుగోలు చేస్తే తక్కువ ఖర్చులో అయిపోతుంది. సామూహిక అత్యవసర సంసిద్ధత, మానవశక్తితో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఏర్పాటు సమాజంలోని బలహీన వర్గాలకు సహాయపడుతుంది.

4 ఆ. వస్తువులను కొనుగోలు (ఖరీదు) చేసేటప్పుడు,
నిరుపేదవారిని పరిగణనలోనికి తీసుకొని అదనపు కొనుగోళ్లు (ఖరీదు) చేయండి

‘వసుదైవకుటుంబకం’ (అర్థం : పథ్వి మొత్తం నా కుటుంబం) ’ ఇది భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత. దీని ప్రకారం, మీరు ఆపత్కాలంలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే, మీతో సమాజంలోని పేదవారిని పరిగణనలోనికి తీసుకొని అదనంగా ఆహార ధాన్యాలు, బట్టలు మొదలైనవి కొనండి. ఈ వస్తువులను ఆపత్కాలంలో అవసరమైనవారికి మరియు పేద ప్రజలకు ఇవ్వవచ్చు. ఇండో-పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో, కొంతమంది భారతీయ పౌరులు స్వచ్ఛందంగా వివిధ రైల్వే స్టేషన్లలో భారతీయ సైనికులకు టీ మరియు నీటిని సరఫరా చేశారు. 2020 సంవత్సరంలో, ’కరోనా’ వైరస్‌ కారణంగా గృహ నిర్బంధం ప్రకటించిన సమయంలో, దేశంలో అకస్మాత్తుగా ‘రవాణా నిషేధం’ విధించారు. ఫలితంగా, చాలా మంది కార్మికులు, ట్రక్‌ నడిపేవాళ్ళు మొదలైనవారు వివిధ ప్రాంతాలలో చిక్కుకున్నారు. అప్పుడు అనేకమంది భారతీయులు స్వతహాగా వాళ్ళకు ఆహారం సరఫరా చేశారు. ‘హిందూ జనజాగృతి సమితి’ వంటి సంస్థలు అవసరమైన వారికి పండ్లు, పానీయాలు మొదలైనవి పంపిణీ చేశారు. అనేక మంది పరోపకారులు, సామాజిక సమూహాలు మరియు సంస్థలు కూడా సహాయక చర్యల కోసం ప్రభుత్వానికి నిధులు విరాళంగా ఇచ్చారు.

4 ఇ. మీరు నిరుపేదవారికి సహాయం చేయలేకపోతే,
ఆపత్కాలంలో మీ అవసరాలకు సరిపోయేంత మాత్రమే కొనండి

ఆపత్కాలం ప్రారంభమయ్యే ముందు, ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అవసరమైన ఆహార ధాన్యాలు, సదుపాయాలు, బట్టలు, ఔషదాలు మొదలైనవి కొనవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే, వస్తువుల కొరత ఉండవచ్చు. ‘నేను నా కోసం కొనుగోలు చేసినట్లే, సమాజంలో ఇతరులకు కూడా ప్రతిదీ అందుబాటులో ఉండాలి’ అనే ఆలోచన ఉండాలి. అందువల్ల, మీ అవసరాలకు సరిపోయేంత మాత్రమే కొనండి.

4 ఈ. అవసరమున్నవారికి సహాయం చేయడానికి మీ జ్ఞానాన్ని ఉపయోగించండి

వైద్యులు, రైతులు, ధాన్యం వ్యాపారులు మొదలైనవారికి తమ తమ వృత్తులలో వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తులు వారి జ్ఞానాన్ని అవసరమైనవారికి సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు, ఉదా. వైద్యులు ఔషధీ వనస్పతి మొక్కలను పెంచడము గురించి, రైతులు పండ్లు మరియు కూరగాయల గురించి, ధాన్యం వ్యాపారులు ఆహార ధాన్యాలు ఉత్తమ పద్దతులలో నిల్వ చేసుకోవడం గురించి అవసరమైన వారికి తెలియజేయవచ్చు.

 

5. ఆపత్కాలంలో చేయవలసిన ఇతర సంసిద్ధత మరియు జాగ్రత్తలు

5 అ. ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించడం ఇప్పటినుండే మొదలు పెట్టండి

ఆపత్కాలం కొరకు చేయు సంసిద్ధతలో భాగంగా మనం చాలా వస్తువులు ఇంట్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక సమయంలో, ఇబ్బందుల్లో వున్న బంధువులకు లేదా చుట్టుప్రక్కల నివసించు ప్రజలకు మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల, మీ ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించడం ప్రారంభించండి. ఇది ఇంట్లో స్థలాన్ని ఏర్పరుస్తుంది మరియు ఆ వస్తువుల పట్ల వున్న అనుబంధాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

5 ఆ. మొబైల్‌ల గురించి సంసిద్ధత

1. రెండు వేర్వేరు సంస్థల సిమ్‌ కార్డులు ఉపయోగించగలిగిన మొబైల్‌ ఫోన్లు

దీని ప్రయోజనం ఏమిటంటే, ఒకదానికి సంకేతం ఎప్పటికీ అందకపోతే, మరొకదాని సంకేతం వుండే అవకాశం ఉంటుంది.

2. వీలైతే రెండు సెట్ల మొబైల్‌ ఫోన్‌లను పెట్టుకోండి

ఒక మొబైల్‌ యొక్క బ్యాటరీ అయిపోయినట్లయితే, మరొక సెట్‌ను ఉపయోగించవచ్చు.

3. వీలైతే మీ మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం పవర్‌ బ్యాంక్‌ తీసుకోండి.

5 ఇ. బంధువులు, కుటుంబ వైద్యుడు మొదలైన ముఖ్యమైన వ్యక్తులు
మరియు పోలీస్‌ స్టేషన్‌, అగ్నిమాపక దళం మొదలైన వారి యొక్క మొబైల్‌
నంబర్లు మరియు చిరునామాలను మొబైల్‌ ఫోన్‌ మరియు చిన్న డైరీలో వ్రాసిపెట్టుకోండి

ఆపత్కాలంలో, మొబైల్‌ ఫోన్‌ ఛార్జ్‌ చేయకపోతే ఉపయోగపడదు; అందువల్ల, పైన పేర్కొన్న మొబైల్‌ నంబర్లను, మొబైల్‌ ఫోన్‌ లో మాదిరిగా చిన్న పుస్తకంలో అవసరమైన టెలిఫోన్‌ నంబర్లు మరియు చిరునామాలను రాసుకోవడం అనువైనది. ఈ చిన్న పుస్తకాన్ని ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. ఉదాహరణకు, ఇది వేరొకరి మొబైల్‌ లేదా టెలిఫోన్‌ను ఉపయోగించడం ద్వారా ఇతరులను సంప్రదించడానికి సహాయపడుతుంది. కొన్ని చాలా ముఖ్యమైన పేర్లు మరియు మొబైల్‌ నంబర్లను గుర్తుంచుకోండి.

5 ఈ. ముఖ్యమైన పత్రాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

రేషన్‌ కార్డ్‌ ఆధార్‌ కార్డ్‌ బ్యాంకు పాస్‌ బుక్‌ వంటి ముఖ్యమైన పత్రాలు ఆపత్కాలంలో ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కోల్పోవచ్చు. అందువల్ల, ముందు జాగ్రత్త చర్యగా, అటువంటి పత్రాల ఫోటోకాపీలను వేరే చోట ఉంచండి (ఉదాహరణకు, బంధువుల ఇల్లు) మరియు ఈ పత్రాల ఛాయాచిత్రాలను మీ మొబైల్‌లో ఉంచండి. ఈ పత్రాల ఛాయాచిత్రాలను మీ ఇ-మెయిల్‌ డ్రైవ్‌లో, పెన్‌డ్రైవ్‌ లో సేవ్‌ చేసుకోండి.

5 ఉ. వ్యక్తిగత లేదా ఆఫీసు కంప్యూటర్లలో వున్న ముఖ్యమైన
సమాచారం (డేటా) ఇతర ప్రదేశాల కంప్యూటర్లలో (బ్యాకప్‌ డేటా) భద్రపరచడం

ఆపత్కాలంలో మీ ఇల్లు లేదా కార్యాలయం దెబ్బతిన్నట్లయితే, కంప్యూటర్‌లోని ముఖ్యమైన సమాచారం ఇతర కంప్యూటర్‌లో ఉంచబడినందున, అది తిరిగి పొందవచ్చు. కార్యాలయం యొక్క కంప్యూటర్లలో సమాచారాన్ని వేరే చోట ఉంచే ముందు, బాధ్యతాయుతమైన అధికారులకు ప్రమాదం సంభవించే అవకాశాల గురించి తెలియజేయాలి మరియు వారి అనుమతి తీసుకోవాలి లేదా సమాచారాన్ని వేరే చోట ఉంచమని వారికి సూచించాలి.

5 ఊ. ఆపత్కాలములో అనువైన నైపుణ్యాలు
నేడే తెలుసుకొని(నేర్చుకొని) వాటిని అలవర్చుకొండి

వంట ఎలా చేయాలో తెలియని వారు సాధారణ భోజనం వండటం నేర్చుకోవాలి (ఉదాహరణకు, అన్నం-పప్పు, కిచిడి మొదలైనవి). జుట్టు కత్తిరించడం, ఈత కొట్టడం, కుట్టు యంత్రాలపై బట్టలు కుట్టడం వంటి నైపుణ్యాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

5 ఎ. ఇంటి రక్షణ కోసం కుక్కను పెంచుకోండి

దొంగలు, అల్లర్లు మొదలైనవాటి నుండి ఇంటిని రక్షించడానికి కుక్కను పెంచుకోండి. ‘కుక్కల సంరక్షణ’ మరియు ఔషదాల గురించి తెలుసుకోండి.

సేకరణ : సనాతన గ్రంథమాల – ‘ఆపత్కాలంలో ప్రాణ రక్షణకొరకు చేయబడే సంసిద్ధత’!

(ప్రస్తుత లేఖనము యొక్క సర్వహక్కులు సనాతన భారతీయ సంస్కృతి సంస్థ వద్ద సురక్షితముగా వున్నాయి) 

Leave a Comment