బలిప్రతిపద

అత్యంతమైన దానశూరుడు, కాని దానము ఎవరికి చేయాలనే తెలివి లేకపోవడమువలన బలీరాజును భగవాన్ శ్రీవిష్ణువు వామనావతారమును ధరించి పాతాళలోకమునకు పంపిన దినము. త్రిపాదముల భూమి దానమడిగి వామనుడు బలీరాజు ను పాతాళలోకమునకు పంపించినప్పటికి, సర్వార్థముతో అతని కల్యాణమే చేసినాడు. పథ్విపై దీపావళి ఆచరించు వెనుకలో ఈ ఘటన ముఖ్య ఆధారము.

 

1. తిథి

కార్తిక శుద్ధ ప్రతిపదా (దీపావళి పాడ్యమి). శ్రీవిష్ణువు ఈ తిథిని బలిరాజు పేరుతో చేశాడు, కాబట్టి ఈ తిథిని ‘బలిప్రతిపదా’ అని అంటారు.

వామనుడు

 

2. ఇతిహాసము

బలీరాజు అత్యంతమైన దానశూరుడు. కావున తన ద్వారమునకు చేరిన ప్రతి అతిథీ అడిగింది దానమిచ్చేవాడు. ‘దానము ఇవ్వటము’ ఇది సద్గుణమైనను అది అతీగా ఉంటే దోషమగును. ఎవ్వరికి ఏమి, ఎప్పుడు మరియు ఎక్కడ దానం ఇవ్వాలి ఇది తప్పకుండ ఆలోచించవలెను. ఇది శాస్త్రాలలో మరియు గీతలో కూడా చెప్పబడినది. సత్పాత్రే దానము చేయాలి. అపాత్రకు ఇవ్వ కూడదు. అపాత్రులైన మనుష్యుల చేతికి సంపత్తి దొరికితే మదోన్మత్తులై ఇష్టమున్నట్లుగా ప్రవర్తించగలరు. బలీరాజు ఎవ్వరికైనను ఎప్పడంటే అప్పుడు ఏది అడిగినను ఇచ్చేవాడు. అప్పుడు శ్రీవిష్ణువు బటువు రూపములో అవతారం (వామనావతారము) ధరించాడు. (బటువు చిన్న అబ్బాయి ‘భవతి భిక్షాం దేహీ అంటే ‘బిక్షము పెట్టండి’ అని అంటుంటాడు.) వామనుడు బలిరాజ వద్దకు వెళ్ళి బిక్షమడిగినప్పుడు ఆయన “నీకు ఏమి కావాలి ? అని అడుగగా ‘వామనుడు త్రిపాద నేల (మూడడుగుల భూమిని) దానము కావాలని అన్నాడు. ‘వామనుడు ఎవ్వరు?, ఈ దానమువల్ల ఏమగును’ అనే జ్ఞానము లేనందువలన తను మూడడుగుల భూమిని వామనుడికి దానము ఇచ్చాడు. అప్పుడు వామనుడు విరాట రూపమును ధరించి ఒక అడుగుతో పథ్వినంతయు వ్యాపించుకున్నాడు. మరో అడుగుతో అంతరిక్షాన్ని(ఆకాశాన్ని) వ్యాపించుకున్నాడు, తరువాత ”మూడవ అడుగును ఎక్కడ పెట్టాలి ?”, అని బలిరాజును అడగగా “మూడవ అడుగు నా మస్తకముపై (తలపై) పెట్టండి.” అని అన్నాడు. అప్పుడు ‘మూడవ అడుగును అతని మస్తకముపై పెట్టి బలిరాజును పాతాళములోకి పంపించాలనే తలంపుతో వామనుడు, “నీకేదైన వరము అడగాలన్నచో అడుగవచ్చును (వరం బ్రూహి)”, అని అతనికి తెలియజేసెను. అప్పుడు తను వరము అడిగాడు, ‘ఇప్పుడు పథీపై నా రాజ్యమంతయు సమాప్తమైనది, మీరు నన్ను పాతాళములోకి పంపించుచున్నారు, ఈ మూడు అడుగులు వేయటముతో ఇదంత గడిచినది, ఇది పథ్విపై ప్రతి సంవత్సరము మూడు రోజులైన నా రాజ్యమని గోచరించని. ప్రభూ, యమప్రీత్యర్థ దీపదానము చేయువారికి యమయాతన కలుగకుండ, వారికి అపమత్యువు రాకుండ మరియు వారి ఇంటిలో లక్షీ నిరంతరంగా నివసిస్తు ఉండాలి.’ ఈ మూడు రోజులు అనగా ఆశ్వయుజ కష్ణ చతుర్దశీ, ఆశ్వయుజ అమావాస్య మరియు కార్తిక శుద్ధ ప్రతిపదను ‘బలీరాజ్యము’ అని అంటారు.

 

3. ప్రాముఖ్యత

దీపావళి పాడ్యమి మూడున్నర ముహూర్తములలో అర్ధ ముహూర్తము. ఇది ‘విక్రమ సంవత్సర’ కాలగణనలో సంవత్సారారంభ దినముగా ఆచరించబడుతుంది.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

అక్షయ తృతీయ, ఉగాది, విజయదశమి (దసరా) ఇవి సంపూర్ణ ముహూర్తాలు, దీపావళి పాడ్యమి ఇది అందులో అర్ధ ముహూర్తము. మూడున్నర మూహూర్తలకు భగవంతుని పరాశక్తి బ్రహ్మాండములో ప్రక్షేపిస్తుంది. ఈ శక్తి ప్రభావమువలన బ్రహ్మాండములోని సత్వగుణమునకు చాలన లభించి అంతట మంగళకరమైన తరంగాలు ప్రక్షేపించి సద్గుణములకు చాలన లభిస్తుంది. ఇందుకే మూడున్నర ముహూర్తాలప్పుడు అనేక శుభకర్మలను చేపట్టుతారు.

 

4. పండుగను జరుపుకునే విధానము

అ. బలిని పూజించడం

బలి ప్రతిపద అనగా పాడ్యమి రోజున నేలపై పంచరంగులతో ముగ్గులతో బలి మరియు తన భార్య అయిన వింధ్యావలి వీరి చిత్రాలను గీసి వాటిని పూజిస్తారు. తరువాత బలి ప్రీత్యర్థంగా దీపం మరియు వస్త్రములను దానము చేస్తారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : గొప్ప విష్ణు భక్తుడు అని బలి మరియు వాడి ధర్మపత్నినీ పూజించే విధానము ధర్మ శాస్త్రములో చెప్పబడింది. కావున పూజించేవారికి బలి మాదిరిగా విష్ణుభక్తి నిర్మాణమయ్యేందుకు సహాయమౌతుంది. బలికి సమర్పిత భావముతో దీపదానం చేస్తే వాడికి అగ్ని అంశం అర్పణ అయ్యి దైత్య రాజు సంతోష పడతాడు మరియు దీపదానం చేసే వ్యక్తికి కూడా దైత్యుల ద్వారా సృష్టించే కష్టాల నుండి అభయం కలుగుతుంది. పథ్వి యొక్క సృజనాత్మకతకు ప్రతీకమైనా వస్త్రమును బలిచక్రవర్తికి దానం చేయడం వలన దానం ఇచ్చే వ్యక్తికి బలి యొక్క కృపాశిస్సులు లభించి వాడి ఇల్లంతా సుఖసమాధానాలతో నిండుతుంది.

ఆ. భార్య తన భర్తకు హారతినివ్వడం

ఈ రోజున పొద్దున్నే అభ్యంగవ స్నానం చేసి స్త్రీలు తమ భర్తలకు హారతినిస్తారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : పురుష అనగా శివుడి యొక్క ప్రతీకము మరియు స్త్రీ అనేది దుర్గాదేవి యొక్క ప్రతీకము. ఈ రోజు ప్రొద్దున్నే అభ్యంగన స్నానం చేసిన తర్వాత స్త్రీ తన భర్తకు హారతినిస్తుంది. దీని మూలంగా భార్యలో దుర్గా తత్వం జాగృతమయ్యి పురుషులలో వారి కుండలినీశక్తి జాగృతమయ్యి సుప్తావస్థలో ఉన్నటువంటి శివ తత్వం ప్రకటమౌతుంది. ఇలా హారతినివ్వడం వలన భార్యాభర్తలు ఇరువురు కూడా ఆధ్యాత్మిక స్థాయిలో మంచి లాభాన్ని పొందుతారు.

ఇ. భోజనము

ఈ రోజున పంచ పక్వాన్నములు, పిండి వంటలను చేసి బ్రాహ్మణులకు మధ్యాహ్నం భోజనాలు పెడతారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన ధర్మదేవత ప్రసన్నమౌతుంది. ప్రత్యేకమైన పిండి వంటలు వండినందు వలన వాతావరణంలో కార్యనిరతమైన విష్ణుతత్వం యొక్క సాత్వికత మరియు చైతన్యము గల స్పందనములు వంటకాలులో ఆకర్షింపబడుతాయి.

ఈ. జలసా చేసుకోవడం

శాస్త్రము ద్వారా చెప్పినటువంటి నిషిద్ధమైన కర్మలను వదిలి బలి రాజ్యంలో మనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలి అని మన ధర్మ శాస్త్రము చెబుతుంది. అభక్షభక్షణ, అపేయపానం మరియు అగమ్య గమనము ఇవి నిషిద్ధమైన కర్మములు. శాస్త్రము ద్వారా అనుమతించడం వలన అందరూ కూడా పరంపర అనుసారంగా జలసా చేసుకుంటారు .

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : ఈ రోజు అసాత్వికమైన పదార్థములు లేక పానీయాలు సేవించకూడదు మరియు స్త్రీని ఉపభోగించకూడదు. దీన్ని పాటించడం వలన జీవుడి ఆచారము పరమ శుద్ధి అయి వాడి మనసుపై సాత్వికమైన సంస్కారము దృఢంగా అవుతుంది. దీనితోపాటు ఇంద్రియాలపై నియంత్రణ సాధించుట వలన ఇంద్రియ నిగ్రహశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఆచరణ వల్ల జీవుడిలో సుప్తంగా ఉన్న సాత్విక వృత్తి జాగృతమౌతుంది. సత్వ గుణాలను అనుసరించి ఇష్టానుసారంగా జలసాను చేసుకుంటూ సాత్వికమైన సుఖమును ప్రాప్తించుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు అని ధర్మ శాస్త్రము చెబుతుంది.

ఉ. గోవర్ధనపూజ

ఈ రోజు అందరూ కొత్త బట్టలను ధరించి రోజంతా ఆనందంగా గడుపుతారు. గోవర్ధన పూజ చేసుకుంటారు. వీటికోసం ఆవుపేడతో పర్వతాలను తయారు చేసి వాటిపై దూర్వ (గడ్డిపోసలు) మరియు పుష్పాలను గుచ్చుతారు. శ్రీకృష్ణుడు, ఇంద్రుడు, గోమాత మరియు ఆవుదూడలు గల ప్రతిమను తయారు చేసి వాటిని పూజిస్తారు మరియు ఊరేగింపు చేస్తారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : గోవర్ధన పర్వతములో శ్రీకృష్ణుడి అంశం ఉన్నది. దానిలో 4 శాతము శ్రీకృష్ణ తత్వము వుండి శ్రీకృష్ణుడి యొక్క 10 శాతము తారక మరియు 10 శాతము మారక శక్తి కార్యనిరతమై ఉంటుంది. గోవర్ధన పూజ వలన ఒక రకమైన గోపాలకులను కాపాడే గోవర్ధన రూపమైన భగవాన్ శ్రీకృష్ణుడిని పూజించడం జరుగుతుంది; దీని మూలంగా, పూజించే వ్యక్తికి భగవాన్ శ్రీకృష్ణుని కృప ఆశీస్సులు లభించి సద్గుణాల సంవర్ధనమౌతుంది.

దీపావళికి గల భావార్థము : శ్రీకృష్ణుడు అసుర ప్రవత్తి గల నరకాసురున్ని వధించి ప్రజలను భోగప్రవృత్తి, లోభము, అనాచారము మరియు దుష్టప్రవత్తి నుండి విముక్తపరిచాడు. ప్రభు చింతనను (భగవత్‌చింతనను) కలుగజేసి సంతోషింపజేశాడు, ఆ ‘దీపావళిని’ మనము సంవత్సరాల కొలది కేవలము ఒక రూఢిగా భావించి జరుపుకుంటున్నాము. నేడు దానికున్న గుహ్యార్థము (గూఢార్థము) లోపించినది. ఈ గుహ్యార్థమును గుర్తించి దానిలోని అస్మీతను జాగతపరిచి అజ్ఞానరూప అంధఃకారన్ని, అలాగే భోగప్రవృత్తి మరియు అనాచారి (దుర్నితుడు, లైంగిక విషయాల్లో అనైతికంగా ఉండే వ్యక్తి), సజ్జనుల శక్తిపై ఆసురిప్రవృత్తి గల ప్రజల ప్రాబల్యము మరియు ఆధిపత్యము తగ్గుతుంది.

సందర్భం : సనాతన ప్రచురణ ‘పండుగలు, ఉత్సవాలు మరియు వ్రాతల నేపథ్య శాస్త్రం’

Leave a Comment