ధనత్రయోదశి

దీపావళి రోజులలోనే వచ్చే ఈ పండుగ సందర్భంగా కొత్త బంగారు ఆభరణాలను కొనుక్కునే అలవాటు ఉన్నది. వ్యాపారస్తులు ఈ రోజు వారి పెట్టెలను పూజిస్తారు. ధనత్రయోదశి అనగా దేవతలకు వైధ్యుడు ‘ధన్వంతరి దేవుడి’ జయంతి. ఈ రోజుకు గల మహాత్మ్యము, ఈ రోజున చేసే క్రుతలకు గల శాస్త్రమును తెలుసుకుందాం.

 

1. తిథి

హిందూ పంచాంగమునకనుసారంగా అశ్వయుజ బహూళ త్రయోదశిని ‘ధనత్రయోదశీ’ గా జరుపుకొంటారు.


shrilakshmi
 

shrilakshmi

 

2. భావార్థము

‘ఏ దానితో మన జీవితము చక్కగా పోషించబడుతుందో, ఆ ధనమును ఫూజిస్తారు. ‘ధనము’ అంటే శుద్ధ లక్ష్మీ. శ్రీసూక్తములో భూమి, నీరు, వాయు, అగ్ని మరియు సూర్యుడు వీరిని కూడ ధనం అని చెప్పబడినది. ఏ ధనమునకు నిజమైన అర్థము ఉంటుందో, అదే నిజమైన లక్షీ! లేకపోతే అలక్ష్మీ వలన అనర్థము (విపత్తు, సంకటాలు) గడుచును.

 

3. వైశిష్ట్యములు

అ. వ్యావహారికముగా

ఈ రోజు వ్యాపారస్థులకు విశేషమైనదని భావించబడినది; ఎందుకంటే ధనప్రాప్తి కొరకు శ్రీ లక్షీ దేవిని పూజిస్తారు.

ఆ. ఆధ్యాత్మికంగా

ఈ రోజున బ్రహ్మాండములో శ్రీ లక్ష్మీ దేవి తత్వము పథ్విపై ఎక్కువ శాతములో ప్రక్షేపితమౌతూ ఉంటుంది. అందువలన జీవునికి శ్రీ లక్ష్మీదేవి మరియు నారాయణుడి కృప పొందుటకు సాధ్యమౌతుంది. జీవునిలోని ఎంత సమయం ఈ భావం ఉంటుందో అంత సమయం ఈ కృపను పొందగలడు. ప్రస్తుత కాలములో సాధకులకు శక్తి ఆవశ్యమైనది. అలాగే వ్యావహారిక సుఖముకంటే జీవించి ఉండడం మరియు ఆయుష్యాన్ని పొందడం ముఖ్యం. ఇందుకని సాధన చేయువారికి ఈ దినము ‘గొప్ప పర్వము’ గా భావించబడుతుంది.

 

4. ప్రాముఖ్యత

అ. ధనత్రయోదశిని వాడుక భాషలో ‘ధనతేరస్’ అని అంటారు. ఈ దినమున వ్యాపారస్తులు వారి పెట్టెలను పూజిస్తారు. వ్యాపారుల సంవత్సరము దీపావళి నుండి దీపావళి వరకు ఉంటుంది. క్రొత్త సంవత్సరము లెక్కల పుస్తకాలలను ఈ దినము తీసుకు వచ్చి పూజ చేస్తారు తరువాత వాటిని వాడడానికి తీసుకుంటారు.

ఆ. ధనత్రయోదశికి కొత్త బంగారు ఆభరణాలను కొనుక్కొనే రూఢి వున్నది. అందువలన సంవత్సరమంత ఇంటిలో ధనలక్షీ నివసిస్తుంది. వాస్తావానికి లక్షీపూజా సమయములో సంవత్సరము మొత్తము జమాఖర్చు ఇవ్వవలసి ఉంటుంది. ధనత్రయోదశి వరకు మిగిలిన సంపత్తిని భగవత్కార్యమునకై అంటేనే సత్కార్యమునకై ధనము వినియోగించుటవలన ధనలక్షీ చివరి వరకు లక్షీరూపములో ఉంటుంది. ధనము అనగా డబ్బు. ఈ డబ్బును సంవత్సరమంత కష్టపడి ఒక్కొక్క పైసా సన్మార్గముతో సంపాదించి జమా చేసినవి ఉండాలి. ఈ డబ్బులో 1/6 భాగము భగవత్కార్యమునకై దానము చేయాలి, అని శాస్త్రము చెబుతుంది.

– పరమ పూజ్య పరశరామ్ మాధవ్ పాండే మహారాజ్, సనాతన ఆశ్రమము, దేవద్, పన్వేల్

ఇ. ఈ రోజు శ్రీ విష్ణు యొక్క అప్రకట శక్తి యొక్క ఆధారం పై శ్రీ లక్ష్మి దేవి కుడి నాది కర్యనిరతమై దాని నుండి ఉత్పన్నమయ్యే తేజ తత్వాత్మక తరంగాలు అతి వేగంగా బ్రహ్మాండం వైపునకు పయనిస్తుంది. లక్ష్మి తత్వము యొక్క కుడి నాడి కార్యనిరతమైన స్థితిలో ఈ రోజు సంపూర్ణ బ్రహ్మందములోని వాయుమండలం బంగారం లాగ మెరిసే బంగారు కణాలతో నిండుకుని ఉంటుంది. ఈ మెరిసే బంగారు కణాలలోని శ్రీ లక్ష్మీ దేవి చతన్యం జీవుడికి మాయలోని ఐశ్వర్యంను ప్రదానించి జీవి యొక్క సాధన కొరకు పూరకమైన వాతావరణం నిర్మాణం చేస్తుంది; అందుకే ఈ రోజు ధన రూపంలో శ్రీ లక్ష్మీని మనసార పూజిస్తారు. శ్రీ లక్ష్మిదేవిని భావపూర్ణంగా పూజ చేయడంతో ప్రుత్వి పై ధనమునకు అధిపతి అయిన కుబేరుడు ఆగమిస్తాడు.

ఈ. ముందు కాలములో రాజులు సంవత్సరం చివరిలో వారి సంపత్తిని ఉంచుకున్న పెట్టెను ఖాళి చేసేవారు. దీనితో ‘మేము ధన్యులయ్యము’ అనే సంతృప్తిని చెందేవారు. దీని వలన ప్రజలు మరియు రాజు మధ్య కుటుంబ భావాన నిర్మాణ మయ్యేది. ‘రాజు యొక్క సంపత్తు ప్రజలకు చెందినది, దానిని కాపాడుకొనే బాధ్యత రాజు దగ్గర ఉంది’ ఈ భావన ఉండడం వలన ప్రజలు కరమును ఇవ్వడానికి కొంచం కూడా ఆలోచించేవారు కాదు. అందువల్ల ఎల్లప్పుడూ సంపత్తు నిండుగానే ఉండేది. సత్కార్యం కొరకు ధనం వినియోగించబడేది కాబట్టి ఆత్మబలం కూడా పెరిగేది.

 

5. పూజ

అ. ధన్వంతరి జయంతి


dhanvantari
 

dhanvantari

ధన్వంతరి జన్మము

‘ధన్వంతరి దేవుని జన్మము దేవతలు మరియు రాక్షసులు చేసిన సముద్రమంథనములో నుండి జరిగినది. నాలుగు చేతులున్న భగవాన్ ధన్వంతరి ఒక చేతిలో ‘అమృత కలశము’, మరో చేతిలో ‘జలగ’, మూడవ చేతిలో ‘శంఖము’ మరియు నాలుగావ చేతిలో ‘చక్రము’ వీటితో జన్మించాడు. (సముద్రమంథనములో నుండి బయటకు వచ్చాడు.) ఈ నాలుగు చేతులలో వున్న వాటిని ఉపయోగించి అనేక వ్యాధులను, రోగములను నయము చేసే కార్యము భగవాన్ ధన్వంతరి చేస్తాడు.

– ఆధునిక వైధ్యుడు శ్రీ. రామ్ లాడ్, లోకజాగర్. నవంబరు ౨౦౧౦

పూజ

ఇది ‘ధన్వంతరి దేవుని జన్మదినము. ఆయుర్వేదమనుసారంగా ఈ దినమును ధన్వంతరి జయంతి అని అంటారు. వైధ్యులు ఈ రోజున ధన్వంతరిని (దేవుళ్ళ వైధ్యుడు) పూజిస్తారు. సన్నగా తరిగిన వేపాకు ముక్కలను మరియు చక్కెరను ‘ప్రసాదంగా’ అందరికి పంచుతారు. దీనికి గొప్ప అర్థమున్నది. అమృతము నుండి వేప వ్యుత్పన్న మైనది. ధన్వంతరి అమృత తత్వాన్ని ప్రసాదించే దేవత అని దీనినుండి అర్థం అవుతుంది. 5-6 వేపాకులను ప్రతి రోజు తినడముతో వ్యాధులు అయ్యే అవకాశము ఉండదు. వేపకు ఇంత ప్రాముఖ్యత కలదు. అందుకే వేపాకును ఈ రోజున ధన్వంతరి ప్రసాదమని ఇస్తారు.

ఆ. యమదీపదానము

ప్రాణాలను హరించేది యమధర్మరాజు యొక్క కార్యము. కాలమత్యువు ఎవరికి తప్పలేదు మరియు తప్పుకోలేము; కాని అకాల మత్యువు ఎవ్వరికి రాకూడదని, ధనత్రయోదశికి యమధర్మరాజును ఉద్ధేశించి పిండితో తయారు చేసిన దీపములను (13 దీపాలను) తయారు చేసి వాటిని ఇంటి బయట దక్షిణదిశకు ముఖము చేసి సాయంకాలమున పెట్టాలి. సాధారణంగా దీపాల ముఖము దక్షిణమునకు ఎప్పుడు పెట్టడము జరుగదు. కేవలము ఈ దినమున దీపాలన్నిటి ముఖమును దక్షిణమునకు చేసి పెట్టాలి. ఆ తరువాత ఈ మంత్రోచ్ఛారణతో ప్రార్థించాలి.

మృత్యునా పాశదండాభ్యాం కాలేన శ్యామయాసహ l
త్రయోదశ్యాందిపదానాత్ సూర్యజః ప్రీయతాం మమ ll

అర్థము : ధనత్రయోదశి రోజున యమునికి చేసిన దీపదానమునకు ప్రసన్నమై మత్యుపాశము మరియు మత్యుదండము నుండి నన్నువిముక్తపరచండి.

ఇ. ధనత్రయోదశి రోజున శ్రీలక్ష్మీతత్వము పథ్విపై ఎక్కువ ప్రమాణములో వస్తుంది. ఈ రోజున శ్రీలక్ష్మీ పూజ చేసేటప్పుడు ప్రస్తుతం ప్రజలు డబ్బులు (నాణెములు, రూపాయిలు), ఆభరణాలు పెట్టి పూజిస్తారు. ఇందుకే శ్రీ లక్ష్మీ యొక్క కృప వారిపై నిజమైన అర్థములో అవ్వదు. కేవలము స్థూల ధనమును పూజించే జీవులు మాయా వలలో చిక్కుకొనుటవలన ‘సాధన చేసి మోక్షప్రాప్తి పొందాలి అనే మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ధేశమును మరిచిపోతారు. ఈ రోజున శ్రీలక్ష్మీని ధ్యానించి శాస్త్రసమ్మతమైన పద్ధతితో పూజించుట ఆపేక్షితమైనది. – శ్రీ. నిలేశ్ చితళే వీరి మాధ్యమంగా లభించిన జ్ఞానం

సందర్భము : సనాతన ప్రచురణ ‘పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు’ (హింది)

Leave a Comment