లక్ష్మి పూజ

శ్రీ లక్ష్మీదేవి

తిథి

ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య దినమున జరుపుకుంటారు.

 

ఇతిహాసము

ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి బలి చక్రవర్తి యొక్క కారాగృహములో బంధించబడి వున్న దేవతలందరిని విముక్తి చేశాడు, ఆ తరువాత దేవతలందరు క్షీరసాగరములోకి వెళ్ళి పడుకొన్నారు, అను కథ వున్నది.

 

పండుగను జరుపుకొనే పద్ధతి

తెల్లవారుజామున మంగళ స్నానాన్ని ఆచరించిన తరువాత దేవుణ్ణి పూజిస్తారు. మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు శ్రాద్ధము మరియు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, సాయంత్రము తమ పూజ స్థలాన్ని లతలు, పుష్పాలు మరియు ఆకులతో అలంకరించి లక్ష్మీదేవి, శ్రీ విష్ణు మరియు కుబేరున్ని పూజిస్తారు. ఇలా లక్ష్మీపూజ రోజున ఈ విధిని ఆచరించబడుతుంది.

లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆసనాన్ని సిద్ధం చేయాలి. దానిపైన అష్టదళ పద్మం గాని లేదా స్వస్తిక చిహ్నాన్ని గాని అక్షింతలతో తయారు చేసి దానిపై లక్ష్మీదేవి విగ్రహమును స్థాపించాలి. కొన్ని ప్రాంతాల్లో కలశముపై పూజ పళ్ళెమును ఏర్పాటుచేసి తరువాత లక్ష్మీదేవి విగ్రహమును స్థాపన చేస్తారు.

లక్ష్మీదేవి ప్రక్కనే కుబేరుడి ప్రతిమను ఏర్పాటు చేయాలి. తరువాత లక్ష్మీ దేవితో పాటు దేవతలందరికీ చక్కెర వేసిన ఆవుపాలుతో తయార చేసిన పదార్థమును నైవేద్యంగా పెడతారు. ధనియాలు, బెల్లం, పొట్టుతో వున్న పేలాలు, చక్కెర బిల్లలు మొదలగు పదార్థములను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా బంధువులకు పంచుతారు. ఎండిన గోంగూర పుల్లలకు వొత్తులు చుట్టి వెలిగించి దక్షిణం వైపు చూపించి పితృదేవతలను ప్రార్థ్ధిస్తారు. బ్రాహ్మణులకు మరియు ఆకలితో వున్నవారికి అన్నదానం చేస్తారు. ఈ రోజు రాత్రికి నిద్రపోకుండా జాగరణ చేస్తారు. ఎందుకంటే ఆశ్వయ్యుజ అమావాస్య రోజు రాత్రిపూట లక్ష్మీదేవి ఆదర్శవంతమైన గృహం కోసం వెదుకుతూ తిరుగుతు వుంటుంది. ఎక్కడైతే చారిత్రవంతులు, కర్తవ్యదక్షులు, ఓపిక గలవారు, ధర్మనిష్ఠ గలవారు, భగవత్భక్తి మరియు క్షమాశీలులైన పురుషులు మరియు గుణవంతులైన, పతివ్రతా స్త్రీలు నివసించే గృహంలో మాత్రమే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది.

 

లక్ష్మి దేవితో కుబేరుడిని పూజించిటకు మహత్యం

లక్ష్మి దేవి సంపదను ప్రసాదించే తల్లి, దేవత కుబేరుడు కోశాధికారి. చాలామందికి ధనాన్ని సంపాదించే కళను కలిగి వుంటారు. కానీ వారికి ఎలా పొదుపు చేయాలో తెలియక వృధా ఖర్చులు చేసి ధనాన్ని అంతా పోగొట్టుకుంటారు . వాస్తవానికి ధనాన్ని సంపాదించడంతోపాటు దానిని ఆదా చేయడం, తగిన చోట ఖర్చు పెట్టడం చాలా ముఖ్యంమైనది. దేవత కుబేరుడు తానే కోశాధికారి కాబట్టి ఈ కళను నేర్పే దేవత. కాబట్టి ఈ పండుగకు లక్ష్మి దేవిని, దేవత కుబేరున్ని పూజించమని చెప్తారు. ప్రజలందరూ, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఈ పండుగను ఎంతో శోభాయమానంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

 

లక్ష్మీపూజ యొక్క ప్రాముఖ్యత

సాధారణంగా అమావాస్యను అశుభ దినముగా పరిగణిస్తారు; కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యకు మాత్రం మినహాయింపు వుంది. ఈ అమావాస్య దినమును శుభముగా భావించడమైనది; అయినప్పటికీ అన్ని సందర్భాలకు శుభ దినముగా పరిగణించరు; అందువల్ల ఈ దినమును శుభదినముగా పిలువడంకన్నా ఆనందమయ దినముగా పరిగణించడము సరియైనది.

 

లక్ష్మీదేవికి చేయవలసిన కొన్ని ప్రార్ధనలు

లక్ష్మి పూజలో లెక్కల పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి ఇలా ప్రార్ధించాలి. ‘ఓ దేవి నీవు అనుగ్రహహించిన సంపదను సత్కార్యానికి మరియు దైవకార్యానికి ఉపయోగించాము. పూర్తి చేసిన లెక్కలను మీ ముందు వుంచుతున్నాము తల్లి. వీటిని అంగీకరించుము. రాబోయే సంవత్సరంలో కూడా మా లక్ష్యం ఎల్లప్పుడు కొనసాగేటట్లు దీవించు తల్లి’.

‘నేను చేపట్టే ప్రతి కార్యంలో నాతోవుండి నా అవసరాలను తీర్చడానికి నాకు చైతన్యాన్ని ఇచ్చే దైవ శక్తి నాలో వుంది. కాబట్టి ఆ దైవశక్తి కూడా నా భాగస్వామియే. ఏడాది పొడవునా నేను సంపాదించిన ధనము యొక్క లెక్క మరియు దానిని ఉపయోగించిన విధానం, ఈ పుస్తకాలలో చివరి పైసా వరకు లెక్క వ్రాయబడింది. నేను ఈ రోజు మీ ముందు పరిశీలన కోసం ఉంచాను. నీవే సాక్షి తల్లి. నేను మీ నుండి ఏమీ దాచలేను. నేను నిన్ను గౌరవించాను మరియు దైవకార్యానికి మాత్రమే ఉపయోగించాను. ఓ నిష్కలంకమైన మరియు శుద్ధమైన లక్ష్మీదేవి నేను నిన్ను ఎలాంటి అన్యాయమైన చర్యకు ఉపయోగించలేదు’.

‘ఇదంతయు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం వల్లనే సంభవమైనది. నేను విచక్షణ మరియు నైతిక విలువలు కలిగివున్నాను. ఇందువల్లనే నాలోని ఆత్మబలము తక్కువ కాలేదు. నాకు మరియు నా కుటుంబానికి సుఖము, సమాధానము లభించినది. నేను భగవంతుని సహకారంతో ఆయనను స్మరించుకుంటూ ఖర్చు చేశాను. నేను ధనాన్ని సన్మార్గంలో ఉపయోగించకపోతే నీవు నాతో ఉండవని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల హే లక్ష్మీదేవి, నేను చేసిన ఖర్చును సమ్మతించుటకు మీరు నన్ను దేవునికి శిఫారసు చేయుము; ఎందుకంటే నీ శిఫారసు లేకుండ ఆయన నన్ను మన్నించడు. నా దృష్టికి వచ్చే తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాను. అందువల్ల, హే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి, మీ కృపను నాకు ప్రసాదించుము మరియు నా ద్వారా జీవితమంతా హితము కొరకు వినియోగించుటకు జరుగనిమ్ము.’

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : పై విధంగా లక్ష్మీదేవి మరియు సరస్వతిదేవికి ప్రార్థించడమువలన జీవునిలో వున్న కర్తుత్వము యొక్క సూక్ష్మతలంపు తగ్గి తన స్వభావము అంతర్ముఖమౌతుంది. ఇందువలన నిర్మాణమయ్యే మోహము దానిలో పడకుండ అతని ప్రవర్తనలో వినయశీలత ఏర్పడుతుంది.

 

లక్ష్మీపూజ రోజున తీయవలసిన ముగ్గు

లక్ష్మీతత్వమును ఆకర్షింపజేసుకొనే 11 చుక్కలు మరియు 11 వరుసల ముగ్గు

 

లక్ష్మీపూజ రోజున రాత్రికి ఇల్లును ఎందుకు ఊడ్చుతారు ?

అలక్ష్మీని తొలగించుట

మనలో గుణాలను నిర్మాణము చేసినను, దోషాలను తొలగించుకొనే ప్రక్రియలో ముందడుగు వేసినప్పుడే సద్గుణాలకు గొప్పతనము వస్తుంది. ఇప్పటి వరకు మనము లక్ష్మీని (ధనము) ఎలా సంపాదించాలి, అని తెలుసుకున్నాము. దీనితో పాటు అలక్ష్మీ నాశనము కూడ కావాలి; అందువల్ల ఈ రోజున కొత్త చీపురు కొంటారు. చీపురును లక్ష్మీగా భావిస్తారు.

ఆచరించు విధానము : ఆ చీపురుతో అర్ధరాత్రి ఇల్లు ఊడ్చి ఆ దుమ్మును బయట పడేయాలి అని చెప్తారు. దీనిని అలక్ష్మీని తొలగించడం అంటారు. సాధారణంగా రాత్రికి ఇల్లు ఊడ్చి దుమ్ము బయట పడేయటం ఎప్పుడూ చేయరు. కేవలము ఈ రాత్రికి చేస్తారు. దుమ్మును ఊడ్చుతున్నప్పుడు చాటను చిన్న కర్రతో వాయించి అలక్ష్మీని బయటికి నెట్టేస్తారు.

సందర్భం : సనాతన ప్రచురణ ‘పండుగలు, ఉత్సవాలు మరియు వ్రతాలు’

 

లక్ష్మీ చంచలమైనదని, చెప్పుటకు కారణములు

ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది మరియు దాని అనుసారంగా లక్షణాలు కనబడుతాయి, ఉదా. శ్రీలక్ష్మీయొక్క ఉపాసన చేసినచో, ధనప్రాప్తి అవుతుంది. ఈ ఉపాసన తగ్గినచో, అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకున్ని వదలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుష్యులు లక్ష్మీ చంచలమైనదని అంటుంటారు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేమింటే, లక్ష్మీ చంచలమై వున్నట్లయితే తను శ్రీవిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి వుండేది. – (ప.పూ.) డా. ఆఠవలే (14.10. 2009)

Leave a Comment