గురుతత్త్వం ఒకటే !

అందరు గురువులు బాహ్యతః స్థూలదేహ విషయంలో వేర్వేరుగా ఉన్నా అంతరంగంగా మాత్రం ఒక్కటి గానే ఉంటారు. ఆవు పొదుగులో దేన్నుండి పితికినా సమానంగా నిర్మలమైన పాలు వచ్చినట్లే అందరి గురువులలోని గురుతత్త్వం ఒకటే అవడంవల్ల వారి నుండి వచ్చే ఆనంద తరంగాలు సమంగా ఉంటాయి.

మన భారత దేశపు సర్వ శ్రేష్ఠ గురు-శిష్య పరంపర యొక్క ప్రాముఖ్యత !

గురువులకు కృతజ్ఞత తెలిపే దినమే గురుపూర్ణిమ. గురువులు అజ్ఞాన రూపీ అంధకారాన్ని రూపు మాపే జ్ఞాన రూపీ తేజస్సు. గురువే అజ్ఞానాన్ని పారద్రోలుతారు.