అసంతృప్త పూర్వీకుల ఇబ్బందుల నుండి రక్షించే మరియు వారికి సద్గతిని ప్రసాదించే దేవతయే – దత్తాత్రేయుడు

 

दत्त Datta

అసంతృప్త పూర్వీకుల నుండి ఇబ్బందులు
కలగుటకు కారణాలు మరియు ఇబ్బందుల స్వరూపము

పూర్వము మాదిరిగా ఇప్పుడు చాలా మంది శ్రాద్ధము-పక్షము మొదలుగునవి చేయరు, సాధన కూడా చేయరు. దీని నుండి చాలా వరకు ప్రతిఒక్కరికి పూర్వీకుల లింగదేహముల నుండి ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని లేక ఇబ్బంది కలుగుటను ఉన్నతులు మాత్రమే చెప్పగలరు. అలాంటి ఉన్నతులు దొరకనప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇబ్బందులలో ఏదైనా ఒకటి ఉంటే, అసంతృప్త పూర్వీకుల నుండి కొన్ని ఇబ్బందులున్నాయని తెలుసుకొని, క్రింద చెప్పినట్లు సాధన చేయవలెను.

వివాహము జరగకుండుట, భార్య-భర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట, గర్భధారణ జరగకపోవుట, గర్భస్త్రావము జరుగుట, రోజులు నిండకుండానే పిల్లలు పుట్టుట. బుద్ది మాంద్యులు లేక అంగవైకల్యమున్న పిల్లలు పుట్టుట లేక ఆడపిల్లలే పుట్టుట, పిల్లలు చిన్నవయస్సులోనే చనిపోవుట మొదలగునవి అసంతృప్త పూర్వీకుల నుండి కలిగే కొన్ని ఇబ్బందులు.

 

అసంతృప్త పూర్వీకుల ఇబ్బందుల నుండి రక్షణ
కొరకు ఇబ్బందుల తీవ్రతను బట్టి చేయవలసిన ఉపచారము

అ. ఏ ఇబ్బందులు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు కలుగరాదని, అలాగే కొద్దిగా ఇబ్బందులు ఉన్నట్లైతే ప్రతిరోజు 1 నుండి 2 గంటలు ‘శ్రీ గురుదేవ దత్త’ ఈ నామజపము చేయవలెను.

ఆ. మధ్యమ ఇబ్బందులుంటే ఇలవేల్పు జపముతోపాటు ప్రతిరోజు 2 నుండి 4 గంటలు ‘శ్రీ గురుదేవ దత్త’ జపము చేయవలెను. దీనితోపాటు ఒక సంవత్సరము ప్రతి గురువారము దత్తాత్రేయుని దేవస్థానానికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేసి దేవస్థానములో కూర్చొని ఒకటి లేక రెండు మాల జపము చేయవలెను. తరువాత మూడుమాల జపము చేయడానికి ప్రారంభించవలెను.

 

“శ్రీ గురుదేవ దత్త”

“ఓం ఓం శ్రీ గురుదేవ దత్త ఓం”

 

ఇ. పూర్వీకుల తీవ్ర ఇబ్బందులుంటే ఇలవేల్పు నామజపముతో పాటు ప్రతిరోజు 4 నుండి 6 గంటలు ‘శ్రీ గురుదేవ దత్త’ జపము చేయవలెను. ఏదైన ఒక జ్యోతిర్లింగము ఉండే స్థానానికి వెళ్ళి అక్కడ నారాయణబలి, నాగబలి, త్రిపిండి శ్రాద్ధము, కాలసర్ప శాంతి మొదలగు విధులను చేయవలెను. దీనికి జతగా ఏదైన ఒక దత్తక్షేత్రములో వుండి సాధన చేయవలెను లేక సాధువుల సేవచేసి వారి కృపను సంపాదించవలెను.

ఈ. పితృపక్షము సమయములో దత్తాత్రేయుణి నామజపం చేయడం వలన పూర్వీకులకు త్వరగా గతి ప్రాప్తవుతుంది; అందువలన ఆ సమయములో ప్రతిరోజు కనీసం 6 గంటలైన దత్తాత్రేయుడి నామజపము చేయవలెను.

దత్తాత్రేయుడి నామజపమే కాకుండా ఇతర సమయములలో ప్రారబ్ధము నుండి ఇబ్బందులు కలుగరాదని అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి కావలెనని ఇలవేల్పు జపము కూడా చేయవలెను.

మరిన్ని వివరాల కొరకు చదవండి సనాతన లఘుగ్రంథం ‘దత్తాత్రేయుడు’

Leave a Comment