అగ్నిమాపక యొక్క కొన్ని పద్ధతులు

మన రోజువారి జీవితంలో అగ్ని ఖచ్చితంగా అవసరం అయినప్పటికీ, నియంత్రించదగిన మరియు అనియంత్రిత మంటల మధ్య గల చిన్న వ్యత్యాసం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. సాధారణంగా, మానవులు ఉపయోగించే అన్ని మంటలు నియంత్రించదగినవి; కానీ కొన్ని సందర్భాల్లో అగ్ని నియంత్రణ సరిహద్దును దాటవచ్చు. ఇలా జరిగినప్పుడు, అగ్నిమాపక సిబ్బంది దాని గురించి ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెద్ద కర్మాగారాలు, సముద్రపు ఓడలు, విమానం మొదలైన వాటిలో అగ్నిమాపక శిక్షణ ఇవ్వబడుతుంది; కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, రోజుకు 5-6 గంటలు వంటగదిలో  గడిపే సగటు వ్యక్తికి  మరియు గృహిణికి, అగ్ని మరియు అగ్నిమాపక పరిష్కారాల శాస్త్రం గురించి పూర్తిగా తెలియదు, మరియు ఈ అజ్ఞానం అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ పవిత్ర గ్రంథాన్ని సంకలనం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అగ్నిమాపక శాస్త్రం, వివిధ రకాల అగ్నిమాపక మార్గాలు మరియు వాటిని ఉపయోగించే పద్ధతులు, వాటి ప్రయోజనాలు, తప్పు మార్గాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు మొదలైన వాటి గురించి శాస్త్రీయ మరియు సరళమైన భాషలో జ్ఞానం ఇవ్వడం.

అగ్ని ప్రమాదంలో, ప్రాణంతో పాటు ఆస్తి పరంగా కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని నివారించాలంటే జాతీయ ప్రయోజనాలకు మరియు రక్షణకు ఉపయోగపడే పనిలో  విజయవంతంగా  పాల్గొనాలి.

అగ్నిమాపక శిక్షణ తీసుకోవడం  ప్రతికూల సమయాల్లో మాత్రమే కాకుండా, సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ లేఖనం ద్వారా పాఠకులకు  అగ్నిమాపక శిక్షణకు పరిచయం చేస్తున్నాము. ఈ విషయాన్ని సనాతన అగ్నిమాపక శిక్షణ గ్రంథములో వివరంగా చర్చించారు. పాఠకులు ఈ పుస్తకాన్ని వారి సేకరణలో ఉంచుకోగలరు.

 

అగ్నిమాపక చర్యలో ప్రయోగాత్మక శిక్షణ

1. పరిచయం

అ. అగ్ని యొక్క అంశాలు

ఇంధనం, ఆక్సిజన్‌ మరియు వేడి అగ్ని ఏర్పడటానికి అవసరమైన మూడు ప్రధాన అంశాలు. ఈ మూడు మూలకాలు సరైన నిష్పత్తిలో కలిసినప్పుడు అగ్ని సృష్టించబడుతుంది.

ఆ. అగ్ని ఏర్పడటానికి సామాన్య కారణాలు

1. ప్రకృతి సహజమైనవి : తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు మొదలైనవి.

2. కృత్రిమమైనవి : ఇలాంటి మంటలకు మనిషి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తాడు. కృత్రిమ మంటలకు ఇతర కారణాలు ఉన్నాయి; ఉదాహరణకు, అజ్ఞానం (ఇనుమును ఎక్కువగా వేడిచేయడం, సిగరెట్‌ చల్లారకుండా నిర్లక్ష్యంగా విసిరేయడం), అజాగ్రత్త, ప్రమాదాలు, విధ్వంసం, యుద్ధం మొదలైనవి.

ఇ. అగ్నిలో రకాలు

ఇంధన రకాన్ని బట్టి, మంటలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.

1. ‘ఎ’ రకం అగ్ని : దహన పదార్థలైన కలప, బొగ్గు, కాగితం, ప్లాస్టిక్‌, రబ్బరు మొదలైన వాటిని కార్బోనైజ్‌ చేసి, ఘన రూపానికి మారినప్పుడు, ఆ అగ్నిని ‘ఎ’ రకం అగ్ని అంటారు.

2. ‘బి’ రకం అగ్ని : మండుతున్న పదార్థం ద్రవ రూపంలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఘన పదార్థం ద్రవ రూపంలో మండుతున్నప్పుడు, ఆ అగ్నిని ‘బి’ రకం అగ్ని అని పిలుస్తారు; ఉదాహరణకు, పెట్రోల్‌, డీజిల్‌, కందెన నూనె, రసాయనాలు, రంగులు మొదలైనవి

3. ‘సి’రకం అగ్ని : మండుతున్న పదార్థం వాయు రూపంలో ఉన్నప్పుడు లేదా ద్రవ పదార్థం వాయువు రూపంలో మండుతున్నప్పుడు, ఆ అగ్నిని ‘సి’ రకం అగ్ని అని పిలుస్తారు; ఉదాహరణకు, వంట గ్యాస్‌, వెల్డింగ్‌ గ్యాస్‌ మొదలైనవి.

4. ‘డి’ రకం అగ్ని : ఏదైనా లోహం మండుతున్నప్పుడు, ఆ అగ్నిని ‘డి’ రకం అగ్ని  అని పిలుస్తారు; ఉదాహరణకు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, టైటానియం మొదలైనవి.

ఈ. అగ్నిని చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు?

1. ‘మంటలు – మంటలు’ అని అరవడం ద్వారా పరిసరాల్లోని ప్రజలను హెచ్చరించండి.

2. అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక దళం, పోలీసులు, మునిసిపాలిటీ మొదలైన వారికి తెలియజేయండి.

3. అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు, మంటలను అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. తలుపులు మరియు కిటికీలను మూసివేసి విద్యుత్‌ సరఫరాను ఆపివేయండి. అగ్ని సమీపంలో మండే పదార్థాన్ని సురక్షితమైన ప్రదేశానికి మార్చండి. వీలైతే, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నీటిని చల్లండి.

4. తగిన అగ్నిమాపక మాధ్యమాన్ని ఉపయోగించి మంటలను ఆర్పివేయండి.

ఉ. అగ్నిమాపక పద్ధతులు

1. ఇంధన సరఫరాను ఆపడం (స్టార్వింగ్‌)

మంటలకు ఇంధన సరఫరాను ఆపడం ద్వారా, మంటలు వెంటనే ఆరిపోతాయి. ఈ పద్ధతిని ‘స్టార్వింగ్‌’ అని పిలుస్తారు, ఉదా: గ్యాస్‌ సరఫరాను ఆపినప్పుడు  ఇంధనం లభించకపోవడం వల్ల గ్యాస్‌ స్టవ్‌ లో మంట ఆగిపోతుంది.

2. శీతలీకరణ

మండుతున్న పదార్ధం యొక్క ఉష్ణోగ్రతను దహన బిందువు క్రిందకు తీసుకొచ్చినప్పుడు పదార్ధం యొక్క ఉష్ణోగ్రత తగ్గి, మంట వెంటనే ఆరిపోతుంది. ఈ రకమైన అగ్నిమాపక చర్యను శీతలీకరణ అంటారు, ఉదా. మండుతున్న చెక్కపై నీళ్ళు పోయడం.

సేకరణ : సనాతన ప్రచురణ ‘అగ్నిమాపక’

Leave a Comment