అగ్నిమాపక

చివరి లేఖనంలో, అగ్ని యొక్క అంశాలు, అగ్ని యొక్క సామాన్య కారణాలు, మంటల వర్గీకరణ, అగ్నిని చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఈ లేఖనంలో అగ్నిమాపక యొక్క కొన్ని పద్ధతులు గురించి ముందు ప్రస్తావించబడింది.

 

అ. అగ్నిమాపక పద్ధతులు

1. ఆక్సిజన్‌ సరఫరాను ఆపడం (స్మోథరింగ్‌)

అగ్నికి ఆక్సిజన్‌ సరఫరా పూర్తిగా నిలిపివేయబడినప్పుడు లేదా గాలిలోని ఆక్సిజన్‌ మొత్తాన్ని 16 శాతానికి పైగా తగ్గించడం ద్వారా మంటలు వెంటనే ఆరిపోతాయి. వెలుగుతున్న కొవ్వొత్తిని గాజు గిన్నెతో కప్పే ప్రయోగంలో ఇది తెలుసుకోవచ్చు . దీన్ని ‘స్మోథరింగ్‌' అంటారు.

2. శృంఖలా ప్రతిక్రియను విచ్ఛిన్నం చేయడం

నిర్దిష్ట రసాయనాలను ఉపయోగించి మండుతున్న మంటల యొక్క శృంఖలా ప్రతిక్రియను విచ్ఛిన్నం చేయడం ద్వారా అగ్నిని
చల్లారుస్తారు. ఉదాహరణకు, హలోన్‌ గ్యాస్‌. ఇవి చాలా ఖరీదైనవి కాబట్టి, వాటి ఉపయోగం నిర్దిష్ట పరిస్థితులకు పరిమితం
చేయబడింది.

 

ఆ. అగ్నిమాపక చర్యలో ఉపయోగించే సాధనాలు

యంత్రాలు మరియు వాటి పద్ధతులు క్రింద ఇవ్వబడ్డాయి.

1. నీరు

కలప, కాగితం (‘ఎ’ రకం అగ్ని) లేదా మెటల్‌ (‘డి’ రకం అగ్ని) వంటి కార్బోనేషియస్‌ పదార్థాలపై నిరంతరం నీటిని చల్లడం ద్వారా నీరు
మండుతున్న పదార్థాల నుండి వేడిని గ్రహిస్తుంది. నీరు వేడిని పీల్చుకునే శాతం ఉష్ణ ఉత్పత్తి శాతం కంటే ఎక్కువగా ఉంటే, అగ్ని ఆరిపోతుంది.

2. పొడి రసాయన చూర్ణం

సోడియం బైకార్బోనేట్‌ మరియు పొటాషియం బైకార్బోనేట్‌ యొక్క రసాయన పొడులను ‘డ్రై కెమికల్‌ పౌడర్‌' అంటారు. ఇది
స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటుంది. ఈ పొడి యొక్క కణాలు ద్రవ కార్బన్‌ డయాక్స్‌డ వాయువును ఉపయోగించి ఎక్కువ ఒత్తిడితో
మంటలపై చల్లడం ద్వారా నిప్పుపై మేఘాన్ని ఏర్పరుస్తాయి. ఈ మేఘం కారణంగా, అగ్నికి గాలితో సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం
వల్ల శృంఖలాలో తగినంత ఆక్సిజన్‌ లేకపోవడం కారణంగా మంటలు ఆరిపోతాయి. ఈ మాధ్యమం ప్రధానంగా ‘బి’ మరియు ‘సి’ రకం మంటలను మరియు విద్యుత్‌ పరికరాలలో మంటలను ఆర్పడానికి ఉపయోగపడుతుంది.

3. కార్బన్‌ డయాక్స్‌డ

ఈ వాయువు చాలా అధిక పీడనము వద్ద, ఒక నిర్దిష్ట పద్ధతి ద్వారా తయారు చేయబడిన సిలిండర్లలో నిల్వ చేయబడుతుంది. ఇది గాలి కంటే ఐదు రెట్లు భారీగా ఉంటుంది కాబట్టి, దానిని నిప్పు మీద పిచికారీ చేసినప్పుడు అది మండుచున్న పదార్థాలపై పొరను ర్పరుస్తుంది. ఈ విధంగా, గాలి (ఆక్సిజన్‌) తో సంబంధం కోల్పోవడం వల్ల అగ్ని ఆరిపోతుంది. ఇది ఎలక్ట్రికల్‌ పరికరాలలో అగ్ని ప్రమాదము జరిగినప్పుడు కార్బన్‌ డయాక్స్‌డ ప్రధానంగా ఉపయోగించబడుతుంది.

4. విశిష్ట రసాయనాలు

కొన్ని రసాయనాలు మండుచున్న శృంఖలా ప్రతిచర్యను విచ్ఛిన్నం చేయడం ద్వారా మంటలను ఆర్పడానికి సహాయపడతాయి. ఇటువంటి రసాయనాలను అగ్నిమాపక చర్యలో చాలా తక్కువగా ఉపయోగిస్తారు.

5. ఇసుక

మంటలు చిన్నవిగా ఉండి మరియు ఇతర మార్గాలు అందుబాటులో లేనట్లయితే, ‘ఎ’, ‘బి’ మరియు ‘డి’ రకం మంటలను ఆర్పడానికి ఇసుకను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఇసుక అందుబాటులో లేకపోతే, పొడి మట్టిని ఉపయోగించవచ్చు.

అగ్నిమాపక యంత్రాలు, ఆస్బెస్టాస్‌ వస్త్రం, నురుగు మొదలైన వాటిని ఎప్పుడు ఉపయోగించాలో మరియు వివిధ రకాల మంటలను ఎలా ఆర్పివేయలో కూడా సనాతన పుస్తకములో వివరించబడ్డాయి.

 

ఇ. పరిస్థితులు మరియు పరిష్కార చర్యలు

మంటలను ఆర్పడంలో శీఘ్రముగా సిద్ధపడటం కన్నా ముఖ్యమైనది అగ్నిని ఒంటరిగా ఎదుర్కోవాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడం. ఈ
నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే కొన్ని మార్గదర్శకాలు ముందు ఇవ్వబడ్డాయి. ఈ క్రింద ప్రశ్నలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ
ప్రశ్నలకు సమాధానం అవును అయితే, అగ్నిని ఆర్పే ప్రయత్నం చేయవద్దు. అటువంటప్పుడు, ప్రాణాంతకమైనది కాబట్టి, వెంటనే
సురక్షితమైన ప్రదేశానికి వెళ్లి సహాయం కోసం అడగండి.

  • మంటలు ప్రారంభమైన ప్రదేశం నుండి వేగంగా వ్యాపిస్తున్నాయా?
  • మీరు తప్పించుకునే మార్గం వైపు మొగ్గు చూపడం ద్వారా మంటలను ఆర్పివేయడం అసాధ్యమా?
  • మీరు తప్పించుకునే ఏకైక మార్గాన్ని అగ్ని అడ్డుకుంటుందా?
  • తగిన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవా?
  • మీ అగ్నిమాపక మాధ్యమాలన్నీ అయిపోయాయ?
  • ఫైర్‌ సూట్‌ వంటి అగ్ని రక్షణ పరికరాలు అందుబాటులో లేవా?
  • మండే పదార్థాలు
  • మండే ద్రవాలు మరియు వాయువు
  • విద్యుత్‌ ఉపకరణాలు
  • విద్యుత్‌ పదార్థాలు
  • వంట ఉపకరణాలు
సేకరణ : సనాతన ప్రచురణ ‘అగ్నిమాపక’

Leave a Comment