గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ చిత్శక్తి (శ్రీమతి) అంజలి ముకుల్ గాడ్గిల్ మరియు శ్రీ సత్శక్తి (శ్రీమతి) బిందా నీలేష్ సింగ్‌బాల్ వీరి సందేశం (2022)

భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు మీ ప్రయత్నాలను పెంచుకోండి! – శ్రీచిత్శక్తి (శ్రీమతి) అంజలి ముకుల్ గాడ్గిల్

శ్రీచిత్శక్తి (శ్రీమతి) అంజలి గాడ్గిల్

ప్రస్తుతం సామాన్యులు నిత్యజీవితం గడపడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. జీవితం ఆనందంగా ఉండాలంటే, సాధన (భగవంతుని పొందడం కోసం రోజువారీ ప్రయత్నం) చేయాలి. ప్రస్తుతం నిత్యసాధన చేయడం కష్టంగా అనిపించినా, ఎక్కడ ఉన్నా, భగవంతుని నామస్మరణ చేయడం, భగవంతునితో నిరంతరం మాట్లాడడం, భగవంతుడిని ఎక్కువగా ప్రార్థించడం లేదా ఆయనకు శరణాగతి అవ్వడం, ప్రతి చర్య యొక్క కర్తుత్వం భగవంతుడికి సమర్పించడం మొదలైన పనులు చేయండి! కాబట్టి భగవంతుని అనుగ్రహం మీకు త్వరలో లభిస్తుంది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ సందర్భంగా, ‘నా ప్రతి కార్యం భగవంతుని అనుగ్రహం కోసం జరగాలి’ అని ప్రార్థించండి!

– శ్రీచిత్శక్తి (శ్రీమతి) అంజలి గాడ్గిల్, సనాతన్ ఆశ్రమం, రామనాథి, గోవా.

మీ శక్తి మేరకు ధర్మ స్థాపనకు సహకరించండి ! – శ్రీసత్శక్తి (శ్రీమతి) బిందా నీలేష్ సింగ్‌బాల్, సనాతన్ ఆశ్రమం, రామనాథి, గోవా

శ్రీసత్శక్తి (శ్రీమతి) బిందా సింగ్బాల్

శ్రీగురువు ఆశించిన ధర్మకార్యాన్ని శిష్యుడు నిర్వహించడమే నిజమైన గురుదక్షిణ. ప్రస్తుత సమయం ధర్మ స్థాపనకు అంటే హిందూ రాష్ట్ర స్థాపనకు అనుకూలమైనది. ఈ కాలంలో హిందూ ధర్మ నేపధ్యంలో సమాజాన్ని మేల్కొల్పడం, ధర్మ పరిరక్షణకు చురుగ్గా తోడ్పడడం, ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగ్గట్టుగా సహకారం అందించడం కూడా ఒక రకంగా గురుకార్యం. ఏ పని చేయలేని వ్యక్తి కూడా ప్రతిరోజూ హిందూ రాష్ట్ర స్థాపన కోసం దేవతలను ప్రార్థించడం ద్వారా ఈ పనికి సహకరించవచ్చు. ఈ గురుపూర్ణిమ నుండి, ధర్మ స్థాపనకు, అంటే ధర్మాధిష్ట హిందూ రాష్ట్ర స్థాపనకు మీ చేతనైనంత సహకారం అందించాలని నిర్ణయించుకోండి!

– శ్రీసత్శక్తి (శ్రీమతి) బిందా సింగ్బాల్, సనాతన్ ఆశ్రమం, రామనాథి, గోవా.

Leave a Comment