ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాలపై ఆధ్యాత్మిక ఉపాయలు

మానవాళికి, ప్రాణశక్తి అనేది జీవ చైతన్యాన్ని అందించే శక్తి. దీనిని ‘పిరమి్‌డ నివారణలు’, ‘రేకి చికిత్స’ వంటి ప్రసిద్ధ నివారణలలో కూడా ఉపయోగిస్తారు. ఈ పవిత్ర గ్రంథం రుగ్మతలను నయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గంలో ప్రాణశక్తి ఉపయోగించడం వెనుక ఉన్న శాస్త్రాన్ని వివరిస్తుంది. ఈ చికిత్సలో, వేళ్ళతో ముద్రలు (ప్రాణశక్తి ప్రవాహాన్ని నిర్దేశించే ముద్ర) మరియు దేవుని పేరు జపించడం ముఖ్యమైన అంశాలు.

మానవుని చేతి యొక్క ప్రతి వేలు పంచమహాభూతాలను సూచిస్తుంది – భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశము. వేళ్ళకు అనుబంధమైన పంచమహాభూతాల వివరణకు సంబంధించిన విషయాలు పవిత్ర గ్రంథాలైన ‘శారదతిలక్‌’ (అధ్యాయం 23, శ్లోకం 106 పై విశ్లేషణ) మరియు ‘స్వరవిజ్ఞాన్‌’ నుండి తీసుకోబడ్డాయి.

శరీరంలోని కుండలిని చక్రాలలో(సూక్ష్మ-శరీరంలో నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తి యొక్క స్థానాలు) లేదా వివిధ అవయవాల స్థానంలో ముద్రను ఉపయోగించి న్యాసము చేయడం ప్రాణశక్తి(జీవ చైతన్యం) ప్రసరణ నివారణలో ఒక భాగం. మనకు పురాతన కాలం నుండి మంత్ర యోగాలో మాతృక న్యాసమును అభ్యసించమని చెప్పారు. అందులో, ఐదు వేళ్ళను మరియు అరచేతిని ఉపయోగించి శరీరంలోని వివిధ అవయవాల వద్ద న్యాసం చేస్తారు. (సందర్భము : ప్రచురణ :  రతీయ సంసతి కోశం, ఖండం 4 మరియు 7)

ఆధ్యాత్మికత అనేది ఒక ఆచరణాత్మక శాస్త్రం, ఇది ప్రయోగం మరియు సృజనాత్మకతను కలిగి ఉంటుంది. హిందూ ధర్మంలో లభించే జ్ఞానాన్ని నేను ఉపయోగించినప్పుడల్లా, ఈ అంశాలను ఆసక్తిగా అధ్యయనం చేసాను. వేర్వేరు ముద్రలు, న్యాసం మరియు నామ జపము ద్వారా ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధములను కనుగొనే మార్గాలపై నేను ప్రయోగాలు చేశాను మరియు సంభందిత అనుభవాలను పొందాను. చాలా మంది ఆధ్యాత్మిక సాధకులు ఈ చికిత్సతో ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోజనాలను తెలుసుకున్న తరువాత, ఇది పవిత్ర గ్రంథం రూపంలో ప్రచురణ చేయబడింది.

ఈ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక అనుభవాల గురించి మాకు తెలియజేయమని పాఠకులను మేము అభ్యర్థిస్తున్నాము. భగవంతుడే ఈ పనిని పూర్తి చేసాడు; అందువల్ల, నేను ఆయన పవిత్ర పాదాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – పరాత్పర గురువు డాక్టర్‌ ఆఠవలే (28.10.2015)

 

మనోగతం

ఉపాయ పద్ధతుల యొక్క సారాంశం

మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ వంటి వివిధ వ్యవస్థలు పనిచేస్తాయి. ఈ వ్యవస్థల పనితీరుకు అలాగే మనస్సుకు అవసరమైన శక్తి ప్రాణశక్తి ప్రవాహం ద్వారా అందుతుంది. ప్రాణశక్తి ప్రవాహంలో అవరోధములు ఏర్పడినప్పుడల్లా, సంబంధిత ఇంద్రియాల పనితీరు తగ్గిపోతుంది మరియు రుగ్మతలు ఏర్పడతాయి. ఇంద్రియాల పనితీరును మెరుగుపరచడానికి ఎన్ని ఆయుర్వేద, అల్లోపతి మరియు ఇతర మందులు తీసుకున్నా, అవి పెద్దగా ఉపయోగపడవు. ఇందుకోసం, ప్రాణశక్తి ప్రవాహంలో ఏర్పడిన అవరోధము తొలగించడమే ఏకైక మార్గం. వేళ్ళ నుండి ప్రాణశక్తి బయటకు వస్తుంది. రోగాలను నయం చేయడానికి దీనిని ఉపయోగించడం ఈ ఉపాయం యొక్క సారాంశం.

 

అధిక పరిపూర్ణమైన ఉపాయ పద్ధతి

వ్యక్తులకు బాధ కలిగించే దుష్ట శక్తులు తరచుగా అనారోగ్యం యొక్క మూలాన్ని మారుస్తాయి. అటువంటి సమయాల్లో, ఆక్యుప్రెషర్‌ వంటి పద్ధతుల ద్వారా రోగికి ఖచ్చితమైన చికిత్సను అందించడం సాధ్యం కాదు, దీనిలో అనారోగ్యంతో సంబంధం ఉన్న ఒత్తిడి బిందువు గుర్తించి ఒత్తిడి కలిగించడం అవసరం. ప్రాణశక్తి ప్రవాహ చికిత్సలో, అవరోధము యొక్క స్థానం సులభంగా గుర్తించబడుతుంది. అందువల్ల, ఖచ్చితమైన ఉపాయం అందించడం సాధ్యపడుతుంది.

 

అధిక స్వయం సమృద్ధి ఉపాయ పద్ధతి

ముఖ్యంగా రాబోయే ప్రతికూల సమయాల్లో, సాధారణ వైద్య సహాయం, కొరత ఉన్నప్పుడు వ్యాధుల నివారణకు ఆక్యుప్రెషర్‌ థెరపీ, రిఫ్లెక్సాలజీ, పిరమి్‌డ థెరపీ, మాగ్నెట్‌ థెరపీ వంటి చికిత్స పద్ధతులు ముఖ్యమైనవి. ఆక్యుప్రెషర్‌, రిఫ్లెక్సాలజీ, మొదలైన నివారణలకు పుస్తకం లేదా ఈ రంగాలకు చెందిన నిపుణుల సలహా అవసరం. పిరమి్‌డ థెరపీ, మాగ్నెట్‌ థెరపీ మొదలైన వాటిలో, ప్రత్యేక సాధనాలు అవసరం. దీనికి విరుద్ధంగా, ఎవరి సహాయం లేదా సాధనాలు అవసరం లేని ప్రాణశక్తి ప్రవాహ చికిత్స చాలా వరకు స్వయం సమృద్ధిగా ఉంటుంది. – పరాత్పర గురువు డాక్టర్‌ ఆఠవలె

భూమిపై నిరంతరం వినూత్నమైన ఆధ్యాత్మిక నివారణ పద్ధతులను అందించే, ఏకైక పరాత్పర గురువు (డాక్టర్‌) ఆఠవలే

ఒక వ్యక్తి తరచుగా అనుభవించే శారీరక మరియు మానసిక క్షోభకు కారణం ఆధ్యాత్మిక బాధలు; దీనికి ప్రధాన కారణం దుష్ట శక్తుల వల్ల కలిగే బాధ. ఈ సమస్యను అధిగమించడానికి పరాత్పర గురువు (డాక్టర్‌) ఆఠవలే ఆధ్యాత్మిక వైద్యం యొక్క అనేక కొత్త పద్ధతులను అందించారు, ఉదా. పరిస్థితులకు అనుగుణంగా దేవతల పేర్లను మార్చిమార్చి జపించడం, ఖాళీ పెట్టెల నివారణలు, ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాల వల్ల కలిగే వ్యాధులపై అనేక కొత్త ఆధ్యాత్మిక నివారణలను రూపొందించారు. ఈ నివారణల నుండి వందలాది మంది సనాతన సంస్థ యొక్క వ్యక్తులు ప్రయోజనం పొందారు; ఫలితంగా, ఈ పద్ధతులు ప్రామాణిక శాస్త్రంగా మారాయి.

రాబోయే ప్రపంచ యుద్ధంలో, రేడియో ధార్మికత కారణంగా లక్షలాది మంది చనిపోతారని మహాత్ములు అంచనా వేశారు. భవిష్యత్తులో, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి మరియు ఈ కాలంలో సమాజం అనేక విపత్తులను ఎదుర్కొంటుంది.మనతో సహా కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించడం అత్యవసర పరిస్థితుల్లో పెద్ద సవాలు. ప్రతికూల సమయంలో, సమాచార మాధ్యమాలు విచ్ఛిన్నమవుతాయి. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లడం, వైద్యుడిని సంప్రదించడం మరియు మందులు కొనడం కష్టం అవుతుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడే గ్రంథాలను సనాతన సంస్థ సిద్ధం చేసింది. ఈ గ్రంథాల నుండి నేర్చుకున్న చికిత్సా విధానం అత్యవసర సమయాల్లో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా సహాయపడుతుంది; ఎందుకంటే, వారు ప్రతి ఒక్కరినీ స్వయం సమృద్ధిగా మరియు ఆత్మ విశ్వాసంతో ఉండేటట్లు చేయటం వారి ద్యేయం. ప్రస్తుతానికి, ఈ శ్రేణిలో 13 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. ’ప్రాణశక్తి ప్రవాహ వ్యవస్థలో అవరోధాల వల్ల కలిగే వ్యాధులపై ఆధ్యాత్మిక నివారణలు’ అనునది ఒకటి. 2010 నుండి వందలాది మంది సనాతన సంస్థ యొక్క వ్యక్తులు కూడా ఈ నివారణపై ప్రయోగాలు చేశారు మరియు వారు కూడా ప్రయోజనం పొందారు. ఈ పవిత్ర గ్రంథం నుండి ముఖ్యమైన అంశాలను వరుస క్రమముగా అందించబడ్డాయి.

 

1. ప్రాణ శక్తి ప్రవాహంలో అవరోధమును కనుగొనడం (న్యాసం చేయు స్థానము కనుగొనడం)

1 అ. దుష్ట శక్తులతో బాధపడుతున్న వారు జపించడం ద్వారా స్థానాన్ని కనుగొనడం!

చేతి వేళ్ళతో న్యాసం చేయు స్థానము కనుగొనేటప్పుడు, మీకు ఎక్కడ ఊపిరి ఆడటంలేదో దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. దుష్టశక్తులతో బాధపడుతున్న వారు స్థానము కనుగొనేటప్పుడు జపించాలి; ఎందుకంటే, స్థానము కోసం శోధిస్తున్నప్పుడు వారి వేళ్ళ నుండి వచ్చే బాధించే శక్తి వారి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

1 ఆ. శరీరంలోని కుండలిని చక్రాలపై మీ వేళ్ళను కదిలించడం ద్వారా న్యాసం చేయు స్థానాన్ని కనుగొనడం

ప్రతి అవయవంతో సంబంధం ఉన్న ఒక కుండలిని-చక్రం ఉంటుంది. విశ్వంలోని ప్రాణాశక్తిని కుండలిని-చక్రాల ద్వారా అది సంబంధిత అవయవాలకు రవాణా చేయబడుతుంది. కుండలిని-చక్రంలో అవరోధాలు ఉన్నప్పుడు, ఆ చక్రంతో సంబంధం ఉన్న అవయవాలలో ప్రాణశక్తి లోపము ఉంటుంది. దుష్ట శక్తులు ప్రధానంగా కుండలిని-చక్రాలపై దాడి చేస్తాయి మరియు వాటిలో బాధపడే శక్తిని నిల్వ చేస్తాయి, ఫలితంగా కుండలిని-చక్రాలలో అవరోధాలు ఏర్పడతాయి. అందువల్ల, కుండలిని-చక్రాల ప్రాంతంలో వేళ్ళు కదపడం ద్వారా న్యాసం చేయటానికి స్థానాన్ని కనుగొనడం అవసరం.

1 ఇ. శరీరంలోని సర్వ అవయవాలపై మీ వేళ్ళను కదిలించడం ద్వారా న్యాసం చేయు స్థానాన్ని కనుగొనడం

కుండలిని-చక్రాల వద్ద అవరోధాలు ఉన్నా లేకపోయినా, ఇంకా శరీరంలోని వివిధ నాడిలలో కూడా అవరోధములు ఉండవచ్చు. ఫలితంగా, అనుబంధ అవయవాలు బాధను అనుభవిస్తాయి; ఉదాహరణకు – ఊపిరి ఆడకపోవడము . అటువంటి సమయాల్లో, నాడిలలోని అవరోధములను కనుగొనడానికి చక్రాలను వదిలి, తల, మెడ, ఛాతీ, ఉదరం, చేతులు మరియు పాదాలు మొదలైన అన్ని అవయవాలపై వేళ్ళను కదిలించండి.

1 ఈ. బాధ యొక్క లక్షణం వ్యక్తమైనప్పుడు కూడా న్యాసం చేయడానికి అనుకూలమైన స్థానముగా గుర్తించాలి

కొన్నిసార్లు సమస్యకు స్థానాన్ని కనుగొనేటప్పుడు ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది. ఆధ్యాత్మిక నివారణలు బట్టి బాధ యొక్క లక్షణాలు (ఉదా. ఆవలింతలు, త్రేంపులు మరియు చికాకు కలిగించే చర్మ అనుభూతులు). అలాంటి సందర్భాల్లో, ఆ స్థానం కూడా న్యాసం చేయడానికి అనువైనదిగా పరిగణించాలి.

1 ఉ. మీరు కుడి చేతి వేళ్ళను ఉపయోగించి స్థానాన్ని కనుగొనలేకపోతే, ఎడమ చేతిని ఉపయోగించండి.

1 ఊ. రెండు చేతుల వేళ్ళతో స్థానాన్ని కనుగొనడం

ఒక చేతి వేళ్ళను ఉపయోగించి కుండలిని-చక్రాలలో లేదా శరీరంలోని ఇతర భాగాలలో ప్రాణశక్తి ప్రవాహంలో ఉన్న అవరోధములను మీరు కనుగొనలేకపోతే, రెండు చేతులను ఒక చేతి వెనుకభాగం మరొక అరచేతిపై ఉంచే విధంగా పట్టుకోండి, మరియు రెండు చేతుల వేళ్ళను ఉపయోగించి స్థానాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. రెండు చేతుల వేళ్ళను ఉపయోగించడం ద్వారా, ఎక్కువ ప్రాణ శక్తి ప్రసారం కావడంతో ఆ ప్రదేశంలో చికిత్స చేయవచ్చు. తత్ఫలితంగా, అవరోధము యొక్క పరిధి చిన్నది అయినప్పటికీ, అవరోధము యొక్క స్థానం గుర్తించబడుతుంది మరియు ఖచ్చితమైన కేంద్రముకు చికిత్స చేయగలుగుతాము.

 

1 ఋ. స్థానాన్ని కనుగొనడానికి వేళ్ళను కదిలించేటప్పుడు కొన్నిసార్లు భరించలేని అసౌకర్యం

కొన్ని సమయాల్లో, స్థానాన్ని కనుగొనడానికి మీరు మీ వేళ్ళను కదిలించే టప్పుడు, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటి తీవ్రమైన బాధలను మనం అనుభవించవచ్చు. సమస్య ఏమిటంటే, అవయవాల యొక్క సహజ కదలికకు వ్యతిరేక దిశలో వేళ్ళను కదిలించడం వల్ల ఈ బాధ వస్తుంది. ఒక ఉదాహరణ ఏమిటంటే – పెద్ద ప్రేగు యొక్క కదలిక దిగువ కుడి వైపు నుండి, నేరుగా ప్రక్కటెముక వరకు మరియు అక్కడ నుండి ఎడమ వైపున ప్రక్కటెముక వైపుకు మరియు తరువాత పొట్ట యొక్క ఎడమ వైపుకు ఉంటుంది. ఈ దిశకు వ్యతిరేకంగా వేళ్ళను కదిలించడం భరించలేని బాధను కలిగిస్తుంది. అటువంటి బాధ అనుభవించినప్పుడల్లా, వేళ్ళ కదలిక దిశ తప్పు అని మీరు గుర్తుంచుకోండి.

Reference : Sanatan’s Holy Text ‘Spiritual remedies on ailments caused by obstructions in the Pranashakti flow system’

Leave a Comment