ఆయుర్వేదం – అనాది మరియు శాశ్వతమైన మానవ జీవితము యొక్క శాస్త్రం!

ఆయుర్వేదం అంటే జీవితం యొక్క ‘వేదం’ లేదా మానవ జీవిత శాస్త్రం. అందులో శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక స్వస్థన్ని ఎలా నిర్వహించాలో మార్గదర్శకత్వం చూపిస్తుంది. జీవితానికి ప్రయోజనకరమైన మరియు హానికరమైన ఆహారం గురించి,  విహారము మరియు ఆచారము వీటి గురించి వివేచనము చేయబడినది.  ఇది మానవ జీవితము యొక్క లక్ష్యం (ధ్యేయము) గురించి మరియు  నిజమైన సుఖము ఎందులో వుందో దీని గురించి కూడా చెబుతుంది. అలాగే, ఇది వివిధ వ్యాధుల కారణాలు, దాని  లక్షణాలు,  చికిత్స మరియు రోగములు కాకుడదని వాటి నివారణ చర్యలను గురించి కూడా తెలియజేస్తుంది.  ఈ జన్మలోను, భవిష్యత్‌ జన్మలలోను నిత్య ఆనందం ఇది తరువాయి మనిషి అభివృద్ధిని ఎలా పొందాలో మరియు మన మానవ పుట్టుక యొక్క తుది లక్ష్యాన్ని ఎలా సాధించాలో, అన్ని దుఃఖాల నుండి శాశ్వత ఉపశమనం ఎలా పొందాలో మరియు ఈ జన్మలోను, భవిష్యత్‌ జన్మలలోను నిత్య ఆనందం యొక్క నిరంతర ఆధ్యాత్మిక అనుభవాన్ని ఎలా సాధించాలో ఇది మనకు మార్గన్ని చూపిస్తుంది. సంక్షిప్తంగా, ఆయుర్వేదం ఒక శాస్త్రం, ఇది మానవ జీవితానికి పూర్తి ఆలోచనను ఇస్తుంది మరియు విజయవంతమైన, యోగ్యమైన, దీర్ఘ మైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా గడపాలి అనే దాని గురించి మార్గదర్శకత్వం చూపిస్తుంది.

 

1. హిందూ ధర్మం ఇచ్చిన ప్రత్యేక బహుమతైన ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత

ఆయుర్వేదం అనేది రోజువారీ జీవితంలో, శాశ్వతమైన మరియు నిరంతర శాస్త్రం.

न चैव हि अस्ति सुतराम् आयुर्वेदस्य पारम् । – చరక సంహిత , విమన్‌ స్థాన్‌ , అధ్యాయం 8, వరుస 14

అంటే ఆయుర్వేద జ్ఞానానికి పరిమితులు లేవు. ఆయుర్వేదం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటుంది.

सोऽयमायुर्वेदः शाश्‍वतो निर्दिश्यते अनादित्वात् स्वभावसंसिद्ध-लक्षणत्वात् । – చరక సంహిత , సూత్రస్థాన్‌ , అధ్యాయం 30, వరుస 25

ఆయుర్వేదం శాశ్వతమైనది మరియు స్వీయ-నిరూపితమైన నిత్య శాస్త్రం. ఆయుర్వేదం అంటే జీవితం యొక్క ‘వేదం’, అంటే జీవితం గురించిన జ్ఞానం. జీవితం మరియు ఆరోగ్యం గురించి ఉపయోగకరమైన సమాచారం ఉన్న శాస్త్రాలన్నీ ఆయుర్వేదంలో అంతర్భాగం. ‘ప్రతి శాస్త్రం ఆయుర్వేదంలో విడదీయరాని భాగం’ అని ఆయుర్వేదం పట్ల పూర్వపు ఋషులు గొప్ప దృక్పథాన్ని కలిగి ఉన్నారు. ఈ విధానం ప్రకారం, హోమియోపతి, ఆక్యుపంక్చర్‌, అల్లోపతి, ఎలెక్ట్రోపతి, నేచురోపతి, మాగ్నెటోథెరపీ మొదలైనవి ఆయుర్వేదంలో భాగాలని, మనం అర్థం చేసుకోవాలి. వీటిని అన్నింటిని ఆయుర్వేద శాఖలుగా పరిగణించవచ్చు. ఆయుర్వేదం అనే ఈ భారీ వృక్షం క్రింద, ప్రతి శాఖ వారి ప్రత్యేకతను కాపాడుకోవాలి మరియు వారి శాఖను కూడా విస్తరించాలి. ఈ భారీ ఆయుర్వేదాన్ని అధ్యయనం చేయడానికి, దాని ప్రాథమిక సూత్రాలను కూడా అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

‘न अनौषधं जगति किंचित् द्रव्यम् उपलभ्यते ‘ । – చరక సంహిత , సూత్రస్థాన్‌ , అధ్యాయం 26, వరుస 12

అంటే ఆయుర్వేదం ప్రకారం, ఈ ప్రపంచంలో ఔషధంగా ఉపయోగించలేని ఒక్క పదార్థం కూడా లేదు. ఆయుర్వేదం మొక్కల యొక్క లక్షణాలను మానవ శరీరంపై వాటి ప్రభావాల ప్రకారం వివరించింది, ఉదాహరణ – ‘పింప్లి’ వేడిని కలిగిస్తుంది, అయితే ‘ఆమ్లా’ చల్లధనాన్ని కలిగిస్తుంది. అయితే ‘పింప్లి’ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని, ‘ఆమ్లా’ ఉష్ణోగ్రత తక్కువగా ఉందని దీని అర్థం కాదు. అవి తాకడానికి వేడి లేదా చల్లగా ఉండవు. వేడి కలిగించే గుణం వున్నా పదార్థాలు జీవక్రియ రేటును పెంచుతాయి, అయితే చలువను కలిగించే గుణం వున్నా పదార్థాలు జీవక్రియ రేటును తగ్గిస్థాయి. వేడి పదార్థాలు రక్తనాళ వ్యాకోచానికి కారణమవుతాయి, అయితే చల్లని పదార్థాలు రక్తనాళ సంకోచానికి కారణమవుతాయి. ఆయుర్వేదం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు మరియు ఒగరు కలిగిన ఆహారం గురించీ మరియు పదార్థాలలోని ధాతుకామ్లము  మరియు మలం గురించీ చక్కగా వర్ణించింది అలాగే వాటి లోపాలను కూడా వివరిచింది.

చాలా వరకు ఆయుర్వేదంలో పేర్కొన్న ఔషధ మొక్కలు గ్రామాల్లో లభిస్తాయి. అందువల్ల వ్యాధుల నివారణకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడానికి మామూలుగా లభించే ఔషధ మొక్కల వాడకం గురించి సమాచారం ఆయుర్వేదంలో లభిస్తుంది.

‘చరక’ మరియు ‘సుశ్రుత’ యుగంలో ఒక వనస్పతుల మొక్క లను వివిధ భాగాలను ఔషధాలుగా ఉపయోగించేవారు. చాలా ఔషధ మొక్కల సంస్కృత పేర్లు ఆ మొక్క యొక్క ప్రత్యేక ధర్మం మరియు చర్య గురించి సమాచారాన్ని ఇస్తాయి.ఉదాహరణ- ‘ కుష్టు వ్యాధి’ కు ‘కుష్ట’ అనే ఔషధ మొక్క ఉపయోగపడుతుంది, జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంచడానికి ‘బ్రాహ్మి’ ఉపయోగపడుతుంది, ‘అశ్వగంధ’ అంటే గుర్రం లాంటి వాసన కలిగిన. అశ్వ అంటే గుర్రం అంటే ‘మనిషి’ (మగ). అందువల్ల పురుష జననాంగాల బలాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఔషధ మొక్క అశ్వగంధ. ‘బాలంతశోప’ ను సంస్కృతంలో ‘శతపుష్ప’ అంటారు. పుష్ప అంటే పువ్వు. ఈ మొక్క స్త్రీ జననాంగాలపై పనిచేస్తుంది. ‘మేధా’ మరియు ‘మహామేధ’ శరీరంలోని కొవ్వు లోహాన్ని పెంచడానికి సహాయపడే ఔషధ మొక్కలు, తద్వారా బరువు పెరగడానికి సహాయపడుతుంది.

A. ఆయుర్వేదము యొక్క మహనీయమైన పరంపరా

కాయ, శల్య, శాలాక్య, బాల్య, గ్రహ, విష, రసాయన మరియు వాజికరణ మొదలగునవి ఎనిమిది భాజకములు. ఆయుర్వేదము యొక్క సర్వ సంహితలు మరియు సంగ్రహలు గ్రంథములో బ్రహ్మదేవుడు ఆదిప్రవక్తలని అన్నారు.

బ్రహ్మదేవుడు కూడ విద్య దక్షుడు ప్రజాపతి మరియు భాస్కరునికి ఇచ్చాడు. దక్షుడు ఆయుర్వేద విషయ పరంపరలో  సిద్ధాంతమునకు మరియు భాస్కరుని పరంపరలో చికిత్సాపద్ధతికి ప్రాధాన్యత కలదు. దక్షుడు ప్రజాపతివద్ద  అశ్వినికుమారుడు సమగ్ర ఆయుర్వేదము యొక్క అధ్యయనము చేశాడు. అమతమును పొందుటకు ఔషధములను ఎన్నుకొని సరియైన స్థానములో నాటడము, ఇది అశ్వినికుమారుడి విశేషమైన కార్యమైనది. అశ్వినికుమారుడు తన వైద్యము ద్వారా వద్ధుడైన చ్యవనఋషికి యువవస్థ (తారుణ్యము)ను ప్రాప్తింపజేశాడు, అశ్వినికుమారుడే ఇంద్రుడికి ఆయుర్వేదమును నేర్పించాడు. ఇంద్రుడు భగు, అంగిరా, అత్రి, వసిష్ఠ, కశ్యప, అగస్త, పులస్య, వామదేవ, అసిత మరియు గౌతమ ఈ పదిమంది ఋషులకు ఆయుర్వేదము యొక్క జ్ఞానాన్ని కలుగజేశాడు.

చరకసూత్రము మరియు చరకసంహితలో చెప్పబడిన ఆయుర్వేదము యొక్క గొప్పతనము

1. ‘ఆయుర్వేదము అనగా దీర్ఘ్గాష్యము గురించి ఆలోచించే వేదము. దీని వ్యాఖ్య – ‘తత్రయుర్వేదయతీత్యాయుర్వేదః… యతశ్చాయుష్యణ్యనాయుష్యాణి చ ద్రవ్యగుణకర్మాణి వేదయత్యతోSప్యాయుర్వేదః |’అనగా ఏదైతే ఆయుష్యము యొక్క జ్ఞానాన్ని కలుగజేస్తుందో అది అని అర్థము.

2. హిందు ధర్మము యొక్క అద్వీతీయమైన వరము గల ఆయుర్వేదము యొక్క ప్రాముఖ్యత

ఆయుర్వేదం అనేది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక వృద్ధికి సహాయపడే ఆరాధన పద్ధతులలో ఒకటి, ఇది ఒక వ్యక్తికి యుగం మరియు అతని స్వభావాన్ని బట్టి ‘యమ-నియమం’ (ఐదు నైతిక ధర్మాలు మరియు ఐదు నియమాలను) ఎలా పాటించాలో నేర్పిస్తుంది. ఈ విధంగా, ఒక వ్యక్తి తన విధి ప్రకారం ఒక వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, అతని ప్రవర్తన ఆయుర్వేదం చెప్పినట్లుగా ఉంటే, ఆ మూర్తీభవించిన ఆత్మ ప్రతికూల శక్తుల బాధతో బాధపడకుండా బాధను తట్టుకోవడం సులభం అవుతుంది. ఆ వ్యక్తి ఆధ్యాత్మిక వృద్ధిని కూడా పొందుతాడు.

శ్రీ. నిషాద్‌ దేశ్‌ముఖ

 

2. ఆయుర్వేద ఉపచారపద్ధతి ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన

ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మాత్రమే అత్యున్నతమైన ఆనందాన్ని పొందవచ్చు. ఈ సత్యాన్ని పురాతన ఋషులు మరియు సాధువులు తెలుసుకున్నందున, వారు ఆధ్యాత్మిక సాధన యొక్క కోణం నుండి వివిధ పద్ధతులు మరియు శాస్త్రాలను కనుగొన్నారు. ఆయుర్వేద అభ్యాసం దీనికి మినహాయింపు కాదు. ఈ విధంగా, ఆరాధన యొక్క సాధారణ పద్ధతులకు సమగ్రమైన ధర్మాలు మరియు యోగ్యతలు కూడా ఆయుర్వేదంలో కనిపిస్తాయి. దాని యొక్క విశ్లేషణ క్రింద ఇవ్వబడింది.

2అ . ఆయుర్వేదం యుగం మరియు స్వభావం ప్రకారం మార్గదర్శకత్వం చూపిస్తుంది.

ఆయుర్వేదం మూర్తీభవించిన ఆత్మకు మంచి ప్రవర్తనను కలిగి ఉండటానికి, యుగం మరియు అతని స్వభావాన్ని బట్టి సంయమనం యొక్క నియమాలను అనుసరించడానికి మార్గనిర్దేశం చూపిస్తుంది. ఉదాహరణకు, ఏ ఋతువులో ఎంత నిష్పత్తిలో ఏ ఆహార పదార్థాలను తినాలి? వృద్ధాప్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైనవి. ఈ విధంగా మూర్తీభవించిన ఆత్మ యుగం మరియు స్వభావం ప్రకారం ప్రవర్తించడం వల్ల, అతను అవసరమైన శక్తిని పొందుతాడు మరియు అతని ఆధ్యాత్మిక అభ్యాసం శారీరక, మానసిక మరియు ఇతర వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించబడదు మరియు బదులుగా అతని ఆధ్యాత్మిక సాధన యొక్క పెరుగుదలకు ఉపయోగించబడుతుంది.

2ఆ. ఆయుర్వేదంలో చెప్పిన ‘యమ-నియమం’ (ఐదు నైతిక ధర్మాలను పాటించడం మరియు ఐదు నియమాలు) పాటించడం వల్ల మనస్సు అధీనంలో ఉండటానికి సహాయపడతాయి

ఆయుర్వేదంలో మందులతో పాటు సంయమనం పాటించడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి, మూర్తీభవించిన ఆత్మ మందులు తీసుకోవడంతో పాటు ‘యమ-నియం’ ను అనుసరించాలి. ఔషధాలకు సంబంధించి ‘యమ-నియం’ ను అనుసరించడం ద్వారా, మూర్తీభవించిన ఆత్మ అతని కోరిక ప్రకారం ప్రవర్తించడం మానేస్తుంది మరియు ఇది కొంతవరకు మనస్సును అధీనంలో ఉంచడానికి సహాయపడుతుంది.

2 ఇ. శారీరక అనారోగ్యంతో పాటు ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక బాధలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

పురాతన కాలంలో వైద్యులు ఒక వ్యాధికి మూలకారణాన్ని అర్థం చేసుకోగలిగేవారు. అందువల్ల, వారు ఔషధాలను అభిమంత్రించి ఇచ్చేవారు, ఇది అతని శారీరక అనారోగ్యంతో పాటు అతని మానసిక మరియు ఆధ్యాత్మిక బాధలను తగ్గించడంలో కూడా సహాయపడేది. అదేవిధంగా, ఆయుర్వేదం మనసుకు బాధ కలిగించే చర్యలను చేయకూడదని కూడా మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఉదాహరణకు ఏ ఋతువులో భౌతిక సంబంధాలను కొనసాగించాలి మరియు ఏ ఋతువులో అవి చేయకూడదు తెలియజేస్తుంది? సంక్షిప్తంగా చెప్పాలంటే శారీరక అనారోగ్యంతో పాటు ఆయుర్వేద చికిత్స కారణంగా మానసిక మరియు ఆధ్యాత్మిక బాధలు కూడా తగ్గుతాయి.

2ఈ . శరీరంలో ఎటువంటి తత్వం లోపం ఉందో తెలపడం ద్వారా ఆధ్యాత్మిక సాధన గురించి మార్గదర్శకత్వం చూపించడంలో కూడా సహాయపడుతుంది.

భగవంతునితో ఏకీభావంతో ఉండటానికి అవసరమైన తత్వాన్ని పొంది దేవుని సాక్షాత్కారం పొందడానికి వివిధ ఆధ్యాత్మిక మార్గాలు ఆధ్యాత్మిక సాధన యొక్క వివిధ మార్గాల గురించి ఎలా మార్గదర్శకత్వం ఇస్తాయో, ఆయుర్వేదం కూడా అదేవిధంగా పనిచేస్తుంది. పంచభూతాలు దేవుని యొక్క అత్యున్నత శక్తి. మూర్తీభవించిన ఆత్మలో ఈ ఐదు విశ్వ సూత్రాల(పంచభూతాలు) సమీకరణంలో ఏమైనా మార్పు ఉంటే, ఆ వ్యక్తిలో ‘కఫా’, ‘వాత’ మరియు ‘పైత్యము’ పెరుగుతాయి మరియు ఆ వ్యక్తి వివిధ వ్యాధులతో బాధపడతాడు. ఆయుర్వేదం ‘కఫా’, ‘వాత’ మరియు ‘పిత్త’ యొక్క సమతుల్యతను కొనసాగించడాన్ని బోధిస్తుంది, అంటే శరీరంలోని ఐదు విశ్వ సూత్రాలలో ఏ సూత్రం అయితే లోపం ఉందో ఆ సూత్రాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, ఆయుర్వేదంలోని ఎనిమిది తంత్రాల (ఆయుర్వేదంలోని శాఖలు) నుండి, ‘భూత-విద్య’ తంత్రంలో ఒకటి. ఈ తంత్రంలో భగవంతుడు మరియు గ్రహాల వల్ల కలిగే రుగ్మతలు ఉన్నాయి, అనగా దైవిక శక్తి లోపం వల్ల కలిగే రుగ్మతలు మరియు దాని చికిత్సలు ఉన్నాయి.

 

3. అనారోగ్యానికి కారణం ప్రారబ్ధం అయినప్పటికీ ఆయుర్వేధం సృష్టించబడటానికి కారణం

మూర్తీభవించిన ఆత్మలో ఉత్పన్నమయ్యే అన్ని వ్యాధులు ప్రారబ్ధం (ఈ జన్మలో అనుభవించవలసిన విధి) వల్ల మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకంగా చేయకూడని చర్యల వల్ల కూడా వస్తాయి. విధి మరియు ఉద్దేశపూర్వకంగా చేయకూడని చర్యల వల్ల కలిగే వ్యాధులను భరించడానికి మరియు నయం చేయడానికి, దేవుడు ఆయుర్వేద జ్ఞానాన్ని సమాజానికి ఇచ్చాడు.

 

4. విధి వలన కలిగే వ్యాధులకు ఆయుర్వేద చికిత్స వల్ల ప్రయోజనం

4 అ. మూర్తీభవించిన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసానికి ఆయుర్వేద చికిత్స ఎటువంటి హాని కలిగించదు

మూర్తీభవించిన ఆత్మ వ్యాధిగ్రస్తుడైనప్పుడు, ప్రారంభంలో అతని ప్రాణశక్తి వ్యాధితో పోరాడటానికి సక్రియం అవుతుంది. వ్యాధికి కారణమయ్యే జీవి చాలా శక్తివంతమైనది మరియు మూర్తీభవించిన ఆత్మ యొక్క ప్రాణశక్తి దానితో పోరాడలేకపోతే, ఆ వ్యక్తి యొక్క వ్యాధి పెరుగుతుంది. ప్రత్యేకంగా రోగి ఆధ్యాత్మికత సాధన చేస్తుంటే అతని మనస్సు యొక్క శక్తి చురుకుగా ఉంటుంది. విధి కారణంగా వ్యాధి వల్ల కలిగే శరీర మరియు మనస్సు యొక్క స్థితిని చాలా మంది రోగులు అంగీకరించలేరు. విధిని భరించాలి మరియు పూర్తి చేయాలి అనే జ్ఞానం వారికి లేనందున ఇలా ప్రవర్తిస్తారు. అందువల్ల, వారు తమ మనస్సు యొక్క శక్తి ఆధారంగా తేలికపాటి విధి కారణంగా కలుగుతున్న వ్యాధులతో పోరాడగలుగుతారు. ఈ కారణంగా వారు మునుపటి జన్మలలో పొందిన ఆధ్యాత్మిక సాధనను కోల్పోతారు. ఈ విధంగా ఆధ్యాత్మిక సాధనను వ్యాధులు వంటి కారణాల కోసం ఖర్చు చేసినప్పుడు, మూర్తీభవించిన ఆత్మ ఆధ్యాత్మిక పురోగతి సాధించడంలో విఫలమవుతుంది మరియు బదులుగా ఆధ్యాత్మిక క్షీణత అవుతుంది. 71 శాతం ఆధ్యాత్మిక స్థాయిని సాధించిన తర్వాత, ఈ వ్యాధి విధి వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్య వల్ల సంభవించిందో అర్థం చేసుకోవడం సులభం. అలాగే, ఈ ఆధ్యాత్మిక స్థాయిలో, మూర్తీభవించిన ఆత్మ యొక్క మనస్సు క్రియాశూన్యం అయినందువల్ల మరియు అతని మనస్సు యొక్క పరిశీలకుడి వైఖరితో(సాక్షిగా) వ్యాధిని చూడగలుగుతాడు; విధి కారణంగా పొందిన తన వ్యాధులను నయం చేయాలి అనే ఆలోచనలు అతనికి రావు. 71 శాతం కంటే తక్కువ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న మూర్తీభవించిన ఆత్మల యొక్క బాధలను తగ్గించడానికి ఆయుర్వేదం రూపొందించబడింది. ఆయుర్వేదం ఆధ్యాత్మిక సాధన చేసే మార్గాలలో ఒకటి కాబట్టి, ఆయుర్వేద చికిత్సను అనుసరించడం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు మూర్తీభవించిన ఆత్మ చేత చేయబడిన ఆధ్యాత్మిక అభ్యాసం వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించకుండా అతని ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ఈ విధంగా, ఆయుర్వేద చికిత్స ద్వారా, తేలికపాటి విధి కారణంగా పొందిన వ్యాధి నయమవుతుంది, మధ్యస్థ విధి కారణంగా పొందిన వ్యాధి ప్రభావం తగ్గుతుంది, అయితే తీవ్రమైన విధి కారణంగా పొందిన వ్యాధిని, భరించే శక్తిని పొందుతారు.

4 ఆ. ఆయుర్వేద చికిత్సా విధానం మూర్తీభవించిన ఆత్మపై ప్రతికూల శక్తుల దాడిని(సూక్ష్మంగా) తగ్గిస్తుంది

మూర్తీభవించిన ఆత్మ అనారోగ్యానికి గురైనప్పుడు, అతని శరీరంలో రజ – తమ భాగాలు పెరుగుతాయి మరియు ప్రతికూల శక్తులతో పోరాడటానికి అతని శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. ప్రతికూల శక్తులు ఈ స్థితిని సద్వినియోగం చేసుకొని మూర్తీభవించిన ఆత్మపై దాడి చేసి అతని శరీరంపై నియంత్రణ సాదిస్తాయి మరియు రాబోతున్న కాలంలో అతనికి ఇంకా బాధలు కలిగిస్తూ ఉంటాయి. మరణం సమయంలో కూడా, మూర్తీభవించిన ఆత్మ యొక్క స్థితి బలహీనంగా మారుతుంది. ప్రస్తుత అల్లోపతి చికిత్స మరియు వైద్య సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం మూర్తీభవించిన ఆత్మ యొక్క ముఖ్యమైన శక్తిని మరింత వెనక్కి తగ్గించడానికి కారణమవుతున్నాయి. ఇవి శరీరంలోని వివిధ పనికిరాని వాయువుల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది శరీరం యొక్క ప్రాణశక్తిని తగ్గిస్తుంది మరియు ‘ప్రాణశక్తి’ ప్రవాహ వ్యవస్థలో వివిధ అవరోధాలను కలిగిస్తుంది. ఇది సూక్ష్మ శరీరానికి ‘ప్రాణం’ (ఉచ్ఛ్వాస చర్యలో పాల్గొనే ఐదు ముఖ్యమైన శక్తులలో ఒకటి) వదిలివేయడానికి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, ప్రతికూల శక్తులు సూక్ష్మ శరీరంపై సులభంగా నియంత్రణ సాధించి లక్షల సంవత్సరాలు బానిసగా చేస్తాయి. దీనికి విరుద్ధంగా ఆయుర్వేద చికిత్స మూర్తీభవించిన ఆత్మ యొక్క శక్తి పురోగతికి సహాయపడుతుంది. ప్రాణాధారమైన శక్తి యొక్క పురోగతి ఉన్నందున, దాని ప్రవాహం ‘ప్రాణశక్తి’ ప్రవాహ వ్యవస్థలో చురుకుగా ఉంటుంది మరియు వ్యవస్థలో ఎటువంటి అవరోధాలు కలిగించవు. అందువల్ల మరణం సమయంలో, ఈ ప్రాణాధార శక్తి ఆధారంగా, సూక్ష్మ శరీరానికి స్థూల శరీరాన్ని విడిచిపెట్టడం సులభం అవుతుంది మరియు ప్రతికూల శక్తుల దాడి నుండి సూక్ష్మ శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

4 ఇ. ఆయుర్వేద చికిత్స వల్ల శరీర ఎరుకను తగ్గించడం వల్ల మూర్తీభవించిన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సులభతరం అవుతుంది

ప్రస్తుత ఆధునిక ఔషధం మరియు వైద్య సాంకేతిక పరిజ్ఞానం మూర్తీభవించిన ఆత్మకు తన శరీరం గురించి ఎరుకలో ఉండేలా చేస్తుంది. అందువల్ల మరణ సమయంలో అతని స్థూల శరీరాన్ని మరియు దానికి సంబంధించిన బంధాలను విడిచిపెట్టడానికి అతనికి కష్టమవుతుంది. ఆయుర్వేదంలో ప్రార్థనలు, మంత్రాలు (శ్లోకాలు), సంయమనం మొదలైన వివిధ రకాల చికిత్సా పద్దతులు మూర్తీభవించిన ఆత్మ యొక్క మనస్సుపై ప్రభావం చూపుతాయి, అంటే అతను నిరంతరం దేవుని ధ్యాసలో ఉంటాడు మరియు అతని శరీరం, ఆత్మ రెండు భిన్నం అనే ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాడు. ఈ భావం వల్ల ఆ వ్యక్తికి శరీరం గురించిన ఎరుక తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా మూర్తీభవించిన ఆత్మ మరణ సమయంలో స్థూల శరీరంతో సంబంధాన్ని విడిచిపెట్టడానికి తేలికవుతుంది.

4 ఈ. ఆయుర్వేద చికిత్స మూర్తీభవించిన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది

ఆయుర్వేద చికిత్సతో శరీరంలోని వ్యాధిగ్రస్తమైన భాగాలు కూడా ప్రాణాధారమైన శక్తిని కలిగి ఉంటాయి. అందువల్ల, భౌతిక శరీరం విధి కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ప్రతికూల శక్తులు దాడి చేసి, శరీరంలో వ్యాధులు కలిగించలేవు. ఆయుర్వేద చికిత్స శరీరంలో ప్రాణాధారమైన శక్తిని అవసరమైన నిష్పత్తిలో పైకి లేదా క్రిందికి దిశలో కలుపుతుంది. పై దిశలో ప్రాణాధారమైన శక్తి ప్రవాహం వల్ల కుండలిని చక్రం సున్నితంగా మారుతుంది. ఈ కారణంగా, మూర్తీభవించిన ఆత్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు, సంబంధిత కుండలిని చక్రంపై ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రభావం ఆ నిర్దిష్ట చక్రం యొక్క మేల్కొలుపునకు కారణమవుతుంది మరియు తద్వారా ఆ మూర్తీభవించిన ఆత్మ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు, ప్రాణాధారమైన శక్తి యొక్క దిగువ ప్రవాహం వివిధ వాయువుల ఉత్పత్తికి కారణమవుతుంది, ఇది శరీరం దాని విభిన్న కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి సహాయపడుతుంది. సంక్షిప్తంగా, ఆయుర్వేద చికిత్స మూర్తీభవించిన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది.

4 ఉ. ముగింపు

అనారోగ్యం రూపంలో తీవ్రమైన విధిని భరిస్తూనే శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో సహాయం చేయడానికి సమాజానికి ఆయుర్వేద జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అందువల్ల, మూర్తీభవించిన ఆత్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధన చేయగలదు మరియు తద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించగలదు.

– శ్రీ నిషాద్‌ దేశ్ముఖ్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా (22.08.2018, మధ్యాహ్నం 12.51)

 

5. విధి కారణంగా వ్యాధులు సంభవించినప్పుడు, ఆయుర్వేదం ఎందుకు సిఫార్సు చేయబడింది?

‘అన్ని వ్యాధులకు మూలకారణం అన్యాయం. సత్యయుగంలో, ధర్మం దాని నాలుగు పాదాలైన నిజం, స్వచ్ఛత, తపస్సు మరియు బిక్షపై నిలిచింది. ఆ సమయంలో అనారోగ్యాలు లేవు. త్రేతాయుగంలో, నాలుగు కాళ్ళలో ఒకటైన, నిజం లోపించడం అన్యాయానికి దారితీసింది. అందువల్ల ఇది రుగ్మతలకు దారితీసింది. ఈ రుగ్మతలు ఋషుల ఆధ్యాత్మిక సాధనలో అవరోధాలను కలిగించాయి. ఈ అడ్డంకులను తొలగించడానికి, ఋషులు తమ ఆధ్యాత్మిక సాధనను సక్రమంగా చేయగలిగేలా, భరద్వాజ ఋషి దేవత ఇంద్రుడి నుండి ఆయుర్వేదం నేర్చుకున్నారు మరియు ఇతర ఋషులకు కూడా నేర్పించారు. (సూచన: సూత్రస్థాన్‌, అధ్యాయం 1) ఆ విధంగా, ఆధ్యాత్మిక సాధన నుండి వివిధ రుగ్మతల రూపంలో వస్తున్న అడ్డంకులను తొలగించడానికి, ఆయుర్వేదం భూమిపై ఆవిర్భవించింది.

విధిని భరించాలి; కానీ ఆధ్యాత్మిక సాధన దాని తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ‘దైవ-వ్యాపాశ్రయ చికిత్సను’ ఆయుర్వేదం సిఫార్సు చేసింది. ‘దైవ-వ్యాపాశ్రయ చికిత్స’ అంటే జపం చేయడం, ప్రవర్తనా నియమాలు పాటించడం, మంత్ర జపం చేయడం, ప్రాయశ్చిత్తం, యద్న్యం , శాంతి వంటి ఆధ్యాత్మిక సాధన చేయడం.

అన్ని రుగ్మతలు విధి కారణంగా కాదు. వాటిలో కొన్ని ఉద్దేశపూర్వకమైన తప్పు చర్యల వల్ల కూడా వస్తాయి. సరైన ఉద్దేశపూర్వక చర్యలతో ఈ రుగ్మతలను నివారించడానికి లేదా అప్పటికే సంభవించిన రుగ్మతలను నయం చేయడానికి ఆయుర్వేదం ఉంది.

ఈ జన్మలో ఉద్దేశపూర్వక చర్యలు మన తదుపరి జన్మ యొక్క విధి. అందువల్ల మన ఉద్దేశపూర్వక చర్యలు తప్పుగా ఉండకుండా మరియు మన తదుపరి జన్మకు విధి ప్రోగుచేసుకోకుండా, ఆయుర్వేదం ప్రకారం మన ప్రవర్తన ఉండాలి.

– వైద్యులు మేఘరాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా (22.8.2018)

 

6. ఆయుర్వేదం – రుగ్మత యొక్క మూల కారణం మరియు దాని చికిత్స కూడా మనకు చెప్తుంది!

ఆధునిక ఔషధం

ఆయుర్వేదం

1. ఔషధాల ప్రభావం ఈ మందులు రసాయనాలతో మరియు కృత్రిమమైన వాటితో చేయబడినవి కాబట్టి, ఎక్కువకాలం తీసుకుంటే, అవయవాలు పనిచేయకపోవచ్చు. ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలు మానవ శరీరానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి, అవి ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించవు మరియు శరీరం వాటిని పూర్తిగా జీవక్రియ చేయగలదు.
2. ఔషధం ప్రభావం చూపించు భాగాలు శరీరం మొత్తం శరీరం మరియు మనస్సు
3. రోగ నిర్ధారణ రకం సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా మాత్రమే ఆయుర్వేదం ఉపవేదం కాబట్టి, ఇది మూలకారణమైన ‘వాతము’, ‘పైత్యము’, ‘కఫము’ వైఖరి ప్రకారం పనిచేస్తుంది మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
4. ‘ఆధిదైవిక (ప్రతికూల శక్తులు మరియు అధీన దేవతల కారణంగా బాధలు; ఉదాహరణకు, తీవ్రమైన వాతావరణం, భూకంపం, అధిక వర్షం లేదా వర్షం లేకపోవడం) చికిత్స మరియు ‘గ్రహబాధ’ పై ‘చికిత్స’ (గ్రహాల చెడు ప్రభావాల కారణంగా) లేదు ఉంది
5. గర్భధారణకు ముందు ఉత్తమ నాణ్యతను కలిగి ఉన్న అండం మరియు వీర్యకణాలను ఉత్పత్తి చేయగల చికిత్స లేదు పునరుత్పత్తి ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్‌ తరాలను కలిగి ఉండటానికి, ఆయుర్వేదంలో గర్భధారణకు ముందే వీర్యకణాలు మరియు అండం యొక్క ఉత్తమ నాణ్యతను పొందడానికి చికిత్స ఉంది. అలాగే, గర్భం దాల్చిన తరువాత, పెరుగుతున్న పిండాన్ని పోషించడానికి మరియు ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రతి నెల ఆయుర్వేద కషాయాలను ఇవ్వడం ద్వారా చికిత్స ఇస్తుంది.
సేకరణ : మరాఠి దిన పత్రిక ‘సనాతన ప్రభాత్‌’

Leave a Comment