దిష్టి మరియు చేతబడిని నివారణ చేయుటలో గల ప్రాముఖ్యత దిష్టి

 

1. కొబ్బరికాయను ఉపయోగించి దిష్ట మరియు
చేతబడిని నివారణ చేయుటలో గల ప్రాముఖ్యత దిష్టి

1 అ. కొబ్బరికాయ సానుకూల మరియు ప్రతికూల తరంగాలను ఆకర్షిస్తుంది. రజ – తమ ప్రధాన తరంగాలను తక్కువ సమయంలో కొబ్బరికాయ ఆకర్షిస్తుంది మరియు కొబ్బరికాయ యొక్క స్వాభావిక సాత్వికత(స్వచ్ఛత) కారణంగా, అవి కొబ్బరికాయ లోపల పెద్ద మొత్తంలో విచ్ఛిన్నమవుతాయి.

1 ఆ. దిష్టినివారణ ప్రయోజనం కోసం ఉపయోగించే ఇతర పదార్ధాలతో పోల్చినప్పుడు కొబ్బరికాయకు దిష్టితొలగించే సామర్థ్యం ఎక్కువ; అందువల్ల, సూక్ష్మ- దేహం నుండి నల్ల శక్తి యొక్క వలయాన్ని తొలగించే సామర్థ్యంలో ఇది ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. తీవ్రమైన స్వభావం గల ఏదైనా కుదృష్టిని కొబ్బరికాయను ఉపయోగించి నివారించవచ్చు.

1 ఇ. కొబ్బరికాయ కుదృష్టిని తొలగించడానికి కావలసిన గుణాలన్నిటినీ కలిగి ఉంటుంది.అందువల్ల, ఏ రకమైన కుదృష్టిని తొలగించడానికైనా మరియు చేతబడిను తొలగించడానికైనా ఉపయోగించవచ్చు.

 

2. కొబ్బరికాయను ఉపయోగించి దిష్టినివారణ చేయు విధానం

2 అ. ప్రార్థించు విధానం

కుదృష్టితో బాధపడుతున్న వ్యక్తి దేవత మారుతికి నమస్కారం చేసి ఇలా ప్రార్థించాలి – ‘ఓ మారుతి, నాలోని బాధ కలిగించే ప్రకంపనలన్నింటినీ (తమ పేరు ఉచ్చరించుకొని) ఈ కొబ్బరికాయలోకి ఆకర్షించి మరియు వాటిని నాశనం చేయండి’.

కుదృష్టి నివారణ చేయు వ్యక్తి దేవత మారుతికి నమస్కారం చేసి ఇలా ప్రార్థించాలి – ’ఓ మారుతి, చెడు కన్నుతో బాధపడుతున్న వ్యక్తి యొక్క శరీరం లోపల మరియు వెలుపల ఉన్న అన్ని బాధ కలిగించే ప్రకంపనలను ఈ కొబ్బరికాయలోకి ఆకర్షించి మరియు వాటి మూలం నుండి నాశనం చేయండి . దిష్టినివారణ చేసేటప్పుడు మీ యొక్క రక్షణ కవచము దయతో నా చుట్టూ నిరంతరం ఉండనివ్వండి ’.

2 ఆ. తీసుకోవలసిన చర్య

1. దిష్టినివారణకు ఉపయోగించే కొబ్బరికాయను కేవలం ముందుభాగంలో పీచు ఉంచి మిగతా కాయ అంతా పీచును తీసివేయాలి.

2. దిష్టినివారణ చేయు వ్యక్తి కొబ్బరికాయను తన దోసిలిలో చేతుల్లో పట్టుకొని బాధిత వ్యక్తి ముందు నిలబడాలి. కొబ్బరికాయ యొక్క పీచు భాగం బాధిత వ్యక్తికి ఎదురుగా ఉండాలి.

3. బాధిత వ్యక్తి కొబ్బరికాయ పీచును చూడాలి.

4. కొబ్బరికాయను మూడుసార్లు సవ్యదిశలో బాధిత వ్యక్తి పాదాల నుండి తలపైకి సవ్యదిశలో త్రిప్పాలి. తరువాత బాధిత వ్యక్తి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయండి. ఈ ప్రదక్షిణల సమయంలో, కొబ్బరికాయ పీచు భాగం వ్యక్తికి ఎదురుగా ఉండాలి. ఈ పద్ధతిని వ్యక్తుల సమూహాన్ని ఒకే చోట కూర్చోబెట్టి కూడా కుదృష్టిని సమిష్టిగా తొలగించవచ్చు.

 

3. చెడు కన్ను తొలగించడానికి ఉపయోగించిన
కొబ్బరికాయను ఈ క్రింది విధంగా పారవేయాలి

అ. బాధిత వ్యక్తికి తేలికపాటి లేదా మితమైన బాధ ఉంటే, దిష్టినివారించడానికి ఉపయోగించే కొబ్బరికాయను మూడు రోడ్ల కూడలి(కలయిక) వద్ద పగలుకొట్టాలి.

ఆ. ఒకవేళ బాధిత వ్యక్తి యొక్క బాధ తీవ్రంగా ఉంటే, దిష్టినివారించడానికి ఉపయోగించిన కొబ్బరికాయను మారుతి ఆలయంలో పగలుకొట్టాలి. మారుతి ఆలయం సమీపంలో లేకపోతే, దగ్గర్లో ఉన్న దేవాలయం మెట్ల మీద కొబ్బరికాయను పగలుకొట్టాలి, ఆ దేవాలయంలో దేవత జాగృత స్థితిలో లేదా ఉన్నతమైన స్థాయి శక్తి కలిగిన దేవత అయుండాలి. కొబ్బరికాయను మెట్లపై పగలుకొట్టకుండా వదిలేయడం తప్పు. కొబ్బరికాయను పగలుకొట్టడం సముచితం.

ఇ. ఒకవేళ బాధిత వ్యక్తి తీవ్ర బాధతో బాధపడుతుంటే, కొబ్బరికాయ ప్రవహించే నీటిలో వదిలేయాలి.

ఈ. పైన పేర్కొన్న అంశాలు ఏవీ సాధ్యం కాకపోతే, అప్పుడు ఇంటి దగ్గర దేవత మారుతి యొక్క సాత్విక చిత్రాన్ని ఆరాధించి, ప్రతికూల శక్తులను నాశనం చేయమని దేవత మారుతిని ప్రార్థించి, ఆపై దేవత మారుతి చిత్రానికి ముందు కొబ్బరికాయను పగలుకొట్టండి.

ఉ. కొబ్బరికాయను పగలుకొట్టేటప్పుడు లేదా నీటిలో వదిలేటప్పుడు, దేవత మారుతిని మూడుసార్లు,‘ జై ఆంజనేయ’అని చెప్పాలి.

ఊ. సాధారణంగా, దేవునికి నైవేద్యంగా సమర్పించిన కొబ్బరికాయను తింటాము; కానీ, కుదృష్టిని తొలగించడానికి ఉపయోగించిన కొబ్బరికాయను తినకూడదు; ఎందుకంటే కొబ్బరికాయలోకి దుష్ట శక్తి ఆకర్షించబడిన కారణంగా అది తినడం వల్ల మరల భాద వస్తుంది.

 

4. కొబ్బరికాయను ఉపయోగించినప్పుడు
దిష్టినివారణ సమయంలో జరుగు సూక్ష్మ-ప్రక్రియ

కుదృష్టిని నివారించడానికి కొబ్బరికాయను ఉపయోగించినప్పుడు జరుగు సూక్ష్మ-ప్రక్రియను వర్ణించే చిత్రం

గమనిక

1. బాధ కలిగించే కంపనాలు : 4 %

2. సూక్ష్మ-జ్ఞానం ఆధారంగా చిత్రంలోని ప్రకంపనల నిష్పత్తి : దైవిక శక్తి 0.75%, మారక-శక్తి 2% మరియు దుష్ట శక్తి 3%.

3. ఇతర అంశాలు :

అ. కొబ్బరికాయ విశ్వంలోని మూడు గుణాలైన సత్వ – రజ – తమ ప్రాభల్యమైన ప్రకంపనలను ఆకర్షించే సామర్ధ్యం కలిగి ఉంది . అందువల్ల, ఆచార ఆరాధన సమయంలో మరియు దిష్టినివారణ వంటి చర్యలలో, కొబ్బరికాయను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ కంపనాలు కొబ్బరికాయ ముందు భాగంలో ఉన్న పీచు ద్వారా దానిలోకి ప్రవేశిస్తాయి.

ఆ. కుదృష్టి నివారణకు కొబ్బరికాయను వ్యక్తి చుట్టూ త్రిప్పినప్పుడు కొబ్బరికాయలోని అయస్కాంత శక్తి వ్యక్తి చుట్టూ ఉన్న నల్ల శక్తిని ఆకర్షిస్తుంది మరియు తనలో నిలువవుంచుతుంది.

ఇ. అలాంటి కొబ్బరికాయను ప్రవహించే నీటిలో పడేయాలి లేదా పగులుకొట్టాలి. కొబ్బరికాయను పగలుకొట్టినప్పుడు వచ్చే శబ్దం వల్ల దానిలో నిలువవున్న దుష్ట శక్తి విచిన్నమౌతుంది.

ఈ. నల్ల శక్తిని కొబ్బరికాయలోకి ఆకర్షించినప్పుడు, కొబ్బరికాయలో అప్పటికే ఉన్న సానుకూల ప్రకంపనలకు మరియు నల్ల శక్తికి మధ్య యుద్ధం జరుగుతుంది.

 

5. మధ్యస్థ లేదా తేలికపాటి బాధ ఉన్న వ్యక్తిపై
దిష్టినివారణకు ఉపయోగించిన కొబ్బరికాయను మూడు
రహదారుల కూడలి వద్ద పగలుకొట్టడంలో గల అంతర్లీన శాస్త్రం

అ. ఒక వ్యక్తి తేలికపాటి లేదా మధ్యస్థ దెయ్యం లేదా దుష్ట శక్తి యొక్క ప్రభావంవల్ల కుదృష్టితో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి మధ్యస్థ లేదా తేలికపాటి బాధను అనుభవిస్తాడు. అలాంటి సందర్భాల్లో, దిష్టినివారించడానికి ఉపయోగించిన కొబ్బరికాయను మూడు రోడ్ల కూడలి వద్ద పగలుకొట్టినప్పుడు, అక్కడ తక్కువ స్థాయిలో ఉన్న దేవతల శక్తి ఉన్నందున, కొబ్బరికాయలో బాధను కలిగించే తరంగాలు నాశనమౌతాయి.

ఆ. దిష్టినివారణకు ఉపయోగించిన కొబ్బరికాయను దేవత మారుతి గుడి మెట్ల వద్ద లేదా ఉన్నత స్థాయి శక్తి గల దేవత గుడి మెట్ల వద్ద లేదా జాగృత స్థితిలో ఉన్న దేవత గుడి మెట్ల వద్ద పగలుకొట్టడం మరియు ప్రవహించే నీటిలో కొబ్బరికాయను వదిలేయడం వెనుక ఉన్న శాస్త్రీయ విశ్లేషణ.

ఇ. ఒక వ్యక్తి అతడు / ఆమె తీవ్రమైన బాధపడుతున్నప్పుడు, దిష్టిఉన్నత స్థాయి దుష్ట శక్తి నుంచి ఉండవచ్చు, ఉదాహరణకు మాంత్రికుడు. ఇటువంటి సందర్భాల్లో, దిష్టినివారణకు ఉపయోగించే కొబ్బరికాయను మూడు రోడ్ల కూడలి వద్ద పగలుకొట్టకూడదు; ఎందుకంటే, కొబ్బరికాయలో ఉన్నతమైన బాధ కలిగించే ప్రకంపనలను నాశనం చేయడానికి, ఉన్నతమైన దేవత యొక్క శక్తి (దైవిక శక్తి) అవసరం. మూడు రోడ్ల కూడలి వద్ద కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు, కొబ్బరికాయ నుండి వచ్చే బాధ కలిగించే కంపనాలు పూర్తిగా నాశనం కాకపోవచ్చు. తత్ఫలితంగా, వ్యక్తి మరల కుదృష్టితో బాధపడే అవకాశం పెరుగుతుంది. అటువంటి పరిస్థితులలో, ముందు ఇవ్వబడిన చర్యలను అవలంబించండి.

 

6. కొబ్బరికాయను దేవత మారుతి గుడిలో పగలుకొట్టండి

మారుతి విలక్షణమైన శక్తితో సంబంధం ఉన్న దేవత. అందువల్ల, ప్రతికూల శక్తులను నాశనం చేసే సామర్థ్యం 70% ఉంది. మారుతి ఆలయంలో కొబ్బరికాయను పగలుకొట్టినప్పుడు, కొబ్బరికాయలో దుష్ట శక్తి నాశనం అవుతుంది.

ఉన్నత స్థాయి శక్తి కలిగిన దేవత యొక్క ఆలయం మెట్లపైన లేదా జాగృత స్థితిలో ఉన్న దేవత ఆలయం మెట్లపైన గాని కొబ్బరికాయను పగలుకొట్టండి

కొబ్బరికాయను ఉపయోగించి కుదృష్టిని నివారించిన తరువాత, కొబ్బరికాయను పగలుకొట్టడానికి మారుతి ఆలయం సమీపంలో లేకపోతే, దానిని ఉన్నత స్థాయి శక్తి కలిగిన దేవత ఆలయ మెట్లపై లేదా జాగృత స్థితిలో ఉన్న ఒక దేవత ఆలయ మెట్లపై పగలుకొట్టండి. ఎందుకంటే ఈ జాగృత స్థితిలో ఉన్న ప్రదేశాలు కూడా దుష్ట శక్తులను నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

కుదృష్టి నివారణ తరువాత, కొబ్బరికాయను పగలుకొట్టకుండా ఆలయ మెట్లపై వదిలేయడం సరికాదు. దిష్టినివారణ తరువాత, కొబ్బరికాయను పగలుకొట్టడానికి బదులుగా, కొంతమంది దానిని ఆలయ మెట్లపై వదిలేస్తారు. అలా చేయడం ద్వారా, కొబ్బరికాయ నుండి కంపనాలు పర్యావరణంలోకి వ్యాపించే అవకాశం ఉంది మరియు సమయం గడిచేకొద్దీ ఆలయ ప్రాంగణాన్ని ఈ కంపనాలు కలుషితం చేస్తాయి. ఆ వ్యక్తి సంబంధిత పాపానికి కూడా గురవడం జరుగుతుంది.

 

7. ఒక వ్యక్తికి దిష్టినివారణకు లేదా చేతబడి నివారణకు
కొబ్బరికాయను చుట్టూ త్రిప్పినప్పుడు, కొబ్బరికాయపై ప్రభావం

అ. చెడు కన్ను ప్రభావం మితంగా ఉన్నప్పుడు కొబ్బరికాయపై ప్రభావాలు

కొబ్బరికాయను పగలుకొట్టినప్పుడు, కొబ్బరికాయలోని నీరు వేగంగా బయటకు వస్తాయి. కొన్నిసార్లు 1-2 మీటర్ల ఎత్తు లెగుస్తాయి.పగలుకొట్టిన కొబ్బరికాయ లోపల పాడవుతుంది.

ఆ. దిష్టిప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు కొబ్బరికాయపై ప్రభావాలు

1. కొబ్బరికాయ నిలువుగా పగులుతుంది.

2. కొబ్బరికాయ చాలా ముక్కలుగా పగులుతుంది.

3. కొబ్బరికాయ సులభంగా పగలదు; ఎందుకంటే బాధ కలిగించే దుష్ట శక్తి శక్తివంతమైనది. ఫలితంగా, కొబ్బరికాయలో ఆకర్షించబడిన నల్ల శక్తి ఎక్కువ. మొదటి ప్రయత్నంలో కొబ్బరికాయ పగిలితే, ఆ చర్య చేసే వ్యక్తి బాధను అనుభవించడు. మొదటి ప్రయత్నంలో కొబ్బరికాయ పగలకపోతే, ఆ చర్య చేసే వ్యక్తి బాధను అనుభవించవచ్చు.

4. కొబ్బరికాయ పగలుకొట్టేటప్పుడు చేతి నుండి జారిపోతే, అది ముందుకు వెనుకకు దొర్లుతూ ఉంటుంది.

5. దుష్ట శక్తి చాలా శక్తివంతంగా ఉన్నప్పుడు, కొబ్బరికాయ కొన్ని సమయాల్లో జారిపోతుంది మరియు అది కనుగొనబడదు.

ఇ. కొబ్బరికాయపై ప్రభావాల ద్వారా చేతబడి
లక్షణాలు మరియు తీవ్రతను అర్థం చేసుకోవడం

కొబ్బరికాయపై చేతబడి ప్రభావం చేతబడి యొక్క తీవ్రత చేతబడి యొక్క ప్రత్యేక లక్షణాలు
1. కొబ్బరికాయ బరువుగా అవుతుంది 20 ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించడం, ఆలోచించలేకపోవడం, తల బరువు పెరగడం వంటి బాధలను కలిగించడానికి చేతబడి చేశారు.
2. కొబ్బరికాయలో నీరు ఎండిపోతుంది 29 ఆకలి భావనను తగ్గించడానికి ఆహార మాధ్యమం ద్వారా బాధ కలిగించేలా చేతబడి చేశారు
3. కొబ్బరి నల్లగా మారుతుంది 32 ఎముకలు బలహీనపడటం వంటి బాధ కలిగించేలా చేతబడి చేశారు
4. కొబ్బరికాయ చాలా ముక్కలుగా పగిలిపోతుంది 35 మొత్తం శరీరంలోని కణాలలో నల్ల శక్తిని వ్యాప్తి చేయడానికి చేతబడి చేశారు
5. కొబ్బరికాయ పగలదు 40 చేతబడి వ్యక్తిని చంపడానికి చేశారు
6. కొబ్బరికాయ చేతిలో నుండి జారిపడి దొరకదు 70 చేతబడి వ్యక్తిని చంపడానికి మరియు తరువాత ఆ వ్యక్తి సూక్ష్మ దేహాన్ని ఆదీనంలోకి తీసుకోవడానికి చేశారు

గమనికలు :

చేతబడి యొక్క తీవ్రత 100% కి చేరుకున్నప్పుడు, వ్యక్తికి ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి మరియు ఆలోచన వచ్చిన వెంటనే ఆత్మహత్య చేసుకుంటాడు.

చేతబడిని తొలగించడానికి ఒక వ్యక్తి చుట్టూ కొబ్బరికాయను త్రిప్పినప్పుడు, ఆ వ్యక్తిలోని నల్ల శక్తి కొంతవరకు విచ్ఛిన్నమవుతుంది. మరోవైపు, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక సాధన కూడా చేస్తే, బాధ యొక్క నిష్పత్తి ఆ వ్యక్తిలో చాలా ఎక్కువ తగ్గుతుంది. ఆధ్యాత్మిక సాధన చేయడం యొక్క ప్రాముఖ్యత ఇది.

సేకరణ : సనాతన ఇంగ్లీషు ప్రచురణ ‘Science Underlying affliction by the Evil Eye and its removal

Leave a Comment