
1. దిష్టిని నివారించు వ్యక్తి మరియు దిష్టి వల్ల బాధపడుతున్న
వ్యక్తి, ఇద్దరూ దిష్టిని తొలగించే ముందు ఎందుకు ప్రార్థన చేయాలి ?
1 అ. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత
దేవుడి సహాయము కోసం ప్రార్ధించిన తరువాత దిష్టిని తీసివేసినప్పుడు, దిష్టి నివారణ చేస్తున్న వ్యక్తి దిష్టి వల్ల బాధపడడు మరియు దిష్టి వల్ల బాధపడుతున్న వ్యక్తి యొక్క బాధ తక్కువ సమయంలో తగ్గుతుంది.
1 ఆ. ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనాలు
1. ప్రార్థన కారణంగా దేవత యొక్క కప అవుతుంది. దాని ఫలితంగా బాధిత వ్యక్తి లోపల మరియు వెలుపల బాధ కలిగించే ప్రకంపనాలు తక్కువ సమయంలో సక్రియం చేయబడి, దిష్టి తీసివేయడానికి ఉపయోగించే పదార్థంలో కేంద్రీకృతమై అగ్నిలో కాల్చినప్పుడు నాశనమౌతాయి.
2. దేవతకపతో, ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఒక రక్షణ కవచము ఏర్పడుతుంది మరియు తరువాత, దుష్ట శక్తుల దాడుల నుండి వారిని రక్షించడంలో ఈ రక్షణ కవచము సహాయపడుతుంది.
2. దిష్టి వల్ల బాధపడుతున్న వ్యక్తి , దిష్టి నివారణ
సమయంలో అరచేతులను ఆకాశం వైపు ఎందుకు తెరచి ఉంచాలి?
దుష్ట శక్తులు నరక లోకం నుంచి పెద్ద ఎత్తున నల్ల శక్తిని విడుదల చేస్తాయి. అరచేతి యొక్క లోపలి భాగము మరియు వెనుక భాగము పోల్చినట్లయితే అరచేతి లోపలి భాగము దివ్య శక్తిని ఆకర్షించడానికి మరియు దుష్ట శక్తిని విడుదల చేయడానికి మరింత సున్నితంగా ఉంటుంది. అరచేతులు ఆకాశం వైపు తెరచి వుంచినప్పుడు నరక లోకం నుంచి విడుదల చేయబడుతున్న నల్ల శక్తి నేరుగా చేతులలోకి ప్రవేశించలేదు. మరియు అరచేతులను పైకి(ఆకాశం వైపు) తెరచి ఉంచడం వల్ల దిష్టి తీసివేయడానికి ఉపయోగిస్తున్న పదార్ధాలు శరీరంలోని నల్ల శక్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది.
3. దిష్టిని నివారించు సమయంలో ఉపయోగిస్తున్న
పదార్థాలను బాధిత వ్యక్తి చుట్టూ ఎందుకు త్రిప్పాలి ?
దిష్టిని నివారించు సమయంలో ఉపయోగిస్తున్న పదార్థాలను వ్యక్తి చుట్టూత్రిప్పడానికి కారణం, రజ ప్రధానమైన కదలిక ద్వారా ప్రయోజనకరమైన అనుకూల తరంగాలకు కదలికను యిస్తుంది.
4. దిష్టిని తీసివేసిన వ్యక్తి పదార్థాలను అగ్నిలో వేసి తిరిగి
వస్తున్నప్పుడు ఎందుకు వెనుకకు తిరిగి చూడకుండా రావాలి?
దిష్టిని తీసి అగ్నిలో వేసి కాల్చిన తరువాత ఆ వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు వెనుకకు తిరిగి చూడటం అనేది చెడు శకునంగా పరిగణిస్తారు. దిష్టిని తీసిన తరువాత ప్రయోజనం కోసం ఉపయోగించిన పదార్థాలు రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలతో నిండివుంటాయి. తత్ఫలితంగా, ఆ వ్యక్తి నడుస్తున్న త్రోవ కూడా రజ – తమ ప్రధానమైన తరంగాలతో నిండివుంటుంది మరియు ఇది ఆ వ్యక్తిని అనుసరించే అనేక దుష్ట శక్తుల అవకాశాన్ని పెంచుతుంది. ఈ వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే, వ్యక్తి యొక్క మనస్సును అపవిత్రమైన ప్రకంపనలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది మరియు అపవిత్రమైన మార్గంలో ఉన్నా దుష్ట శక్తుల దాడులకు వ్యక్తి గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యక్తి దేవుని పేరు జపిస్తూ ఉండాలని మరియు బాధిత వ్యక్తిపై దిష్టి నివారణ చేసిన తరువాత వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు సాగాలని సలహా యిస్తారు.
5. వ్యక్తులు, దిష్టి నివారణలు చేసేవారు మరియు
దిష్టి వల్ల బాధపడుతున్నవారు ఎందుకు మౌనంగా ఉండి,
దేవుని నామాన్ని జపిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగించాలి?
5 అ. దిష్టిని తీసిన తరువాత జరిగే ప్రక్రియ మరియు దాని యొక్క చెడు ప్రభావాలు
1. కొంతవరకు దిష్టిని నివారిస్తున్న వ్యక్తి యొక్క శరీరం రజ – తమ ప్రధానమైన ప్రకంపనలకు గురవుతుంది
దిష్టిని నివారించిన తరువాత, బాధిత వ్యక్తి యొక్క రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలు ఈ కతి చేసే వ్యక్తిని ప్రభావితం చేస్తాయి మరియు అందువల్ల, అతని / ఆమె శరీరం కూడా కొంతవరకు ఈ ప్రకంపనలతో నింపబడుతుంది.
2. ఈ సమయంలో భావోద్వేగకరమైన చర్చలు వ్యక్తికి హాని కలిగిస్తాయి, ఎందుకంటే ఇవి రజ – తమ ప్రధానమైన ప్రకంపనలను ఆకర్షిస్తాయి : ఈ సమయంలో, దేవుని పేరు జపించడం మినహా ఏదైనా సంభాషణ భావోద్వేగ స్థాయిలో ఉంటుంది. ఇది జరిగితే, శరీరంపై వ్యాపించిన రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలు ప్రసంగంలోని సూక్ష్మ ధ్వని ప్రకంపనలను పెద్ద నిష్పత్తిలో ఆకర్షిస్తాయి. ఫలితంగా, అవి నోరు, ముక్కు, కళ్ళు మరియు చెవుల రంద్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
5 ఆ . దేవుని నామ జపములో ఉన్న దైవ శక్తి రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలను నాశనం చేస్తుంది మరియు ఆ వ్యక్తి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతాడు.
1. రజ – తమ ప్రధానమైన ప్రకంపనల పొరను వ్యర్థమైన చర్చ ద్వారా శరీరంలోకి ప్రవేశించడానికి అనుమతించకుండా, దేవుని పేరు జపిస్తూ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, శరీరంపై అభివృద్ధి చెందిన రజ – తమ ప్రధానమైన ప్రకంపనల వలయం ఈ దేవుని జపం వల్ల ఉత్పన్నమైన సాత్విక ప్రకంపనల ద్వారా నాశనం అవుతుంది.
2. శరీరం చుట్టూ ఎర్పడిన రక్షణ వలయం బాహ్య వాతావరణం నుండి దుష్ట శక్తుల దాడుల అవకాశాన్ని తగ్గిస్తుంది.మాయకు సంబంధించిన భావోద్వేగ చర్చలకు బదులుగా, శరీరం చుట్టూ ఉన్న రజ – తమ ప్రధానమైన ప్రకంపనల వలయాన్ని వదిలించుకొని మరియు తద్వారా శరీరాన్ని శుద్ధి చేయడం మంచిది.
దిష్టిని నివారించే ప్రక్రియ తరువాత వ్యక్తులు దేవుని జపం చేయడం ఎల్లప్పుడూ మంచిది, లేకపోతే ప్రతికూల ప్రకంపనలు వెంటనే దాడి చేసే అవకాశం పెరుగుతుంది.
6. దిష్టి నివారణ తరువాత, నివారణ చేసిన
వ్యక్తి మరియు బాధపడుతున్న వ్యక్తి ఇద్దరు ఎందుకు కాళ్ళు,
చేతులు కడుగుకొనిన తరువాత తమ కార్యకలాపాలను కొనసాగించాలి?
6 అ. దిష్టి నివారణ చర్యలో భాగంగా, నివారణ చేయుట మరియు దిష్టి నివారణ పొందుట రెండు ప్రక్రియలలోను పెద్ద సంఖ్యలో రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలు బదిలీ అవుతాయి మరియు దాని ప్రతికూల ప్రభావాలు
1. దిష్టి నివారణ చేయుట మరియు దిష్టి నివారణ పొందుట రెండు ప్రక్రియలలోను పెద్ద సంఖ్యలో రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలు మార్పు చెందడము జరుగుతుంది.
2. దిష్టిని తొలగించే ముందు భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఆధ్యాత్మిక భావోద్వేగం తగ్గితే, దుష్ట శక్తులు దాడి చేసే అవకాశం వెంటనే పెరుగుతుంది.
3. ఈ ప్రక్రియలో, ఇద్దరు వ్యక్తులు అశుభమైన చర్యలో పాల్గొంటున్నందున, ఇద్దరి వ్యక్తులపై కోపంగా ఉన్న దుష్ట శక్తులు దాడి చేసే అవకాశం సమానంగా ఉంటుంది. కాబట్టి, ఇద్దరిపై దుష్ట శక్తులు దాడి చేసే ప్రమాదం ఒకటే.
4. సాధారణంగా, ఈ ప్రక్రియ రజ – తమ ప్రధానమైనది. ఇతర శరీర అవయవాలతో పోల్చినప్పుడు, పాదాలు భూమితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల, నరక లోకం నుండి తరంగాలు కాళ్ళ మాధ్యమంగా పై దిశలో ప్రసారమయ్యే బలమైన అవకాశం ఉంది. చేతుల మాధ్యమంగా శరీరం ఈ తరంగాలతో నింపబడి, అది తల వరకు చేరుతుంది.
6 ఆ. చేతులు మరియు కాళ్ళను నీటితో కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. దిష్టిని తీసివేసిన తరువాత, చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నా రజ – తమ ప్రధానమైన ప్రకంపనలకు వెంటనే స్పందించే అవయవాలు కాబట్టి చేతులు మరియు కాళ్ళను కడుగుకోవాలి.
2. నీరు అన్ని స్థాయిలలోను పనిచేసి రజ – తమ ప్రధానమైన ప్రకంపనాలను ఆకర్షించి చెడు తరంగాలను శరీరం నుంచి శుద్ధి చేస్తుంది. అందువల్ల, ఈ ప్రక్రియ తర్వాత చేతులు మరియు కాళ్ళు కడుగుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది.
7. బాధ యొక్క తీవ్రతను బట్టి, దిష్టిని గంట
వ్యవధిలో మరల నివారించాల్సిన అవసరం ఏమిటి?
సాధ్యమైతే మరియు బాధ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే, దిష్టి నివారణ పద్దతిని గంట వ్యవధిలో మరల చేయవచ్చును. లేదంటే ఈ బాధ మరల వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి గంటకు ఒకసారి చేసినప్పుడు, శరీరంలో నల్ల శక్తి పునరావృత్తి అయ్యే నిష్పత్తి తగ్గుతుంది.
8. దిష్టి నివారణ చేస్తున్నప్పుడు ఇరుగు దృష్టి , పొరుగు దృష్టి
మొదలగు పదాలు ఉపయోగించి చేసినప్పుడు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు
ఒక భక్తురాలికి దిష్టి నివారణ చేస్తున్నప్పుడు పలికిన వాక్యాలు ఆంగ్లంలో కన్నా మరాఠీ భాషలో ఉపయోగించినప్పుడు బాధ యొక్క తీవ్రత మరియు స్వరూపం ఎక్కువగా వ్యక్తమైంది : డిసెంబర్ 2007 లో, ఒక భక్తురాలికి ఉప్పు, ఆవాలు మరియు ఎండు మిరపకాయలు ఉపయోగించి దిష్టి నివారణ చేసే పద్ధతిని చిత్రీకరించడం పురోగతిలోఉంది. దిష్టి నివారణ చేస్తున్న భక్తురాలు ఆంగ్లంలో వాక్యాలను ఉపయోగించినప్పుడు బాధిత భక్తురాలిలో ఉన్నా దుష్ట శక్తి వ్యక్తమైంది. అప్పుడు, దిష్టి నివారణ చేస్తున్న భక్తురాలు మరాఠీలో కూడా పలకగలదని మేము గ్రహించి ప్రయోగం మొత్తం మరాఠీలో మరల పునరావృతం చేశాము. మొదలుపెట్టిన వెంటనే బాధిత భక్తురాలిలో ఉన్నా దుష్ట శక్తి వ్యక్తీకరించడం ప్రారంభమైంది, కానీ ఈ సారి వ్యక్తీకరణ యొక్క తీవ్రత అధికంగా వుండెను. ఈ ప్రయోగం మరాఠీ భాష యొక్క ప్రాముఖ్యతను వెల్లడి చేసింది.
పటికను ఉపయోగించి కుదృష్టిని తొలగించే విధానం మరియు ప్రతికూల శక్తిని ఎలా వదిలించుకోవాలి
కుదృష్టి నివారణ – నజర్ ఉతార్న (కుదృష్టి నుండి రక్షణ)
ఉప్పు మరియు ఆవాలు ఉపయోగించి కుదృష్టి నుండి రక్షణ పద్ధతి
దిష్ట్టి వల్ల ప్రభావితమైన వ్యక్తి యొక్క లక్షణాలు
దిష్టి అంటే అర్థం మరియు దిష్టి వల్ల కలిగే బాధలు
దిష్టిని నిమ్మకాయతో నివారించే విధానము