వసంత పంచమి

ఋతువులన్నిటికి రాజ వసంత ఋతువు. ఈ ఋతువు యొక్క ఆగమనం వసంతపంచమినాడు ప్రారంభమౌతుంది. అలాగే ఈ రోజుననే శ్రీసరస్వతిదేవి మరియు లక్ష్మీదేవి జన్మదినము అని ఆచరిస్తారు.

కల్తీదారులను ఆపండి, కౌటుంబిక మరియు దేశ స్వస్థతను కాపాడండి !

ప్రస్తుతము అన్ని రంగాలలో భ్రష్టాచారం వ్యాపించినది. అందులో గంభీరమైనది కల్తీ. పదార్థములలో కల్తీ చేయడం వలన వినియోగదారునికి ఆర్థిక హాని కలుగుతుంది, అతని ఆరోగ్యము మీద కూడా విపరీత పరిణామం చూపుతుంది. దేశములో జరుగుతున్న ఆరోగ్యహానిని శాశ్వతముగా ఆపేందుకు కల్తీ చేసేవారికి విరుద్ధముగా ఫిర్యాదు చేయడము దేశ కర్తవ్యమే అగును. కల్తీదారుల విరుద్ధం ఎక్కడ ఫిర్యాదుని చేయాలి ? కల్తీదారులకు 3 సంవత్సరాలు కారాగృహము మరియు 10 లక్షల రూ. వరకు జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. అందుకే … Read more

ఆశ్లీలతను అరికట్టండి మరియు ఉత్తమ సమాజాన్ని నిర్మించండి !

ఉత్పాదనల అమ్మకం పెరిగేందుకు, ఇటీవల ఉత్పాదనల ప్రకటనలలో మరియు ఉత్పాదనల కవర్ల్‌పై స్త్రీలను అశ్లీలంగా చూపించడం జరుగుతున్నది. దీని వలన సమాజం నీతిహీనంగా మారుతున్నది. ఈ హానిని ఆపేందుకు మరియు స్త్రీల గౌరవాన్ని కాపాడుటకు అశ్లీలతను అరికట్టడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. దీని కొరకు – అశ్లీల ప్రకటనలు గల వస్తువులను వాడకండి ! అశ్లీల చలనచిత్రాలను మరియు దూరదర్శన కార్యక్రమాలను చూడకండి, వాటిని నిషేధించండి ! ‘స్త్రీల అశ్లీల ప్రతిబంధక చట్టం 1986’ అనుసారం ‘స్త్రీలను … Read more

‘కరచాలన’కు బదలు నమస్కారము చేయండి !

కరచాలన చేయుటవలన క్రిములు వ్యాపిస్తాయి అందుకనే ఇప్పుడు విదేశాలలో కూడా‘కరచాలన చేయుటకు బదులు చేతులను జోడించి నమస్కారం చేయండి’ అని ప్రచారం జరుగుతోంది. కరచాలన చేయుటవలన సూక్ష్మరూపము గల చెడుశక్తుల నుండి ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. దీనికి బదలుగా చేతులను జోడించి నమస్కారం చేసినప్పుడు మనలో నమ్రత భావము పెరిగి వృత్తి సాత్త్వికమవుతుంది. హిందువుల్లారా, చైతన్యమయ హిందూ సంస్కృతిని కాపాడండి !

గ్రహణకాలములో సాధన ఎందుకు చేయవలెను ?

గ్రహణకాలంలో వాయుమండలంలో సూక్ష్మ క్రిములు, చెడుశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తినటం, నిద్రించటం మొదలైన రజ-తమతో కూడిన కృతులను చేస్తే చెడుశక్తుల ఇబ్బంది కలుగవచ్చును. కానీ గ్రహణ కాలంలో నామజపం, స్తోత్రపఠణం మొదలైన వాటిని చేస్తే మన చుట్టూ సంరక్షణ కవచం నిర్మాణమై గ్రహణం యొక్క అమంగల ప్రభావం నుండి మన రక్షణ అవుతుంది.

దేవతల జయంతి, ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపము చేయండి !

దేవతల జయంతి రోజున (ఉదా. శ్రీరామనవమి) లేదా ఉత్సవ సమయములో (ఉదా. గణేశోత్సవము) ఆయా దేవతా తత్వము ఎక్కువగా కార్యనిరతమై ఉండును. దేవతల జయంతి లేదా ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపం చేయుట వలన దేవతా తత్వమును ఎక్కువగా గ్రహించవచ్చును. (వినండి : సాత్విక స్వరంలోని సనాతన ధ్వనిముద్రిక దేవతల నామజపం చేయు సరైన పద్ధతి)

యమద్వితీయ, భగినీహస్త భోజనం

ఈ తిథి నాడు యమలోకంలో నుండి వచ్చే యమతరంగాలు పృథ్విలోని వాయుమందలములోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ పృథ్వి అనగా యముడి సహోదరి. అందుకే ఈ రోజున యముడు తన లోకాన్ని విడిచి, తన సహోదరి అనగా, పుత్రిస్వరూపమైన భూలోకానికి ప్రవేశిస్తాడు. దీనికి ప్రతీకగా ఈ రోజున ప్రతి ఇంటి పురుషుడు తన భార్య చేతి వంటను స్వీకరించకుండా, సహోదరి ఇంటికి భోజనానికి వెళ్తాడు. సహోదరి ఇంట అతడు యమాది దీవతలకు పూజ చేస్తాడు. అకాల మృత్యువును తప్పించేందుకు యమద్వితీయ … Read more

బలిపాడ్యమి

దీపావళిలో ఇది ముఖ్యమైన రోజు ప్రాతఃకాలంలో స్త్రీలు అభ్యంగనస్నానం చేసి, తమ భర్తకు హారతినిస్తారు. అందరూ క్రొత్త వస్త్రాలు ధరించి, మధ్యాహ్నం వివిధ రకాల వంటకాలతో భోజనం చేసి, రోజంతా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు కొందరు బలిచక్రవర్తి ప్రతిమకు పూజ చేస్తారు. దీని కారణం, సంవత్సరమంతా బలిరాజు తన శక్తి బలముతో పృథ్వీ పై ఉన్న జీవులకు ఇబ్బంది కలగకుండా, ఇతర చెడు శక్తులను శాంతపరచాలనేది ఈ పూజ యొక్క ఉద్దేశము. (మరిన్ని వివరాల కొరకు … Read more