అలంకరణ కోసం వాడే చట్రములలో (ఫ్రేమ్) థర్మోకోల్ ను వాడకండి !

శ్రీ గణపతి విగ్రహము కొరకై అలంకరణ చట్రములను తయారు చేసేటప్పుడు థర్మోకోల్ ను వాడకండి. 1. థర్మోకోల్ సహజంగా మట్టిలో కలిసిపోదు, అందుచేత దానిని ఉపయోగించడం పర్యావరణమునకు హానికరం. అది ఒక రసాయనిక పద్ధతిలో తయారు చేయబడినది కాబట్టి దానిలో రజస్, తమో గుణములు ప్రబలంగా ఉంటాయి. అటువంటి రజస్, తమో గుణములు ప్రబలంగా ఉన్నటువంటి వస్తువు సాత్వికతను గ్రహించలేదు. పైగా, అది రజస్, తమో గుణముల ప్రకంపనలను పర్యావరణంలోకి ప్రసరింప చేస్తుంది. 2. దానికి బదులుగా, … Read more

సంకటకాలములో (అత్యవసర పరిస్థితులు) గణేశోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి ?

కరోనా వంటి సంక్షోభం నేపథ్యంలో, హిందూ  ధర్మాచరణ యొక్క శాస్త్రములో కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి, దీనిని  ‘ఆపద్ధర్మము’ అని పిలుస్తారు. 

ఉత్తరపూజను చేసిన తరువాత అదే రోజు లేదా తరువాయి రోజున మూర్తిని నిమజ్జనము చేయుట అన్ని విధములుగా సరియైనది

శ్రీ గణేశుని నిమజ్జన సందర్భములో ఒక్క వైశిష్ఠ్యపూర్ణమైన విషయము ఏమనగా జీవము లేని మూర్తిలో ప్రాణప్రతిష్ఠ ద్వారా తీసుకువచ్చిన దైవత్వము ఒక్క రోజు కన్ననూ అధికముగా ఉండదు. దీని అర్థము ఏమనగా గణేశుని నిమజ్జనము ఎప్పుడైనా చేయండి, శ్రీ గణేశుని మూర్తిలో ఉన్న దైవత్వము తరువాయి రోజునే నష్టము అయ్యి ఉంటుంది. అందుకనే ఏదైనా దేవత యొక్క ఉత్తరపూజను చేసిన తరువాత అదే రోజున కానీ లేదా తరువాయి రోజు కానీ మూర్తిని నిమజ్జనము చేయుట మంచిది. … Read more

ప్రవాహిస్తున్న నీటిలో శ్రీ గణేశుడి విగ్రహా నిమ్మజనం చేయండి !

గణేశ భక్తులారా, గణేశ చతుర్థి కాలంలో, మీరు శ్రీ గణేశుడిని భక్తితో,  శాస్త్రానుసారంగా పూజ చేస్తారు. ఆ విగ్రహాన్ని శాస్త్రానుసారంగా   నిమ్మజనం చేయుటకు బదులుగా, కేవలం ప్రసిద్ధి కోసం పర్యావరణాన్ని పరిరక్షింస్తున్నట్లు నటించే నాస్తికులకు మీరు విగ్రహాన్ని అప్పగించబోతున్నారా ? ఈ ధర్మద్రోహుల వికృతి పిలుపుకు లొంగకుండ, నిమ్మజనం చేయని మహాపాపమునకు దూరంగా ఉండండి. శ్రీ గణేశ విగ్రహాన్ని ధర్మ శాస్త్రానుసారంగా బంకమట్టితో తయారు చేస్తే పర్యావరణ కూడా పరిరక్షింపబడుతుంది మరియు ధర్మాచరణ చేసినందు వలన … Read more

గణేశ విగ్రహాలలో వివిధ రకాలు ఏవి ?

1. సాధారణ విగ్రహం గణేశ విగ్రహ తయారీ శాస్త్రం “శ్రీ గణపత్యధర్వశీర్షము” లో ఇలా ఇవ్వబడింది, ‘ఏకదంతం, చతుర్హస్తం……’, అంటే ఒకే దంతం కలవాడు, నాలుగు చేతులు కలవాడు, పాశమును మరియు అంకుశమును ధరించేవాడు, విరిగిన దంతమును ఒక చేతితో పట్టుకుని మరొక చేతిని వరాలను ఒసగే ముద్రలో (వరద ముద్ర) పెట్టువాడు, ధ్వజం పై మూషిక చిహ్నం కలవాడు, ఎర్రని కాంతి కలవాడు, పెద్ద ఉదరం కలవాడు (లంబోదరుడు), చేటల వంటి చెవులు కలవాడు, ఎర్రని వస్త్రములు ధరించేవాడు, దేహమునకు ఎర్రని గంధము (రక్తచందనము) పూయబడువాడు, ఎర్రని పువ్వులతో పూజింపబడువాడు. సూచన – శ్రీ గణేశుడు ఒక్క చేతిలో (విరిగిన) దంతమును ధరించినవాడు అని అథర్వశీర్షములో అతని రూపము గురించి చెప్పారు. శ్రీ గణేశుడు ముఖ్యంగా … Read more

సనాతన సంస్థ ద్వారా తయారు చేయబడిన శ్రీ గణపతి సాత్విక విగ్రహం

శాస్త్రాలకు అనుగుణంగా చేయబడిన  శ్రీ గణేశ విగ్రహములను పూజించడం ద్వారా ధర్మమును కాపాడండి ! ఆధ్యాత్మిక దృక్కోణంలో, ప్రతీ దేవతా మూర్తికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు కలిసి ఉంటాయి. దీని ప్రకారము, దేవతా విగ్రహమును గ్రంథములకు అనుగుణంగా తయారు చేయనట్లయితే ఆ దేవత యొక్క ఆశీస్సులను మనము పొందలేము. కాబట్టి, అటువంటి విగ్రహమును ఆరాధించే భక్తుడు ఎటువంటి ప్రయోజనమును పొందలేడు అని గ్రంథాలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఈ చర్య … Read more