సేవ యొక్క సదవకాశం

సనాతన సంస్థ నిర్మిత సర్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక గ్రంథాలను సర్వ భారతీయ మరియు విదేశీయ భాషల్లో ప్రచురించడానికి, గ్రంథాల రచనలో మరియు వ్యాపక సేవలో పాల్గొనండి !

వివిధ భారతీయ భాషలు మరియు ఇంగ్లీషు పరిజ్ఞానం ఉన్న సాధకులు, పాఠకులకు మరియు శ్రేయోభిలాషులకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ కార్యంలో పాలుపంచుకోవడానికి అమూల్యమైన అవకాశం !

పరాత్పర గురువు డా. ఆఠవలె సంకలనం చేసిన గ్రంథాలలో, ఆగస్టు 2021 నాటికి, కేవలం 345 కంటే ఎక్కువ గ్రంథాలు-లఘుగ్రంథాలు ప్రచురించబడ్డాయి మరియు 5 వేలకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ ప్రక్రియ వేగంగా జరగాలి. మీ ఆసక్తి మరియు సామర్ధ్యం అనుసారం, మీరు రచనలను సంకలనం చేయడం, వివిధ భాషలలో రూపొందించడం మరియు అనువాదించడం మొదలైన సేవలలో పాల్గొనవచ్చు.

 

1. ఆధ్యాత్మికతలోని వివిధ విషయాలపై ఆసక్తి గలవారిని ఆధ్యాత్మిక సాధన వైపు మళ్ళించడానికి ఉపయుక్తమైన వివిధ విషయాలపై సంకలనం చేయాల్సిన వందలాది గ్రంథాలు

1 అ. రాబోయే గ్రంథాల రచనల సంకలనం ఇంకా రావలసి ఉంది

ఇప్పుడు కూడ సంకలన శేషంగా వున్న గ్రంథాల లేఖనాల సంగణకం (కంప్యూటర్‌) జాబితాలు తయారుగా వున్నాయి.

1ఆ. సనాతన గ్రంథాల ప్రాముఖ్యత

‘వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనవి గత కొన్ని వేల సంవత్సరాలుగా మార్గదర్శకంగా ఉన్నాయి, దీనితో పాటు, సనాతన గ్రంథాలు రాబోయే మానవాళికి వేల సంవత్సరాలు మార్గదర్శనంగా నిలుస్తాయి’, ఇలా  అని ఒక సంత్‌మహాత్ములు ఆశీర్వాదించారు.

 

2. గ్రంథాలను ప్రచురించే సేవలో పాల్గొనడానికి ఆసక్తిగల పాఠకుల కోసం వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి

2 అ.  సంగణకం (కంప్యూటర్‌) టైపింగ్‌, పునర్విచారణ మరియు సంగ్రహించడం

సంగణకం (కంప్యూటర్‌)లో టైప్‌ చేయడం మరియు టైప్‌ చేసిన తర్వాత, ’అన్నీ సరిగ్గా టైప్‌ చేశారా?’ అని మూల సంకలనం ఆధారంగా పునర్విచారణ చేయడం మరియు రచనను సంగ్రహించడం.

2 అ 1. కావలసిన నైపుణ్యాలు :

సంగణకం (కంప్యూటర్‌)లో టైప్‌ చేయగల సామర్థ్యం, అలాగే తెలుగు, మరాఠీ, హిందీ లేదా ఆంగ్ల భాషలలో వ్యాకరణం మరియు పదజాలంపై పరిజ్ఞానం వుండటం.

2 ఆ. సంస్కృత పదాలు, శ్లోకాలు మొదలైనవాటిని పునర్విచారణ చేయడం

గ్రంథాల రచనలో వచ్చిన సంస్కృత శ్లోకాలు, పదాలు మరియు సుభాషితాలను పరిశీలించడానికి; వాటి మూల సంకలనం మరియు అర్థం రాయడం మొదలైన సేవలు ఇందులో చేర్చబడ్డాయి. ఇందు కోసం సాధకులకు సంస్కృత భాషపై కొంత పరిజ్ఞానం ఉండాలి. మీకు సంస్కృత భాష జ్ఞానం లేకపోతే, అది వదిలి, ఇతర రచనలను చేయవచ్చు.

2 ఇ. మరాఠీతో పాటు ఇతర భాషల్లోని గ్రంథాల సంకలనం

2 ఇ 1. ఇతర సేవలు

అ. చేయబోయే గ్రంథాల విషయము యొక్క వివిధ మూలాధారాల శీర్షికల ప్రకారం విషయం యొక్క సూచికను సిద్ధం చేయడం.

ఆ. సూచిక ప్రకారం రచనను పెట్టి ఆ రచన యొక్క తుది సంకలనం చేయడం

ఇ. సాధారణంగా 100 పేజీల (500 KB) గ్రంథం ఉంటుంది. ’పాఠ్యాంశాలలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని వ్రాయడం నుండి నిర్ణయించడానికి, పేజీల సంఖ్యను చూడటానికి మరియు అంచనా వేయడానికి, గ్రంథమును 2, 3, … వంటి భాగాలుగా విభజించడం.

ఈ. ప్రతి భాగం యొక్క సూచిక మరియు ఉపోత్ఘామును తయారు చేయడం

ఉ. ప్రతి భాగం యొక్క కవర్‌ పేజీ మరియు చివరి కవర్‌ ఆధారంగా లేఖనాలు తయారు చేయడం

2 ఈ. వివిధ భాషల గ్రంథాలు మరియు లఘుగ్రంథాల సంగణకం సంరచన(ఫార్మేటింగ్‌) చేయడం, అలాగే గ్రంథాలలో ముద్రించడం కోసం పట్టికలను (టేబుల్స్‌) సిద్ధం చేయడం

దీని కోసం ’ఇన్‌-డిజైన్‌’ సంగణకం(కంప్యూటర్‌ ) ప్రణాళిక గురించి పరిజ్ఞానం ఉండాలి.

2 ఉ. మరాఠీ, హిందీ లేదా ఇంగ్లీషు భాషల గ్రంథాలను ఇతర దేశ మరియు విదేశీయ భాషల్లోకి అనువదించడం

ఈ సేవ చేయడానికి ’మనము ఏ భాషలో అనువదించగల భాష’, ఆ భాష యొక్క వ్యాకరణం గురించి సరైన జ్ఞానం కలిగి ఉండటం అవసరం. భాష యొక్క జ్ఞానం కలిగివున్నా వ్యాకరణం గురించి మీకు ప్రత్యేక జ్ఞానం లేకపోతే, ఆ సందర్భంలో శిక్షణ తీసుకోండి.  సంగణకం యొక్క పరిజ్ఞానం (కంప్యూటేషనల్‌ నాలెడ్జ్‌) (MsWord మరియు PDF ప్రణాళిక మరాఠీ రచనను ఆంగ్ల భాషలోకి అనువాద సేవ కోసం.)

 

3. గ్రంథ సేవాలో పాల్గొనడానికి మమ్మల్ని సంప్రదించండి !

పైన పేర్కొన్న అన్ని సేవలకు, సంగణకం (కంప్యూటర్‌)పై ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండటం అవసరం, దానితో పాటు సంగణకం (కంప్యూటర్‌) టైపింగ్‌ రావాలి. పైన పేర్కొన్న సేవ సనాతన ఆశ్రమంలో ఉంటూ లేదా ఇంట్లో కూడా చేయవచ్చు. గ్రంథాల ప్రచురణకి సంబంధించిన సేవలను తెలుసుకోవాలనుకునే వారు సనాతన ఆశ్రమంలో 2-3 వారాలు ఉండవలెను. ఆ తరువాత ఆశ్రమంలో లేదా ఇంట్లో ఉండి మీరు సేవ చేయగలుగుతారు.

ఈ సేవలు చేయాలనుకునే వారు జిల్లా సేవకుల మాధ్యంగా, వారి సమాచారాన్ని శ్రీమతి భాగ్యశ్రీ సావంత్‌ పేరు [email protected] కి లేదా క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపండి.

పోస్టల్‌ చిరునామా : శ్రీమతి భాగ్యశ్రీ సావంత్‌, ’సనాతన ఆశ్రమం’, రామనాథి, ఫోండా, గోవా. పిన్‌ – 403 401

– (పూజ్య.) శ్రీ. సందీప్‌ ఆళిశీ, సనాతన్‌ ఆశ్రమం, రామనాథి, గోవా. (26.5.2021)

Leave a Comment