గురుపూర్ణిమ సందర్భంగా పరాత్పర గురువు డా. ఆఠవలె గారి సందేశం (2022)

గురుపూర్ణిమ తర్వాత వచ్చే మహా సంక్షోభ సమయంలో సురక్షితంగా ఉండటానికి గురువంటి సాధువుల మార్గదర్శకత్వం ప్రకారం సాధన చేయండి !

గురుపూర్ణిమ, గురు మార్గదర్శకత్వంలో సాధన చేసే భక్తులు, సాధకులు, శిష్యులు మొదలైన వారికి కృతజ్ఞతా పండుగ.

గురువువల్ల ఆధ్యాత్మిక సాధన ప్రారంభమై మానవ జన్మ సార్థకం అవుతుంది. సాధన చేయని వ్యక్తులు ప్రాపంచిక జీవితాన్ని గడుపుతుంటారు కాబట్టి వారికి ‘ఆధ్యాత్మ’, ‘సాధన’, ‘గురు’, ‘గురుపూర్ణిమ’ వంటి పదాలతో సంబంధం ఉండదు. వీరంతా ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలంటే, రాబోయే మహా సంక్షోభం గురించి వీరందరికీ చెప్పడం అవసరం.

ఈ గురుపూర్ణిమ తర్వాత కొన్ని నెలల్లో, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా భయంకరమైన సంక్షోభాన్ని అనుభవించవలసి ఉంటుంది. కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి ప్రతిచోటా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆహార ధాన్యాలు, మందులు, ఇంధనం మొదలైన వాటికి భారీ కొరత ఏర్పడుతుంది. చాలా దేశాలు కరువు సమస్యను ఎదుర్కొంటాయి. యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల బ్యాంకులు కూడా దెబ్బతింటాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రతి కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారనుంది. ఫలితంగా మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. భారతదేశంలో కూడా, మతపరమైన ధ్రువణత వల్ల ప్రతిచోటా అల్లర్లు లేదా హింసాత్మక సంఘటనలకు దారితీసే అవకాశం ఉంది. ఇది సామాజిక అభద్రతా సమస్యను సృష్టిస్తుంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఈ గందరగోళాన్ని ఏ రాజకీయ పార్టీ ఆపలేదు. అందువల్ల, ఈ సంక్షోభ సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా మిమ్మల్ని కాపాడుతుందనే భ్రమలో ఉండకండి !

రాబోయే భయంకరమైన సమయాల్లో ఆధ్యాత్మిక రక్షణ లేకుండా సురక్షితమైన జీవితాన్ని గడపడం సాధ్యం కాదు; అందుకే విపత్కర సమయాల్లో భగవంతుని ఆశ్రయిస్తారు.

– పరాత్పర గురువు డా. ఆఠవలె

Leave a Comment