జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహ మహత్తు

శని దేవుడి వైశిష్ఠ్యాలు, జ్యోతిష శాస్త్ర ప్రకారం సాధనలో శని గ్రహం యొక్క మహత్తు, ఏడున్నర సంవత్సరాల శని, దాని పరిహారోపాయం మొదలైన విషయల గురించి తెలుసుకుందాం . . .

 

1. శని దేవుడి వైశిష్ఠ్యాలు

1 అ. స్థానం

1 అ 1. జన్మస్థానం : భారత దేశంలోని సౌరాష్ట్రలో వైశాఖ అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో శనిదేవుడి జననం జరిగింది. కాబట్టి ఆ రోజు శనైశ్వర జయంతిగా ఆచరింప బడుతుంది.

1 అ 2. కార్యక్షేత్రం : మహారాష్ట్రలోని శని శింగణాపూర్ లో శనిదేవుడి పెద్ద నల్ల శిల ఉన్నది. అక్కడ శనిదేవుడి శక్తి కార్యగతమయ్యి ఉంది. శనైశ్వర జయంతి రోజు అక్కడ జాతర జరుగుతుంది. శనిదేవుడు ఉత్సవాన్ని ఆచరించడం జరుగుతుంది.

లక్షాంతర భక్తుల శ్రద్ధాస్థానమయిన శని సింగణాపూర్ లోని శనిదేవుడి కట్ట

 

2. జ్యోతిష శాస్త్ర ప్రకారం శని గ్రహం యొక్క మహత్తు

హిందూ ధర్మంలో గ్రహాలకు దేవతల స్థానాలనిచ్చి గౌరవించడం జరిగింది. శని గ్రహం పాప గ్రహం కాబట్టి లౌకిక దృష్టిలో ఇతర గ్రహాలతో పోలిస్తే ఈ గ్రహానికి మహత్తరమైన స్థానం ఉంది. శని గ్రహానికి మకర మరియు కుంభ ఇవి రాశులు. తులా రాశిలో శని ఉచ్చ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు ఉచ్చ మరియు నీచ రాశులు నిర్ధరించ బడ్డాయి. “ ఒక గ్రహం ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు, అది ఏ విషయాలకు కారణి భూతమై ఉంటుందో, జాతకంలో ఏ ఏ స్థానాలకు యజమానిగా ఉంటుందో ఆ విషయాలకు శుభఫలాన్నిస్తుంది “ అన్న ఒక నియమం ఉంది. శని గ్రహం వాయుతత్త్వానిదై ఉండి, మానవుడిని ఆసక్తినుండి విరక్తి వైపుకు తీసుకువెడుతుంది. జీవితంలో వచ్చే మానావమానాలు, అవహేళనలనుండి పరమార్థం వైపు మళ్ళిస్తుంది. పూర్వ పుణ్యాన్ని చూపించే ఈ గ్రహం మోక్షానికి దారిదీపం.

 

3. మనిషి యొక్క గుణ దోషాల సందర్భంలో శని మహత్తు

జ్యోతిష శాస్త్రానుసారం ప్రతి గ్రహానికి శుభ (గుణం) అశుభ( దోషం) ఎలా రెండు పార్శ్వాలు ఉంటాయి. ఏ గ్రహమూ పూర్తిగా శుభమే అని కానీ పూర్తి అశుభమే అని కానీ ఉండదు. ఈ నియమానుసారంగా శనిగ్రహానికి కూడా రెండు పార్శ్వాలు ఉన్నాయి. కానీ శనిగ్రహం గురించి కేవలం ఒక వైపు మాత్రమే ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ప్రజల మనస్సులలో శనిగ్రహం గురించి భయం ఏర్పడడం జరుగుతుంది. శనిగ్రహం గర్వం, అహంకారం, పూర్వాగ్రహం వీటిని దూరం జేసి మనిషికి మానవత్వాన్ని నేర్పుతుంది. అంతరంగం లోని ఉచ్చ గుణాలను పరిచయం చేయిస్తుంది. శని తన అనుభవంతో శిక్షణనిచ్చే శిక్షకుడి మాదిరిగా ఉంటాడు. ఎవరైతే క్రమశిక్షణ కలవారు, వినయశీలురు, వినమ్రులుగా ఉంటారో వారిని శని ఉచ్చ పదవికి తీసుకువెళ్తాడు. ఎవరైతే అహంకారులు, గర్విష్టులు, స్వార్థులై ఉంటారో వారిని ఇబ్బంది పెడతాడు. ఇలాంటి కష్ట కాలం లోనే మనిషియొక్క యోగ్యతా పరీక్ష జరుగుతుంది, తనవారెవరో, పరులెవరో తెలుస్తుంది. తమ తమ గుణదోషాల అవగాహన జరుగుతుంది. గర్వహరణం జరుగుతుంది. అహంకారం జారి పోతుంది. మానవత తెలుస్తుంది. ఒక మనిషిగా ఎలా జీవించాలి అనే జ్ఞానం కలుగుతుంది. అవిచారులు చేసిన కర్మఫలాలు ఏడున్నర సంవత్సరాల శనిదశ సమయంలో అనుభవించడం కనిపిస్తుంది.

 

4. శనైశ్వర జయంతి రోజు చేయవలసిన సాధన

శనిదేవుడు ప్రతి రాశిలోనూ ప్రవేశించి ఏడున్నర సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి మనిషి ఏడున్నర సంవత్సరాల పాటు శని పీడను అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు శని మకర రాశిలో ఉంటూ ధనస్సు,మకర, కుంభ రాశులవారికి ఏడున్నర శనిదశ జరుగుతోంది. జాతకంలో 1,2,4,5,7,8,9 అలాగే 12 వ స్థానంలో ఉన్న శని పీడాకారుడుగా ఉంటాడు. శనిదేవుడి పీడా పరిహారార్థం శని జయంతి రోజు జపం, దానం, పూజ చేసి పుణ్యం సంపాదించుకోవడం ద్వారా పరిహారం జరుగుతుంది. శని గ్రహం దాస్య వృత్తి గ్ర్హహం కాబట్టి ఏడున్నర సంవత్సరాల శనిదశ సమయంలో దాస్యభక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి.

4 అ. శని యొక్క పీడ పరిహార దానములు : బంగారం, ఇనుప, నీలమణి, మినుము, ఎద్దు, నూనె, నల్ల కంబళి, నల్ల లేదా నీలి పువ్వులు.

4 ఆ. జనాభా : 23 వేలు

4 ఇ. పూజకు శనిదేవుడి ఇనుప ప్రతిమను ఉపయోగించాలి.

4 ఈ. శని పురాణం ( పౌరాణిక) మంత్రం.

నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్|

ఛాయామార్తాండసమ్భూతం తం నమామి శనైశ్చరమ్ ||

–  నవగ్రహ స్తోత్రం శ్లోకం 7

అర్థం : శనిదేవుడు నీలం రంగు కాటుకలా కనిపిస్తాడు. అతడు సూర్య భగవానుడి పుత్రుడు. సాక్షాత్ యముడి పెద్దన్న. దేవి ఛాయ మరియు సూర్య భగవానుడినుండి ఉత్పన్నుడైన శనిదేవుడికి నేను నమస్కరిస్తున్నాను.

4 ఉ. శనిదేవుడి ఇనుప ప్రతిమ యొక్క పూజ, దానం వీటి సంకల్పం : “మమ జన్మరాశే సకాశాత్ అనిష్టస్థానస్థితశనేః పీడాపరిహారార్థమ్ ఏకాదశస్థానవత్ శుభఫలప్రాప్యర్థం లోహప్రతిమాయాం శనైశ్చరపూజనం తత్ప్రీతికరం ( ఈ వస్తువును) దానం కరిష్యే |

అర్థం : నా జాతకంలో అనిష్ఠ స్థానంలో ఉన్న శని పీడ దూరమవ్వాలని అలాగే అతడు పదకొండవ స్థానమందుడేలా శుభ ఫలాన్నిఇవ్వాలని, దీనికొరకు ఇనుప శనిమూర్తియొక్క పూజ అలాగే శనిదేవుడు ప్రసన్నమవ్వాలని ’ఈ వస్తువు’ ను దానం చేస్తున్నాను.

టిప్పణి : ’ఈ వస్తువు’ ఈ స్థలంలో ఏ వస్తువును దానం చెయ్యదలచుకున్నారో ఆ వస్తువుయొక్క పేరును చెప్పాలి.

ధ్యానం

అహో సౌరాష్ట్రసంజాత ఛాయాపుత్ర చతుర్భుజ |
కృష్ణవర్ణార్క గోత్రీయ బాణహస్త ధనుర్ధర ||
త్రిశూలిశ్చ సమాగచ్ఛ వరదో గృధ్రవాహన |
ప్రజాపతే తు సంపూజ్యః సరోజే పశ్చిమే దలే ||

అర్థం : శనిదేవుడు సౌరాష్ట్రలో అవతరించాడు. అతడు సూర్యుడి మరియు ఛాయాదేవి కుమారుడు. అతడికి నాలుగు చేతులు. రంగు నలుపు. అతడి ఒక చేతిలో ధనస్సు, మరొక్క చేతిలో బాణం, ఇంకో చేతిలో త్రిశూలం ఉన్నాయి. నాలుగవ చెయ్యి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. “ రాబందు” అతని వాహనం. అతడు ప్రజలందరి పాలనా కర్త. నవగ్రహాల కమలంలో అతని స్థాపనను వెనుకవైపు రేకులో చెయ్యబడుతుంది. అటువంటు శనిదేవుడిని ఆరాధించాలి.

4 ఊ. దాన శ్లోకం

శనైశ్ఛర ప్రీతికరం దానం పీడానివారకమ్ |
సర్వాపత్తి వినాశాయ ద్విజాగ్రాయ దదామ్యహమ్ ||

అర్థం : శనిదేవుడికి ఇష్టమైన దానం చేసినప్పుడు ఇబ్బందుల, సంకటాల నివారణ కలుగును. ఇలాంటి దానాన్నినేను శ్రేష్ఠుడైన బ్రాహ్మణునకు ఇచ్చుచున్నాను.

 

5. ఏడున్నర సంవత్సరాల శని పీడ ఉన్నవారు చెయ్యవలసిన పరిహారోపాయం

అ. ప్రతిదినం శనిదేవుడి స్తోత్రాన్ని పఠించండి.

ఆ.శనిదేవుడి ప్రీతి కొరకు జపం, దానం, పూజలను తప్పకుండా చెయ్యండి.

ఇ. ఫీడ పరిహారార్థం శనివారం రోజు అభ్యంగన స్నానం చెయ్యండి.

ఈ. శనివారం రోజు శనిదేవుడి దర్శనం చేసుకుని, మినుము, ఉప్పు ఆయనకు అర్పించి, తైలాభిషేకం చేసి, నల్లటి పూలను అర్పించడం ద్వారా పీడా పరిహారం చెయ్యవచ్చును. నల్ల పూలు దొరకని యెడల నీలి వర్ణం పూలు అర్పించవచ్చు.

ఉ. సాధ్యమైతే శనివారం రోజు సాయంత్రం వరకూ నిరాహారంగా ఉండాలి. ఒకవేళ వీలుకాకపోతే ఒక పూట భోజనం చెయ్యవచ్చును.

ఊ. నీలమణి ఉంగరం ధరించాలి.

(ఆధారం: దాతె పంచాంగం )

శనిదేవుడి స్తోత్రం

కోణస్థ పింగలో బభ్రు కృష్ణో రౌద్రాన్తకో యమః |
సౌరిః శనైశ్చరో మన్దః పిప్పలాదేన సంస్తుతః ||

ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
శనైశ్చర్యకృత పీడా న కదాచిత్ భవిష్యతి ||

పిప్పలాద ఉవాచ | నమస్తే కోణసంస్థాయ పింగలాయ నమోఽస్తుతే |
నమస్తే బబ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే || 1 ||

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాన్తకాయ చ |
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో || 2||

నమస్తే మన్దసంజ్ఞాయ శనైశ్చర నమోఽస్తుతే |
ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ || 3||

తాత్పర్యం : పిప్పలాదుడు అనే పేరుగల ఋషివర్యుడు “కోణస్థ, పింగల, బభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, శనైశ్చర, మంద “ ఈ పది పేర్లతో శనిదేవుడిని స్తుతించియున్నాడు. ఈ పది పేర్లను ఉదయం లేవగానే ఎవరైతే చెప్పుకుంటారో వారికి ఎప్పుడూ శనిగ్రహం నుండి ఇబ్బంది కలగదు. పిప్పలాద ఋషివర్యులు అంటారు. “ హే కోణమందు నిలుచు కోణస్థుడా, హే పింగలా, హే బభ్రు, హే కృష్ణా, హే రౌద్ర దేహుడా, హే అంతకుడా, హే యమా, హే సౌరీ, హే విభో, హే మందా, హే శనిదేవా నేను నీకు నమస్కరించుచున్నాను. నేను దీనుడనై నీకు శరణయ్యాను. దయచేసి నా పైన ప్రసన్నుడవు కమ్ము.

ఈ స్తోత్రాన్ని నిత్యం ప్రాతఃకాలమందు పఠించాలి.

–  సౌ. ప్రజక్తా జోషి, జ్యోతిష ఫలిత విశారద, సనాతన ఆశ్రమం, గోవా.

1 thought on “జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహ మహత్తు”

Leave a Comment