జ్యోతిష్య శాస్త్రానికనుగుణంగా రోగ నివారణ కొరకు మందు సేవించుటకు ముహూర్తం మరియు రోగి సేవ చేసే వ్యక్తి జాతకంలోని యోగం

“రోగికి తొందరగా నయం కావాలి” అని జ్యోతిష్య శాస్త్రానికనుగుణంగా దేవుడికి ప్రార్థన చేసి మందును సేవించాలి. మందును సేవించడానికి ముందుగా సాధ్యమైతే యోగ్యమైన తిథి, వార నక్షత్రాలను చూడాలి. అలా సాధ్యం కాని సమయంలో మందును ధన్వంతరి దేవుడి ప్రసాదమని భావించి సేవించాలి. దేవుడి పైన పరిపూర్ణమైన శ్రద్ధ ఉంచి మందును సేవించాలి. రోగికి ఉపచారాలు చేసేవారు ఉదాః వైద్యులు, పరిచారకులు,అతడికి సహాయ పడే వ్యక్తి యొక్క గ్రహగతులు అనుకూలంగా ఉంటే రోగికి తొందరగా నయం కాగలదు. కొన్నిసార్లు రోగికి వైద్యుడి పైన శ్రద్ధ ఉన్నప్పటికీ ఆ రోగి కోలుకోవడం కనిపించదు. ఎందుకంటే వారిద్దరి గ్రహగతులలో సామ్యం కుదురి ఉండదు. అలా కాకపోతే రోగి తొందరగా కోలుకోవడం జరుగుతుంది. కాబట్టి రోగి మందు సేవించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రోగి సేవలో ఉన్నమనిషి గ్రహగతులు ఎలా ఉండాలి అనే అంశాల గురించిన సమాచారం తెలుపబడింది.

1. మందు సేవించడానికి ముహూర్తం

1 అ. మందు సేవించడానికి మొదలు పెట్టేటప్పుడు ఏ నక్షత్రాలు ఉండాలి ?

మందు సేవించడానికి మొదలు పెట్టేటప్పుడు,గురు సేవను ప్రారంభించేటప్పుడు అశ్విని, మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ మరియు రేవతి నక్షత్రాలు ఉండాలి. జన్మ నక్షత్ర సమయంలో మందు సేవన మొదలుపెట్టడం వదిలెయ్యాలి.

1 ఆ. సేవను ప్రారంభించేటప్పుడు ఏ వారం ఉండాలి ?

సేవించడం ప్రారంభించేటప్పుడు కానీ, మందు ఇచ్చేటప్పుడు కానీ ఆదివారం, బుధవారం, గురువారం లేదా శుక్రవారం ఉండాలి. వీటిలో ఆదివారం అత్యంత శుభదాయకం అని చెప్పబడింది. ఎందుకంటే ఆదివారంలోని రవి గ్రహం తేజో తత్త్వకారకం. ఏ మందునైనా ఆదివారం సేవించడం మొదలు పెడితే మందు నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

1 ఇ. మందు సేవించేటప్పుడు ఏ తిథి ఉండాలి ?

మందు సేవించేటప్పుడు శుభ తిథి ఉండాలి. క్షయ తిథి, అమావాస్య, పౌర్ణమి తిథులు ఉండరాదు.

2. రోగి, అతడికి సేవ చేసే వ్యక్తి జాతకాలలో ఏమేం ఉండాలి, ఏమేం ఉండకూడదు?

2 అ. సేవకుడి జాతకంలో అశుభ గ్రహం ఉండకూడదు !

సేవకుడి జాతకంలో రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహాలు శుభకరంగా ఉండాలి. సేవకుడి జాతకంలోని గ్రహాలు అశుభంగా కానీ లేదా నీచరాశిలో ఉన్నట్లయితే రోగి ఇబ్బంది పెరిగే సూచనలు ఎక్కువవుతాయి. లేదా రోగి తొందరగా కోలుకోడు. ఎందుకంటే సేవకుడి గ్రహాలు అశుభంగా ఉన్నట్లయితే దాని పరిణామం రోగి పైన చూపడం కనిపిస్తుంది (పరాత్పర గురువు డా.అఠవలె గారి సేవలో ఉన్న సాధకుల జాతకాలు చూసి సేవలు అందిస్తే వారి ఉపచారాలకు అనుకూలంగా ఉంటుంది.)

2 ఆ. గ్రహం, గ్రహం యొక్క నీచ రాశి, అనుక్రమాంకం

గ్రహం  గ్రహం యొక్క నీచ రాశి రాశి క్రమాంకము
1. రవి తులా 7
గ్రహం గ్రహం యొక్క నీచ రాశి రాశి క్రమాంకము 
2. చంద్ర వృశ్చిక 8
3. మంగళ కర్క 4
4. బుధ మీన 12
5. గురు మకర 10
6. శుక్ర కన్యా 6
7. శని మేష 1
8. రాహు ధను 9
9. కేతు మిథున 3

2 ఇ. అనారోగ్య వ్యక్తి, సేవకుడి నడుమ గ్రహ మైత్రి ఉండాలి !

గ్రహ మైత్రి అనగా ఇద్దరు వ్యక్తుల స్వామి ఒకరికొకరు మిత్రులై ఉండాలి. ఉదాః అనారోగ్య వ్యక్తియొక్క రాశి మకర రాశి అనుకుంటే, ఆ రాశియొక్క స్వామి శనిగ్రహం. శనిగ్రహానికి శుక్రగ్రహం మరియు బుధ గ్రహం మిత్ర గ్రహాలు. అంటే మకర రాశియొక్క వ్యక్తులకు బుధ గ్రహానికి సంబంధించిన (మిథునం మరియు కన్యా) రాశుల వారు, శుక్ర గ్రహానికి సంబంధించిన (వృషభం మరియు తులా) రాశివారితో గ్రహమైత్రి ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వ్యక్తుల సేవలు అధిక ఫలదాయకంగా ఉంటాయి అని వెలుగులోకి వచ్చింది. ఈ క్రింది పట్టీలో గ్రహం, గ్రహాకనుగుణమైన రాశి, గ్రహాలకు మిత్ర గ్రహాలను ఇవ్వడం జరిగింది.

గ్రహం గ్రహం యొక్క స్వామి రాశి మిత్ర గ్రహం
రవి సింహ చంద్ర, మంగళ, గురు
చంద్ర కర్క రవి, బుధ
మంగళ మేష మరియు వృశ్చిక రవి, గురు, చంద్ర
బుధ మిథున మరియు కన్య రవి, శుక్ర
గురు ధను మరియు మీన రవి, చంద్ర, మంగళ
శుక్ర వృషభ మరియు తులా బుధ, శని
శని మకర మరియు కుంభ బుధ, శుక్ర

2 ఇ. రోగి యొక్క నక్షత్రం నుండి సేవకుడి నక్షత్రం ద్వితీయం కాకూడదు !

రోగి నక్షత్రానికి సేవకుడి నక్షత్రం రెండోదయ్యుంటే ఆ సేవ వ్యర్థమౌతుంది. ( పరాత్పర గురు డాక్టర్ గారి నక్షత్రం ఉత్తరాషాడ కాబట్టి ఆయన నక్షత్రం నుండి రెండో నక్షత్రం “శ్రవణ” నక్షత్రం కల సాధకులు ఆయన సేవ చెయ్యకూడదు )

 సౌ. ప్రాజక్తా జోషి, ( జ్యోతిష్య ఫలిత విశారదులు), మహర్షి ఆధ్యాత్మ విశ్వవిద్యాలయం, రామనాథి, గోవా.

జ్యోతిష శాస్త్రంలో అన్ని విషయాల గురించి ఎంత లోతుగా ఆలోచన చేయబడింది అని మనకు తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యమనిపిస్తుంది. “ నాకు అన్నీ తెలుసు” అనే అహంకారం కలిగినవారు, ఏమీ తెలుసుకోవాలనే కోరిక లేని బుద్ధిప్రమాణ్యవాదులకయితే జ్యోతిష శాస్త్రం అబద్ధం అనిపిస్తుంది “ – (పరాత్పర గురు డా. అఠవలెగారు )

Leave a Comment