గురు పూర్ణిమ నిమిత్తంగా పరాత్పర గురువు డా. జయంత్‌ ఆఠవలె గారి సందేశము (2021)

ధర్మ సంస్థాపన కొరకు సర్వస్వమును త్యాగము చెయ్యండి !

పరాత్పర గురువు డా. జయంత్‌ బాళాజి ఆఠవలె

గురుపౌర్ణిమ గురువుల పట్ల కృతజ్ఞతలు వ్యక్తపరిచే రోజు. ప్రతి ఒక్క హిందువు ఈ రోజు ఆధ్యాత్మిక గురువులకు కృతజ్ఞతగా యథాశక్తి తనువు-మనస్సు-ధనమును సమర్పిస్తారు. ఆధ్యాత్మికతలో తనువూ, మనస్సు, ధనమును త్యాగం చేయడానికి అనన్య సాధారణమైన ప్రాముఖ్యత ఉంది, కానీ గురుతత్వానికి శిష్యుడు ఒక రోజు మాత్రమే చేసే తనువు, మనస్సు, ధనముల త్యాగం కాదు, సర్వస్వాన్ని త్యాగం చేయడం కావాలి. సర్వస్వాన్ని త్యాగం చేయకుండా మోక్షప్రాప్తి కలగదు. అందుకే ఆధ్యాత్మికంగా ప్రగతి పొందాలనుకునేవారు సర్వస్వాన్ని త్యాగం చెయ్యాలి.

ధర్మపరాయణమైన వ్యక్తిగత జీవనం గడిపేవారు, సమాజ సేవకులు, దేశభక్తులు మరియు హిందుత్వనిష్ఠ కలిగిన సమష్టి జీవనం గడిపే కర్మశీలురైన హిందువులు వీరికి ఆధ్యాత్మిక సాధన కొరకు సర్వస్వం త్యాగం చేయడం కష్టంగా అనిపించవచ్చు. ప్రస్తుత కాలంలో ధర్మసంస్థాపన కొరకు కార్యం చేయడమే సర్వోత్తమమైన సమష్టి సాధన. ధర్మసంస్థాపన అనగా సమాజవ్యవస్థను, దేశ నిర్మాణాన్ని, ఆదర్శంగా మార్చడం కోసం ప్రయత్నం చేయడమే. ఈ కార్యం కలియుగంలో చేయడానికి సమాజానికి ధర్మాచరణ నేర్పించడం, ఆదర్శ రాజ్యవ్యవస్థ కొరకు చట్టపరంగా సంఘర్షణ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. ఆర్య చాణుక్యుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటివారు ధర్మసంస్థాన కొరకు సర్వస్వాన్ని త్యాగం చేసారు. వారి త్యాగం వల్లనే ధర్మసంస్థాపన కార్యం విజయవంతం అయ్యింది, ఈ చరిత్రను గుర్తుంచుకోండి.

అందుకే ధర్మనిష్ఠ కల హిందువులారా, ఈ గురుపౌర్ణిమ నుండి ధర్మసంస్థాపన కార్యం కొరకు అనగా ధర్మాధిష్ఠిత హిందూరాష్ట్ర స్థాపన కొరకు సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధం అవ్వండి. ఇలా త్యాగం చేస్తే గురుతత్వం కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది అని విశ్వసించండి.

– పరాత్పర గురువులు డా. జయంత్ బాలాజీ ఆఠవలె , సంస్థాపకులు, సనాతన సంస్థ.

Leave a Comment