వికార (రుగ్మత) నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము భాగము – 3

రాబోయే ప్రపంచ యుద్ధంలో, అణు వికిరణం కారణంగా లక్షలాది మంది చనిపోతారని సాధుమహాత్ములు/మహాత్ములు, జ్యోతిష్కులు భవిష్యవాణి తెలియ చేశారు. భవిష్యత్తులో, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి మరియు ఈ కాలంలో సమాజం అనేక విపత్తులను ఎదుర్కొంటుంది. ఆపత్కాలంలో, సమాచార మాధ్యమాలు విచ్ఛిన్నమవుతాయి. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్ళడం, వైద్యుడిని సంప్రదించడం మరియు మందులు కొనడం కష్టం గా మారవచ్చు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడే/ఉపయోగపడే గ్రంథాలను సనాతన సంస్థ సిద్ధం చేసింది. ఈ గ్రంథాల నుండి నేర్చుకున్న చికిత్సా విధానం అత్యవసర సమయాల్లో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా సహాయపడుతుంది; ఎందుకంటే, వారు ప్రతి ఒక్కరినీ స్వయం సమృద్ధిగా మరియు ఆత్మ విశ్వాసంతో వుండేటట్లు చేయటం వారి ధ్యేయం. ప్రస్తుతానికి, ఈ్సT, శ్రేణిలో 13 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. ‘వ్యాధులను నయం చేయడానికి ఖాళీ పెట్టెల యొక్క ఆధ్యాత్మిక వైద్య నివారణలు’ అనే పుస్తకాన్ని రెండు భాగాలుగా పరిచయం చేస్తున్నారు. ఈ పవిత్ర గ్రంథాలలో వివరంగా సమాచారం అందించబడింది.

‘వ్యాధులను నయం చేయడానికి ఖాళీ పెట్టెల యొక్క ఆధ్యాత్మిక వైద్య నివారణలు’ అనే పవిత్రమైన గ్రంథములు ఇది ప్రతికూల సమయాల్లో మాత్రమే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడతాయి.

ఒక సాధారణ ఖాళీ పెట్టె ఆధ్యాత్మిక వైద్యం నివారణకు అవకాశం లేని సాధనంగా అనిపించవచ్చు; ఏది ఏమయినప్పటికీ, ఖాళీ పెట్టె యొక్క శూన్యత నేరుగా ఆకాశాతత్వం (సంపూర్ణ ఈథర్‌/ఆకాశ సూత్రం) కు సంబంధించినది. అన్ని పంచతత్వాలలో (సంపూర్ణ విశ్వ సూత్రాలు), ఆకాశాతత్వం అత్యంత సూక్ష్మమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఆధ్యాత్మిక వైద్యనివారణ కోసం ఖాళీ పెట్టె యొక్క ఆకాశతత్వం మాధ్యమంగా మన శరీరం, మనస్సు మరియు బుద్ధి పై ఉన్న నల్లటి వలయం తొలగించబడుతుంది, అదే విధంగా దుష్ట శక్తి బాధను కూడా తొలగిస్తుంది. ఆధ్యాత్మిక వైద్యనివారణ సమయంలో, ఎవరైనా ఆకాశాతత్వం కు కేంద్రీకృతమైతే వైద్యం మెరుగుపడుతుంది.

ఖాళీ పెట్టెలకు సంబంధించిన రెండు సంచికలలో, మొదటి భాగంలో ఖాళీ పెట్టెల ఆకారం, కొలతలు, పరిమాణం, రంగు మరియు సాధారణ సమాచారం ప్రస్తావించబడింది. రెండవ భాగంలో శరీరంలో ఏ ఏ స్థానాలలో ఆధ్యాత్మిక నివారణలు చేయాలో ప్రస్తావించబడింది. ఈ సంచికలో రెండవ భాగం గురించి ప్రస్తావిస్తూ 2 అ తో కొనసాగుతాము.

భాగం – 1 వ్యాసంలో

1. ఖాళీ పెట్టెల గురించి, వాటి ఆకారం, కొలతలు, పరిమాణం, రంగు మరియు సాధారణ సమాచారం ప్రస్తావించబడింది.

2. శరీరంలో ఆధ్యాత్మిక నివారణలు చేయాల్సిన స్థానాలు/ కేంద్రలను గురించి ప్రస్తావించబడింది. ప్రస్తుతం ఈ సంచికలో 2అ.శరీరంలో ఆధ్యాత్మికం స్థాయిలో ఉన్న కేంద్రలను ఖాళీ పెట్టెలను ఉపయోగించి ఎలా నివారణలు చేయ్యాలి మరియు కుండలిని-చక్రాలు, రుగ్మతలతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాయి అనే విషయాన్ని ప్రస్తావించాము

3 ఈ. నిద్రపోయేటప్పుడు ఖాళీ పెట్టెల నివారణలు చేయడం

రాత్రి సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దుష్ట శక్తుల ప్రభావం వున్నవాళ్ళు పగటిపూట మరియు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఖాళీ పెట్టెల నివారణలు చేయాలి. ఎలాంటి దుష్ట శక్తులతో బాధపడని వారు కూడా రాత్రిపూట మంచానికి చుట్టూ పెట్టెలను ఉంచడము వల్ల రక్షణ కవచం ఏర్పడుతుంది.

3 ఈ 1. మంచం చుట్టూ ఖాళీ పెట్టల అమరికపై కొన్ని మార్గదర్శకాలు
3 ఈ 1 అ. వ్యక్తి నిద్రిస్తున్న స్థాయిలో పెట్టెలను ఉంచండి (నేలపై లేదా మంచం మీద అయినా)

1. కుర్చీ, పీట, బల్ల మొదలైన వాటిని ఉపయోగించి మంచం ఎత్తు ప్రకారం పెట్టెలను సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది సాధ్యం కాకపోతే, వాటిని తక్కువ ఎత్తులో లేదా నేలపై ఉంచండి. పెట్టెలను ఇతర స్థాయిలలో ఉంచడం ద్వారా పొందే ప్రయోజనం 20 నుండి 30 శాతం మాత్రమే లభిస్తుంది, అవసరమైన స్థాయిలో ఉంచడం ద్వారా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని, పెట్టెలను అవసరమైన స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించాలి.

పెట్టెలను ఒకే స్థాయిలో ఉంచడం సాధ్యం కాకపోతే, పెట్టె తెరచివున్నవైపు వ్యక్తికి ఎదురుగా ఉండే విధంగా ఏటవాలుగా ఉంచాలి (క్రింద ఉన్న బొమ్మను చూడండి. ఈ చిత్రంలో సౌలభ్యం కోసం రెండు పెట్టెలను మాత్రమే చూపబడింది).

2. మంచం ఒకప్రక్క లేదా రెండు ప్రక్కల గోడను తాకినట్లయితే, అప్పుడు పడుకునే ముందు, గోడ నుండి దూరంగా లాగి, మంచం ఎత్తులో పెట్టెలను ఉంచాలి. (గోడ నుండి మంచం లాగడం సాధ్యం కాకపోతే, గోడ దగ్గర దాని అంచున చిన్న పెట్టెలను ఉంచాలి. చిన్న పెట్టెల నుండి పొందిన ప్రయోజనం పెద్ద వాటి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, పెట్టెలు లేకపోవడం కంటే ఇది మంచిది).

3 ఈ 1 ఆ. పెట్టెలను 30 సెం.మీ. (1 అడుగు) మంచం నుండి దూరంగా ఉంచాలి. ఒక 10 సెం.మీ. ఉన్నా కూడా ఆమోదయోగ్యమే. ఇది సాధ్యం కాకపోతే, దూరాన్ని మరింత తగ్గించవచ్చు.

3 ఈ 1 ఇ. పాయింట్‌ ’3 ఈ 2 అ’ లో చూపిన విధంగా, పెట్టెలను అడ్డంగా ఉంచాలి. ఇలా పేట్టెలు అడ్డంగా ఉంచటం వల్ల వ్యక్తి శరీరంలో ఎక్కువ భాగం ప్రభావవంతమై ఉంటుంది

3 ఈ 2. రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి నిద్రపోయినప్పుడు ఆధ్యాత్మిక నివారణలు
3 ఈ. 2 అ. రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి మాత్రమే నిద్రపోతున్నప్పుడు పెట్టెలను ఎలా ఉంచాలి

క్రింద ఉన్న చిత్రంలో చూపిన విధంగా వ్యక్తి మంచం యొక్క నాలుగు వైపుల పెట్టెలను ఉంచాలి.

3 ఈ 2 అ 1. పెట్టె తెరచినవైపు భాగం రుగ్మత ఉన్న వ్యక్తి తలకు ఎదురుగా ఉంచాలి.

3 ఈ 2 అ 2. వ్యక్తి పాదాల దగ్గర మరొక పెట్టెను అరికాళ్ళకు ఎదురుగా ఉంచాలి.

3 ఈ 2 అ 3. రుగ్మత ఉన్న వ్యక్తి యొక్క ఎడమ మరియు కుడి వైపున రెండు పెట్టెలను ఉంచాలి. పెట్టె తెరచినవైపు భాగం రుగ్మత ఉన్న వ్యక్తి యొక్క నివారణ ప్రదేశంలో ఉంచాలి. (నివారణ చేయడానికి నిర్దిష్ట ప్రదేశాలు లేకపోతే, ’3 ఈ. 2 అ. ’ చిత్రంలో చూపిన విధంగా పెట్టె 1’, ’పెట్టె 2’, ’పెట్టె 3’ మరియు ’పెట్టె 4’ స్థానాల ప్రకారం పెట్టెలను ఉంచాలి).

3 ఈ 2 అ 4. మరో రెండు పెట్టెలను తీసుకొని, వాటిలో ఒక పెట్టె తెరచినవైపు భాగం పైకి మరియు మరొక పెట్టె తెరచిన వైపు భాగం క్రిందికి, 3 ఈ. 2అ చిత్రంలో చూపిన విధంగా పెట్టెలను వ్యక్తి చుట్టూ ఉంచాలి. (సౌలభ్యం కోసం రెండు పెట్టెలను వ్యక్తి యొక్క పాదాలకు ఎడమ మరియు కుడి వైపులా ఉంచారు).

వ్యక్తి మంచం మీద నిద్రిస్తున్నప్పుడు, మంచం క్రింద ఒక పెట్టెను తెరచినవైపు భాగం క్రింది దిశలో ఉండేలా ఏర్పాటుచేయాలి. మరియు మరొక పెట్టెను తెరచినవైపు భాగం పైదిశలో ఉండే విధంగా ఎక్కడైనా వ్యక్తి చుట్టూ ఉంచాలి (కాని మంచం క్రింద కాదు).

ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే నిద్రిస్తే ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటే, అప్పుడు పెట్టెలను ఎలా ఉంచాలి? అనారోగ్యమైన తల్లి తన ఆరోగ్యకరమైన బిడ్డతో నిద్రిస్తున్నప్పుడు పెట్టెలను ఎలా ఉంచాలి? ‘మొదలైనవి ఈ పవిత్ర గ్రంథంలో చర్చించారు.

3 ఈ 3. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ ఆరోగ్యకరమైన వ్యక్తులు కలిసి నిద్రిస్తున్నప్పుడు, దుష్ట శక్తుల నుండి వారిని రక్షించడానికి పెట్టెలతో నివారణలు

ఈ పద్ధతిలో, పెట్టె తెరచినవైపు భాగం వ్యక్తి యొక్క శరీరానికి బయట వైపు ఉండేలా పెట్టాలి. అందువల్ల, బయటి నుండి దాడి చేసే దుష్ట శక్తి పెట్టెల శూన్యతలోకి లాగబడుతుంది, తద్వారా వ్యక్తికి రక్షణ కలుగుతుంది.

3 ఈ 3 అ. ఒక వ్యక్తి మాత్రమే నిద్రిస్తున్నప్పుడు పెట్టెలను ఎలా ఏర్పాటు చేయాలి?
1. ప్రతి పెట్టె తెరచినవైపు భాగం వ్యక్తి యొక్క శరీరానికి బయట వైపు ఉండేటట్లు క్రింద చూపిన విధంగా నాలుగు పెట్టెలను మంచం చుట్టూ నాలుగు దిశల్లో అమర్చాలి.

అ. వ్యక్తి తల బయట వైపు ఒక పెట్టెను ఉంచాలి.

ఆ. వ్యక్తి యొక్క పాదముల దగ్గర మరియొక పెట్టెను బయట వైపు ఉంచాలి. మరో రెండు పెట్టెలను వ్యక్తి యొక్క ఎడమ మరియు కుడి వైపులా సుమారు మధ్యలో ఉంచాలి.

2. పైన 3 ఈ.2 అ4 లో సూచించిన విషయమును చూడండి (క్రింది చిత్రం చూడండి.)

 

4. ఖాళీ పెట్టెలను ఉపయోగించి అనారోగ్య సమస్యలపై ఆధ్యాత్మిక
నివారణలు చేయు వ్యవధి మరియు తీవ్రతను బట్టి నివారణ వ్యవధిని పెంచుట

ప్రతిరోజూ సుమారు 1-2 గంటలు ఖాళీ పెట్టెలను ఉపయోగించి నివారణలు చెయ్యాలి. కొన్ని రోజులు 1-2 గంటలు ఈ నివారణలు చేసిన తర్వాత కూడా, రుగ్మత తగ్గకపోతే లేదా నియంత్రించకపోతే, అప్పుడు నివారణల వ్యవధిని పెంచాలి.

 

5. ఖాళీ పెట్టెల ద్వారా ఆధ్యాత్మిక వైద్య నివారణకు సంబంధించిన సాధారణ సూచనలు

5 అ. ఖాళీ పెట్టెల ద్వారా – నివారణలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన సూచనలు

5 అ 1. ఆధ్యాత్మిక నివారణల కోసం మనం ఏ దిశలో కూర్చోవాలి?

సాధ్యమైనంతవరకు, తూర్పు-పడమర దిశలో కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం దిశలో కూర్చోకూడదు.

5 అ 2. ఉపాసించే దేవతను ఆధ్యాత్మిక భావంతో ప్రార్థించాలి.

ప్రార్థన చేయు విధానము : ‘ఓ దేవత (దేవత నామాన్ని చెప్పాలి), నా అనారోగ్యం (వ్యాధి పేరు) మీ దయ వల్ల ఆధ్యాత్మిక నివారణల ద్వారా మరియు వీలైనంత త్వరగా నయమవ్వాలని నేను మీ పవిత్ర పాదాలకు ప్రార్థిస్తున్నాను.

5 అ 3. భావముతో ఆధ్యాత్మిక నివారణలు చేయుట

భక్తుల భావముతో భగవంతుడు సంతోషిస్తాడని అంటారు. పెట్టలలోని ఆకాశతత్వము మన భావము వల్ల ఎక్కువ స్థాయిలో చైతన్యవంతంగా అవుతుంది మరియు మన బాధను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

5 అ 3 అ. ఆధ్యాత్మిక నివారణల సమయంలో భావము జాగృతం చేయడానికి చేయవలసిన చర్యలు

1. పెట్టెలో దైవత్వం ఉంది అన్న భావముతో పెట్టెలకు నమస్కారం చేసి ఉపయోగించాలి.

2. ఆధ్యాత్మిక నివారణలు చేస్తున్నప్పుడు, ‘నా చుట్టూ ఉన్న నల్లటి వలయం మరియు నాలోని బాధను కలిగించే దుష్ట శక్తి నాశనం అవుతోంది మరియు నేను దైవ చైతన్యమును పొందుతున్నాను’ అని భావించాలి.

5 అ 4. నివారణలు పూర్తయిన తర్వాత ఉపసనాదేవతకు కృతజ్ఞతలు తెలియజేయాలి.

ఈ విధంగా కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి – ‘ఓ’ దేవత (ఉపసనా దేవత నామాన్ని చెప్పాలి), నేను మీ కపవల్లనే ఆధ్యాత్మిక నివారణలు చేయగలిగాను. మీ పవిత్ర పాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’.

5 ఆ. ఇతర సూచనలు

5 ఆ 1. ఆధ్యాత్మిక నివారణలకు ఉపయోగించే పెట్టెలను శుద్ధి చేయాలి.

సాత్వికమైన అగరుబత్తి యొక్క పొగతో ప్రతిరోజూ పెట్టెలను శుద్ధి చేయాలి.

5 ఆ 2. ఖాళీ పెట్టెల శూన్యతలో దైవత్వాన్ని నిలిపి ఉండటానికి ఇలా చేయాలి.

అ. ప్రార్థన : ‘పెట్టెల యొక్క శూన్యత దైవ చైతన్య స్థాయిలో జాగృతంగా ఉండనివ్వండి’. అని ఉపాసన దేవతను ప్రార్థించాలి.

ఆ. అగరుబత్తి తిప్పటం : పెట్టెల శూన్యతలో అగరుబత్తిని మధ్య-మధ్యలో తిప్పాలి మరియు దీనివల్ల వాటిలో దైవత్వాన్ని చైతన్యాన్ని చర్య స్థాయిలో జాగృతపరచాలి.

– ఒక విధ్వాంసుడు (16.10.2007, మధ్యాహ్నం 12.35) (సనాతన సద్గురు [శ్రీమతి] అంజలి గాడ్గిళ్‌ మాధ్యమంగా ఈ రచనలు ‘ఒక విధ్వాంసుడు’, ‘గురుతత్వం’ మొదలైన పేర్లతో ప్రచురించబడ్డాయి)

 

6. పెట్టెలతో పరోక్ష నివారణ యొక్క కొన్ని పద్ధతులు

6 అ. రుగ్మత నుండి బయటపడటానికి, వ్యక్తి యొక్క పూర్తి పేరును కాగితంపై లేదా ఫోటోను పెట్టెలో ఉంచడం

6 అ 1. విధానం

రుగ్మత నుండి బయటపడటానికి, ఆ వ్యక్తి తన పూర్తి పేరును కాగితంపై వ్రాసి కాగితమును లేదా ఫోటోను పెట్టెలో ఉంచాలి.

6 అ 2. ప్రత్యేక అనుకూలత

వ్యక్తి చుట్టూ చికిత్సల కోసం పెట్టెలను ఉంచడం సాధ్యం కాకపోతే (ఉదా. రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్నారు, ప్రాకే పిల్లవాడు), అప్పుడు ఈ చికిత్సలు చేయండి.

6 ఆ. ఒక వ్యక్తి మనస్సులో ప్రతికూల, నిరుత్సాహపరిచే, అసహ్యకరమైన లేదా అపసవ్య ఆలోచనలను కలిగి ఉంటే, ఆ ఆలోచనలను కాగితంపై వ్రాసి ఖాళీ అట్ట పెట్టెలో ఉంచండి లేదా ఆ వ్యక్తి స్వయంగా వ్రాసిన కాగితమును లేదా పుస్తకమును ఖాళీ అట్ట పెట్టెలో ఉంచండి.

6 ఆ 1. విధానము

అ. మండలంలో (కాగితముకు నాలుగు ప్రక్కల) ‘ఓం నమో భగవతే వాసుదేవయ ‘ అను నామజపమును వ్రాసి, వ్యక్తి పైన పేర్కొన్న ఆలోచనలను కాగితంపై వ్రాసి మడత పెట్టి ఒక ఖాళీ అట్ట పెట్టెలో ఉంచండి మరియు ఉపాసన దేవత యొక్క నామజపమును చేయాలి.

ఆ. పైన పేర్కొన్న విధానము చేయలేకపోతే, వ్యక్తి తన చేతివ్రాతను కాగితం పై లేదా పుస్తకములో వ్రాసి పెట్టెలో ఉంచాలి. సమస్యలు వున్న సమయంలో చేతివ్రాతతో వ్రాయాలి.

సందర్భం : సనాతన ప్రచురణ ‘వికార (రుగ్మత) నిర్మూలన కొరకు ఖాళీ పెట్టెల ఉపచారము భాగము 3’(ఇంగ్లీషు)

Leave a Comment